.
Subramanyam Dogiparthi ….. శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో … ఈ పాటను ఓసారి యూట్యూబులో చూడండి… తరువాత ఇది చదవండి… ఆ ట్యూన్, ఆ టోన్, ఆ పిక్చరైజేషన్, సింపుల్ స్టెప్స్, బ్యాక్ గ్రౌండ్… అదిరిపోతాయి… చిరంజీవి ఫ్యాన్స్‌లో చాలామందికి అప్పట్లో ఇది అత్యంత ఫేవరెట్ సాంగ్… ఇక పదండి రివ్యూలోకి…
చిరంజీవి- కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన మరో సూపర్ హిట్ సినిమా 1990 మార్చిలో వచ్చిన ఈ కొండవీటి దొంగ . ఈ ఘన విజయానికి క్రెడిట్ ఎవరికి ఇవ్వాలో చెప్పటం చాలా కష్టం . ఏ సినిమా అయినా కధ లేకుండా ప్రేక్షకులను రంజింపచేయలేదు . జుట్టు ఉంటే ఏ కొప్పయినా పెట్టుకోవచ్చు .
Ads
బిర్రయిన కధ క్రెడిట్ పరుచూరి బ్రదర్స్ , యండమూరి వీరేంద్రనాథుకే దక్కాలి . ఆ తర్వాత ఆ కధను బిర్రయిన స్క్రీన్ ప్లేగా మార్చిన ఘనత యండమూరి వీరేంద్రనాథుకు వెళ్ళాలి . ఎక్కడా బోరించకుండా దడదడా లాక్కెళుతుంది .
ఇంక సారధి కోదండరామిరెడ్డి . సినిమాకు సంబంధించిన అన్ని విభాగాలను సమన్వయపరిచి ప్రేక్షకరంజకంగా చిత్రీకరించే ఘనుడు దర్శకుడు . అద్భుతమైన లొకేషన్లు , ఫొటోగ్రఫీ . మధుమలై అడవులను , కేరళ అందాలను చక్కగా ఉపయోగించుకున్నారు దర్శకుడు . లోయలు , కొండలు , జలపాతాలు , అడవులు , వగైరా చాలా బాగా వినియోగించుకున్నారు .
ఈ సినిమా అనగానే ముందుగా ఎవరికయినా గుర్తుకొచ్చే పాటలు శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో , ఛమకు ఛమకు ఛాం చుట్టుకో చుట్టుకో పాటలు . ఈ పాటలకో చరిత్ర కూడా ఉంది . నాయక్ సినిమాలో శుభలేఖ రాసా పాట రీమిక్స్ చేయబడితే , ఛమకు ఛమకు పాట ఇంటెలిజెంట్ సినిమాలో రీమిక్స్ చేయబడింది . ఒక దాంట్లో చిరంజీవి కొడుకు , మరో దాంట్లో మేనల్లుడు డాన్సించారు . ఎంత గొప్ప విషయం ! కానీ ఒరిజినల్ ఒరిజినలే…
ఈ ఘనతంతా ఇళయరాజాదే . చాలా శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు . పాటలకు కావలసిన డాన్స్ స్టెప్పులను చిరంజీవి , రాధ , విజయశాంతిలు బ్రహ్మాండంగా వేసారు . తార , సుందరం బ్రహ్మాండంగా కంపోజ్ చేసారు . అద్భుతమైన లొకేషన్లు . బాలసుబ్రమణ్యం , జానకమ్మ , చిత్ర శ్రావ్యంగా పాడారు . పాటలను వేటూరి , సిరివెన్నెల వారు వ్రాసారు .
ఈ రెండు పాటల తర్వాత మంచి పాట తెల్ల గుర్రం మీద నల్ల దుస్తుల్లో మెడలో ఎర్ర రుమాలతో వెంట శునకరాజంతో రాబిన్ హుడ్ పాత్ర పాడే జీవితమే ఒక ఆట సాహసమే పూబాట . దేవీ శాంభవీ దీన బాంధవీ పాట కూడా బాగుంటుంది .
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ సాగే గ్రూప్ డాన్స్ కం డ్యూయెట్ , కోలో కోలమ్మ , టిప్ టాప్ లుక్కు లిప్ మీద క్లిక్కు డ్యూయెట్లు హుషారు హుషారుగా సాగుతాయి . మొదటి రెండు హిట్ పాటలకు చిరంజీవి అభిమానులు సినిమా హాళ్ళల్లో పూనకంతో ఊగిపోయారు . ఇళయరాజా బీట్లు అలాగే ఉంటాయి .
ఇంక నటీనటుల పాత్రలు , నటన . భారీ తారాగణం , అనుభవజ్ఞులయిన నటీనట బృందం . చిరంజీవి నటన , డైలాగ్ డెలివరీ , ఫైట్లు , డాన్సులు , అల్లరి ప్రేక్షకులను ఊపేస్తాయి . తర్వాత చెప్పుకోవలసింది శారద పాత్ర . పేరు శాంభవి . భలే పేరు . పేరుకు తగ్గట్లు ఆమె ఆహార్యం . ఇంక నటన గురించి చెప్పేదేముంది ? బ్లేస్టే . పరుచూరి బ్రదర్సుని అభినందించాలి . సౌమ్య , విషోద , శోక శారదను రౌద్ర శారదగా మార్చిపడేసారు . పరుచూరి బ్రదర్స్ ఉన్నాక శారద పాత్ర ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు కదా .
ఇంక హీరోయిన్లు . 2+1 సినిమా . రుద్రనేత్రలో చివర్లో అవగాహనకొస్తారు . కాబట్టి ఇద్దరూ బతికిపోయారు . ఎన్ని సినిమాల్లో అవగాహనకొస్తారు . పాపం రాధను లేపేసారు ఈ సినిమాలో . అక్కాచెల్లెళ్ళుగా విజయశాంతి , రాధలు మోస్ట్ గ్లామరస్సుగా నటించారు . విజయశాంతి పోలీస్ ఆఫీసర్ , రాధ డాక్టర్ .
విలన్ నాయకుడిగా అబ్రకదబ్ర అమ్రీష్ పురి . యండమూరికి అబ్రకదబ్ర అంటే ప్రియం కదా ! ఆ పేరుని లాక్కొచ్చారు . ఆయన డబ్బింగ్ ఆయనే చెప్పుకోవటం వలన బాగుంటుంది . పోలీసు ఆఫీసరుగా , విలనుగా రెండు చోట్ల కనిపిస్తాడు . తోటి విలన్లుగా రావు గోపాలరావు , మోహన్ బాబు , అల్లు రామలింగయ్య , చలపతిరావు నటించారు .
ఇంక ఇతర ప్రధాన పాత్రల్లో సత్యనారాయణ , దివ్య వాణి , శ్రీధర్ , రంగనాథ్ , శ్రీవిద్య , ప్రసాద్ బాబు , నిర్మలమ్మ , చిట్టిబాబు , బ్రహ్మానందం , కాకరాల తదితరులు నటించారు . నాగబాబుకి మంచి పాత్ర లభించింది . అడవిలో బాటసారిని అంటూ డిఫరెంట్ ఏక్షనుతో రాణించాడు .
క్లైమాక్సులో ఫైట్సు కూడా బాగా కంపోజ్ చేసారు . షడ్రసోపేతంగా వండబడిన ఈ సినిమా 34 సెంటర్లలో వంద రోజులు ఆడింది . తమిళ , మళయాళ భాషల్లోకి డబ్బింగ్ చేయబడింది . తరచూ టివిలో వస్తూ ఉంటుంది . సినిమా యూట్యూబులో ఉంది . It’s an unmissable wonderful action entertainer .
#తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు
Share this Article