Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

విష్ణువిన్యాసం..! చివరిదాకా చూడగలిగిన ప్రేక్షకులు అత్యుత్తమ జాతి..!!

February 27, 2026 by M S R

.

వేయి మాటలేల, వందల విశ్లేషణలేల… స్ట్రెయిట్‌గా, సరళంగా, సంక్షిప్తంగా సినిమా ఎలా ఉందో చెప్పేస్తే, అంతకుమించిన సినిమా రివ్యూ ఏముంటుంది అసలు…

అసలే పెయిడ్ రివ్యూలు ప్రేక్షకుల్ని మాయల్లో ముంచేస్తున్న రోజులివి… నిజాయితీ రివ్యూలు నచ్చక నిర్మాతలు ఏడుస్తున్న రోజులివి… సో ఈ స్థితిలో విష్ణు విన్యాసం అని ఓ సినిమా వచ్చింది… రెండు గంటల్లోపే నిడివి, థాంక్ గాడ్… తెలుగు ప్రేక్షకుల్ని బతికించాడు… ఆ కాస్త సమయం కూడా నిజంగా ప్రేక్షకులు భరించగలిగారా..?

Ads

యూఎస్ మిత్రుడు  Sreekumar Gomatham నిర్మొహమాట, నిష్కర్ష సమీక్ష ఒకటి చూద్దాం, సరిపోతుంది… లేకపోతే ఏ తరుణ్ భాస్కరో (తనకు వరంగల్ బాపతు నిజాయితీ, స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌నెస్, ప్రత్యేకించి మేం గతంలో అభిమానించిన ప్రణయ్ భాస్కర్ బాపతు లక్షణాలు లేనట్టు అనిపించింది)…

మళ్లీ, సోషల్ మీడియాకు ఎక్కేసి, తూచ్, ఈ రివ్యూయర్ అసలు సినిమా చూశాడా అని ఏవో పోస్టులకు దిగే ప్రమాదముంది… ఆమధ్య తను నటించిన ఏదో సినిమా బాగోలేదుర భయ్ అని చెబితే… నీ పేరు చూసి సినిమాకు వెళ్లి భంగపడ్డాం బ్రో అని చెబితే… నేను దర్శకుడిని కాదు, అసలు సినిమా చూశాడా ఈ రివ్యూయర్ అని ఎదురుదాడికి దిగాడు… అసలు ఆ దర్శకుడి పేరు ఎవడికి తెలుసని..!! నీ పేరు చూసి సినిమాకు వెళ్లాంర భయ్ అని చెబితే ఆ క్రెడిట్ ఏమిటో కూడా అర్థం కాని దురవస్థ పాపం..!!



·
విష్ణు విన్యాసం – సినిమా సన్యాసం!
ఇది (ఓపిక గా చివరిదాకా) చూసాక, ఇక తెలుగు సినిమాలు చూడడం మానెయ్యాలి అన్న ఫీలింగ్ వచ్చింది!
ఎంతసేపూ పెద్ద హీరోల కసకసా రపారఫా నరుక్కునే సినిమాలు చూసి, విరక్తి పుట్టి, కాస్త పకపకా నవ్వుకోవడానికి కామెడీ సినిమాలు చూద్దామని అనుకుంటే… ఇదిగో ఇలాంటివి తగులుతాయి.

సినిమా ఎలా తీయాలో తెలియని నాలాంటి వాళ్ళకి కూడా, ఎలా తీయొద్దో పాఠాలు గుణపాఠాలు నేర్పిస్తాయి.
శ్రీ విష్ణుకి అలాగే డైలాగులు చెప్పాలని ఎవరైనా సలహా ఇస్తారో, లేక పాపం అలా తప్ప వేరేలా చెప్పడం రాదో తెలీదు కానీ, దాదాపు 50 శాతం ఏమంటున్నాడో అర్ధం కాలేదు… మిగతా 50 శాతం కష్టపడి అర్ధం చేసుకోవాల్సి వచ్చింది…

మొదటి రోజు రెండో ఆటలో, థియేటర్ పూర్తిగా నిండింది కానీ సగంలోనే సగం మంది వెళ్ళిపోయారు. నాలాంటి సినీ ప్రేమికులు మాత్రం ‘తర్వాత సీన్ నించి అయినా బాగుంటుందేమో’ అని చివరి దాకా ఉన్నారు అత్యాశావాదులు…

చిన్నప్పుడు వన్డే క్రికెట్ లో… ఇండియా మిగిలిన అయిదు ఓవర్లలో చివరి వికెట్ కి వంద రన్లు కొట్టాలి అంటే, ఓడిపోతారు అని తెలిసి కూడా, ఇక ప్రతీ బాల్ కి సిక్సర్ కొడతారు అన్న ఆశ లాంటిది అది…

PS...: టికెట్ కొన్నారు కమిట్ అయ్యారు కాబట్టి హాల్లో ఇద్దరు ముగ్గురు అక్కడక్కడా నవ్వినట్టు చేశారు, నలుగురిలో బాగుండదేమో అని కావచ్చు!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మరేమనుకున్నారు పెద్ద దొర పెంపకం అంటే..? ఫుల్ క్లీన్ చిట్…!!
  • విష్ణువిన్యాసం..! చివరిదాకా చూడగలిగిన ప్రేక్షకులు అత్యుత్తమ జాతి..!!
  • పైకి అంతా బాగానే ఉంది కానీ… లోలోపల పీడించే రోగాలెన్నో…
  • మగాడు..! తెలుగులో సింగిల్ కమెండో ఆపరేషన్ సినిమాలు తక్కువే..!!
  • వంద ఆరుట్ల మోడల్ స్కూళ్లు… గుడ్ డెసిషన్… మురళి సిఫారసులూ భేష్…
  • త్వరలో లోకేష్‌కు పగ్గాలు..? మరి చంద్రబాబు..? మరి జనసేనాధిపతి..?!
  • ఆఫ్టరాల్ శెట్టి గ్యాంగ్..! తెలంగాణా కోడలా… తలెగరేసి ఇలాగే బతికెయ్..!!
  • అగ్రదేశపు యుద్ధనౌక… టాయిలెట్లతో యుద్ధం… చెప్పలేని అగచాట్లు…
  • న్యాయం ఓ ప్రశ్నార్థకం..! ఈ ఇద్దరు తల్లుల పోరాటానికి అభివందనం..!!
  • పని చేయడానికే జీవితమా..? జీవితంలో పని కేవలం ఓ భాగమా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions