Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కన్నెపల్లి పంపులపై కేటీయార్ వితండవాదం – ఇవిగో అసలు నిజాలు…

July 6, 2026 by M S R

.

కాళేశ్వరంపై బీఆర్ఎస్ సర్కారును, కాంగ్రెస్ పార్టీని ఓ ట్రాపులోకి లాగే ప్రయత్నం చేస్తోందా..? తద్వారా రేవంత్ రెడ్డి సంకల్పించిన తుమ్మిడిహెట్టి టు సుందిళ్లకు పురిట్లోనే గండికొట్టే కుట్రకు పాల్పడుతోందా..? ఇప్పటికే మేడిగడ్డను మింగిన బీఆర్ఎస్ అన్నారం, సుందిళ్లకూ ఎసరు పెట్టే ఆలోచనలో ఉందా..? హరీష్ రావును సైడ్ లైన్ చేసి, ఇక కేటీయార్ పూర్తిగా పగ్గాలు చేపట్టినట్టేనా..? ఇవి కాస్త సీరియస్‌గా విశ్లేషించుకోవాలి, ఎందుకంటే బీఆర్ఎస్ ఏదైనా చేయగలదు… నిన్న కేటీయార్ కన్నెపల్లి స్టేషన్ సందర్శన, చేసిన వితండవాదం వివరంగానే చెప్పుకోవాలి… కేటీయార్ మరిచిన నిజాలేమిటో, తన వాదనలపై అసలు నిజాలు ఏమిటో కూడా చర్చలకు రావాలి…

1) హరీష్ రావు… నిన్న గమనించారా..? మొత్తం కేటీయార్ షో… ఎప్పుడూ సాగునీటి విషయాలు హరీష్ రావే మాట్లాడేవాడు, అసెంబ్లీలో గానీ, బయట గానీ… తను సాగునీటి మాజీ మంత్రి కదా, కొంత సబ్జెక్టు కూడా ఉంది… కానీ కన్నెపల్లి ఎపిసోడ్‌లో తను ఎక్కడా లేడు… ఇక పార్టీలో నేనే సర్వం అనే మెసేజ్ పార్టీ కేడర్‌కు కేటీయార్ ఇచ్చేశాడు… ఇది హరీష్ రావు పట్ల ‘ఆపరేషన్ కత్తెర’…

Ads

ktr

2. సరే, ఆ పార్టీ అంతర్గతం… చెల్లె బయటికి పోయింది, బావ బయటికి పోతే, ఇక నేనే అనుకున్నాడేమో, దాన్ని వదిలేస్తే తనేమన్నాడు… లక్ష క్యూసెక్కుల వరద వస్తోంది గోదావరిలో, వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలి, మామీద కక్షతో రైతులను నష్టపరచొద్దు, కన్నెపల్లి సందర్శన రాజకీయ ప్రేరేపితం కాదు…

నిజం ఏమిటంటే… అన్నారం, సుందిళ్ల నిర్మాణాలు కూడా నాసిరకం, అశాస్త్రీయం, వాటిల్లోకి నీరు ఎత్తిపోస్తే అవీ మేడిగడ్డలాగా తస్కే ప్రమాదం ఉంది, NDSA బరాజుల నుంచి నీళ్లనలా వదిలేయాల్సిందేనని చెబుతోంది… బీఆర్ఎస్ ట్రాపులో పడి ఒకవేళ ప్రభుత్వం తొందరపడితే అన్నారం, సుందిళ్ల బరాజులకూ మేడిగడ్డ గతే… అదే జరిగితే భద్రాచలానికి, మరికొన్ని ఊళ్లకు డేంజరే…

kaleswaram

3. కుంగినవి రెండు పిల్లర్లు, ఎల్‌అండ్‌టీ రిపేరు చేస్తానంటే సర్కారు ఒప్పుకోలేదు, ఆఫ్టరాల్ మూణ్నాలుగు వందల కోట్ల ముచ్చట అంటున్నాడు కేటీయార్…

తప్పు… ఆ రెండు పిల్లర్లు అనేది కాదు ఇష్యూ… మొత్తం బరాజుల నిర్మాణమే నాసిరకం… సీకెంట్ పైల్స్ పద్ధతి గోదావరిపై పనికిరాదు, కానీ కేసీయార్ సూచనలతో ఆ పద్ధతి పాటించి మొత్తం లక్ష కోట్ల ప్రాజెక్టునే ప్రమాదంలో పడేశారు… కటాఫ్ వాల్, స్టిల్లింగ్ బేసిన్, పైపింగ్ ఎఫెక్ట్ అన్నీ లోపాలే… అసలు కేసీయార్ సూచనలకు గుడ్డిగా తలూపిన ఇంజినీర్లను ఉరితీసినా తప్పులేదు…

మరో నిజం ఏమిటంటే..? ఎల్అండ్‌టీ రిపేరుకు ముందుకురాలేదు, అక్కడే కదా రేవంత్ రెడ్డికి చర్రుమన్నది… ఇప్పుడు మొత్తం మూడు బరాజులకు కింది వరకూ బోర్లు వేసి, పరీక్షలు చేసి, అప్పుడు ఎలా రిపేర్లు చేస్తే అవి నిలుస్తాయో తేల్చాలి… ఇప్పుడు ఆ పని జరుగుతోంది…

ఇంకో నిజం… రేవంత్ రెడ్డి తుమ్మిడిహెట్టి లేదా దాని ఎగువన బరాజు కట్టి, ఆ నీటిని సుందిళ్ల దాకా తీసుకొచ్చి, ఎల్లంపల్లికి ఎత్తిపోయాలనీ, తద్వారా గోదావరి జలాల సమర్థ వినియోగం జరుగుతుందని సంకల్పించాడు… ఇప్పుడు బీఆర్ఎస్ అన్నారం, సుందిళ్ల బరాజులకూ గండికొట్టే ట్రాప్ విసురుతోంది ప్రభుత్వం మీద… అంటే తుమ్మిడిహెట్టికి కూడా పురిట్లోనే గండి కొట్టే కుట్ర అనుకోవచ్చు కదా…

medigadda

4. కాళేశ్వరం మాకు అప్పగించండి, కేసీయార్ వారం రోజుల్లో రాష్ట్రమంతా నీళ్లిస్తాడు, ఎక్కువ వరి పండితే ఎక్కువ ధాన్యం కొనాలి, ఎక్కువ బోనస్ ఇవ్వాల్సి వస్తుందని కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తలేరని కేటీయార్ చెబుతున్నాడు…

వితండ వాదం అంటారు దీన్ని… సముద్రంలోని ఉప్పుకూ, చెట్టు మామిడి కాయ పులుపుకూ ముడిపెట్టడం ఇది… కాళేశ్వరానికి సొంత ఆయకట్టు ఏముందని అసలు..? శ్రీశైలం, శ్రీరాంసాగర్, దేవాదుల, నాగార్జునసాగర్ ఏమీ అవసరం లేదా? కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తే రాష్ట్రమంతా నీళ్లొస్తాయా..? ఏం మాట్లాడుతున్నాడో తను!!

kaleswaram

5. కాంగ్రెస్ అవినీతి, అసమర్థత వల్లే ఎస్ఎల్బీసీ కూలింది అంటాడు కేటీయార్…

అది ప్రకృతి తెచ్చిపెట్టిన ప్రమాదం, అక్కడ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రోజూ కుర్చీ వేసుకుని కూర్చున్నా ఫలితం ఉండదు… అది అనుకోకుండా ముంచిన విపత్తు … అందులో అవినీతి, అసమర్థత ఏముంది.,.? అందుకే రాజకీయ నేతల మాటల్లో విచక్షణే కాదు, విజ్ఞత కూడా ఉండాలి అనేది!!

kaleswaram

6. పంపులు ఆన్ చేయకపోతే 50 వేల మందితో వెళ్లి మేమే ఆన్ చేస్తాం… ఇదీ కేటీయార్ హెచ్చరిక…

పోనీ, ఈ సాకుతోనైనా కేసీయార్ ఫామ్ హౌజ్ బందిఖానా నుంచి బయటికి వస్తాడా..? మేడిగడ్డలాగే అన్నారం, సుందిళ్ల బరాజులకూ గండ్లు కొడతాడా..?

చివరగా… కేటీయార్ నిన్నటి వాదనల్లోని అనేక అంశాలకు పాయింట్ టు పాయింట్ సమాధానాలు ఇవ్వొచ్చు… వాటినలా వదిలేయొచ్చు… కానీ పదే పదే కాళేశ్వరం మీద బీఆర్ఎస్ ఏం మాట్లాడినా, ఏం చేసినా అది ఆ పార్టీకే కౌంటర్ ప్రొడక్ట్… జనంలో కాళేశ్వరం అవినీతి మీద, బ్లండర్స్ మీద మరింత చర్చ జరుగుతూనే ఉంటుంది జనంలో… ఐతే కేటీయార్ కన్నెపల్లి ప్రహసనాన్ని రాష్ట్ర మంత్రులు సమర్థంగా ఎండగట్టగలిగారా? అది వేరే చర్చ… ప్రస్తుతానికి ఇక్కడ ముగిద్దాం…

చివరాఖరుగా… కేసీయార్ ఇంజినీరింగ్ బ్లండర్ దెబ్బకు కన్నెపల్లి కూడా మునిగింది… అసలు అందులో ఎన్ని మోటార్లు పనిచేసే స్థితిలో ఉన్నాయి? ఆ నష్టం మాటేమిటి మరోసారి చెప్పుకుందాం..!! నిజానికి నిన్న ఉత్తమకుమార్ రెడ్డే చెప్పి ఉండాల్సింది!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కన్నెపల్లి పంపులపై కేటీయార్ వితండవాదం – ఇవిగో అసలు నిజాలు…
  • మూడు రాచకుటుంబాల వారసత్వం – ఒక్క వీడియోతో కెరీర్ కకావికలం
  • FIFA 2026 – అనూహ్య ఫలితాలు – అంచనాల్లో తేడాలే అసలు మజా!!
  • I will find you – గ్రిప్పింగ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ –
  • OTT కంటెంటుపైనా ‘కత్తెర’ – జీ5 నుంచి ఓ సినిమా మొత్తం లేపేశారు!!
  • ఆరుగురూ ఆరుగురే! అసలు జాతీయ ఉత్తమ అవార్డు విజేత ఎవరో!!
  • రావణ్‌పై రాజద్రోహం సెక్షన్? ప్రకాశ్‌రాజ్‌నూ బుక్ చేస్తారా?
  • ఆ రోడ్డు పక్కన… ఆ కారును కేసీఆర్ ఎందుకు ఆపినట్టు ఆ అర్థరాత్రి వేళ!?
  • ప్రజాస్వామ్యం ఎప్పుడైనా ఆపదలో పడితే మళ్లీ వస్తా :: చిరంజీవి
  • అశ్విని! వెండితెర వెలుగు తార- విధి నాటకంలో రాలిపోయింది!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions