అయ్యో, ఇక ఈ జంట మళ్లీ తెరపై కనిపించదా అని బోరుమన్నాయి కొన్ని సైట్లు… ఒకడు ఏదైనా రాస్తే చాలు, ఇక కుప్పలుతెప్పలుగా అందరూ అదే గొర్రెదాటు… ఇంతకీ ఆ జంటపేరు చెప్పనేలేదు కదూ… విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన… కారణమేమిటీ అంటారా..? ఓ పొంతన లేని విషయానికీ దానికీ ముడిపెట్టేశారు… విషయం ఏమిటంటే..? పరుశురాం అనబడే దర్శకుడు గీతా ఆర్ట్స్ వారికి, అనగా అల్లు అరవిందుడికి ఓ సినిమా చేయాల్సి ఉంది… అడ్వాన్స్ కూడా పుచ్చుకున్నాడట… […]
నా భర్తనే అవమానిస్తావా..? ఛిఫో… దోస్తీ కటీఫ్… ఇకపై నీతో నటించను…
AK62… ఇదీ నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ వాళ్లు చాన్నాళ్ల క్రితమే ప్రకటించిన సినిమా… ఏకే47 మాదిరిగా ఏకే62 తుపాకీ కాదు… ఇది సినిమా పేరు కాదు, అజిత్ 62 వ సినిమా అని అర్థం… ఇప్పటికే మూడుసార్లు అజిత్‌తో జతకట్టిన నయనతార ఇందులో అజిత్ పక్కన హీరోయిన్గా నటించాలి… వాళ్లది హిట్ పెయిర్… నయనతార లేడీ సూపర్ స్టార్ కదా, అజిత్‌తో కలిస్తే ఇక ఢోకా ఏముంది..? సో, లైకా ప్రొడక్షన్స్ […]
విశ్వనాథ్ పట్ల కమల్ హాసన్ అగౌరవం… సారు గారికి గురువు గారు గుర్తే లేరు…
ఊళ్లో ఓ పెద్ద మనిషి గారి పెంపుడు కుక్క ఆయుష్షు తీరి చనిపోతే ఊరివాళ్లంతా బారులు తీరతారు… మందలుమందలుగా వెళ్లి ఆ పెద్ద మనిషిని పరామర్శిస్తారు… అబ్బ, మీ కుక్క భలే ఉండేదండీ, పిక్కల్ని తప్ప మరొకటి పీకి ఎరుగదు అని కూడా మెచ్చుకుంటారు… పంచాయతీ ఖర్చులతో డీజే బ్యాండ్, ఊరేగింపుతో వెళ్లి, బాణాసంచా కాల్చి మరీ అంత్యక్రియలు నిర్వర్తించి గౌరవాన్ని చాటుకుంటారు… కానీ ఆ పెద్ద మనిషే చచ్చిపోతే..? కుక్కలు కూడా పట్టించుకోవు..!! ఇది అందరికీ […]
ఈ డబ్బా సినిమాలో ఏముందని డబ్బు పెట్టుబడి పెట్టావమ్మా తల్లీ..!!
‘‘నిర్మాతగా మారాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా… పాప్ కార్న్‌తో మొదలుపెట్టా… సినిమా భలే వచ్చింది, హీరో సాయి రోనక్‌తో నా రెండో సినిమా… థ్రిల్లింగ్ సినిమా అంటే సీన్ ఫార్వర్డ్ చేయకుండా చూసేలా ఉండాలి… మా సినిమా అలాగే ఉంటుంది… అందుకే ఓటీటీకి కూడా ఇంకా ఇవ్వలేదు… ఇకపైనా చిత్రాలు నిర్మిస్తాను… సినిమాను నాగచైతన్య, అఖిల్, నాగార్జున మెచ్చుకున్నారు…’’ అని చెబుతూ పోయింది నటి అవికా గోర్… ఫాఫం… ఏదో చెబుతోంది గానీ అసలు ఎందుకు ఈ […]
మూడు పాత్రలు… మూడు రెట్ల వాయింపు… బింబిసారతో వచ్చిన ఇమేజ్ ఫట్…
1992లో బాలకృష్ణ, దివ్యభారతి ధర్మక్షేత్రం సినిమాలో ‘ఎన్నో రాత్రులొస్తాయి’ అని ఒకరినొకరు గట్టిగా అల్లుకుపోయిన పాట… ట్యూన్ బాగుండి, పైకి క్లాస్‌గా వినిపించినా సరే… ఊర మాస్ పాట అది… వేటూరి అంత త్వరగా దొరకడు గానీ పచ్చిదనం పులుముకున్న పాట… పెదవి కొరికే పెదవి కొరకే వంటి భేషైన పదప్రయోగాలు ఒకటీరెండు బాగున్నా… వేడి చెమ్మ, తొడిమ తెరిచే తొనల రుచికే వంటి చాలా కథలు పడ్డాడు… ఈ సినిమా పాటతో కథనం మొదలుపెట్టేందుకు కారణముంది… […]
బింబిసారతోనే పునర్జన్మ… అదే ఊపులో మరిన్ని సినిమాలు చకచకా…
కళ్యాణరామ్… ఎన్టీయార్ నట వారసుల్లో తన తరువాత మొదటితరంలో బాలకృష్ణ మాత్రమే, ఇంకెవరూ లేరు… అప్పుడెప్పుడో మొదలు పెట్టిన ప్రస్థానంలో ఇంకా తిప్పలు పడుతూనే ఉన్నాడు… ఆమధ్య చాన్నాళ్లు గ్రాఫ్ ఘోరంగా పడిపోయినవేళ అఖండతో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు… రెండో తరంలో జూనియర్ సూపర్ హిట్టయ్యాడు… నిజంగా సరైన పాత్రలు పడాలే గానీ తనను కొట్టేవాడు లేడు టాలీవుడ్లో… ఆ ఎనర్జీ, ఆ మెరిట్, ఆ ఈజ్, ఆ డిక్షన్, ఆ డాన్స్ అన్నీ ఉన్నాయి […]
వెండితెరపై రంగస్థల పతాక… అన్ని పాత్రలూ చేసిన సంపూర్ణ నటుడు…
Bharadwaja Rangavajhala……….. రంగస్థల నట ప్రతిష్టను తెరమీద నిలబెట్టి వెలిగించి కనుమరుగైన నిజమైన నటుడు రాళ్లపల్లి వెంకట నరసింహారావు. దేశానికి స్వతంత్రం రావడానికి సరిగ్గా రెండేళ్ల ముందు అంటే 1945 అగస్ట్ పదిహేనో తేదీన ఆయన జన్మించారు. 1960 లో అంటే తన పదిహేనోయేట స్టేజ్ మీద కాలుపెట్టారు. కన్యాశుల్కం నాటకంలో ఆడి పేరు తెచ్చుకున్నారు . ఆ తర్వాత వెనక్కి తిరిగిచూసుకోలేదు. స్టేజ్ ఆర్టిస్టుగా పరిషత్ నాటకపోటీల్లో రాళ్లపల్లి ఓ సంచలనం. ఆయన సంభాషణల విరుపు ప్రత్యేకంగా […]
ఓ కామెడీ ముద్రతో ఇంతటి బరువైన పాత్ర… కోవై సరళ చేసింది, మెప్పించింది…
కోవై సరళ… తెలుగు ప్రేక్షకులకు ఎవరూ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు… సూపర్ టైమింగుతో కామెడీని పండించే ఈమె హఠాత్తుగా ఓ సీరియస్ పాత్రలో… ఎమోషన్స్‌ను పండించి అందరి ప్రశంసలూ అందుకుంటున్న తీరు విశేషం… తెలుగు, తమిళ సినిమాల్లో దాదాపు ప్రతి సీనియర్ కమెడియన్తోనూ కలిసి నటించిందామె… కోవై సరళ అనగానే ఆమె పోషించిన కామెడీ పాత్రలే మనకు మనోచిత్రంలో కదలాడతాయి… అలాంటిది సెంబి సినిమాలో పోషించిన బరువైన పాత్ర పూర్తిగా ఆమెలోని అసలైన […]
వామ్మో… సుమపై జూనియర్ అంత సీరియసయ్యాడా..? ఇక ఆమె మొహమే చూడడా..?
చివరకు ఈటీవీ భారత్ కూడా సగటు యూట్యూబ్ చానెల్ అయిపోనట్టు అనిపించింది ఆ వార్త చూశాక… అమిగోస్ అని కల్యాణరామ్ సినిమా ఒకటి వస్తోంది తెలుసు కదా… దానికి ప్రిరిలీజ్ ఈవెంట్… అంతకుముందు జూనియర్ వచ్చి బింబిసార ప్రిరిలీజ్లో నాలుగు మంచి మాటలు మాట్లాడాడు కాబట్టి అది సూపర్ హిట్ అయిందనేది ఓ సెంటిమెంట్… సో, నిర్మాతలు మైత్రి మూవీస్ ఈ ప్రిరిలీజ్కూ రమ్మన్నారు… కల్యాణరామ్ సినిమాా కాబట్టి కాదనలేడు… మరోవైపు తారకరత్న చావుబతుకుల్లోనే ఉన్నాడు… ఇంకోవైపు […]
జోలా జో-లమ్మ జోలా, జేజేలా జోలా, జేజేలా జోలా… హమ్ చేయండి ఓసారి…
Bharadwaja Rangavajhala…….. విశ్వనాథ్ చిత్రాల్లో లాలి పాటలు … హాయైన సంగీతాన్ని అందించడమే కాదు … ఎందుచేతో విశ్వనాథ్ గారి చిత్రాల్లో మిగిలిన దర్శకుల చిత్రాలతో పోలిస్తే జోలపాటలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయం ఆయన గుర్తించారో లేదోగానీ … నిజం. అసంకల్పితంగా జరిగిపోయి ఉండవచ్చుకూడా. ఆయన సినిమాలకు ఆయనే కథ సమకూర్చుకోవడం వల్ల కావచ్చు … ఆయన మీద చిన్నతనంలో విన్న లాలి పాటల ప్రేరణ ఉండడం వల్లనూ కావచ్చు … మనసు సేద తీరే […]
మనసు పలికే మౌనగీతం… తెలుగు సినిమా పాటకు స్మశాన వైరాగ్యం…
Songs-Surrealism: మాటలో, పాటలో మాటలే ఉన్నా మాట మాటే. పాట పాటే. మాటల్లో చెప్పలేనిదేదో పాటలో చెప్పాలి. మామూలు మాటలను పేర్చి పాటల కోటలు కట్టాలి. అది సినిమా సందర్భంలో ఎంతగా ఒదిగి ఉంటుందో… అంతగా సందర్భం దాటి ఎదిగి… బయట ప్రపంచాన్ని కూడా ప్రతిబింబించాలి. ఆ పాట విశ్వవ్యాప్తమై వినిపించాలి. అనంతమైన ఆ పాట ఎవరు పాడుకుంటే వారికి సొంతం కావాలి. ఆ పాట తోడు కావాలి. ధైర్యం చెప్పాలి. ఓదార్చాలి. తట్టి లేపాలి. జోకొట్టి […]
అన్నా చంద్రబోసన్నా… గీ పాట విన్నావే నువ్వు… సకినాల మిరం రుచి తగుల్తది…
జీవనదిలా సాగే ఓ ప్రాంత మాండలికాన్ని పట్టుకోవాలంటే ఆ ప్రాంత సంస్కృతి ఏమిటో తెలియాలి… అర్థం చేసుకోవాలి, ఆవాహన చేసుకోవాలి, అనుభవించాలి, అక్షరీకరించాలి… అప్పుడు అది ఆ మట్టి పరిమళాల్ని మోసుకొస్తుంది… ఒక చిత్తూరు యాస, ఒక రాయలసీమ గోస, ఒక ఉత్తర కోస్తా ధ్యాస, ఒక తెలంగాణ భాషలో పాట రాయాలంటే ఆ పదాల విరుపు పట్టుకోవాలి… ఎలా రాయకూడదంటే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటలా ఉండకూడదు… అది సంకరభాష… నిజాం కాలంనాటి తెలంగాణ భాష […]
ఆధునిక సినిమా ద్వేషి రంగనాయకమ్మకూ నచ్చిన శంకరాభరణం..!
విశ్వనాథ్ మరణించి, ఆ కట్టె కాలకముందే ఏవేవో విమర్శలు తనమీద… తను పక్కా థ్రెడ్ లేదా కేబుల్ లేదా వైర్ ఓరియెంటెడ్ సినిమాలే తీశాడనీ, కులతపస్వి అనీ, తన సినిమాలన్నీ బ్రాహ్మణీయాలేననీ వాటి సారాంశం… అగ్రవర్ణ పక్షపాతమనీ వాటి ఆరోపణ… ఆ చర్చ, ఆ రచ్చ సాగుతూనే ఉంది… కొన్నాళ్లు సాగుతుంది కూడా… తన సినిమాల్లోని కొన్ని అభ్యుదయాలు, ఆదర్శాలు గాలికి వదిలేసి, తన కులాన్ని పట్టుకుని, ఒక బయాస్డ్, ప్రిజుడీస్ అభిప్రాయంతో పోస్టులు పెట్టినవాళ్లు కూడా […]
స్టెప్ మోషన్లో… ఒక్కొక్కరినీ పరిశీలిస్తూ ‘కవర్’ చేయాల్సి వచ్చింది…
‘‘సినిమా షూటింగు కోసం… అవసరమైనప్పుడు క్రౌడ్ చూపించడం కోసం… భారీగా జనాన్ని సమీకరించాలి… ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా సరే, కొంత ఆర్టిఫిషియాలిటీ కనిపిస్తూనే ఉంటుంది… ఒరిజినాలిటీ ఉండదు… అందుకని కాంతార సినిమా కోసం జనసమీకరణ, డబ్బులిచ్చి జనాన్ని తరలించడం గట్రా చేయలేదు… అందుకని కంబాలా ఫెస్టివల్ జరుగుతున్నప్పుడే కంబాలా సీన్లను ఆ జనంలోనే తీసేశాం… షూటింగ్ జరుగుతోందని తెలిస్తే డిస్టర్బెన్స్ ఉంటుంది… అందుకని ఆ విషయం తెలియకుండా జనాన్ని షూట్ చేశాం… అందుకే మీకు కాంతార సినిమాలో […]
ముంబైలో వాణిని తొక్కేసింది లత, ఆశ… అసలే సౌతిండియన్, పైగా మెరిటోరియస్…
‘‘ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమాలతోనే ఆరంభం కాదు, వాటితోనే ముగియవు…’’ వాణీజయరాం ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య అది… తనను ఎదగకుండా హిందీ పరిశ్రమలో కొందరు రాజకీయాలు నడిపి, తనంతటతాను ముంబై వదిలి వెళ్లేలా చేశారనే బాధ ఆమెలో ఎప్పుడూ ఉండేది… కానీ కనిపించనిచ్చేది కాదు… అదే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… ‘‘ముంబైలో పని తగ్గిపోయింది, ఐతేనేం, ఆ రాజకీయాలు నాకు ఇతర భాషల తలుపులు తెరిచాయి… అనేక భాషల్లో మంచి పాటలు పాడే […]
జగదానందకారకా… నాటరాగం సహా కష్టమైన రాగాలన్నీ ఆమెకిష్టమైన రాగాలే…
Bharadwaja Rangavajhala…. అన్ మాచ్డ్ నైటింగేల్ ఆప్ ఇండియా… ఏ పాటైనా పాడేయడమే కాదు… ఎవరీవిడ అని చూడాలనిపించే క్యూరియాసిటీ కలిగించిన గాయని తను. పేరు వాణీ జయరామ్. అమృతగానమది ….. అమితానందపు ఎద సడి …. తెలుగు సినిమాలను చక్కటి సంగీతంతో అలంకరించిన కన్నడ దేశ జంట సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర. ఎవిఎమ్ వారు తీసిన నోము, పూజ చిత్రాలకు వారే సంగీతం అందించారు. పూజ చిత్రం కోసం దేశ్ రాగంలో ఓ భక్తి […]
ఈ మలయాళీ బుట్టబొమ్మ… తెలుగు వాళ్లకు ధమ్ బిర్యానీ కాదు, జస్ట్ ఉప్మా…
బుట్టబొమ్మ… ఈ సినిమా ఎలా ఉందనే విశ్లేషణలకు ముందు… నిర్మాత సాయిసౌజన్య అలియాస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్యకు ఒక అభినందన… సినిమా లవ్ స్టోరీ అయినా, అక్కడక్కడా డర్టీ రొమాన్స్ సీన్లతో గతి తప్పే అవకాశాలున్నా సరే, ఎక్కడా అసభ్యతకు, అశ్లీలానికి తావివ్వలేదు… ప్లెయిన్ అండ్ ఫెయిర్‌గా ఉంది సినిమా… (క్లాసికల్ డాన్సర్ అయిన ఆమె సిరివెన్నెల సీతారామశాస్త్రికి స్వయానా మేనకోడలు…) ఒకరకంగా త్రివిక్రమ్ సినిమాయే… అందుకే ఈ చిన్న సినిమా మీద రివ్యూయర్ల ఆసక్తి… లేకపోతే […]
జగన్‌ను ఏం తిడుతున్నావో సమజైందా బాలయ్యా…? ఇదేం మర్యాద…?!
ప్చ్… పవన్ కల్యాణ్ మారడు… హిపోక్రటిక్ వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు… జనం ఎడ్డోళ్లు, ఏం చెప్పినా నమ్ముతారు అనే భావన ఎందుకు, ఎలా బలంగా మనసులో నాటుకున్నదో గానీ… ఒక్కసారైనా ఫెయిర్‌గా, స్ట్రెయిట్‌గా మాట్లాడటం లేదు… పైగా బాలకృష్ణ… అసలే బ్లడ్డు అండ్ బ్రీడు బాపతు… నెత్తుటిలో అదే అహం… కాకపోతే మనసులో ఉన్న కోపమైనా, ప్రేమైనా బయటికి రావల్సిందే… పవన్ కల్యాణ్, బాలకృష్ణ ఈ విషయాల్లో క్వయిట్ కంట్రాస్టు… పొలిటికల్ వేదికగా మార్చేయబడిన ఆహా అన్‌స్టాపబుల్‌లో […]
రైటర్ పద్మభూషణ్… యండమూరి, మల్లాది కాలంలో తీయాల్సిన సినిమా…
ఎప్పటి నుంచో చాయ్ బిస్కెట్ వెబ్ ఫీల్డులో ఉంది… డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు అనాలేమో… సరే, సుహాస్ అక్కడే ఎదిగాడు… చాయ్ బిస్కెట్ వాళ్లే సుహాస్ హీరోగా ఓ సినిమా తీశారు… రొటీన్‌గా కనిపించే ఇమేజీ బిల్డప్పులు, ఫార్ములా కథ గాకుండా ఓ భిన్నమైన కథ… సుహాస్ ఇంతకుముందు కలర్ ఫోటోలో యాక్ట్ చేశాడు కానీ అది ఓటీటీ సరుకు అయిపోయింది… ఇప్పుడు రైటర్ పద్మభూషణ్… ఈ సినిమా కాస్త నచ్చుతుంది… ఎందుకంటే… తెలుగు సినిమా తాలూకు […]
కేజీఎఫ్ సినిమా ప్రభావం… మైఖేల్‌కు ప్రేరణ, అనుకరణ, అనుసరణ…
ఒక సినిమా భారీ హిట్టయిందంటే… తరువాత సినిమాలపై ఆ ప్రభావం ఉంటుంది… సహజం… మైఖేల్ సినిమా చూస్తే కేజీఎఫ్ అనేకసార్లు గుర్తొస్తుందీ అంటే ఆ సహజసూత్రమే… మైఖేల్ సినిమా నిర్మాతలకు ఓ పాన్ ఇండియా సినిమా కావాలి… అందుకని రిస్క్ దేనికి..? హిట్ ఫార్ములా, ప్రజెంట్ ట్రెండ్ అని ప్రూవ్ చేసుకున్న కేజీఎఫ్‌ను ఆదర్శంగా తీసుకుంటే సరి… ఇంకేముంది, దర్శకుడికి కూడా క్లారిటీ వచ్చింది… ఇంతకుముందు ఈ గ్యాంగ్స్టర్లు, నడుమ ఇరికించబడిన తల్లి, చెల్లి సెంటిమెంట్ల కథల్ని […]
- « Previous Page
- 1
- …
- 70
- 71
- 72
- 73
- 74
- …
- 126
- Next Page »