.
ఒక్క 10 సీట్లు తక్కువ పడ్డాయి, మద్దతు ఇవ్వండి అంటూ తమిళ జోసెఫ్ విజయ్ ఎక్కే గడప దిగే గడప అన్నట్టుగా తిరిగాడు… గవర్నర్ దగ్గరకు వెళ్లడం, ఎహె, నీకు మెజారిటీ ఏది అని ఆయన వెనక్కి పంపడం అనే ఎపిసోడ్లూ జరిగాయి… చివరకు బలపరీక్ష నాటికి పరిస్థితి ఏమిటో తెలుసా..?
తను ఒకవేళ వద్దూవద్దంటున్నా సరే, మద్దతు వస్తోంది… మా 108 కి మరో 10 చాలురా బాబూ అనుకుంటే ఏకంగా 144 వోట్లు పడ్డాయి… అదీ రాజకీయం… సారీ, అదీ అధికారం లేకుండా ఉండలేని దౌర్భాగ్యం… ఫస్ట్, కాంగ్రెస్ వచ్చి సాగిలబడింది… తరువాత స్టాలిన్ చక్రాలు తిప్పి, ప్రభుత్వంలో మనవాళ్లే ఉండాలని వీసీకే, ఐయూఎంఎల్, లెఫ్ట్ పార్టీలను పంపించాడు… ఓహో ఆహా అని ఎగేసుకుని వెళ్లారు, దొరికిందే సందని…
Ads
అంతేనా..? ఏఎంఎంకే అని ఓ పార్టీ, దానికి ఓ ఎమ్మెల్యే… పార్టీ చీఫ్ దినకరన్ వద్దన్నా, బహిష్కరించినా సరే, ఛపో అనేసి ఆ ఎమ్మెల్యే విజయ్ పంచన చేరిపోయాడు… ఏదో ఓ పదవి దక్కకపోదని ఆశ… డీఎండీకే ఎమ్మెల్యే ప్రేమలత విజయకాంత్ కూడా సపోర్ట్… వెరసి ఏడు పార్టీలు, చిన్నాచితకవి మద్దతు…
చివరగా చెప్పుకోవాల్సింది అన్నాడీఎంకే… అయితే ఏకంగా నిలువునా చీలిపోయింది… దాదాపు 24 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ అడగకపోయినా అనుకూలంగా వోటేశారు… ఏం ఖర్మరా బాబూ… ఒకవేళ డీఎంకే భాగస్వాములు నీకు తలనొప్పులు క్రియేట్ చేస్తే, తోక జాడిస్తే నీకు మద్దతుగా మేమున్నాం అనే భరోసా అన్నమాట…
డీఎంకే వాకౌట్ ఊహించిందే… బలనిరూపణలో విజయ్‌కు మద్దతు కోసం… ఎటొచ్చీ ఎటూగాకుండా అయిపోయింది పళనిస్వామి వర్గం… 22 మంది… అన్నాడీఎంకే కూటమిలో ఉన్నానో లేనో తెలియని దురవస్థలో ఉన్న బీజేపీ..!! ఉన్నదొకటే సీటు…!!
ఇక్కడ రెండు అంశాలు చెప్పుకోవాలి… 1) ఉదయనిధి మూర్ఖత్వం… జనం కర్రుకాల్చి వాతపెట్టినా సరే మనిషి గుణం మారలేదు, మళ్లీ హిందూ మతంపై విషం కక్కాడు, అది సరే, అసలు టీవీకేకు జనం తీర్పు లేదు, 35 శాతమే వోట్లేశారు, 65 శాతం వ్యతిరేకమే కదానే అజ్ఞానం ప్రదర్శించాడు… ఒరే నాన్నా… భారత రాజకీయాధికార వ్యవస్థ గురించి ముందుగా చదువుకోరా బాబూ… 8 మంది బరిలో ఉంటే… ఒకడికి రెండు వోట్లు వచ్చి, మిగతా వాళ్లందరికీ ఒకే వోటు వచ్చినా సరే, రెండు వచ్చినవాడే పాలకుడురా తండ్రీ…
మరొకటి చెప్పుకోవాలి… 2) బీజేపీ భంగపాటు గురించి… పళనిస్వామిని నమ్మి బోల్తాకొట్టిన వ్యూహరాహిత్యం గురించి… నిజానికి పళనిస్వామికి నాయకత్వ లక్షణాలే లేవు… జయలలిత మరణం తర్వాత జరిగిన రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం…. 2019లో కేవలం ఒక సీటు గెలిచారు, 2024లో సున్నా…
వరుసగా రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి… AIADMKను మూడవ స్థానానికి పడిపోయేలా చేశాడు… పార్టీని హస్తగతం చేసుకోవడానికి పన్నీర్ సెల్వం (OPS), శశికళను బయటకు పంపాడు… బీజేపీలో అన్నామలైకి పొగబెట్టాడు… బీజేపీ సాగిలబడింది… 2026 ఎన్నికల్లో మిత్రపక్షాలకు తగినన్ని సీట్లు ఇవ్వకుండా మొండికేశాడు… EPS అహంకారం వల్ల AIADMK పూర్తిగా నాశనమైంది… ఇప్పుడు నిలువునా చీలిపోయింది… ఒకప్పుడు తమిళ రాజకీయాల్ని శాసించిన పార్టీ నేడు నీచావస్థలో ముక్కుతూ మూలుగుతోంది..!!
Share this Article