పోసాని సుధీర్ బాబు… తెలుగు హీరో… బలమైన సినీ కుటుంబ నేపథ్యం ఉన్నా సరే ఈరోజుకూ పాపం ఒక్క హిట్ లేదు… 13 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్… బోలెడు సినిమాలు… కానీ ఇదీ నా సినిమా అని చెప్పుకునేందుకు ఒక్క సినిమా లేదు… హీరో మహేశ్ బాబుకు బావ, దివంగత హీరో కృష్ణకు చిన్నల్లుడు… అప్పుడే వయస్సు కూడా 46 దాకా వచ్చేసింది… ఐనా తెలుగు హీరోలకు వయస్సుతో పనేమిటి..? 70 ఏళ్లొచ్చినా పిచ్చి గెంతులు, ఫైట్లు […]
సగటు సినిమా పైత్యాలు ఏవీ లేని… ఓ రియల్ బయోపిక్ 800…
ముందుగా ఓ ఒపీనియన్… అందరూ అంగీకరించకపోవచ్చు కూడా… ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లు తీసిన ఘనుడు… ఒక క్రికెటర్‌గా కన్నా సేవాభావం, క్రికెట్ పట్ల అంకితభావం, తన దేశం పట్ల ఉన్న నిబద్ధత కోణం తనను ఉన్నతంగా నిలబెడుతుంది… తనకు బాగా అడ్వాంటేజ్ ఏమిటంటే…? పుట్టుకతోనే తన చేతి నిర్మాణం కాస్త వంకర తిరిగి ఉంటుంది… అది తన బౌలింగుకు అనుకూలంగా మారి, మంచి స్పిన్ సాధ్యమయ్యేది… ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఎంతటి స్టారుడైనా సరే మురళీధరన్ బాల్ […]
నిజమే… ఈ సినిమా ఓ మ్యాడ్… మరో సెలబ్రిటీ పోరడి వెండితెర ఎంట్రీ…
మ్యాడ్ అంటే… వెర్రి, పిచ్చి… ఈ మ్యాడ్ పేరుతో ఓ సినిమా వచ్చింది… మస్తు బ్యాక్ గ్రౌండ్ ఉన్న మరో వ్యక్తి హీరోగా తెరప్రవేశం (ఆరంగేట్రం) చేసిన సినిమా ఇది… జూనియర్ ఎన్టీయార్ సొంత బావమరిది నార్నే నితిన్ హీరో… మస్తు డబ్బుంది, పైగా జూనియర్ బావమరిది… ఇదే తన అర్హత… అఫ్కోర్స్, మన తెలుగు తెరను ఏలేది ఇలాంటి తారాగణమే… బలమైన ధననేపథ్యం లేదంటే వారసత్వం… ఎలా చేశాడు..? ఏదో చేశాడంటే చేశాడు… కొత్త కదా… […]
అప్పటి చిరంజీవి మంచి సినిమా ‘శుభలేఖ’కు ఈ నాటకమే స్పూర్తి…
Sai Vamshi……… వరకట్నంపై వందేళ్ల కిందటి సమ్మెటపోటు… వరకట్నం సాంఘిక దురాచారం. ఎన్నాళ్లయింది దాని మీద ఒక గట్టి సినిమానో, నాటకమో వచ్చి? ‘వరవిక్రయం’ నేటికీ ఆ లోటు తీరుస్తూ ఉంది. పశ్చిమగోదావరి జిల్లావాసి కాళ్లకూరి నారాయణరావు గారు వందేళ్ల క్రితం రాసిన నాటకం ఇది. ఆయన గనుక ఇది రాయకపోయి ఉంటే తెలుగు నాటకరంగపు ముత్యాలదండలో ఒక మణిపూస ఉండకపోయేది కదా? ఎల్లకాలాలకూ తట్టుకొని నిలిచే ఈ నాటకాన్ని చేజార్చుకునేవాళ్లం గదా? ఎన్ని వేల నమస్సులు […]
ప్రత్యామ్నాయ సినిమా డిస్ట్రిబ్యూషన్ పద్ధతి… ఓ కొత్త ఆలోచన…
Bharadwaja Rangavajhala…… సినిమా తీద్దాం … రండి…. నాకు చిన్నప్పుడు చిత్రసంస్కార పత్రికలో చదివిన కాట్రగడ్డ నరసయ్యగారి ఆర్టికల్ పదే పదే గుర్తొస్తోంది. సినిమా తీయాలనే తపన చాలా మందికి ఉంటుంది. ఓ మంచి కథ కూడా వాళ్ల మనసుల్లో ఉంటుంది. కానీ తీయడానికి తగిన ఆర్ధిక వసతి ఉండదు. ఒక వేళ తీసినా దాన్ని విడుదల చేయడం అంత తేలికైన పని కాదు. ఈ విడుదలకు సంబంధించి నరసయ్యగారు ఓ చిట్కా చెప్పారు. నిజానికి ఆయన తెలుగు […]
ప్చ్… ఫాఫం భక్తకన్నప్ప… దివిలో బాపుకు తెలియనివ్వకండి ఈ వార్తలు…
మంచు ఫ్యామిలీ ప్రతిష్ఠాత్మకంగా 150 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న భక్తకన్నప్ప సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించబోతున్నాడనే వార్త పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు… అసలు భక్తకన్నప్ప సినిమాను మంచు కుటుంబం నిర్మిస్తుందనే వార్తతో కలిగిన విభ్రమ ముందు మరే ఇతర ఆశ్చర్యాలూ పెద్దవి కావు… ఎందుకంటే..? 1976లో కృష్ణంరాజు నటించి నిర్మించిన చిత్రం భక్త కన్నప్ప… తెలుగు భక్తి సినిమాల్లో ఇదీ ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది… కృష్ణంరాజును జనసామాన్యంలోకి బాగా తీసుకెళ్లింది కూడా […]
మరీ అంత పెదకాపు ఏమీ కాదు… ఈ విరాటకర్ణుడు జస్ట్, ఓ చినకాపు మాత్రమే…
అతడు సినిమాలో ఓచోట హీరోయిన్ ‘నేనూ వస్తా’ అంటుంది… దానికి హీరో ‘నేనే వస్తా’ అంటాడు… పైకి సరళంగా అనిపించినా కనెక్టవుతుంది… ఆ సన్నివేశంలో బాగా అమరిన మాటలు అవి… సీతారామయ్యగారి మనవరాలు సినిమాలో ఓచోట ఓ లేడీ పాత్రధారి ‘మనవరాలు అంటే మన వరాలు’ అని చెబుతుంది… ఒక బామ్మ ప్రేమ వ్యక్తీకరణ అది… సినిమాల్లో సంభాషణలు ఇలాగే ఉండాలి… కావాలని డైలాగులు రాస్తున్నట్టు గాకుండా… ఆయా సన్నివేశాల్ని ఎలివేట్ చేస్తూనే ఈజీగా కనెక్టయిపోవాలి, ప్రత్యేకించి […]
దంచుడే దంచుడు… తెర నిండా బీభత్సమే… అచ్చమైన బోయపాటి సినిమా…
బోయపాటి దర్శకత్వం అంటేనే… లాజిక్కులు వెతక్కూడదు… దంచుడే దంచుడు… నరుకుడే నరుకుడు… బీభత్సమైన హింస… గాల్లోకి తేలిపోతూ రౌడీలు… సూపర్ మ్యాన్‌లా హీరో ఫైటింగులు… కథా కాకరకాయా చూడొద్దు… భీకరమైన బీజీఎంతో హీరో నెత్తురు పారిస్తూ ఉంటాడు… థియేటర్ దడదడలాడిపోతూ ఉంటుంది… సీఎం లను సైతం తుక్కుతుక్కు కొట్టేసాడు హీరో… స్కంద కాదు, బోయపాటి బొంద… మొన్నమొన్నటి బాలయ్య అఖండ అయినా… రాపో, అనగా రామ్ పోతినేని నటించిన తాజా స్కంద అయినా అంతే… బోయపాటి మారడు… […]
అందంలో… అభినయంలో… జ్యోతికకు ఆమడదూరంలోనే ఆగింది కంగనా…
మొన్నొకసారి చంద్రముఖి హీరోయిన్ల గురించి రాస్తున్నప్పుడు… చంద్రముఖి సీక్వెల్‌కు ఆ పాత దర్శకుడు వాసు దర్శకత్వం వహిస్తున్నాడనీ, చీప్ టేస్టున్న సదరు దర్శకుడు ఈ సినిమాను ఏం చేస్తాడో పాపం అని అభిప్రాయపడ్డాను… అనుమానించినట్టే జరిగింది… ఓ చెత్తా సినిమాను వదిలాడు ప్రేక్షకుల మీదకు… సీక్వెల్‌కూ స్పూఫ్కూ తేడా తెలియదు ఈ దర్శకుడికి… ఓ పాపులర్ కమర్షియల్ హిట్ సినిమాకు సీక్వెల్ అంటే మరీ ఆ ఒరిజినలే పదే పదే గుర్తొచ్చేలా (పాతదే నయం అని గుర్తొచ్చేలా… […]
ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు… కానీ ఆస్కార్ బరికి సరైన అధికారిక ఎంపిక…
1, ది స్టోరీ టెల్లర్ (హిందీ), 2, మ్యూజిక్ స్కూల్ (హిందీ), 3, మిస్ ఛటర్జీ వర్సెస్ నార్వే (హిందీ), 4, ట్వెల్త్ ఫెయిల్ (హిందీ), 5, విడుథలై పార్ట్-1 (తమిళ్), 6, ఘూమర్ (హిందీ), 7, దసరా (తెలుగు), 8, వల్వి (మరాఠీ), 9, గదర్-2 (హిందీ), 10, అబ్ తో భగవాన్ సే భరోసే (హిందీ), 11, బాప్ లాయక్ (మరాఠీ), 12, రాఖీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ (హిందీ), 13, జ్విగాటో […]
మౌనం రాగం మధురం మంత్రాక్షరం… కంపోజర్‌గా కూడా బాలు ఘనుడే…
Bharadwaja Rangavajhala…. స్వరకల్పన… చీకటిలో వాకిట నిలిచీ దోసిట సిరిమల్లెలు కొలిచీ … 1977 లో రేడియోలో ఆ పాట వినిపించగానే వాల్యూమ్ పెంచేవారు శ్రోతలు. జయమాలిని, శ్రీవిద్య హీరోయిన్లు గా చేసిన కన్యాకుమారిలో పాట అది. దర్శకుడు దాసరి ఎందుచేతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సంగీత దర్శకత్వం ఛాన్స్ ఇచ్చారు. అంతే బాలు చెలరేగిపోయాడు. ఆ తర్వాత బాపు, జంధ్యాల, సింగీతం లాంటి క్రియేటివ్ జీనియస్సుల దగ్గర సంగీతం చేశారు. అనేక గుర్తుండిపోయే గీతాలకు ప్రాణం పోశారు. కన్యాకుమారితో మొదలై జైత్రయాత్ర […]
దాదా సాహెబ్ ఫాల్కే… పద్మభూషణ్… కానీ అవార్డుల సంఖ్య చాలా తక్కువ…
1955… రోజులు మారాయి అనే తెలుగు సినిమా… కల్లాకపటం ఎరుగనివాడా, ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా అనే పాటలో తొలిసారి నర్తించింది వహీదా రెహమన్… అంటే 68 ఏళ్ల క్రితం… ఇప్పుడామె వయస్సు 87… సుదీర్ఘమైన సినిమా ప్రయాణం… అయితే ఈ ప్రస్థానంలో ఆమెకు లభించిన అవార్డుల సంఖ్య స్వల్పం… అది ఆశ్చర్యకరం… నిజానికి అవార్డులే ఆమె వెంటపడాలి… తెలుగు, తమిళంలో యాక్ట్ చేసినా సరే, ఆమె ప్రధానంగా పనిచేసింది హిందీ, మరాఠీ ఇండస్ట్రీల్లో…! ఇన్నేళ్ల పయనంలో […]
కంగనా రనౌత్ నార్త్ చంద్రముఖి… నాలుగు కాదు, ఆమె నంబర్ అయిదు…
సినిమా సైట్లు, యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతోంది… చంద్రముఖిగా ఎవరు బాగా చేశారు అని..! సరదాగా బాగానే ఉంది కానీ చాలామంది కంగనా రనౌత్‌ను నాలుగో నంబర్ చంద్రముఖిగా చెబుతున్నారు… అదీ బ్లండర్… ఆమె త్వరలో విడుదల కాబోయే చంద్రముఖి-2 సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది… నటిగా ఆమె మెరిట్‌కు వంక పెట్టలేం… కాకపోతే ఆమె సౌత్ సినిమాల్లో నటించి ఎప్పుడూ పెద్దగా క్లిక్ కాలేదు… ఈ సినిమా రిజల్ట్ చూడాలిక… దెయ్యం, […]
ఆ మూగజీవాలూ మన కుటుంబసభ్యులే… ఆ ఉద్వేగాల్ని పట్టించిన మూవీ…
“రామే ..అండాళుం రావణే అండాళుం” ఆనందంతోనో.. బాధతోనో రెండు కన్నీటి చుక్కలు రాల్చలేని కళ్లెందుకు?? .. బావోద్వేగాన్ని పంచలేని గుండె ఎందుకు ?? చివరికి అవయవదానం చేసుకోవడానికి తప్ప ఇంక దేనికి పనికిరావు .. మనిషికి, రోబోట్ కి తేడా ఏంటి అంటే ?? ఫీలింగ్స్ లేకపోవడమే అంటాడు ..రోబో సినిమాలో వశీకరణ్..నిజమే స్పందనలు , బాధ , సంతోషం , ఉద్వేగం , ఆవేశం ఇవన్నీ ఉంటాయి కాబట్టే మనం మనుషులం అయ్యాం .. కానీ […]
సినిమాగా ‘పర్వ’… ఆదిపురుష్‌లాగే తీస్తే అడ్డంగా తిరస్కరించడం ఖాయం…
నిన్నో మొన్నో మిత్రుడు Yeddula Anil Kumar పోస్ట్ ఒకటి కనిపించింది… ‘‘ప్రముఖ కన్నడ నవలా రచయిత ఎస్.ఎల్.భైరప్ప గారు మహాభారతం మీద వ్రాసిన నవల “పర్వ”… దాదాపు 90సార్లు ఈ పుస్తకం మరుముద్రణ కాబడింది… లక్షల కాపీలు అమ్ముడయ్యాయి… 7 దేశీయ భాషల్లో, మూడు విదేశీ భాషల్లో ఈ పుస్తకము అనువాదం అయ్యింది… ఇంత గొప్ప పుస్తకాన్ని కశ్మీర్ ఫైల్స్ చిత్రము తీసిన ప్రముఖ దర్శకులు వివేక్ అగ్నిహోత్రి గారు సినిమాగా తీస్తున్నారు… అందుకోసం రచయితతో ఒప్పందం కూడా […]
సప్త సాగరాలు దాటి… వెలుగుతున్న నటనా ప్రభ… భేష్ రక్షిత్, భేష్ రుక్మిణి…
మనకు ప్రగాఢమైన ఓ నమ్మకం… హిందీ వాళ్లు కూడా సౌత్ బాట పట్టారంటే మన దగ్గర క్రియేటివిటీ, కొత్తదనం మత్తళ్లు దూకుతోందని… అందులోనూ తమిళ, మలయాళ దర్శకులైతే కథను కథలాగా… ఓ బేకార్ హీరోయిజాన్ని దగ్గరకు రానివ్వకుండా ఇంప్రెసివ్ కథనాన్ని ప్రజెంట్ చేస్తారనీ… భిన్నమైన కథలతో ప్రయోగాలు చేస్తారనీ మనకు బోలెడంత విశ్వాసం… అంతే కాదు, హీరోయిన్లలో మలయాళ లేడీస్ అయితేనే నటన ఇరగదీస్తారని కూడా ఓ అంచనా ఉండనే ఉంది… అందం గిందం గాకుండా మొహంలో […]
ఎట్టాగైనా ఏలుకుంటా… నేనే వాణ్ని సాదుకుంటా… జిల్లేలమ్మా జిట్టా…
నిన్ను ఆనాడు ఏమన్నా అంటినా తిరుపతీ… కాపోళ్ల ఇంటికాడ… తిన్నాతిరం పడతలే… బాధయితుందే నీ యాదిల మనసంతా… జిల్లేటమ్మా జిట్టా… ఫోటువ తీస్తున్నడే సీమదసరా సిన్నోడు… రెండేళ్లుగా ఈ తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ దుమ్మురేపుతున్నయ్…! నిజానికి ఇవన్నీ ఏనాటి నుంచో పాడబడుతున్న జానపదాలేమీ కావు… రీసెంటుగా తెలంగాణ రచయితలు రాస్తున్నవే, తెలంగాణ గాయకులు పాడుతున్నవే… తెలంగాణ క్రియేటివ్ గ్రూప్స్ డాన్సులు కంపోజ్ చేసి, షూట్ చేయించి, అప్ లోడ్ చేయిస్తున్నవే… మొన్న చిరంజీవి సినిమా భోళాశంకర్ […]
షకీలాను పంపించేశారు… సీక్రెట్ రూంకు గరుణపురాణం… పాత బేకార్ తప్పులే మళ్లీ…
బిగ్‌బాస్ ఏదో ఉల్టాపుల్టా అన్నాడు… నిజంగానే అంతా ఉల్టాపల్టా యవ్వారమే కనిపిస్తోంది… రెండు వారాలకొచ్చింది… వీసమెత్తు ఇంట్రస్ట్ క్రియేట్ చేయలేకపోయింది ఈ సీజన్ కూడా… గత సీజన్ పనిచేసిన క్రియేటివ్ టీమే పనిచేస్తున్నట్టుంది చూడబోతే… నాగార్జున రాగద్వేషాలు కూడా పనిచేస్తున్నట్టున్నయ్… వెరసి ఇప్పటికీ బిగ్‌బాస్ గాడిన పడలేదు, పట్టాలెక్కలేదు… ఈసారి ఏం చేశారు..? షకీలాను బయటికి పంపించేశారు… అబ్బే, ప్రేక్షకుల వోట్ల మేరకు అంటారేమో… అంత సీన్ లేదు… అదంతా బిగ్‌బాస్ ఇష్టారాజ్యం… పంపించాలనుకుంటే ప్రేక్షకుల వోట్లు […]
తలె కూతల్… తల్లిదండ్రుల మెర్సీకిల్లింగ్‌కు ఓ దిక్కుమాలిన ఆచారసమర్థన…
దక్షిణ తమిళనాడులో అమలులో ఉన్న తలైకూతల్ అనే ఆచారం ఆధారంగా తీసిన సినిమా బారం (బరువు అనే అర్ధం). ప్రియా కృష్ణస్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2019 లో జాతీయ అవార్డు గెలుచుకుంది. తలైకూతల్ అనేది వృద్ధాప్యం వలన మంచం పట్టి ఇక వారు కోలుకునే అవకాశం లేదనుకున్న పెద్దవారిని కుటుంబసభ్యులే చంపివేసే దారుణమైన ఆచారం. మెర్సీ కిల్లింగ్ పై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ మెర్సీ కిల్లింగ్ ముసుగులో ఈ తలైకూతల్ అనేది ఒక organized crime […]
తమిళ నిర్మాతలు ఆ నిర్ణయమైనా తీసుకోగలిగారు… తెలుగువాళ్లకు చేతనవుతుందా..?
ఒక వార్త ఎందులోనో కనిపించింది… కాస్త ఆసక్తికరంగానే అనిపించింది… తమిళ సినీ నిర్మాతలకు అంత దమ్ముందా..? మన తెలుగు నిర్మాతలకు, దర్శకులకు అందులో వీసమెత్తు దమ్ము కూడా లేదెందుకు..? ఎందుకీ బతుకులు అని కూడా అనిపించింది ఓ దశలో… తీరా వార్త చివరకు వచ్చేసరికి ఓ వాక్యం ఉంది…‘‘గతంలోనే తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి ఇలాంటి చర్యలు తీసుకుంది… కానీ పూర్తి స్థాయిలో ఆచరణలోకి రాకపోవడం గమనార్హం…’’ అని వార్తకు చివరలో పంక్చర్ కొట్టారు… నిజమే… […]
- « Previous Page
- 1
- …
- 44
- 45
- 46
- 47
- 48
- …
- 117
- Next Page »