Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బీజేపీ బిగ్ గేమ్..! ఇండి కూటమి కకావికలు… టార్గెట్ 2028…!!

June 11, 2026 by M S R

.

రాజకీయాల్లో కొన్ని వ్యవహారాలు తెర వెనుక నిశ్శబ్దంగా నడుస్తుంటాయి… బయటికి గాసిప్స్‌లా కొన్ని లీక్స్ వినిపిస్తుంటాయి, మీడియాలో కనిపిస్తుంటాయి… అవి కొన్ని నిజం కావచ్చు, కాకపోవచ్చు… ఉదాహరణకు, మమత పార్టీ రెబల్స్‌ బీజేపీలో విలీనం కావడం గురించి… అనుకున్నట్టే, దాదాపు 62 – 64 మంది మమతకు గుడ్‌బై చెప్పినట్టే, వారు బీజేపీలో విలీనం కావల్సిందే, లేకపోతే అనర్హత పాలవుతారు, యాంటీ డిఫెక్షన్ చట్టం ప్రకారం…

సేమ్, 20 మంది ఎపీల కథ కూడా… రాజ్యసభలో రోజుకొకరు చొప్పున ఇప్పటికి నలుగురు రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామాలు చేశారు… మిగిలింది ఏడుగురు… ఇంకోవైపు మమత తన మిగిలిపోయిన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తుందా లేదానేది గాసిప్స్ స్థాయిలోనే ఉందా, నిజంగానే కాంక్రీట్ అడుగులు పడుతున్నాయా వేచి చూడాలి… అదేం జరిగినా ఎన్డీఏకు పెద్ద ఫరక్ పడదు… తెర వెనుక సువేందు అధికారి, అమిత్ షా ఆడుతున్న ఆట…

Ads

మరోవైపు మహారాష్ట్రలో ఫడ్నవీస్ మరోరకంగా పావులు కదుపుతున్నాడు… అజిత్ పవార్ మరణించాడు, శరద్ పవార్ దాదాపు రిటైర్డ్… ఆయన కూతురు సుప్రియా సూలేకు పార్టీని నిభాయించే శక్తి లేదు… సో, అజిత్ పవార్ గ్రూపు ప్లస్ శరద్ పవార్ గ్రూపు ప్రజాప్రతినిధులను బీజేపీలో కలిసిపోయేలా ప్రయత్నాలు, సంప్రదింపులు సాగుతున్నాయి… ఎన్సీపీ రెండు వర్గాలకూ కలిసి 9 లోకసభ ఎంపీ సీట్లు, ముగ్గురు రాజ్యసభ సభ్యులు… సంఖ్య తక్కువేమీ కాదు…

శివసేన చీలిన తరువాత ఉద్ధవ్ ఠాక్రే దగ్గర మిగిలిపోయిన వర్గాన్ని షిండే వర్గంలోకి చేరిపోయేలా ఓవైపు ప్రయత్నాలు సాగుతుంటే, షిండే నాయకత్వం నచ్చకపోతే నేరుగా బీజేపీలో చేరండని చెబుతున్నారు… ఈ రోజు ఉద్ధవ్ సేన ఏడుగురు ఎంపీలు ముందు షిండేతో, తరువాత ఫడ్నవీస్ తో కలిసిన కారణాలు ఇవే అంటున్నారు… శల్యుడు సంజయ్ రౌత్‌ను ఠాక్రే ఇంటి మనిషిగా నమ్మినంతకాలం ఆ వర్గం గతి అంతే…

2029 కాదు, 2028 లోనే ఎన్నికలుంటాయి ఈసారి, ఈమేరకు తనను కలిసిన సీఎంలు, ప్రతిపక్ష సీఎంలతో కూడా పీఎం సూచనప్రాయంగా అదే చెబుతున్నాడు… 2028 రాజకీయ సమీకరణాలకు సంబంధించి వేగంగా ఓ భారీ కసరత్తు సాగుతోంది… ఒకవైపు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన మరో మేల్ మమత అఖిలేష్ యాదవ్ ‘ఇంటి సమస్య’లో లోతుగా మునిగిపోయి ఉన్నాడు…

కూతురు ఎవరో నైజీరియన్‌తో యవ్వారం అట, ఇదేదో సెటిల్ చేసుకోవడానికి అర్జెంటుగా లండన్ వెళ్లాడట… ఈలోపు ఎస్పీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు బీఎస్పీతో సంప్రదింపుల్లో పడ్డారని సోషల్ మీడియాలో వార్తలు… దక్షిణాన తమిళనాడులో వ్యవహారం వేరు… బెంగాల్‌లో సువేందు, మహారాష్ట్రలో ఫడ్నవీస్ ఉన్నట్టు తమిళనాడులో ఎవరూ లేరు, ఉన్న ఒక్కడినీ బయటికి పంపించేశారు…

కానీ డీఎంకేతో టచ్‌లోకి వెళ్తోందట బీజేపీ… (గతంలో డీఎంకే ఎన్డీయేకు 1999-2003 సపోర్ట్)… ఇండి కూటమి నుంచి బయటికి వచ్చేశాడు స్టాలిన్, రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్‌ను చేర్చుకున్న విజయ్ సోనియాను కలిశాడు, తను ఇండి కూటమిలోకి చేరబోతున్నాడు… సో, స్టాలిన్ థర్డ్ ఫ్రంట్ ఆలోచన చేస్తున్నాడు… డీఎంకేకు లోకసభలో 22, రాజ్యసభలో 10 సీట్లున్నాయి… పార్లమెంటు సంఖ్యాబలాల్లో కీలకమైన ప్లేయర్…

వైసీపీ, బీఆర్ఎస్ వంటివి స్టాలిన్ ఫ్రంటుకు కలిసొస్తాయని ప్రచారం… కానీ  అదేమీ వర్కవుట్ అయ్యేది లేదు, జగన్ ఒంటరిగానే ఉంటాడు, కానీ ఏ ఫ్రంటులోకీ చేరడు… అవసరమైతే ఎన్డీయేకు బిల్లుల విషయంలో సపోర్ట్ కూడా ఇస్తాడు… బీఆర్ఎస్ అడుగులు బభ్రాజమానం భజగోవిందం టైపు… పైగా తనకు లోకసభ సంఖ్య గుండుసున్నా, ఇద్దరో ముగ్గురో రాజ్యసభలో ఉన్నారు… అందుకని ప్రస్తుతానికి ఏ ఫ్రంటూ, ఏ టెంటూ దాన్ని సీరియస్‌గా తీసుకోదు…

ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ బీజేడీ క్రమేపీ బలహీనపడిపోతోంది… సేమ్, జేడీఎస్, జేడీయూ వంటివి కూడా… ఢిల్లీలో ఆప్‌ను దెబ్బతీసిన బీజేపీ ఇక పంజాబ్ విషయంలో ఏం చేయాలో ఆలోచిస్తోంది… పాత దోస్తులను కలుపుకుని, మళ్లీ బలపడే ప్రయత్నాలు…

అసలు ఇండి కూటమికి ప్రధాన బలం డీఎంకే, టీఎంసీ… టీఎంసీ దారుణంగా దెబ్బతిన్నది, డీఎంకే దూరమైంది… సో, 2028 టార్గెట్‌గా దేశ రాజకీయాల పోలరైజేషన్ వేగంగా, బలంగా సాగబోతోంది… ప్రస్తుతానికి ఎటు..? డీలిమిటేషన్ బిల్లును ఈసారి మళ్లీ శీతాకాలపు సమావేశాల్లో పెట్టడానికి… రెండు సభల్లో ఆమోదం కావాలి, కానీ టూథర్డ్ మెజారిటీ కావాలి.., అటువైపు సీరియస్ ఎఫర్ట్స్ నడుస్తున్నాయి…

జనాదరణలో వీక్‌గా ఉన్న ఒకరిద్దరు ముఖ్యమంత్రులను, కొందరు కేంద్ర మంత్రులను కూడా తప్పించి, దూకుడు లీడర్లను ఇండక్ట్ చేయాలని మరోవైపు సొంత అంతర్గత దిద్దుబాటు కూడా ఆలోచిస్తోంది బీజేపీ..!! కాంగ్రెస్ కూడా అర్జెంటుగా అన్ని రాష్ట్రాల పీసీసీల అధ్యక్షులు, ఎఐసీసీ ముఖ్యులతో భేటీ వేసింది ప్రస్తుతం… తనకూ అర్థమవుతున్నాయి ప్రమాద ఘంటికలు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బీజేపీ బిగ్ గేమ్..! ఇండి కూటమి కకావికలు… టార్గెట్ 2028…!!
  • సుప్రీం కోర్టు ఆ తీర్పు… మీనాక్షి నటరాజన్ కేసులో కీలకం..?!
  • ఆ ధర్మస్థల కుట్రదారుల్ని సమాజం ఏం శిక్షించగలిగింది..!?
  • ఈ పిశాచిని ఈ న్యాయవ్యవస్థ శిక్షించగలదా..? ఎవ్వడూ నమ్మడు..?!
  • వర్తమాన రాజకీయాల్లో విజయశాంతి ‘ఆశయం’ నెరవేరేనా..?
  • కాంగ్రెస్‌లో నిమజ్జనం..? కర్మ ఎదురుతన్నడం అంటే ఇదే మరి..!!
  • ప్రత్యేక వర్గం, సొంత కుంపటీ కుదరవు… బీజేపీలో విలీనమే దిక్కు…
  • మోడీ తరువాత ఎవరు..? ఓ కొత్త బ్లూ ప్రింట్ సిద్ధమైపోతోందా..?!
  • ఈ ‘జాగీర్దారు’ ఇంకా గోకుతూనే ఉన్నాడు తెలంగాణ సమాజాన్ని..!!
  • ఈయన్ని ఇంకాస్త డిఫరెంటుగా, లోతుగా అర్థం చేసుకుందాం ఇలా…!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions