Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫాఫం తమన్! కామియోకు ఎక్కువ- కేరక్టర్ ఆర్టిస్టుకు తక్కువ!!

July 8, 2026 by M S R

.

నిన్న ఓ వార్త… తమన్ నటించే ఓ సినిమా ‘హృదయం మురళి’ ట్రెయిలర్ రిలీజ్ అయ్యిందట… పాపం, అందులో అథర్వ మురళి హీరో… ట్రెండింగ్ అందగత్తెలు కయదు లోహర్, ప్రీతి ముకుందన్ ఉన్నారు… ఫహాద్ ఫాజిల్ కూడా ఉన్నాడు… అచ్చంగా ఓ అరవ సినిమా… దానికి తెలుగు డబ్బింగ్…

ఇవన్నీ చెప్పకుండా హెడింగుతో సహా మొత్తం తమన్ మీదే వార్త ఫోకస్… అదేమిటలా..? అప్పుడెప్పుడో బాయ్స్ అనే ఓ పిచ్చి సినిమాలో (20 ఏళ్లు దాటింది కావచ్చు) తమన్ నటించాడు… తను లావు, కామెడీకో, కేరక్టర్ ఆర్టిస్టుకో సూటవుతాడు… అప్పుడప్పుడూ ఎస్పీ బాలు నటించినట్టు…

Ads

కానీ ఇప్పుడు మన తెలుగు వార్తలు హీరోకన్నా ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తున్నాయి తనను… తీరా ట్రయిలర్ చూస్తే, అది ఏ రీతిలోనూ లేదు… చివరకు ఓ పాట అప్పట్లో ఏదో సినిమాలో ‘కళాశాలలో’ అనే హిట్ పాట ఉండేది కదా, దానికి కాపీ… తమనే కదా, ఈ సినిమాకూ మ్యూజిక్, తను పర్‌ఫెక్ట్ కాపీయిస్టే కదా… కొట్టేసి ఉంటాడు…

సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎన్ఎం నీహారిక తెలుసు కదా, పాపం సినిమాల్లో అవకాశాల్ని పరీక్షించాలని ప్రయత్నించీ ప్రయత్నించీ ఫ్లాప్… ఆమె రీల్స్, యాడ్స్‌కే సూటబుల్… ఈ హృదయం మురళి సినిమాలోనూ కనిపించింది, తమన్ ప్రేమికురాలేమో పాత్ర… తమన్ చొక్కాపై ఏదో రాస్తోంది… పాపం, ఇద్దరూ ఇద్దరే…

చివరకు ఫహాద్ కూడా ‘ఒక్కటి తక్కువైంది పుష్పా’ అనుకుంటూ గెస్ట్ రోల్‌కు కాస్త ఎక్కువ పాత్ర చేసినట్టు కనిపిస్తోంది… అవును, తమన్ కూడా అంతే… కామియో కాదు, కేరక్టర్ ఆర్టిస్టూ కాదు పాపం… ఒకవైపు తన మ్యూజిక్ ప్రత్యర్థి దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’లో చేస్తున్నాడు… బలగం దర్శకుడు యెల్దండి వేణు తీస్తున్న సినిమా కదా, మంచి ప్రయారిటీ ఉన్న పాత్రే ఉంటుంది… పైగా దిల్ రాజు నిర్మాత…

తమన్

పోటీ పడాలంటే… ఊఁ అంటావా, కుర్చీ మడతబెట్టి వంటి మసాలా పాటల్లో పోటీపడండి… ఎలాగూ మెలోడీయస్ మనకు చేతకాని విద్య… అంతేతప్ప, దేవిశ్రీ ప్రసాద్ నటిస్తున్నాడు కాబట్టి, నేనూ ఏదో సినిమాలో నటించాల్సిందే అని పోటీపడితే ఎలా నందమూరి తమన్…

సౌండ్ బాక్సులు బద్దలు కొట్టగలవేమో ఢమఢమ భీకరమైన చప్పుళ్లతో… కానీ బాక్సాఫీసు బద్దలు కొట్టడం అంత వీజీ కాదు తమన్… అనవసర పోటీ… ఎవరి టేస్టు వాళ్లది… నీకెందుకు చెప్పు, ఈ గోకుడు మళ్లీ..!! లేదంటే ఎస్పీ బాలులాగా భిన్నమైన పాత్రలు ట్రై చేయి, మరీ కామియో కమ్ గెస్ట్ రోల్స్ కాదు!!అసలే సేమ్ బరువు!!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆహా… ఏం చెప్పితివి జగ్గన్నా… నువ్వు సిసలైన ఇరిగేషన్ మేస్త్రీవి…
  • ఫాఫం తమన్! కామియోకు ఎక్కువ- కేరక్టర్ ఆర్టిస్టుకు తక్కువ!!
  • మరో అసందర్భ ప్రేలాపి – నాగదుర్గపై ఏడుపు కూతలు!
  • అక్కడ ఒక యోగీ సీఎం కాదు- ఒక సజ్జనార్‌ అసలే లేడు… మరి..?!
  • ప్రపంచ బ్యాంకు కాకిలెక్కల్లోనే ‘బలుపు’ – జబ్బలు చరుచుకుంటే ఎలా?
  • కృష్ణ నిజంగా సాహసి – మొండి … అందుకే ఎన్టీయార్‌తో ఢీకొట్టాడు…
  • ఈ మీసం ఫోటో గుర్తుంది కదా! – కేటీయార్ జుట్టు దొరికినట్టేనా..?!
  • ఇంతమందికి ఉరి ఇదే తొలిసారి! సరైన తీర్పు- ఇప్పటికే లేటైంది!!
  • సబాంగ్ పోర్ట్! చైనా సముద్ర వ్యూహాలకు ఇండియా తెలివైన చెక్!
  • ఈ అక్రమ భవనాలకూ – జన్వాడ ఫామ్‌హౌజుకూ ఏమిటి లింకులు?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions