.
నిన్ననే కదా మగ శివాజీ నటించిన దండోరా అనే సినిమా రిలీజైంది… అప్పుడే సక్సెస్ మీట్ అట… సరే, అదీ ఓ ప్రమోషన్… విడుదలానంతరం ప్రమోషన్… దెబ్బ కొట్టిందని తెలిసి ఏదో మళ్లీ పైకి లేపే ప్రమోషన్…
ఇదే సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్‌లోనే కదా, ఈ మగ చావనిస్ట్ ఏవో కూసింది… నిధి అగర్వాల్, సమంతల పబ్లిక్ ఫంక్షన్ల భంగపాటుకు వాళ్ల డ్రెస్సులే కారణం అని తేల్చేశాడు కదా ఈ మేధావి… కారణం మగాడి చూపులో ఉందిరా, మందలో దొరికితే ఎవ్వడూ అదుపులో ఉండడు, అది మాబ్ సైకోయిజం తప్ప డ్రెస్సులు కారణం కాదురా నాయనా అంటే వినడు…
Ads
వాడిదసలే మంగపతి మెంటాలిటీ… చీర కడితే అస్సలు ఎవ్వడూ ఎవ్వరి జోలికీ రారు అంటాడు… ఒరేయ్ నాన్నా తప్పురా బాబూ అంటే అనసూయా నీ రుణం తీర్చుకుంటాను అని బెదిరిస్తాడు… ఈ వివాద ప్రభావం కాస్తా సినిమాపై పడేసరికి ఏదో తత్వం బోధపడుతూ ఉన్నట్టుంది… ఈ గరుడ పురాణ ప్రవచనకారుడికి…
సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ… ‘‘కొన్ని తరాలకు ఒకసారి ఇలాంటి సినిమా వస్తుంది… రెండురోజుల ముందు ప్రీమియర్స్ పడినట్లైతే కలెక్షన్లు వేరేలా ఉండేవి… సెన్సార్ వల్ల విడుదల ఆలస్యమైంది… ‘దండోరా’ గురించి 2026 మొత్తం కూడా మాట్లాడుకుంటారు… విదేశాల్లో కూడా మంచి ఆదరణ లభిస్తోంది…
ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు నేను నిద్రపోయింది కేవలం రెండు గంటలే… ఎందుకంటే ముఖం ఉబ్బుగా ఉండాలని నిద్ర మానుకున్నాను… సినిమా మొత్తం నిద్రముఖంలానే ఉంటుంది… నా పాత్రకు నేను అలా కనిపించకపోతే డైరెక్టర్ దెబ్బతింటాడు… నిద్రమానుకోమని డైరెక్టర్ నాకు చెప్పలేదు… కానీ, నేనే అలా చేశా…
సినిమా కోసం ప్రతి ఆర్టిస్టూ ప్రాణం పెడతారు… అలా చేసిన సినిమానే ‘దండోరా’… దయచేసి నా వ్యక్తిగత విషయాల వైపు వెళ్లకండి… నేను వాటి గురించి విడిగా చూసుకుంటాను… వాటివైపు వెళ్లకుండా ఈ సినిమాను ప్రమోట్ చేయండి… లేదంటే ఆ నింద నేను మోయాల్సి వస్తుంది… ఈ సినిమా గురించి మాత్రమే మాట్లాడండి…
నేను థియేటర్కు వస్తాను… ఏం మాట్లాడాలన్నా నేను థియేటర్లో మాట్లాడతాను… మంచి సినిమాను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆర్టిస్టుకు ఉంటుంది…’’ అని చెప్పుకొచ్చాడు… దర్శకుడు మురళీకాంత్‌కు కూడా తత్వం బోధపడినట్టుంది… ‘‘ఈవెంట్లలో రెండు మూడు మాటలు దొర్లితే వాటిని బట్టి సినిమాను జడ్జ్ చేయకండి’’ అంటున్నాడు…
సక్సెస్ మీట్ అంటే సక్సెస్ అని చెప్పుకుంటున్నారు కదా, మరి మళ్లీ అ వేడికోళ్లు ఏమిటి..? శివాజీ తిక్క మాటలకు సమాజం యాక్సెప్టెన్సీ లభించిందని సంబరపడొచ్చు కదా… మరెందుకు ఈ మొత్తుకోళ్లు…? తను థియేటర్లకు వస్తాడట, ఇంకా పెంట పెంట చేస్తాడట… సినిమాను ప్రమోట్ చేయాలట, లేకపోతే నింద మోయాల్సి వస్తుందట..,
సో వాట్.,.? నువ్వెంత..? నువ్వు నింద మోస్తే ఎవడికి నష్టం..? ప్రేక్షకుడికి ఏం కష్టం..? నిజానికి నింద మోయాల్సిందే కదా… వ్యక్తిగత విషయాల్ని వదిలేయండి అట… కూసేదేదో కూసి, రెండు రోజులుగా నెటిజనంలో ఓ పెంట పంచాయితీ పెట్టి… వదిలేయండి అంటే ఎలా..?
పైగా మొహం ఉబ్బుగా కనిపించడానికి షూటింగ్ జరిగినన్నాళ్లూ రోజుకు రెండు గంటలే పడుకున్నాడట... అలా కనిపించకపోతే దర్శకుడు దెబ్బతింటాడట...’’ హేమిటో ఈ విశ్లేషణ... ఏదో ట్రాక్ తప్పినట్టుంది మనిషికి..! ఎక్కడో బాగా తేడా కొట్టేసినట్టుంది..!!

అత్త చీరకట్టింది… శివాజీ వివాదంతో నెటిజనం పెద్ద ఎత్తున ఆమె బికినీ ఫోటోలు, అసభ్య వస్త్రధారణను ఎక్స్‌పోజ్ చేస్తుండటంతో… ఏమనుకున్నదో ఏమో గానీ… చీరెలు కట్టి సోషల్ మీడియాలో పెట్టుకుంది… శివాజీయే కరెక్టు అని చెబుతోందా..? ఇద్దరూ సేమ్ సేమ్…. మేధావులు..?!
Share this Article