.
ఆహా… రామాయణ సినిమా దర్శకుడు మరో సర్ప్రైజ్ ఇచ్చాడు… ప్రేక్షకులకు మంచి సర్‘ప్రైజ్… ఓ పాట బిట్ రిలీజ్ చేశాడు… అది రావణ తాండవం… శివుడి భారీ విగ్రహం ఎదుట, చుట్టూ మంటల నడుమ రావణుడు తాండవం చేసే సీన్… ఆ పాట… విశేషం ఏమిటీ అంటారా..?
ఆయా భాషల్లో ప్రసిద్ధులైన సంగీత దర్శకులతో స్వయంగా పాడించడం… అవును, నిజమే… తెలుగులో దేవిశ్రీ ప్రసాద్, తమిళంలో అనిరుధ్- జీవీ ప్రకాష్, హిందీలో విశాల్ దడ్లానీ పాడారు… కన్నడ వెర్షన్ రవి బస్రూర్, మలయాళ వెర్షన్ యదు కృష్ణన్ కె…
Ads
స్వయంగా సంగీత దర్శకులైన ఈ ప్రముఖులతో ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో ఓ పాట పాడించడమే ఆ సర్ప్రైజ్… వాళ్లంతా స్వయంగా గాయకులు కూడా… నచ్చింది… బాగా మనసు పెట్టి వర్క్ చేస్తున్నట్టున్నాడు రెహమాన్ ఈ సినిమాకు…
రామాయణ ప్రాజెక్టులో భాగమైనందుకు ఆ సంగీత దర్శకులు కమ్ గాయకులు కూడా ఏమాత్రం భేషజం ప్రదర్శించలేదు సరికదా, ఆనందంగా ఉన్నట్టు ట్వీట్లు కొడుతున్నారు… అదీ అభినందనీయమే… ఇక్కడ రెమ్యునరేషన్ పెద్ద సబ్జెక్టు కాదు, అలా పాడటానికి, పార్టిసిపేట్ కావడానికి అంగీకరించడమే ఓ విశేషం…
మొదటి నుంచీ అనుకుంటున్నదే కదా… రావణుడిని ఓ ప్రతినాయకుడిగాకన్నా రాముడికి దీటైన ప్రత్యర్థిగా చూపిస్తారనీ, యశ్ ఇమేజ్‌కు తగినట్టు క్రియేటివ్ ఫ్రీడం తీసుకుని మూల కథలోనే ఆ మార్పులు చేసుకున్నారనీ..! ఈ రావణ తాండవం పాట కూడా దానికి తగినట్టుగానే కనిపిస్తోంది…

ముఖ్యంగా యశ్ ఆహార్యం, అభినయం, శివ తాండవాన్ని ఆవిష్కరించిన తీరు ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ… యశ్ ముఖంలో కనిపించే తీవ్రత, హావభావాలు, తెరపై ఆయన చూపించిన ప్రభావం పాటకు ప్రధాన బలంగా నిలుస్తున్నాయి…
రెండు భాగాలుగా తెరకెక్కిన ‘రామాయణం’ మొదటి భాగం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా రెండో పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది…
Share this Article