.
న్యూస్ గ్రూపుల్లో కనిపిస్తున్న ఓ తాజా వార్త… ‘‘కవిత పార్టీకి ఈసీ షాక్, TRS పేరు మార్చాలని ఈసీ ఆదేశాలు, TRS పేరు కొనసాగించేందుకు వీల్లేదని కవితకు లేఖ, TRS పేరుపై ప్రజల నుంచి అభ్యంతరాలు వచ్చాయి, 15 రోజుల్లో 3 ప్రత్యామ్నాయ పేర్లు సమర్పించాలి, ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వకపోతే దరఖాస్తు క్లోజ్ చేస్తామని ఈసీ హెచ్చరిక…. ఈసీ నుంచి వచ్చిన 2 అభ్యంతరాలకు సమాధానం ఇచ్చాం, కొత్త పేర్లు ఇచ్చేది లేదు, న్యాయపోరాటానికి సిద్ధం అని కవిత స్పష్టీకరణ…
నిజానికి ఇది వారం పదిరోజులుగా జరుగుతున్నదే… మొదట తెలంగాణ రాష్ట్ర సేన, తెలంగాణ రక్షణ సేన (అసోసియేషన్) పేరిట దరఖాస్తులు చేసుకుంది, ఆమె పార్టీ పేరు ప్రకటన, పార్టీ లాంచింగ్ సమయంలోనూ కనిపించింది అదే… అయితే పార్టీ పేరుకు అధికారిక ఆమోదం రాకముందే ప్రకటించడం అపరిపక్వ నిర్ణయమనే విమర్శలు కూడా అప్పట్లో వచ్చాయి… పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టినట్టు!
Ads
టీఆర్ఎస్ అనే అబ్రివేషన్‌తో ఆమె పార్టీకి ఆమోదం గనుక దక్కితే ఆమెకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది… కేసీయార్ అనవసరంగా టీఆర్ఎస్‌ను వదులుకున్నాడు, దానికి ఉద్యమ పోరాటం తాలూకు మహత్తు, విలువ, పోరాటాల భావోద్వేతం ఉంది, దాన్ని బిడ్డకు ధారాదత్తం చేస్తున్నట్టే… టైట్ ఫైట్ జరిగే సందర్భాల్లో పార్టీ పేరు వల్ల ఓటర్లలో ఏకాస్త గందరగోళం తలెత్తినా, ఎన్నిక ఫలితమే తారుమారయ్యే ప్రమాదం ఉంటుంది…
సో, లేటుగా వచ్చిన సోయితో ఇక ఈసీకి వందల ఫిర్యాదులు పంపించారు… విచిత్రంగా బీజేపీ నుంచి కొన్ని ఫిర్యాదులు కూడా వెళ్లాయట… ఐనా బీజేపీ, బీఆర్ఎస్ రహస్య సంసారమే కదా..! (అన్నట్టు, బీజేపీ అనే అబ్రివేషన్ వచ్చే రిజిష్టర్డ్ పార్టీలు 13-15 దాకా ఉన్నాయట…)

ఆల్రెడీ సిద్దిపేట నుంచి తెలంగాణ రాజ్యసమితి పేరుతో ఓ పార్టీ, మహారాష్ట్ర నుంచి అదే అబ్రివేషన్‌తో మరో పార్టీ నమోదై ఉన్నాయట… వాటి అభ్యంతరాలకు కవిత సమాధానాలు పంపించింది… అవి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, ఆ అభ్యంతరాలకు విలువ లేదు అని… తరువాత ఇంత భారీగా (వందల) ఫిర్యాదులు, అభ్యంతరాలు రావడంతో ఎన్నికల సంఘం మరో లేఖ రాసిన మాటా నిజమే…
ఆ అభ్యంతరాలు ఏమిటో పంపిస్తే, సమాధానాలు ఇస్తామని కవిత టీమ్ ఈసీకి బదులిచ్చింది… సో, పేరుకు ఇది అధికారికంగా ఈసీ వర్సెస్ టీఆర్ఎస్‌లాగా పైకి కనిపిస్తున్నా సరే… వాస్తవంగా బీఆర్ఎస్ కేడర్ అభ్యంతరాలు వర్సెస్ కవిత టీమ్ సమాధానాలుగా ఈ పోరాటం సాగుతోంది… ప్రత్యామ్నాయ పేర్లు కాదు, అవసరమైతే లీగల్ ఫైట్ చేయడానికీ కవిత టీమ్ ఆల్రెడీ ప్రిపేరైపోతోంది! అదీ కథ!!
Share this Article