Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చివరకు AI కూడా చెబుతోంది- హరీష్‌రావు చెప్పేవన్నీ అబద్ధాలేనని!!

July 3, 2026 by M S R

.

తెలంగాణ అప్పుల లొల్లి ఏంది సార్ అనడిగాడు ఒకాయన… మంచి ప్రశ్న… కాంగ్రెస్- బీఆర్ఎస్ ఓ దిక్కుమాలిన రచ్చకు తెరలేపాయి కదా… వాళ్లు చెప్పే ఆర్థికలోటు, అప్పుల లెక్కలు సగటు మనిషికి ఒక్క ముక్క కూడా అర్థం కావు… సగటు మనిషికేం ఖర్మ? నిష్కర్షగా చెప్పాలంటే బడ్జెట్ భాష, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ మ్యాథ్స్ వెనక్కి తిరిగి మళ్లీ చదువుకుంటే, వాటిని పేర్చిన టీమ్‌కే సమజ్ కావు…

మరెందుకు ఈ రచ్చ? కేబినెట్ విస్తరణలో ఉంటాడో లేదో తెలియని మంత్రికి ఎందుకు ఈ లొల్లి? తెరపైకి రావాలనేనా? నేనూ ఉనికిలోనే ఉన్నానోచ్ అని చెప్పుకోవడమా? లేకపోతే ఇదేమిటి? హరీష్ రావు అబద్ధాలు చెప్పడంలో ప్రసిద్ధహస్తుడని అందరికీ తెలుసు… కావాలని ప్రచారయుద్ధంలోకి లాగుతాడనీ తెలుసు… ఏవేవో చెబుతూ జనంలో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచే ప్రయాసలో ఉంటాడనీ తెలుసు… మరెందుకు ఈ సవాళ్లు, ప్రతిసవాళ్ల ట్రాపులోకి మంత్రులు పడిపోవడం?

Ads

హరీష్ రావు ఏమంటున్నాడు..? నో, నాన్సెన్స్, కాంగ్రెస్ చెబుతున్నట్టు 8 లక్షల కోట్ల అప్పులు చేయలేదు, జస్ట్, 4 లక్షల కోట్లే అప్పులు చేశాం అంటున్నాడు… అక్కడికి అదేదో ఘనకార్యం చేసినట్టు! మీరు చేస్తున్న అప్పులు ఏమవుతున్నాయి, ఎవరి జేబులోకి వెళ్తున్నాయి అంటున్నాడు, మరి ఆ 8 లక్షల కోట్లు ఎవరి జేబులోకి వెళ్లినట్టు? అందుకే కాళేశ్వరం ఇంజినీర్లలో ఎవడిని తన్నినా వందల కోట్లు రాలుతున్నయ్?

అప్పులు

సరే, 4 లక్షల కోట్లే తెచ్చారు అనుకుందాం… తెలంగాణ ఏర్పడినప్పుడు జస్ట్ 69 వేల కోట్లు ఉన్న అప్పు, ధనిక రాష్ట్రం కాస్తా కేసీయార్ దిగిపోయేనాటికి 8 లక్షల కోట్ల అప్పుల్ని దాటిపోయింది… మరి కాగ్, ఆర్బీఐ, కేంద్రం చెప్పే లెక్కలు 4 లక్షల కోట్లే కదానేది ఓ విఫల సమర్థన… ఎందుకంటే..?

రాష్ట్రానికి ఎఫ్ఆర్‌బీఎం చట్రం ఎడాపెడా అప్పులు చేయకుండా పరిమితులు విధిస్తుంది… జీఎస్డీపీలో (రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 25 శాతం మించకూడదు) అందుకని ఆ పరిధిలో 4 లక్షల కోట్లు తెచ్చి, ఇక రకరకాల కార్పొరేషన్ల పేర్లతో ఎడాపెడా అప్పులు తెచ్చారు, అవి ప్రభుత్వ సంస్థలు, తీర్చాల్సింది ప్రభుత్వమే, ప్రభుత్వానిదే ఆ అప్పులకు గ్యారంటీలు, హరీష్ రావు తెలివిగా వాటిని మాత్రం లెక్కల్లో చూపించడు…



