Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చోటా భీమ్ ఒంటి చేత్తో ‘హైదరాబాద్‌’ను ఎలిమినేట్ చేశాడు…

May 28, 2026 by M S R

.

మొన్న గుజరాత్ జట్టు బెంగుళూరు జట్టుపై ఎంత పేలవంగా ఆడి, చతికిలపడిందో… నిన్న సేమ్, హైదరాబాద్ జట్టు కూడా అదే రీతిలో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది… ఇంటికి వెళ్లిపోయింది… నిజానికి బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ ఒంటిచేత్తో ఈ ఎలిమినేటర్ మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకున్నట్టే చెప్పాలి…

ఒక దశలో క్రిస్ గేట్ సాధించిన 30 బంతుల్లో సెంచరీని వైభవ్ బ్రేక్ చేస్తాడని అనుకున్నారందరూ… భీకరమైన స్ట్రయిక్ రేట్… కానీ 29 బంతులు ఆడి చివరకు 97 పరుగులు చేసి, మ్యాచ్‌ను రాజస్థాన్ వైపు లాక్కొచ్చాడు ఒకరకంగా… 97 పరుగుల్లో 92 ఫోర్లు, సిక్సులతో వచ్చినవే… ఆరెంజ్ క్యాప్ తన దగ్గరే ఉంది ఇప్పుడు…

Ads

ఒక రికార్డు మాత్రం బ్రేక్ చేశాడు, అదీ క్రిస్ గేల్ రికార్డే… తను ఒక సీజన్‌లో 59 సిక్సర్లు కొట్టాడు… దాన్ని బ్రేక్ చేసిన వైభవ్ ఈ మ్యాచులో ఏకంగా 12 సిక్సులు కొట్టాడు, దాంతో మొత్తం 65 సిక్సులు కొట్టినట్టు…! ఇంకా కనీసం ఒక మ్యాచ్ ఉంది… గుజరాత్ మీద గెలిస్తే ఫైనల్ ఉంటుంది… అన్నట్టు ఒక టీ20 మ్యాచులో డబుల్ సెంచరీ చేయాలనేది తన కోరికట బుడ్డోడికి…! ఏమో, కొట్టినా కొడతాడు…!!

(అఫ్‌కోర్స్, నిన్నటి మ్యాచ్ గెలుపుకి ధ్రువ్ జురేల్ 50 రన్స్, ఆర్చర్ తీసిన 3 కీలక వికెట్లు, పట్టిన 3 క్యాచులు కూడా ఉపయుక్తం అయ్యాయి)… టాస్ గెలిచీ హైదరాబాద్ ఫీల్డింగ్ తీసుకోవడం కూడా ఓ తప్పిదం అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి…

హైదరాబాద్ ఇంటికి వెళ్లిపోయింది గానీ… మొన్న ఓడిన గుజరాత్ 29న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడుతుంది… ఎవరు గెలిస్తే వాళ్లు బెంగుళూరుతో ఫైనల్స్ ఆడతారు… నిజానికి బెంగుళూరు మీద ఓడిపోవచ్చుగాక, కానీ గుజరాత్ జట్టు బలమైందే రాజస్థాన్‌తో పోలిస్తే… అంత తేలికగా వదిలేసే రకం కాదు… కాకపోతే రాజస్థాన్ నిన్నటిలాగా బ్యాటింగులో ప్రతాపం చూపిస్తేనే గుజరాత్ మీద విజయం సాధ్యం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చోటా భీమ్ ఒంటి చేత్తో ‘హైదరాబాద్‌’ను ఎలిమినేట్ చేశాడు…
  • తుపాకీ పడితే ‘రికార్డే’… భేష్, హైదరాబాదీ సంచలనం ఈషా సింగ్..!
  • అసలు వంశీ సినిమాలో మోహన్‌బాబు ఎలా ఫిట్టయ్యాడనేదే ప్రశ్న..!
  • True Pilot … ఆకాశం నుంచి కూలిపోతున్నప్పుడు కూడా… అదే నిబ్బరం…
  • బహుముఖ ప్రజ్ఞ… తేజస్వినీ మనోజ్ఞ…! వావ్, మన తెలుగు తేజం..!!
  • ఆక్సిజన్ తరిగి… శ్వాస కష్టమై… వెనక్కి దిగలేక… మంచుకు బలి…
  • అద్భుతం మొదట గుర్తించబడదు..! తర్వాత ఎవరూ గుర్తించనక్కర్లేదు…!
  • ఇది సరసజ్ఞుల కోసం మాత్రమే… రసహీనులు దూరముండగలరు…
  • మీడియా సోర్సులు- లీకులు… రహస్యాలేమీ దాగవు, ఆగవు…
  • మీకు తెలుసా..? షిర్డి సాయి ముస్లిం కాదట- పక్కా బ్రాహ్మణుడట..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions