.
ఈ సంవత్సరం చివరికల్లా మోదీ ప్రధాని పదవి నుంచి దిగిపోతాడు..! కారణాలేమిటి, కారకులెవరు అనేది పక్కన పెడితే కొన్నాళ్లుగా ఈ ప్రచారం వ్యాప్తి పొందుతోంది… సహేతుక విశ్లేషణలు పెద్దగా ఉండవు, శాస్త్రీయ అంచనాలూ ఉండవు… కానీ ఓ ఫీల్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది…
కేంద్ర ప్రభుత్వ రాజకీయ సమీకరణాల్ని ఏ కోణంలో విశ్లేషించుకున్నా ‘మోదీ అర్థంతర పదవీ వియోగం’ అనేది అబ్సర్డ్ అనిపిస్తుంది… ప్రస్తుతానికి తను తిరుగులేని నాయకుడు… మొన్నమొన్నటిదాకా పాలీమార్కెట్ కూడా మోదీ దిగిపోతాడనే అభిప్రాయాల్ని, అంచనాల్ని పెంచింది… కానీ ఇప్పుడు అది కూడా సవరించుకుంది…
Ads
తాజాగా పాలీమార్కెట్ అంచనాల ప్రకారం… మోదీ ఇక దిగిపోకతప్పదు అనే అంచనా 9 శాతానికి పడిపోయింది… స్టాక్ మార్కెట్ దారుణ పతనం తప్ప ప్రస్తుతం పరిస్థితులన్నీ సద్దుమణిగినట్టే కనిపిస్తున్నాయి… కాకపోతే బొద్దింకల పేరిట అరాచకాన్ని క్రియేట్ చేయాలనుకునే కుట్ర ఇంకా ఏయే రూపాల్లో కాచుకుందో కనిపెట్టి, మూలాల్ని పెకిలించే పని ఇంకా వేగంగా, సమర్థంగా జరగాల్సి ఉంది…
అవునూ, ఈ పాలీమార్కెట్ ఏమిటి..? అంచనాలు ఏమిటి..? అనే సందేహాలు వస్తున్నాయా..? నిజమే, చాలామందికి తెలియదు… సరళంగా చెప్పుకుందాం ఓసారి…
పాలీమార్కెట్ (Polymarket) అనేది ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ప్రిడిక్షన్ మార్కెట్ (Prediction Market) లేదా అంచనాల వేదిక… సాధారణంగా ఎన్నికలు, క్రీడలు, ఆర్థిక మార్కెట్లు, సాంకేతికత, అంతర్జాతీయ పరిణామాల వంటి భవిష్యత్తులో జరిగే సంఘటనల ఫలితాలను ఇక్కడ అంచనా వేయవచ్చు… దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలు…
-
ఎలా పనిచేస్తుంది?….: ఇది క్రిప్టోకరెన్సీ (బ్లాక్‌చెయిన్) ఆధారంగా పనిచేస్తుంది… ఉదాహరణకు, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది లేదా ఒక నిర్దిష్ట సంఘటన జరుగుతుందా లేదా అని రెండు వేర్వేరు ఆప్షన్లు (Yes లేదా No) ఉంటాయి…
-
ట్రేడింగ్….: షేర్ మార్కెట్ లాగే, భవిష్యత్తులో జరుగుతుందని మీరు భావించే ఫలితంపై (Yes లేదా No) డిజిటల్ టోకెన్ల ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు… ఒకవేళ మీ అంచనా సరైనదైతే, మీకు లాభం వస్తుంది; తప్పు అయితే పెట్టిన మొత్తం కోల్పోతారు…
-
ఎందుకు ప్రసిద్ధి చెందింది?….: ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు, ఎన్నికలు (ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు), కీలక వార్తలు, క్రీడా ఈవెంట్లకు సంబంధించి భవిష్యత్తులో ఏం జరగవచ్చనే దానిపై ట్రెండింగ్ అంచనాలు ఇక్కడ ఖచ్చితమైన గణాంకాల రూపంలో కనిపిస్తాయి కాబట్టి ఇది చాలా పాపులర్ అయింది…
ఇంకా సరళంగా చెప్పాలంటే, ఇది మన సట్టా బజార్ టైపు… ఒక రకంగా చెప్పాలంటే కాన్సెప్ట్ పరంగా అదే పద్ధతి (అంచనాలు వేయడం, గెలుపోటములపై బెట్టింగ్ కట్టడం), కానీ కొన్ని పెద్ద తేడాలు ఉన్నాయి…
- లీగల్ & డిజిటల్ విధానం…: మన దేశంలో ఉండే ‘సట్టా బజార్’ లేదా మట్కా పూర్తిగా చట్టవిరుద్ధమైనవి, స్థానిక వ్యక్తుల ద్వారా రహస్యంగా నడుస్తాయి… కానీ పాలీమార్కెట్ అలా కాదు; ఇది అంతర్జాతీయంగా ఆన్‌లైన్‌లో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ (క్రిప్టో) ఆధారంగా పనిచేసే ఒక అధికారిక గ్లోబల్ ప్లాట్‌ఫాం…
- పారదర్శకత…: సట్టా బజార్‌లో లెక్కలు, రేట్లు అన్నీ గోప్యంగా, ఎవరికీ తెలియకుండా జరుగుతాయి… పాలీమార్కెట్‌లో మాత్రం అన్నీ డిజిటల్ లెడ్జర్ (బ్లాక్‌చెయిన్) పై రికార్డ్ అవుతాయి కాబట్టి ఎవరు ఎంత పెడుతున్నారు, రేట్లు ఎలా మారుతున్నాయి అనేది ప్రపంచం మొత్తానికి స్పష్టంగా కనిపిస్తుంది…
సమాచార సాధనంగా వాడకం…: పాలీమార్కెట్‌ను కేవలం జూదంలా కాకుండా, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది లేదా ప్రపంచంలో ఏం జరగబోతోంది అనే దానిపై ప్రజల నాడిని (Public Sentiment) అంచనా వేసే ఒక సీరియస్ రీసెర్చ్ టూల్‌గా కూడా ఆర్థిక నిపుణులు, జర్నలిస్టులు వాడుతుంటారు…

భారతదేశంలో ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎక్కువగా చర్చల్లో నిలిచే, మీడియాలో ప్రముఖంగా వినిపించే సట్టా బజార్లు కొన్ని ఉన్నాయి… వాటిలో ముఖ్యమైనవి…
ఫలోడీ సట్టా బజార్ (Phalodi Satta Bazaar – రాజస్థాన్)…:ఇది భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన, అతిపెద్ద ఎన్నికల అంచనాల కేంద్రం… రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో ఉన్న ఈ చిన్న పట్టణం, దేశవ్యాప్తంగా జరిగే లోక్‌సభ, రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై వేసే అంచనాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది… దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించే సమాచారం ఆధారంగా ఇక్కడ రేట్లు మారుతుంటాయి…
బీకనేర్ సట్టా గలీ / చాయ్ పట్టి (Bikaner Satta Gali – రాజస్థాన్)…:రాజస్థాన్‌లోని బీకనేర్‌లో ఉన్న ఈ ప్రాంతం కూడా వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన బెట్టింగ్ కేంద్రం… ఇక్కడ ఎన్నికల ఫలితాలు, రాజకీయ నాయకుల గెలుపోటముల గురించిన అంచనాలు చాలా జోరుగా సాగుతాయి…
Share this Article