అప్పులు



జనానికి అర్థమయ్యేలా కేసీయార్ దారుణ ఆర్థిక నిర్వహణను తేటతెల్లం చేయడంలో మంత్రులూ ఫెయిల్… చివరకు ఓ దశలో ఇంకా అప్పులు దొరక్క ఔటర్ రింగ్ రోడ్డును అడ్డికిపావుశేరు లీజుకు ఇచ్చారు… (అది మరో స్కామ్- రేవంత్ దాన్ని వదిలేయకుండా ఉండాల్సింది)… నిజానికి జూపల్లి ఆర్థిక వ్యవహారాలపై రచ్చకు పూనుకోవడం వేస్ట్…

భట్టి ఆర్థిక మంత్రి కాబట్టి మాట్లాడితే అర్థముంది… అన్నింటికీ మించి చెప్పుకోవాల్సింది రేవంత్ రెడ్డి కేంద్రం వద్ద పదే పదే ప్రయత్నించి… కేసీయార్ అడ్డగోలు వడ్డీ రేట్ల స్వల్పకాలిక రుణాల్ని, తక్కువ వడ్డీ రేట్లకు దీర్ఘకాలిక రుణాలుగా రీషెడ్యూల్ చేయించుకునే ప్రయత్నాన్ని! కేసీయార్ మోపిన అప్పుల భారాన్ని మోస్తూ, దాన్ని తగ్గించుకోవడానికి ఎలా తిప్పలు పడుతున్నదో హైలైట్ కావాలి… అది చెప్పుకోవడం కాంగ్రెస్‌కు చేతకాదు…

కేసీయార్ దిగిపోయేనాటికి, తన పాలన వైఫల్యాల కారణంగా… ఉద్యోగులకు జీతభత్యాలు సరిగ్గా ఇవ్వలేని దుస్థితి… ఆరోగ్యశ్రీ, కంట్రాక్టర్లు, ఫీజు రీయింబర్స్‌మ్ంట్ తదితరాలకు వేల కోట్ల బకాయిలు… (అందుకే రేవంత్ రెడ్డి తనను బకాయిసురుడు అని వ్యాఖ్యానించింది)… ఈ కేసీయార్ ఫెయిల్యూర్లన్నీ సమర్థంగా కౌంటర్ చేయగలిగేది రేవంత్ రెడ్డి ఒక్కడే, అదీ సరైన వేదిక మీద… అందాకా ఈ రచ్చ, ఈ లొల్లి శుద్ధ దండుగ… హరీష్ రావు ట్రాపులో పడిపోకుండా తమాయించుకోగలిగితే అదే పదివేలు!!

అన్నట్టు చెప్పడం మరిచేపోయాను… ఈ అప్పుల లొల్లి ఏమిటి? నిజంగా కేసీయార్ చేసిన అప్పుల కథేమిటి అని ఎఐని అడిగితే ఖుల్లంఖుల్లా ఇలా చెప్పింది…



అప్పులు



హరీష్ రావు అబద్ధాల స్థాయి ఏమిటో అర్థమవుతోంది కదా… అదీ సంగతి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ సినిమా అర్థం కావాలంటే… మినిమం పీహెచ్‌డీ చేసి ఉండాలి!!
  • చివరకు AI కూడా చెబుతోంది- హరీష్‌రావు చెప్పేవన్నీ అబద్ధాలేనని!!
  • గడ్డ కట్టిపోయే స్థితిలో…. ఆ చిన్నారిని అలాగే ఎత్తిపట్టుకుని…
  • అంతా ‘మాయ’ – పాక్ ఏదైనా స్మగుల్ చేస్తుంది – చైనా ఏదైనా తినేస్తుంది
  • ఆ ‘టైమ్’ వచ్చేదాకా ప్రసవవేదన- ప్రయాస… టాటా వాచీల కథ!
  • నిజంగానే బాలు లేదా దాసరి ఈ సినిమా చేసి ఉంటే…. నా సామిరంగా..!!
  • అమరావతి రాజధాని పనుల్లో ఏదో భారీ తేడా కొడుతోంది!
  • అర్థరాత్రి స్వతంత్రం వెనుక ఆసక్తికర జ్యోతిష్య రహస్యం!
  • ఒక ఆదిపురుష్ – ఒక అఖండ2 – ఒక నాగబంధం!!
  • బంగారు లోదుస్తులు! – వామ్మో ఇరాక్ ఎంపీ!! విస్తుపోయిన ప్రపంచం!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions