Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డర్టీ మొగుడు- కామ ఖాకీ…! చామెట్ యాప్‌లో బరిబాతల దందా!

July 2, 2026 by M S R

.

Yugandhar Reddy …. అగ్నిసాక్షిగా ప్రమాణం చేశాడు… ఏడడుగులు నడిచి నూరేళ్ల బంధానికి ముడివేశాడు. కష్టసుఖాల్లో తోడుంటానని నమ్మించాడు. కానీ, కాలం కలిసిరాక ఆర్థిక కష్టాలు చుట్టుముట్టేసరికి ఆ కట్టుకున్నవాడే ‘కాసుల కక్కుర్తి’తో కసాయిగా మారాడు.

భార్యను అర్ధనగ్నంగా లోకానికి చూపించి నోట్లు ఏరుకున్నాడు. చివరకు న్యాయం చేయాల్సిన రక్షకభటుడే భక్షకుడిగా మారి రాత్రికి రమ్మంటూ వేధించాడు! వినడానికే ఒళ్ళు గగుర్పొడిచే ఈ దారుణమైన చీకటి కథ తిరుపతి జిల్లా కుప్పం నియోజకవర్గంలో వెలుగుచూసింది.

Ads

లక్ష్మీదేవి లాంటి భార్య… లీలలు మొదలెట్టిన మొగుడు!
తిరుపతి జిల్లా, కుప్పం బాదురు సమీపంలోని కొత్త కండ్రిగ గ్రామం. అది కరోనా మహమ్మారి అతలాకుతలం చేసిన సమయం. వ్యాపారాలు దెబ్బతిన్నాయి, చేతిలో పైసలు లేవు. ఆ సమయంలోనే కొత్త కండ్రిగకు చెందిన మున్నుస్వామిరెడ్డి (పేరు మార్చబడింది) మైండ్‌లోకి ఒక వికృతమైన ఆలోచన వచ్చింది.

“మనం బాగుపడాలంటే ఒకటే మార్గం… ఆన్‌లైన్‌లో బరిబాతల కాల్స్ చేస్తే లక్షలు వస్తాయి” అంటూ తన భార్యకు మాయమాటలు చెప్పాడు. మొదట ససేమిరా అన్న ఆ పల్లెటూరి పడతిని, మన ఆర్థిక కష్టాలు తీరిపోతాయంటూ నమ్మబలికాడు. లక్ష్మీదేవి లాంటి భార్యను వికృతమైన సైబర్ ప్రపంచంలోకి నెట్టడానికి ‘చామెట్’ (Chill Chat) అనే యాప్‌లో ఆమె పేరుతో ఒక ఐడీ క్రియేట్ చేశాడు.

‘బ్లాక్‌మెయిల్’ తో మొదలైన నరకం!
భార్య శరీరాన్ని ఎరగా వేసి మున్నుస్వామిరెడ్డి లక్షల రూపాయలు సంపాదించాడు. డబ్బు రుచి మరిగిన ఆ కామాంధుడికి ఆశ ఇంకా పెరిగింది. అయితే, రోజులు గడుస్తున్న కొద్దీ పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. “ఇక మీదట నేను ఈ పాపపు పని చేయను, నా బిడ్డల భవిష్యత్తు ముఖ్యం” అని ఆ భార్య తేల్చి చెప్పింది. అంతే…

మునిరత్నంరెడ్డిలోని అసలు రాక్షసుడు బయటపడ్డాడు. “నువ్వు కాల్స్ చేయకపోతే నేను చచ్చిపోతా” అంటూ బ్లాక్‌మెయిల్ డ్రామాలు మొదలుపెట్టాడు. అయినా వినకపోవడంతో రోజూ కొట్టడం, తిట్టడం, బలవంతంగా గదిలో బంధించి ఆ బాపతు వీడియో కాల్స్ చేయించడం నిత్యకృత్యంగా మార్చుకున్నాడు.

ఆ నరకం భరించలేక, ఒకరోజు ఆమె తన చిన్న కూతురిని తీసుకుని ఇల్లు వదిలి పారిపోయింది. కానీ, రాక్షసుడి చెరలో ఉన్న తన పెద్ద కూతురిని చూడటానికి వెళ్లిన సమయంలో, మున్నుస్వామిరెడ్డి ఆమెపై జంతువులా దాడి చేసి రక్తం వచ్చేలా గాయపరిచాడు.

వీడియో వైరల్… దొంగే దొంగ అన్నట్టు విడాకుల వేధింపులు!
కథ ఇక్కడితో ఆగలేదు. విధి ఆ అభాగ్యురాలితో మరో వింత నాటకం ఆడింది. ఆమె చేసిన ఒక పాత వీడియో కాల్‌ను గుర్తుతెలియని వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఊరు, వాడా ఆ వీడియో చూసి ఆమెను చులకనగా చూడటం మొదలుపెట్టాయి.

ఇదే అదనుగా భావించిన ఆ కిరాతక భర్త మున్నుస్వామిరెడ్డి, తనేదో పతివ్రతుడిలా నాటకమాడటం మొదలుపెట్టాడు. “నీ వీడియో వైరల్ అయింది, సమాజంలో నా పరువు పోయింది, నాకు విడాకులు కావాలి” అంటూ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించాడు. అంతటితో ఆగక, ఆమె సంపాదించిన రూ. 18 లక్షల నగదును, ఒంటి మీదున్న బంగారు నగలను గుంజుకుని ఆమెను నడిరోడ్డుపైకి నెట్టేశాడు.

ఖాకీల నీడలో కామపిశాచి… కానిస్టేబుల్ అసభ్య లీలలు!
కట్టుకున్నవాడు కాటు వేస్తే, న్యాయం కోసం ఆమె పోలీసులను ఆశ్రయించింది. కానీ, అక్కడ ఆమెకు ఎదురైన అనుభవం చట్టం మీదే అసహ్యం కలిగించేలా చేసింది. బాధితురాలు తిరుపతి మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళితే… అక్కడ కూడా ఆమెకు చులకన భావమే ఎదురైంది. సహాయం చేయాల్సిన పోలీసులు ఆమెను హీనంగా చూశారు. అన్నింటికంటే ఘోరం…

ఆర్సీపురం పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఒక కానిస్టేబుల్, ఆమె దీనస్థితిని ఆసరాగా చేసుకోవాలని చూశాడు. “నీ వీడియో నేను చూశాను… కేసు పెట్టాలంటే రాత్రికి నా దగ్గరకు రావాలి” అంటూ అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ లైంగిక వేధింపులకు గురిచేశాడు.

బిడ్డల కోసం తల్లి పోరాటం!
కట్టుకున్న భర్త కసాయి అయ్యాడు… కాపాడాల్సిన ఖాకీలు కామపిశాచులయ్యారు. ఇప్పుడు ఆ అభాగ్యురాలు మీడియా ముందుకొచ్చి కన్నీరుమున్నీరవుతోంది. “నా జీవితం ఎలాగూ నాశనమైంది. కానీ ఎదుగుతున్న నా ఇద్దరు బిడ్డలను కూడా ఆ రాక్షసుడు రేపు ఇదే నరకంలోకి లాగుతాడు. దయచేసి నా బిడ్డలను నాకు ఇప్పించండి” అంటూ ఆమె ఆక్రందిస్తోంది.

మరి ఈ ‘చామెట్’ యాప్ ముఠా వెనుక ఉన్న మున్నుస్వామిరెడ్డిపై, ఆ కామ కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • డర్టీ మొగుడు- కామ ఖాకీ…! చామెట్ యాప్‌లో బరిబాతల దందా!
  • Unsung Hero – అమెరికన్ గడ్డ మీద ఓ ఇండియన్ గదర్!
  • ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర! – సూత్రధారి ఈ సెంథిల్ బాలాజీ..?
  • H-Fast – హైదరాబాద్‌ కడుపుకి చికిత్స – ఫుడ్ సేఫ్టీ హల్‌చల్ !!
  • మావిగన్! ఆంధ్రుల రాజధాని ఇక ఎప్పటికీ ఓ ప్రశ్నార్థకమే!!
  • గోల్డ్ మార్కెట్! మన ‘బంగారు తల్లుల’ కొత్త పాఠాలు – అనూహ్య మార్పు!!
  • ‘తిరుచ్చిలో మా పోటీ అనైతికం’ – త్రిష కాళ్లల్లో లారెన్స్ కట్టెలు!
  • ఎవరు జర్నలిస్టు..? ఏది పత్రికాస్వేచ్ఛ..? ఓ దిక్కుమాలిన నిరర్థక చర్చ..!!
  • అక్కినేనితో ఒకటే – నందమూరితో ఒకటే – విజయశాంతితో లాస్ట్!
  • ఫామ్‌హౌజులో పశుపతి బందీ! – విమర్శలకు క్రియేటివిటీతో పదును!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions