Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలే బాలయ్య, ఆపై విజయశాంతి… మాంచి కమర్షియల్ మాస్ మసాలా…

February 26, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. బాలకృష్ణ- విజయశాంతి కాంబో జైత్రయాత్రలో సూపర్ డూపర్ సినిమా 1990 డిసెంబర్లో వచ్చిన ఈ లారీ డ్రైవర్ . తరచూ ఏదో ఒక టివి చానల్లో వస్తూనే ఉంటుంది . వచ్చిన ప్రతీ సారి కట్టిపడేస్తుంది . సినిమా అంతా చూస్తుంటాను . మొత్తం సినిమాలో ఎక్కడా ఓ అయిదు నిమిషాలు కూడా బోరించకుండా దడదడా లాక్కెళ్ళిపోతూ ఉంటుంది .

ఇంత బిర్రయిన కధను , స్క్రీన్ ప్లేని తయారు చేసిన రచయిత ఆంజనేయ పుష్పానందుని (పుష్ప ప్రసాద్) మెచ్చుకోవాలి . ఆ కధకు దీటుగా పరుచూరి బ్రదర్స్ డైలాగులను సంధించారు . హాస్య సన్నివేశాల్లో డైలాగులు ఇంకా సరదాగా , ఆహ్లాదకరంగా ఉంటాయి .

Ads

గుడివాడ రౌడీని కాదు . అచ్చు తప్పు . గుడివాడ రాయుడు అనలేక గుడివాడ రౌడీ అంటారు అనే విలన్ మోహన్ రాజ్ డైలాగ్ వీర పాపులర్ . ఇంక బాలకృష్ణ డైలాగుల గురించి చెప్పేదేముంది ! బాలకృష్ణ కూడా వీర , రౌద్ర , ప్రేమ , శృంగార రసాలను జోరుగా కురిపించారు .

విజయశాంతితో డ్యూయెట్లు , గ్రూప్ డాన్సులు అదిరిపోతాయి . బోరింగు పాప జయలలితతో డ్యూయట్ ఎంత హాటుగా ఉంటుందంటే ఏదయినా పొరపాటు జరిగిపోతుందా వెండితెరపై అని భయమేస్తుంది . నృత్య దర్శకులు సుందరం , ప్రభు , రఘురాం , తార బ్రహ్మాండంగా కంపోజ్ చేసారు . సినిమా విజయానికి బాగా దోహదపడ్డాయి . ప్రభు అంటే ప్రభుదేవానా !

బాలకృష్ణ- విజయశాంతి జోడీ ,శారద- విజయకుమార్ జోడీ , వాళ్ళ నటన , కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటాయి . బాలకృష్ణ , విజయశాంతి పెళ్ళిచూపుల్లో శారద , విజయకుమార్ చెరొక వైపు చేరి ప్రేక్షకులను రంజింపచేస్తారు .

పరుచూరి బ్రదర్స్ లెవెల్లో ఉంటుంది ఓ సీన్ . కలెక్టర్ శారదని గుడివాడ రౌడీ చెంపదెబ్బ కొట్టి అవమానించే సీన్ . ఈ సీన్లో , శారద కుటుంబానికి ఆసరాగా నిలబడే ప్రతి సీన్లో బాలకృష్ణ , అతనితో పాటు విజయశాంతి ప్రేక్షకరంజకంగా నటించారు .

విజయశాంతి సోడా బుడ్లు వేయటం , రౌడీయిజం చేయటం , బాలకృష్ణ కనపడగానే ఐస్ లాగా కరిగిపోవటం , డిఫరెంట్ షేడ్లను అద్భుతంగా చూపింది . వీరి తర్వాత మెచ్చుకోవలసిన పాత్ర రావు గోపాలరావుది . గొప్ప పాత్ర . క్లైమాక్సులో అవినీతిపరుడైన పోలీస్ ఇనస్పెక్టర్ కొడుకునే చంపేసే పాత్ర .

విలన్లుగా రాజా కృష్ణమూర్తి (కిట్టీ) , బాబూమోహన్ , బాబ్ ఏంధొనీ , మోహన్ రాజ్ , తనికెళ్ళ భరణి గొప్పగా నటించారు . ఇంకా నూతన్ ప్రసాద్ , రాళ్ళపల్లి , జయప్రకాష్ రెడ్డి , వినోద్ తదితరులు నటించారు.

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో సిరివెన్నెల వారు , జొన్నవిత్తుల వారు వ్రాసిన పాటలను బాలసుబ్రమణ్యం , జానకమ్మ , చిత్ర బాగా పాడారు . బాగా హిట్టయ్యాయి కూడా . బాలయ్యా బాలయ్యా గుండెల్లో గోలయ్యా , మావా మంచమెక్కు చేస్తా కనువిందు , జింగు జింగు చీరె కోణంగి కొంగు జార డ్యూయెట్లు విజయశాంతి , బాలకృష్ణ మీద రంజుగా ఉంటాయి .

దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా , కన్నె చిలకా నిన్ను కొరక అంటూ సాగే రెండు గ్రూప్ డాన్సులు బాగుంటాయి . బాలకృష్ణ , మా గుంటూరు జయలలితపై అబ్బ నీ పట్టెంత గట్టిదయ్య హాట్ సాంగ్ గురించి ఆల్రెడీ చెప్పేసా .

రావు గోపాలరావు స్వంత సినిమా అయిన ఈ లారీడ్రైవర్ బి గోపాల్ దర్శకత్వంలో నిర్మించబడింది . ఈ సూపర్ హిట్ సినిమా యూట్యూబులో ఉంది . చూడనివారు ఎవరయినా ఉంటే చూసేయండి . It’s a wonderful , feel good entertainer .

బాలకృష్ణ , విజయశాంతి , మా గుంటూరు జయలలితల అభిమానులు మళ్ళా మళ్ళా కూడా చూడొచ్చు .
#తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈరోజు మ్యాచులో ఈ అంపైర్ గనుక ఉంటే… ఇండియా ఇక ఇంటికేనా..?
  • అసలే బాలయ్య, ఆపై విజయశాంతి… మాంచి కమర్షియల్ మాస్ మసాలా…
  • KCR ఎడాపెడా అప్పులు, అక్రమాలు … గట్టెక్కించే తిప్పలు Revanth Reddy…
  • ఈ కీలక లొంగుబాట్ల వేదికపై ఎవరామె..? ఓసారి చెప్పుకోవాలి..!!
  • అప్పట్లో రిజెక్టయ్యాడు గానీ… వర్తమాన చానెళ్లలో చెలామణీ అయ్యేవాడేమో…
  • సాయి పల్లవి…! వాట్ ఏ కెరీర్… 15 సినిమాలు- ఏడు ఫిలిమ్ ఫేర్లు…!!
  • ఫోన్‌బుక్..! ప్రతి నంబరూ ఆత్మీయం కాదు, అవసరమైతే పలకరించదు..!!
  • పరకాల ప్రభాకర్… కేంద్ర ఆర్థికమంత్రి భర్తకు ఎక్కడో ఏదో దెబ్బ తిన్నది…
  • కేరళం..! ఎందుకు ఈ పేరు మార్పిడి..? ఈ పేరులో అర్థమేమిటి..?
  • రాయల్ టైగర్‌కు ఓ మాంసం ముక్క… ఆడిట్ వాడు పట్టేసుకున్నాడు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions