Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ పోలింగ్ ఆఫీసర్ గుర్తుంది కదా… ఆ ట్రెండీ లుక్కుల వెనుక ఓ ట్రాజెడీ స్టోరీ…

May 13, 2024 by M S R

reena dwivedi

కొడుక్కి పాలిస్తూ… కళ్లల్లో నీళ్లు తుడచుకుంటూ… రెండేళ్లు అసలు నేను గది దాటి బయటికి రాలేదు….. ఈ మాటలు అన్నది ఎవరో కాదు… రీనా ద్వివేది… ఫోటో చూడగానే ఆమె ఎవరో గుర్తుపట్టే ఉంటారు కదా… పోలింగ్ సామగ్రి తీసుకెళ్తున్న ఆమె ఫోటో దేశవ్యాప్తంగా వైరల్ రెండు సందర్భాల్లో… ఒకసారి 2019 జనరల్ ఎలక్షన్స్‌లో… మరోసారి 2022 అసెంబ్లీ ఎన్నికల్లో… ఆమె మీద ఎన్ని చెణుకులు, జోకులు, మీమ్స్, వ్యాఖ్యలు, హాట్ పోస్టులు… మొదటి ఎర్ర చీరెలో […]

8 నెలలు… 3800 కిలోమీటర్ల ఓ సాహసి ఒంటరి పాదయాత్ర… కానీ దేనికి..?!

May 6, 2024 by M S R

srishti

సాటి మహిళల సమస్యలే ఎజెండా! కన్యాకుమారి టూ కశ్మీర్… ఓ నారీ జర్నీ!! WOMB.. WOMEN OF MY BILLION. అమెజాన్ ప్రైమ్ లో డాక్యుమెంటరీగా తెరకెక్కిన ఈ కథనం ఇప్పుడో చర్చ. లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆడియన్స్ అవార్డ్ గెల్చుకుని.. ఆగస్టులో జరుగబోయే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ లోనూ ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది. ఎందుకు WOMB గురించి మరి చర్చ అంటే… సృష్టి బక్షి కన్యాకుమారి నుంచి కశ్మీర్ జర్నీ గురించి […]

భారతీయ కార్టూనిస్టు ధైర్యానికి అంతర్జాతీయ గుర్తింపు 

May 4, 2024 by M S R

rachita

Sai Vamshi….  … భారతీయ కార్టూనిస్టు రచిత తనేజాకు 2024 సంవత్సరానికి గాను ‘Kofi Annan Courage in Cartooning Award’ అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయురాలు రచిత. ఆమెతోపాటు హాంగ్‌కాంగ్‌కు చెందిన కార్టూనిస్టు జున్‌జీ‌కీ ఈ అవార్డు ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ పేరిట 2012 నుంచి జెనీవాలోని ‘Freedom Cartoonists Foundation’ రెండేళ్లకోసారి ఈ అవార్డులు అందిస్తోంది. పురస్కారం కింద రు.13.82 లక్షలను అవార్డు గ్రహీతలకు సమానంగా […]

అరవైలో ఇరవై వచ్చిందీ… ఈమెకు వయస్సు జస్ట్ ఓ నంబర్ మాత్రమే…

May 3, 2024 by M S R

crown

అందానికి అందం ఈ పుత్తడి బామ్మ ‘కన్నెతనం వన్నె మాసి… ప్రౌఢత్వం పారిపోయి… మధ్యవయసు తొంగిచూసిన ముసలి రూపు ముంచుకురాదా!’ అన్న మార్చి రాయలేమో! అందాల పోటీలంటే…తళుకు బెళుకులు, వయ్యారి భామలు అనుకుంటాం. ఆ ప్రపంచంలో మనకేం పని అనుకోడమూ సహజమే. మరి “అరవయ్యేళ్లు!”- ఈ మాట వింటేనే పెద్దవాళ్ళయిపోయామంటూ నిట్టూరుస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు చాలామంది అనారోగ్య సమస్యలతో, పిల్లలు, మనవళ్ల పనులతో గడిపేస్తూ ఉంటారు. అసలీ ఇల్లు, పిల్లలు, భర్త … వీరి పనుల […]

ఒక ఫోటో జర్నలిస్టు… ఎడారిని జయించి అడవిని సాధించాడు…

April 27, 2024 by M S R

forest

ఫోటో జర్నలిస్ట్ పర్యావరణవేత్తయ్యాడు! ఎడారిని జయించి అడవిని సాధించాడు!! డీఫారెస్టేషన్.. ఇప్పుడిది పెద్ద సమస్య. ఏదో నాల్గు మొక్కలు నాటితే తిరిగి పర్యావరణ సమతుల్యతను పొందేది కాని భవిష్యత్ ఉత్పాతం. అర్బనైజేషన్ మూలమా అని పల్లెలు పోయి పట్టణాలు అవతరిస్తూ.. ఊళ్లకూళ్లు మట్టి కనిపించని కాంక్రీట్ జంగల్స్ గా మారుతున్న రోజులు. ఎక్కడికక్క వివిధ మానవ అవసరాల కొరకు, విలాసాల పేరిట కొండలు, గుట్టలు, చెట్లు.. తద్వారా ఎన్నో ప్రాణులు.. ఇలా మొత్తంగా జీవవైవిధ్యానికే ప్రమాదం ముంచుకొస్తున్న […]

ప్రభుత్వం పురమాయించిందని పద్యం రాయలేను నేను…

April 26, 2024 by M S R

kunaparaju

Taadi Prakash…..  ప్రేరణ జన్ముడు కుమార్ కూనపరాజు ————————-2018 సెప్టెంబర్ 8……హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12ఆర్టిస్ట్ మోహన్ లేని ఆ ఆఫీస్ హడావుడిగా ఉంది.అతి తేలికైన పద్ధతిలో లియో టాల్ స్టాయ్ శిల్పం అక్కడ తయారవుతోంది.చెక్కముక్కల ఫ్రేమ్ కి ఒక ముతక గుడ్డని బిగించి, ఒక పద్ధతిలో అమర్చి ఆ మహారచయిత రూపు తెస్తున్నాడు కారంకి శ్రీరామ్. నలుగురైదుగురు మిత్రులం ఆసక్తిగా చూస్తున్నాం.టాల్ స్టాయ్ గంభీరంగా కూర్చుని ఉండే మాస్కో శిల్పం నమూనా అది.మేకులు కొట్టీ, […]

ఇదీ భారతీయ హృదయ స్పందన… పాకిస్థానీ అమ్మాయికి ప్రాణదానం…

April 25, 2024 by M S R

Indian heart

MY COUNTRY IS THE WORLD, AND MY RELIGION IS TO DO GOOD… BY THOMAS PAINE. నా దేశమే ప్రపంచం, మంచి చేయడమే నా మతం.. ప్రఖ్యాత ఫ్రెంచ్ విప్లవకారుడు, రచయిత థామస్ పైన్ చెప్పిన మాటలు.. ఓ పాకిస్థానీ విషయంలో భారత్ స్పందించిన తీరుతో అక్షరసత్యాలయ్యాయి. భారతీయ హృదయ స్పందన.. మరో పాకిస్థానీకి హృదయాన్నిచ్చి.. జీవితాన్నందించిన కథ ఇది. అందుకు చెన్నై ఎంజీఎం హెల్త్‌కేర్‌ మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్ వేదికైంది. ఉచితంగా […]

రెండుసార్లు సివిల్స్ కొట్టి… జస్ట్, అలా వదిలేశాడు… అన్నింట్లోనూ మాస్టర్..!

April 25, 2024 by M S R

gem

ఒక వ్యక్తి ఏదైనా ఓరంగంలో చిత్తశుద్ధితో పనిచేస్తూ పోతే.. కింగ్ కావచ్చునేమో! కానీ, ఒకే వ్యక్తి తానేరంగాన్నెంచుకుంటే అందులో.. రింగ్ తిప్పొచ్చా..? అలా చక్రం తిప్పాడు కాబట్టే ఆయన గురించి ఈ ముచ్చట. ఏకంగా 20 డిగ్రీలు… రెండుసార్లు యూపీఎస్సీలో ఉత్తీర్ణుడు.. ఐఏఎస్ సాధించినోడు.. అంతే సులభంగా దాన్ని జుజుబీ అన్నట్టుగా వదిలేసినోడు.. ఎవరతను..? శ్రీకాంత్ జిచ్ కర్. చదువు పట్ల ఏ మాత్రం ఆసక్తి కనబర్చేవారికైనా… ఈయన స్టోరీ వింటే జస్ట్ గూస్ బంప్సే! ఓ […]

గగనపు అంచుల్లోకి ఎగురుతాం… సముద్రపు లోతుల్లోకి దూకుతాం…

April 23, 2024 by M S R

women

ఫైర్ ఫైటర్స్, డీప్ సీ డైవర్స్ గా మహిళలు … నెత్తి మీద నీటి బిందెలతో మైళ్ళ దూరం నడచి వెళ్లే మహిళల శక్తి సామర్ధ్యాలు మనకి పట్టవు… రోడ్డు పక్కన బండరాళ్లను అవలీలగా పగలగొట్టి రోళ్ళుగా మలచి చవకగా అమ్మే ఆడవారు ఆనరు… సన్నని తాడుపైన పాదాలతో బాలన్స్ చేసుకుంటూ కర్ర చేత్తో పట్టుకుని నడిచే అమ్మాయిని చూసి ఆనందించడమే తప్ప ఆమె సాహసం గుర్తించరు. ఎంత చదువుకుని ఉన్నత హోదాలో ఉన్నా వివక్ష తప్పదనే […]

మనసున్నోడు… సాఫ్ట్‌వేర్ వదిలాడు… సొసైటీ కోసం కదిలాడు…

April 21, 2024 by M S R

human

ఒక దృశ్యం ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను కలిచివేసింది… ఒక ఉత్పాతం తన ఉద్యోగాన్నే వదిలేసేలా చేసింది… వ్యవసాయాన్ని నమ్మిన వేలాది మంది గ్రామాల నుంచి ఇతర పట్టణాలకు వలస బాట పట్టడం అతడి దృక్పథాన్నే మార్చేసింది. అందుకు కారణమైంది 2018 నవంబర్ లో తమిళనాడులో వచ్చిన గజ తుపానైతే… అత్యధిక వేతనంతో దుబాయ్ లో సాఫ్ట్ వేర్ డెవలపర్ ఉద్యోగాన్ని వదులుకున్న ఆ వ్యక్తే నిమల్ రాఘవన్. తమిళనాడు తంజావురు జిల్లా నదియంలో జన్మించిన […]

జ్ఞానం మరీ ఎక్కువైతే…? ఈ కథలోని వశిష్ట నారాయణ్ అవుతారు..!!

April 18, 2024 by M S R

Vasishta

మనిషికి జ్ఞానం ఎక్కువైనా ప్రమాదమే… మన బుర్ర హరాయించుకోలేదు… కొలాప్స్ అయిపోయి, మనిషి పిచ్చోడైపోతాడు… నిజం… ఇక్కడ లక్ష పుస్తకాలు చదివిన, 80 వేల పుస్తకాలు చదివిన, కంప్యూటర్ నేనే కనిపెట్టిన, సెల్ ఫోన్ నా సృష్టే అని సొల్లే జ్ఞానుల గురించి కాదు… నిజంగానే అపరిమిత జ్ఞానాన్ని పొందిన వారి గురించి… బీహార్… బసంతపూర్ జిల్లా… ఎవరికీ తెలియని ఓ మారుమూల పల్లె… 1942లో పుట్టాడు… తండ్రి ఓ పోలీస్ కానిస్టేబుల్… పేరు వశిష్ట నారాయణ్… […]

సమాజమే అడ్డుపడి… ఆ మరణశిక్ష నుంచి అతన్ని తప్పించింది…

April 16, 2024 by M S R

inspiring

ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న.. మదర్ థెరీస్సా చెప్పిన ఈ ప్రోవర్బ్ ఎంత పాప్యులరో తెలిసిందే. అయితే, ఒక వ్యక్తి.. ఒక కుటుంబం ఒంటరైనప్పుడు థెరీస్సా మాటల స్పిరిట్ తో కనుక సమాజం పనిచేస్తే… మన కంటికి కనిపించని దైవత్వాన్ని మించిన మానవత్వాన్ని ఆవిష్కరించొచ్చు. కనిపించని దైవత్వం కన్నా.. కనిపించే మానవత్వమే మిన్న అనిపించొచ్చు. అదిగో అలా చేశారు కనుకే.. ఆ కేరళ సమాజపు స్టోరీ ఓసారి చెప్పుకోవాలి. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను.. మృగజాతికెవ్వడు […]

ఆ రహీమ్ సాబ్ మన హైదరాబాదీయే… బాలీవుడ్ బయోపిక్‌కు రియల్ హీరో…

April 8, 2024 by M S R

maidan

(రమణ కొంటికర్ల) ……… 1964లో రహీమ్ సాబ్ ఏ చిట్కాలైతే చెప్పాడో… ఇప్పుడు ఫుట్ బాల్ కు కేరాఫ్ లా మారిన బ్రెజిల్ లో అవే నేర్పిస్తున్నారు. ఈ మాటన్నది.. 1964లో ఇండియన్ ఫుట్ బాల్ కోచ్ గా పనిచేసిన ఆల్బర్ట్ ఫెర్నాండో. అందుకే రహీమ్ సాబ్ ను ఫుట్ బాల్ ప్రవక్తగా కొల్చేవారట. ఇప్పుడెందుకీ రహీమ్ సాబ్ ముచ్చట అంటే.. ఈ ఏప్రిల్ 10వ తేదీన విడుదల కాబోతున్న అజయ్ దేవగణ్ మైదాన్ స్టోరీ.. రహీమ్ […]

ఓ గృహిణి… రోజూ రెండు ఇడ్లీలు… అస్సలు మెచ్చుకోని ఓ ధర్మ భిక్షువు కథ…

April 5, 2024 by M S R

idli

Prabhakar Jaini….. రెండు ఇడ్లీలు… ఒక మహిళ ప్రతిరోజు తన ఇంటి పిట్టగోడపై ఆకులో రెండు ఇడ్లీలు పెడుతూ వచ్చేది, ఆకలితో ఉన్నవాళ్లు ఎవరైనా తింటారు అని… ఆ దారివెంట వెళ్ళే ఒక ముసలాయన ఆ ఇడ్లీలు తీసుకోవడం ఏదో చిన్నగా గొణుక్కుంటూ వెళ్లడం జరిగేది, ఒకరోజు వేదవతి గోడ పక్కనే నిలబడి అతను ఏమి అంటున్నాడో వినాలని అనుకున్నది, అతను చెప్తున్న మాటలు… నువ్వు చేసిన పాపం నీ దగ్గరే ఉంటుంది నువ్వు చేసే పుణ్యం […]

అక్షయపాత్ర..! అరుదైన ఓ ఘనతకు అక్షరాలా ఐరాస అభినందనలు…

April 4, 2024 by M S R

akshayapatra

అక్షయపాత్ర… మహాభారతంలో ద్రౌపది తన దగ్గరున్న అక్షయపాత్రతో ఎంతమంది అన్నార్తులు వచ్చినా సరే, భోజనాలు సమకూరుస్తుంది… ఓసారి కుయుక్తితో దుర్వాసుడు భోజనాలవేళ దాటాక, తన శిష్యగణంతో వచ్చి భోజనాలకై ఒత్తిడి తెస్తాడు… అప్పుడు కృష్ణుడు సమయానికి అరుదెంచి, అక్షయపాత్రలో మిగిలిన ఓ మెతుకు తిని, సాధుగణం ఏమీ తినకుండానే పొట్టలు పగిలిపోతూ వాపస్ వెళ్లిపోయేలా చేస్తాడు… ఇది పురాణ కథ… సరే, వర్తమానానికి వద్దాం… ఇంటికి నలుగురు అతిథులు వస్తున్నారు, భోజనాలు చేసి వెళ్తారు అంటేనే గృహిణికి […]

సారే జహాసే అచ్చా… అంతరిక్షం నుంచి ఈ మాట విని అప్పుడే 40 ఏళ్లు…

April 3, 2024 by M S R

astronaut

గుర్తుందా..? సరిగ్గా 40 ఏళ్ల క్రితం… భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ రష్యన్ వ్యోమనౌక సూయజ్‌లో అంతరిక్షానికి ఎగిసిన రోజు… ఏ ప్రధాని అయినా ఇలాంటివి ఓన్ చేసుకోవడానికే ప్రయత్నిస్తాడు కదా… చంద్రయాన్ విషయంలో మోడీలాగా..! అప్పటి ప్రధాని ఇందిర కూడా అంతరిక్షంలో ఉన్న రాకేశ్ శర్మతో మాట్లాడటాన్ని కోట్లాది టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయించింది… అంతరిక్షం నుంచి మన దేశం ఎలా కనిపిస్తోంది అనే  ఇందిర ప్రశ్నకు ‘సారే జహాసే అచ్చా’ అని స్పందించాడు రాకేశ్ […]

జిల్లా కలెక్టర్ దాకా ఎదిగిన ఓ పేపర్ బాయ్… ఓ స్పూర్తిదాయక ప్రస్థానం…

March 31, 2024 by M S R

nasar

మీరు ఏదో సమస్య మీద జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి పత్రం అందించి, సమస్య పరిష్కారం కోసం మొరపెట్టుకోవాలని వెళ్లారు… అక్కడ జిల్లా కలెక్టర్‌ను ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది మీకు… కాసేపటికి వెలిగింది… తను రోజూ పొద్దున్నే తమ ఇంటికి డెయిలీ పేపర్ వేసేవాడు కదా… ఎహే, పేపర్ బాయ్ కుర్చీలో ఉన్నది ఏమిటి..? మీలో అయోమయం… సందిగ్ధం… ఆ కలెక్టరే అన్నాడు, మీ సందేహం నిజమే, నేను మీ ఇంటికి పేపర్ వేసేవాడిని నవ్వుతూ…  ఏదో సినిమా […]

ఏడుగురు ఖాకీ బిడ్డల కథ… లింగ వివక్ష అసలే లేని ఓ తండ్రి పెంపకం కథ…

March 30, 2024 by M S R

seven

కేరళ, ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశమంతా ఓ రోగం ప్రబలి ఉండేది కదా… ఆడపిల్ల అని తెలిస్తే కడుపులోనే చంపేయడం, కొన్నిచోట్ల పుట్టగానే చంపేయడం, కాదంటే ఆ తల్లిని వదిలేయడం, ఇంట్లో నుంచి గెంటేయడం, విధి లేక పెంచుతున్నా వివక్ష చూపించడం ఎట్సెట్రా… కొన్ని కులాల్లో, కొన్ని జాతుల్లో, కొన్ని ప్రాంతాల్లో స్త్రీపురుష నిష్పత్తి దారుణంగా పడిపోవడం కూడా తెలిసిందే కదా… అలాంటిది బీహార్‌లో ఒక తండ్రి తన ఏడుగురు బిడ్డల్ని జాగ్రత్తగా పెంచి, విద్యాబుద్ధులు నేర్పించిన […]

ఐఐటీ నుంచి, ఐఐఎం మీదుగా… క్రమేపీ ఓ సరికొత్త ఆధ్యాత్మిక పంథాలోకి…

March 28, 2024 by M S R

tripathi

creation of new humanity througu intelligent spirtuality… ఓ ఐఐటీయన్, ఓ బిజినెస్ మెనేజ్మెంట్ స్టూడెంట్ మాంక్ గా మారి చెబుతున్న కథ! జీవితానికీ… జీవితంలో ఎదుగుదలకూ ఓ సాచ్యురేషన్ పాయింట్ ఉంటుంది. ఎదుగుతున్నకొద్దీ ఇంకేదో అందుకోవాలన్న ఆసక్తి కొందరికుంటుంది. పీక్ లెవల్ కు చేరాక కూడా ఎదిగేందుకు ఇంకెంతో మిగిలి ఉన్నా.. ఎదుగుదలకు ఆకాశమే హద్దనే అవగాహన కల్గి ఉన్నా.. కొందరిలో ఓ సాచ్యురేషన్ పాయింట్ వారిని పూర్తి కాంట్రాడిక్టరీగా.. అప్పటివరకూ వారి జీవితం […]

సంస్కర్త, లడక్ ఉద్యమకారుడు వాంగ్ చుక్.. ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్!

March 28, 2024 by M S R

wand chuck

ఓ వ్యక్తి బయోపిక్ తీయడం వేరు… ఆ క్యారెక్టర్ స్ఫూర్తితో సామాజిక సందేశాన్నిచ్చే సినిమా తీయడం వేరు. రెండో కోవలోకి చెందిందే రాజు హిరానీ తీసిన త్రీ ఈడియట్స్. అంతగా రాజు హిరానీని ఇన్స్పైర్ చేసిన పాత్ర సోనమ్ వాంగ్ చుక్. అదే త్రీ ఈడియట్స్ లో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రైన రాంచోడ్ దాస్ శమల్ దాస్ చాంచడ్. ఈ సినిమా దర్శకుడు రాజు హిరానీ అయితే.. నిర్మించింది మరో టేస్టీ డైరెక్టర్ విధూ వినోద్ […]

  • « Previous Page
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • …
  • 12
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions