.
రామభక్తులపై కాల్పులు జరిపిన చరిత్ర ములాయం సింగ్ యాదవ్‌ది… ఠాట్, గుడి నిర్మాణం ఎలా జరుగుతుందో చూస్తామంటూ బీరాలు పలికిన చరిత్ర లాలూ ప్రసాద్‌ది.,. అడుగడుగునా అయోధ్య గుడిని వ్యతిరేకించింది కాంగ్రెస్, లెఫ్ట్… ఇవన్నీ అయోధ్యను ఓ బీజేపీ వ్యహారంగా చూసి, తప్పులో కాలేశాయి తప్ప అది కోట్లాది భారతీయుల సంకల్పం, ఆశ, కల అని గుర్తించలేకపోయాయి…
యాంటీ హిందూ పోకడలకు ఈ పార్టీలన్నీ పెట్టింది పేరు… వాటికితోడు డీఎంకే, టీఎంసీలు కూడా… కర్నాటకలో ఆమధ్య ధర్మస్థల గుడిపైన జరిగిన కుట్రల గురించి కూడా చదువుతున్నాం… గుడులు, మఠాలపై కేసులు, వివాదాలు ప్రస్తుతం దేశంలో యాంటీ హిందూ యాక్టివిజం… తెలంగాణలోని కేసీయార్ పార్టీ కూడా దీనికి భిన్నం ఏమీ కాదు…
Ads
అయోధ్య చందాలపై నానా గాయిగత్తర చేసి, గతంలో కేసీయార్ ఏమాత్రం పట్టించుకోని, చివరకు ముత్యాల తలంబ్రాల ఆనవాయితీకి కూడా గండికొట్టిన భద్రాచలాన్ని ముందుపెట్టి రచ్చకు దిగిన పార్టీ అది… సో, గుడులపై కుట్రలు కొత్త కాదు… తాజాగా మళ్లీ అయోధ్యపై అఖలేష్ యాదవ్ ఏదో రచ్చ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు… అసలే గుడికి తీవ్ర వ్యతిరేకి- యాంటీ హిందూ కదా…
విషయం ఏమిటంటే… అయోధ్య రామమందిర ట్రస్టు విరాళాలు, కానుకల్లో అవకతవకలు జరిగాయనేది ఆరోపణ… నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరపాలని రామమందిర ట్రస్టు అధ్యక్షుడు మహాంత్ నృత్య గోపాల్ దాస్ వారసుడు మహాంత్ కమల్ నయన్ డిమాండ్ చేశారు… ఎందుకంటే..? ట్రస్టు ఉద్యోగిగా, మందిరంలో అకౌంట్స్ ఇన్ఛార్జిగా పనిచేసినట్లు చెప్తున్న మహిపాల్ సింగ్… క్యాష్ విరాళాల సేకరణలో బ్యాంకు బృందం ఉద్దేశపూర్వకంగా అవకతవకలకు పాల్పడుతోందని, దీనిపై తాను పైఅధికారులకు ఫిర్యాదు చేసినందుకే తనను ఉద్యోగం నుండి తొలగించారని ఆరోపించాడు…
తీసేసిన వాడు ఏదో చెబితే, దాన్ని పట్టుకుని అఖిలేష్ గుడిని, ట్రస్టును బదనాం చేసే పనిలో పడ్డాడు… రామమందిర విరాళాల బాక్సుల నుండి రూ. 5 కోట్ల నుండి రూ. 7.5 కోట్ల వరకు కానుకలు మాయమయ్యాయనే మీడియా కథనాలను ఆధారంగా చేసుకుని అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ (X) లో తీవ్రంగా స్పందించాడు…
విరాళాల మళ్లింపుకి సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారనే వార్తలపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ఇచ్చిన వివరణను అఖిలేష్ తోసిపుచ్చాడు… కేవలం ఒకరిద్దరు ఇచ్చే సాధారణ వివరణ సరిపోదని, ట్రస్టు సభ్యులందరూ కలిసి ఒకచోట కూర్చుని ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేస్తేనే అసలు నిజం బయటపడుతుందని డిమాండ్ చేశాడు… కోట్లాది మంది భక్తుల నమ్మకంతో ముడిపడి ఉన్న ఈ విరాళాల వ్యవహారంలో తప్పులు జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం (UP) మౌనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోందని ఆరోపించాడు…
చివరకు యోగీ సర్కారుకు దీన్ని ముడిపెట్టడం, ఏదో జరిగిపోతోందని అపోహల్ని క్రియేట్ చేయడం అఖిలేష్ ఉద్దేశం… విరాళాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అధికారులతో కలిసి అంతర్గత ఆడిట్ చేస్తున్నామని, ఇప్పటివరకు ఎలాంటి అవకతవకలు జరగలేదని చంపత్ రాయ్ స్పష్టం చేశాడు… లక్నో పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ… అఖిలేష్ యాదవ్ ఆరోపణలకు ఎలాంటి విశ్వసనీయత లేదని కొట్టిపారేశాడు…
ఈ వివాదం తీవ్రమవడంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కూడా ఈ పరిణామాల క్రమంపై సమగ్ర నివేదికను కోరింది… ఈ నివేదిక ఆధారంగా ఆలయ నిర్వహణ, విరాళాల సేకరణ పద్ధతుల్లో ఇంకా కట్టుదిట్టాలు, మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని సమాచారం…
Share this Article