.
కొండా సురేఖ, ఆమె బిడ్డ వ్యాఖ్యలు, ధోరణులపై గులాబీ క్యాంపు వెటకారం దట్టిస్తూ పెట్టే సోషల్ మీడియా పోస్టులు, లెక్కలు ఎక్కడిదాకా వెళ్లాయంటే… ఓసారి ఈ లెక్క చూడండి…
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం – 66
మిత్ర పక్షం సీపీఐ -1
ఫిరాయింపు ఎమ్మెల్యేలు -10
మరో మిత్రపక్షం ఎంఐఎం-7
Ads
కొండా సుస్మితకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టింది ఎమ్మెల్సీలతో కలిపి దాదాపు 18.
సో… 66- 16 = 50
మొత్తం సభ్యులు = 119.
ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సింది 60
అంటే, హైకమాండ్ సీఎంlను మార్చినా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందులు ఏమీ లేవు.
50 మంది అచ్చ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ఒక సీపీఐ.. మరో మిత్రపక్షం- 7.
50+ 1+ 7= 58.
అటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు 10 ఉన్నారు.
58+ 10 = 68.
ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బందీ లేదు, భయం అవసరం లేదు.. ఆ పచ్చ కాంగ్రెస్ లో నయానో.. భయానో.. పదవో ఏదో ఒకటి ఇస్తామంటే అచ్చ కాంగ్రెస్ లో జట్టు కడుతారు.. పచ్చ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రయత్నం చేస్తే, ఫ్లోర్ టెస్ట్ లో ప్రతిపక్షం అచ్చ కాంగ్రెస్ కు ఏదో రూపంలో సహకరించవచ్చు…
అదీ చివరి లెక్క… అవసరమైతే మేం సహకరిస్తాం, కమాన్ కూల్చేయండి అని పిలుపు… ఇక్కడ ఇష్యూ ఏమిటంటే..? వాళ్లో వీళ్లో ఎందుకు కొండా సుస్మితనే సీఎంను చేసేస్తే సరి… (తరువాత ఏకంగా గవర్నర్ కోటాలోనే ఎమ్మెల్సీని చేసేయొచ్చు…)
కానీ ‘మేం ఇంకెవరైనా సీఎం కావాలనుకుంటే సహకరిస్తాం’ అని కేటీయార్ లేదా హరీష్ రావును ఒక్క మాట చెప్పమనండి, ఎలాగూ కేసీయార్ యాక్టివ్ రాజకీయాల్లో లేడు కదా…
నిజానికి కాకిలెక్కలు… ఫిరాయింపు ఎమ్మెల్యేలందరూ ఎటో ఒకవైపు ఇంటాక్ట్‌గా లేరు… 18 మంది ప్రెస్ మీట్ అనేది అప్పటికప్పుడు అందుబాటులో ఉన్నవాళ్ల సంఖ్య… అందులో ఎమ్మెల్సీలూ ఉన్నారు… అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అనేది వ్యంగ్యానికి పనికొస్తుంది…
కానీ గులాబీ ఏమైనా నిఖాలస్ కలరా..? తలసాని నుంచి ఎందరో పచ్చ బీఆర్ఎస్ నేతలు లేరా..? సో, ఈ లెక్కలు, సమీకరణాలు అబ్సర్డ్… హైకమాండ్‌కు కూడా పక్కాగా తెలుసు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని డిస్టర్బ్ చేస్తే, మొత్తం పుట్టి మునిగిపోతుందని…!!
Share this Article