.
ఒకాయన అడిగాడు సీరియస్‌గానే..! ఎందుకు ప్రశ్నించవు అని..!! తను అడిగిన ఘాతుకం, పైశాచికం ఏమిటంటే… తన బాధలో అర్థముంది కూడా… రాజస్థాన్‌లో శ్రీగంగానగర్ జూన్ 18న ఓ 13 ఏళ్ల బాలికను దుండగులు మాయమాటలతో ఎత్తుకెళ్లి, పలు హోటళ్లలో దాచి, వరుసగా రోజుల తరబడీ అత్యాచారం చేశారు…
14 మందిని అరెస్టు చేశారు, మరో 18 మంది దొరకాలి… వాళ్లను బజారులో ఊరేగిస్తూ, జనానికి దేహశుద్ధి చేసే అవకాశం కల్పించారు… ఖుంగార్, జాయ్ ఇన్, సఫైర్ ఇన్ హోటళ్లను బుల్‌డోజర్లతో కూల్చేశారు… అంతేనా..? అవును, అదే ఎక్కువ… అక్కడ యోగీ కాదు సీఎం… ఎవడో సోది భజన్ లాల్ శర్మ… అక్కడెవరూ సజ్జనార్‌లు లేరు…
Ads
ఆఫ్టరాల్ ఓ 13 ఏళ్ల బాలిక… ఎవడికి కావాలి… ఆ పైశాచిక ఘటనకు స్పందించేది ఎవరు..? మన న్యాయవ్యవస్థ అడ్డమైన సూమోటో కేసులు తీసుకుంటుంది, కానీ ఇవి పట్టవు… ఎందుకంటే..? ఏ కపిల్ సిబల్, ఏ ప్రశాంత్ భూషణ్ ఆమెకు మద్దతు రాడు కదా… యాకూబ్ మెమన్, అఫ్జల్ గురు అయితే సుప్రీంకోర్టు తలుపుల్ని అర్థరాత్రి తెరిపించడానికి..!!
అత్యంత కిరాతకమైన అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులోనే మరణ శిక్షలు, యావజ్జీవ శిక్షల్ని ఖరారు చేయడానికి హైకోర్టుకు ఏళ్లూపూళ్లూ పట్టింది… ఇంకా సుప్రీం, అప్పీళ్లు, ధర్మాసనాలు, క్షమాభిక్ష పిటిషన్లు గట్రా పూర్తయ్యేసరికి ఎంచక్కా ప్రజాధనంతో కడుపు నిండా తింటూ బతికే ఉంటారు ఆ పిశాచాలు…
ఎస్, ఈ రాజస్థాన్ కేసులో మన న్యాయవ్యవస్థ అంతకుమించి సాధించేది ఏమీ ఉండదు… నిజం ఇలాగే నిష్ఠురంగా ఉంటుంది… హోటళ్లు కూల్చేస్తే, బజారులో ప్రజలతో కొట్టిస్తే ఒరిగేదేమిటి సీఎం..? ఏమో, వాళ్లు బెయిల్ తెచ్చుకుని మళ్లీ సమాజంలో తిరుగుతూ, ఈసారి 13 ఏళ్లలోపు బాలికలపై కన్నేస్తారు… అవును, మన న్యాయవ్యవస్థ ఏ అన్యాయానికీ జవాబుదారీ కాదు కదా, పైగా బెయిల్ జన్మహక్కు అంటుంది…
అన్నింటికీ మించి… టెర్రరిస్టులు, మతపిశాచాలు, ‘రావణ్’లకు మద్దతుగా నిలిచే యూట్యూబర్ల జాతి ఒకటి ఉంది కదా దేశంలో… తెలుగు రాష్ట్రాల్లో సంగతి తెలుసు కదా.., జర్నలిజం ముసుగులో చెలరేగిపోయే పర్వర్టెట్ జాతివ్యతిరేక సంతతి… ఈ దేశంలో సగటు మనుషులకు, బాధితులకు మానవ హక్కులు ఉండవు కదా, ‘రావణ్’లకు తప్ప..!! ఎవడికీ, ఎవతికీ నొప్పి తీవ్రత తెలియదు కదా..!! బాధితులు కాదు కదా..!!
మన కోర్టులు ఇంతే… మన న్యాయవ్యవస్థ ఇంతే… మన ఘనత వహించిన జర్నలిజమూ (?) ఇంతే… అందుకే మిత్రమా, నువ్వు దుఖపడకు… ఈ దేశం ఇంతే… పిశాచాల రాజ్యమిది…! కర్మ సిద్ధాంతంతో జరిగేది జరగక మానదు అనుకో.., ఏ బాధా ఉండదు… బీఎన్ఎస్ సాక్షిగా..!!
Share this Article