.
ప్రజలు ఘోరంగా ఓడించారు అంటేనే… ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉన్నట్టు లెక్క..! కానీ ఎన్నికలు అయిపోగానే, మళ్లీ క్షుద్ర రాజకీయాలు మొదలుపెడితే ఏం జరుగుతుంది..? జస్ట్, ఇన్నేళ్లూ బెంగాల్‌ను ఓ నియంతగా ఏలిన గూండారాజ్ అధినేత, మమత బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి జరిగిన శాస్తే జరుగుతుంది…
ప్రజలు వెంటబడి తరిమారు, చెప్పులు విసిరాారు, కోడిగుడ్లు- టమాటాలు విసిరారు, దాడి చేశారు… తలకు హెల్మెట్ పెట్టుకుని మరీ డ్రామా చేయబోయి, భంగపడి, తీవ్ర గాయాలపాలై… వీల్ చైర్‌లో హాస్పిటల్ చేరాడు… ఇప్పుడు మేనత్త మమత పరామర్శిస్తోంది… కానీ నిష్ఠురంగా ఉన్నా ఒకటి మాత్రం నిజం… ప్రస్తుతం బెంగాల్ ప్రజానీకం టీఎంసీ గూండాలపై ప్రతీకార ధోరణిలో ఉరుముతున్నారు… ఇప్పుడు మమత బజారులోకి వచ్చినా సరే, ఆమెకూ మేనల్లుడికి జరిగిన శాస్తే తప్పదు… ఇది రియాలిటీ…
Ads
నాలాంటి పొలిటికల్ అనలిస్టులం కూడా ఊహించలేదు… సువేందు అధికారి తీసుకుంటున్న నిర్ణయాలు, ఆచరణ, దూకుడు వేరే లెవల్‌లో ఉంటున్నాయి… బెంగాల్ ముఖచిత్రం మారిపోతోంది… అన్నింటికీ మించి ఇన్నేళ్లు తాటకి బారిన పడ్డ బాధితులు దొరికిన టీఎంసీ గుండాలందరినీ తరుముతున్నారు, తంతున్నారు… అంటేనే అర్థమవుతోంది కదా… ఆ తాటకి బెంగాల్‌ను ప్రత్యక్షంగా, దేశాన్ని పరోక్షంగా ఎంత నష్టపరిచిందో…
పక్కా దుష్టశక్తి… ఇన్నేళ్లు ఏమీ చేతగాకపోయినా, బీజేపీ ఎట్టకేలకు ఓ విభీషణుడిని ముందుపెట్టి బెంగాలంకను గెలిచింది… కానీ రాజకీయాల్లో విజ్ఞత, సందర్భశుద్ది, సకాలప్రాప్తి ఏమిటంటే… జనం వ్యతిరేకంగా ఉన్నప్పుడు వెంటనే మళ్లీ పాలిటిక్స్ ప్లే చేయకపోవడం… కానీ సదరు రౌడీ రాజ్ అభిషేక్‌కు ఆ సోయి ఉంటే కదా… (రేవంత్ రెడ్డి సీఎం కాగానే బీఆర్ఎస్ కూడా ఇదే మొదలుపెట్టి, వందల కోట్ల ఖర్చుతో సోషల్- నెగెటివ్ ప్రాపగాండా మొదలుపెట్టింది… తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ బీఆర్ఎస్‌కు జనం వాతలు పెడుతున్నా సరే…)
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన, వివాదాస్పద నేతగా ఎదిగిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ లక్ష్యంగా జరిగిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది…
1. అసలేం జరిగింది? ఆ బహిరంగ సభ, ధర్నా దేనికి?
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక నిరసన ధర్నా/ బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్లిన అభిషేక్ బెనర్జీపై నిరసనకారులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు… భద్రతా వలయాన్ని ఛేదించుకుని వచ్చి భౌతిక దాడికి పాల్పడటంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి… ముఖ్యంగా కాలు, నడుము భాగాల్లో బలమైన దెబ్బలు తగలడంతో వైద్యుల సూచన మేరకు ఆయన ప్రస్తుతం వీల్ చైర్ (Wheelchair) కే పరిమితమయ్యారు…
అసలు ఈ ధర్నాలు, సభలు ఎందుకు నిర్వహిస్తున్నాడు? టీఎంసీ ఈ స్థాయిలో జనం మధ్యకు వెళ్లడం వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి…
-
కేంద్ర నిధులపై పోరు…: ఉపాధి హామీ పథకం (MGNREGA), ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వేల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం బెంగాల్‌కు నిలిపివేసిందని, దీనివల్ల పేద ప్రజలు నష్టపోతున్నారని ఆరోపిస్తూ టీఎంసీ పెద్ద ఎత్తున ‘దిల్లీ చలో’ వంటి నిరసనలు, రాష్ట్రవ్యాప్త ధర్నాలు చేపట్టింది… ఈ ఉద్యమానికి అభిషేక్ బెనర్జీనే సారథ్యం వహిస్తున్నాడు… పక్కా ఫెయిల్యూర్ ప్లానింగ్…
-
క్యాడర్‌లో ధైర్యం నింపడం…: వరుస అవినీతి ఆరోపణలు, కేంద్ర దర్యాప్తు సంస్థల (ED, CBI) సోదాలతో డిఫెన్స్‌లో పడ్డ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ సభలను ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నాడు… తన్నులు తిన్నాడు…
2. జనంలో వ్యతిరేకత, “గుండాయిజం”పై ఆగ్రహం .,.. బెంగాల్‌లో గత కొన్ని ఏళ్లుగా టీఎంసీ స్థానిక నాయకత్వంపై, వారి “గుండాయిజం” (రాజకీయ హింస)పై ప్రజల్లో విపరీతమైన అసంతృప్తి, లోతైన ప్రతీకార జ్వాలలు రగులుతున్నాయనేది వాస్తవం… పంచాయతీ ఎన్నికల నుంచి సాధారణ ఎన్నికల వరకు జరిగిన హింసాత్మక ఘటనలు, విపక్షాలపై దాడులు, స్థానిక వసూళ్లు (తోలాబాజీ) వంటి అంశాలు సామాన్య జనాన్ని విసిగించాయి…
ఆగ్రహాన్ని గుర్తించడు, తీర్పు గౌరవించడు… తప్పులను సరిదిద్దుకోకుండా, ప్రజల నుంచి వస్తున్న తిరుగుబాటును గుర్తించకుండా మళ్లీ పాత పద్ధతిలోనే సభలు నిర్వహిస్తూ సవాల్ విసరడం ప్రజలను మరింత రెచ్చగొట్టడమే అవుతుంది… సాధారణంగా ఒక పార్టీ ఓడిపోయి, మరో పార్టీ గెలిస్తే… ఓ ఆరు నెలలపాటు రాజకీయాల్ని మానేస్తారు… హనీమూన్ పీరియడ్…
తరువాత ప్రభుత్వ వైఫల్యాల్ని జనంలోకి తీసుకుపోవడం సరైన రాజకీయం… కానీ ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ టీఎంసీకి తేడా లేదు… ప్రజల తీర్పును ఆమోదించలేకపోవడం, ప్రజల్ని అవమానించడం… ఇది విపక్షాల దాడి కాదు, టీఎంసీ గుండాయిజంపై విసిగిపోయిన సాధారణ ప్రజల “స్వయంప్రేరిత తిరుగుబాటు” అని బెంగాల్ మీడియా విశ్లేషిస్తోంది… మరికొన్ని పత్రికలు తృణమూల్ కాంగ్రెస్ అంతర్గత విభేదాల (Internal Factionalism) కోణాన్ని కూడా ప్రస్తావిస్తున్నాయి…!!
మరో వాదన ఏమిటంటే..? ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీకి సంబంధించిన కేసులో విచారణ కోసం మే 30న పశ్చిమ బెంగాల్ సీఐడీ (CID) ఆయనకు నోటీసులు జారీ చేసింది…. జూన్ 1వ తేదీన (సోమవారం) కోల్‌కతాలోని భవానీ భవన్ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు… వచ్చే వారం సీఐడీ అరెస్ట్ చేస్తుందని తెలుసుకొని, వాడు కావాలనే అక్కడకు వెళ్ళాడు, తన్నించుకున్నాడు… నేను విచారణకు రాను అంటాడు…
అన్నట్టు…. మీకు గుర్తుందా..? ఎన్నికల ఫలితాలు రాగానే ఎవడినీ వదలం, బాడీలు లెక్కెట్టుకోవాలి అని కూసింది అభిషేక్ బెనర్జీయే… ఈసారి నిజంగానే టీఎంసీ గనుక గెలిచి ఉంటే… బెంగాల్ బంగ్లాదేశే అయి ఉండేది… ఎన్ని వేల మంది బెంగాల్ విడిచి అస్సాం పారిపోవాల్సి వచ్చేదో..!! పరమ క్రూర గూండాగణం..!!
Share this Article