Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొన్ని అద్భుతాలు జరిగిపోతాయి అంతే – అవి అనూహ్యం !!

September 8, 2026 by M S R

.

ఈ సినిమా గురించి బాగానే చెప్పుకుంటున్నాం కదా… కానీ మీడియా వార్తలు ఎంతసేపూ ఎంత పెట్టుబడి పెడితే ఎంత వచ్చిందనే కోణంలోనే సాగుతున్నాయి… కొన్ని కథనాలు మాత్రమే సినిమా నిర్మాణానికి ముందు, నిర్మాణ సమయంలో అనుభవించిన ప్రయాసను గుర్తుచేస్తున్నాయి… అసలు ఈ సినిమా పూర్తి కాదు, పూర్తయినా రిలీజ్ కాదు, ఎవడూ కొనడు, జనం చూడరు అని మొదటి నుంచీ ఎదురైన అనేక గండాల్ని ఆ కరోలీ బాబా ఆశీస్సులే తప్పించాయనేదే నిర్మాత- దర్శకుల అభిప్రాయం…

అసలు సినిమా నిర్మాతకు సినిమా ప్రపంచంతోనే సంబంధం లేదు దగ్గర నుంచి… ఇదుగో మరో విశేషం ఆసక్తికరం… ఈ సినిమా అయ్యేది కాదు, పొయ్యేది కాదు అని ఒక్కొక్కరూ టీమ్ నుంచి బయటికి వెళ్లిపోయి, చివరకు దర్శకుడు, అసిస్టెంట్ డైరెక్టర్ ఇద్దరే స్థిరంగా మిగిలిన దశ గురించిన కథనం ఇది… బాగుంది…

Ads

బాక్సాఫీస్ సంచలనం ‘హనుమాన్ అంశ్’ వెనుక ఆసక్తికర కథ: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఆధ్యాత్మిక గురువుగా… విశాల్ చతుర్వేది దర్శకత్వం… సినిమా షూటింగ్ ప్రారంభ దశలోనే ఓ పెద్ద ఆటంకం ఎదురైంది. ఒరిజినల్ లీడ్ యాక్టర్ తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. ఆ నటుడు సుమారు 40 -50 సార్లు వాంతులు చేసుకొని, పూర్తిగా నీరసించిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా చిన్న చిత్రాలను ఆపాల్సి వస్తుంది లేదా పక్కన పెట్టేయాలి…

ఈ సంక్షోభ సమయంలోనే దర్శకుడికి ఓ ఆలోచన వచ్చింది. చిత్ర యూనిట్‌లో ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లు (AD) ఉండగా, అందులో ఒకరైన శోభినావ్ సత్యా (Shobhinaw Satyaa) చూడటానికి అచ్చం నీమ్ కరోలి బాబా పోలికలతో ఉండటంతో దర్శకుడు అతడిని ప్రధాన పాత్రకు ఎంపిక చేశాడు…

భయాలు, సందిగ్ధతల నడుమ… లీడ్ రోల్ చేయడానికి శోభినావ్ మొదట్లో అనేక సందిగ్ధతలను ఎదుర్కొన్నాడు. తాను నీమ్ కరోలి బాబాకు పరమ భక్తుడినని, ఒకవేళ ప్రజలు తనను ఈ పాత్రలో అంగీకరించకపోతే ఎలా? అని ఆలోచించాడు. అంతేకాకుండా, ఇంతకాలం తనతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సహచరులు తనను హీరోగా ఎలా స్వీకరిస్తారనే చిన్న భయం కూడా ఉండేది. అయితే దర్శకుడు విశాల్ చతుర్వేది తనకు పూర్తి అండగా నిలుస్తానని భరోసా ఇవ్వడంతో ఈ పాత్ర చేయడానికి అంగీకరించాడు.

చిత్రకూట్ ప్రయాణంలో సవాళ్లు… ఇది మరో సమస్య… బడ్జెట్ లేకపోవడం వల్ల లొకేషన్ల విషయంలోనూ తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. “ఈ సినిమా షూటింగ్ కోసం చిత్రకూట్‌కు వెళ్లలేమని, సినిమా ముందుకు సాగదని భావించి చాలా మంది మధ్యలోనే వెళ్లిపోయారు” అని శోభినావ్ చెప్పాడు ఓ ఇంటర్వ్యూలో.

చివరి క్షణంలో పరిస్థితులు ఎంతకూడా అనుకూలించకపోయినా, దర్శకుడు విశాల్ మాత్రం “మనం దీన్ని పూర్తి చేస్తాం” అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించాడనీ, ఎలాంటి సౌకర్యాలు లేని స్థితిలోనూ ఎలాగోలా టీమ్‌ను మళ్లీ కూడగట్టుకుని, రైలెక్కి, లొకేషన్‌కు చేరుకున్నట్లు గుర్తుచేసుకున్నాడు…

చిన్న సినిమా, పెద్ద అడ్డంకులు, పేలవమైన ప్రారంభం, అనుకోని సంచలనం… ఇప్పుడు దీన్ని ఇతర భాషల్లోకి, ఇంగ్లిషులోకి కూడా తీసుకొస్తున్నారు, అంతేకాదు, సీక్వెల్‌కు టీమ్ రెడీ అయిపోతోంది, ఇదే దర్శకుడు, ఇదే నిర్మాత, దాదాపుగా ఇదే టీమ్!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొన్ని అద్భుతాలు జరిగిపోతాయి అంతే – అవి అనూహ్యం !!
  • ప్రకాశ్‌రాజ్ ఐతేనేం? కొన్ని రోల్స్ అస్సలు చేతకావు- కాలేదు !!
  • ఎవరీ తాతా మధు ? ఈ వికృత దూషణలు ఎక్కడ నేర్చాడు ?
  • యాంటీ దళిత్ ! ఒకరినే కాదు- ఆ ఇద్దరినీ బర్తరఫ్ చేస్తారా.?
  • ‘ తేరా సాయి’ వస్తున్నాడు ! ‘సనాతనం’ ఎలా స్పందించబోతోంది ?
  • ఈవీవీ వెగటు కామెడీ సినిమాలే కాదు – ‘ఆమె’నూ చక్కగా చూపగలడు !!
  • వాడిపై లాఠీలు విరుగుతుంటే జనం చప్పట్లు! ఎందుకంటే!
  • అనుప్రియ ! 21 ఏళ్ల ఈ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ కథ తెలుసా మీకు..?
  • రాజీనామా చేసి, జనంలోకి రావయ్యా — అదే గౌరవం- అదే మర్యాద !!
  • ఇదీ ఓ టాక్సిక్ – బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్ ఓ గ్రాండ్ ఫ్లాప్ షో !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions