ఆలీవుడ్… టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ తరహాలో ఆలీవుడ్… అనగా ఆలీ అనబడే కమెడియన్ కమ్ పొలిటిషియన్ కమ్ టీవీ ప్రజెంటర్ కమ్ కేరక్టర్ ఆర్టిస్ట్… తాజాగా నిర్మాత ఆలీ తీయబోయే సినిమాలను ఆలీవుడ్ అని పిలవాలట… పేరు బాగుంది… క్రియేటివ్‌గా ఉంది… ఓ సినిమా తీశాడు… అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి… సినిమా పేరు అదే… ఆలీ తత్వం కూడా అదే… సినిమా తీశాడు కానీ థియేటర్ల దాకా రానివ్వలేదు… అందులో అంత దృశ్యము లేదని […]
మరోసారి కన్నడ ప్రేక్షకుడి కంటతడి…! ఆ జ్ఞాపకాల ఉద్వేగంలో వెండితెర..!
కన్నడ ప్రేక్షకుడు మరోసారి కన్నీరు పెట్టుకుంటున్నాడు… ఏడాదిక్రితం హఠాత్తుగా మరణించిన తమ అభిమాన కథానాయకుడు అప్పు అలియాన్ పునీత్ రాజకుమార్‌ను తలుచుకుని, చివరిసారిగా వెండితెర మీద చూస్తూ ఉద్వేగానికి గురవుతున్నారు… నిజం… తను ఓ పెద్ద హీరో కొడుకు, కానీ ఎక్కడా ఆ వారస దుర్లక్షణాల్ని చూడలేదు కన్నడ సమాజం… పైగా తనలోని గొప్ప ఔదార్యాన్ని, నేల మీద నడిచే సంస్కారాన్ని, పదిమందిలో ఒకడిగా నడిచిన వ్యక్తిత్వాన్ని చూసింది… మన సినీ ఇండస్ట్రీల్లోని చెత్తా బిల్డప్పు గాళ్లకూ […]
సింగిల్ సమంతపై విజయ్ కన్ను… ఫాఫం, రష్మికకు మళ్లీ శోకాలేనా..?!
అతనికన్నా ఆమే రెండుమూడేళ్లు పెద్ద… ఫాఫం, విజయ్ దేవరకొండ కాలేజీలో చదువుతున్నప్పుడే సమంత వెండితెరకు ఎక్కింది… ఆమెను చూసి తనకు పిచ్చెక్కింది… అప్పటి నుంచీ ఆరాధిస్తూనే ఉన్నాడు… మొదట్లో ఆమె సిద్ధార్థ్ మాయలో పీకల్లోతు పడిపోయింది, మునిగిపోయింది… విజయ్ కాలేజీ నుంచి బయటికి వచ్చి, సినిమాల్లో చిన్నాచితకా వేషాలు వేస్తున్నాడు కానీ తనను దేకేవారు ఎవరు..? సమంత ఓ ప్రేమ దేవత… వెండితెరపై వెలిగిపోతున్న దేవత… విజయ్ను చూసేంత సీన్ ఉందా..? కానీ మెల్లిమెల్లిగా తనూ హీరో […]
బాలయ్య అంటే అంతే… కమర్షియల్ యాడ్స్‌లో కూడా అవే భుజకీర్తులు…
సెలబ్రిటీలు… ప్రత్యేకించి సినిమా సెలబ్రిటీలు కాస్త పాపులరైతే చాలు… రకరకాల కమర్షియల్స్‌లో నటించి ఎడాపెడా డబ్బు తీసుకుంటారు… తప్పుకాదు… బ్రాండ్ ప్రమోషన్ల విషయంలో ఉభయతారకం… అయితే తాము ప్రచారం చేస్తున్న సరుకులతో ప్రజలకు నష్టం వాటిల్లే పక్షంలో వాటికి ఆయా సెలబ్రిటీలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది… లీగల్‌గానే… ఈ విషయం చాలామందికి తెలియదు… అంతెందుకు..? అనైతికంగానూ డబ్బు సంపాదిస్తుంటారు కొందరు… అప్పట్లో అమితాబ్ బచ్చన్, అక్షయ్ తదితరులు గుట్కా సరోగేట్ యాడ్స్ చేసి, తరువాత చెంపలేసుకున్నారు… […]
డియర్ ఆలీ భాయ్… ఈ యెల్లో టీవీ చానెళ్లను కాస్త కంట్రోల్లో పెట్టాలోయ్…
సినిమా నటుడు ఆలీ… ఇండస్ట్రీలో అందరికీ ఇష్టుడే… చిన్నప్పటి నుంచీ కష్టపడ్డాడు… కుటుంబాన్ని ఆదుకున్నాడు… పదిమందికీ సాయం చేస్తాడు… నవ్వుతూ, నవ్విస్తూ సాగిపోతున్నాడు… కానీ ఒక్కసారిగా తనకు తీవ్ర అసంతృప్తి… అదీ జగన్ వైపు నుంచి..! అసలు జగన్ పట్ల మద్దతుగా నిలిచిన సినిమావాళ్లు ఎవరున్నారు..? పోసాని వంటి ఒకటీరెండు కేరక్టర్లు తప్ప… పవన్ కల్యాణ్‌కు సన్నిహితుడైనా, చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్నా ఆలీ జగన్‌కు మద్దతుగా ఉన్నాడు, పార్టీలో చేరాడు… మరి ఆ ఆలీకి జగన్ ఏం […]
పేరుకేనా అన్‌స్టాపబుల్..! అప్పుడే స్టాపా..? ఏదీ ఆ మూడో ఎపిసోడ్..?!
అదుగదుగో అన్‌స్టాపబుల్ తదుపరి ఎపిసోడ్లో అనుష్క… ఇక ఆహా ఓటీటీ దద్దరిల్లిపోవాల్సిందే అని వీరభక్తితో రాస్తూపోయాడు ఓ యూట్యూబర్… కానీ ఏది..? ఎక్కడ.? ప్రోమో ఏది..? అసలు ఆమె చాన్నాళ్లుగా ఏ ఇంటర్వ్యూలకూ రావడం లేదు… నో, నో, రోజాతో మూడో ఎపిసోడ్ రాబోతోంది… ఇక చూస్కో నా రాజా అని మరో వీరభక్తుడు థంబ్ నెయిల్ వెలిగించి మరీ వీడియో పెట్టేశాడు… అసలే జగన్ దగ్గర ఫుల్ మైనస్ మార్కుల్లో ఉంది ఆమె… సొంత నియోజకవర్గంలో […]
నెగెటివ్ ప్రచారంలోనూ స్టడీగా కాంతార… ఓ అరుదైన రికార్డు ఛేదన…
కాంతార సినిమాలోని సూపర్ హిట్ పాట ఓ ప్రైవేటు ఆల్బమ్ నవరసం పాటకు కాపీ అని ఓ వివాదం… లీగల్ నోటీసులు… మీడియా కవరేజీ… గతంలో ఇదే మంగుళూరు ప్రాంతం నుంచి వచ్చిన పింగారా సినిమాకు కాంతార కాపీ అని మరో వివాదం… ఆ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చిందట.,.. ఇప్పుడు దాన్ని తెలుగులోకి డబ్ చేసి వదులుతారట… దీనిపైనా మీడియా కవరేజీ… పనిలోపనిగా భూత్ కోళ సంప్రదాయానికీ హిందూ మతానికీ సంబంధం లేదని మరో […]
హాహాశ్చర్యం..! ఆర్జీవీతో జగన్ బయోపిక్..! ఇదేమి కొత్త విపత్తు స్వామీ..?!
ఈరోజు వార్తల్లో ఆసక్తిగా అనిపించిందీ, జగన్‌ను చూస్తే జాలేసిందీ ఓ వార్త ఉంది… అదేమిటంటే..? రాంగోపాలవర్మ అనే ప్రపంచ ప్రసిద్ధ దర్శకుడు జగన్మోహన్రెడ్డి బయోపిక్ తీయబోతున్నాడట… తాడేపల్లికి వెళ్లి, జగన్‌తో భేటీ వేసి, సినిమా బడ్జెట్, కథ కమామిషూ మాట్లాడి, మీడియాకు చిక్కకుండా వెళ్లిపోయాడట… సినిమా పేరు జగన్నాథ రథచక్రాలు అట… వచ్చే ఎన్నికల్లో లబ్ది కోసం ఈ సినిమా ఉపయోగపడాలట… ఇన్ని ‘ట’లు ఎందుకంటే..? ఇవేవీ ధ్రువీకరించబడిన వార్తలు కావు కాబట్టి… ఇప్పుడప్పుడే ఎవరూ దీని […]
తమిళ సినిమాలో హిందీ పాట అనగానే… కాల్ మిస్టర్ పీబీ శ్రీనివాస్ అర్జెంట్లీ…
Bharadwaja Rangavajhala….. డెబ్బై దశకంలో తమిళ తెరను వెలిగించిన దర్శకుల్లో మహేంద్రన్ ఒకరు. ఆయన తీసిన చాలా సినిమాలు తెలుగులో అనువాదమై అలరించాయి. ఆయన చిత్రాల్లో కథలు చాలా వాస్తవికంగా ఉంటాయి. సహజత్వం దెబ్బతినకుండా ఎంటర్ టైనింగ్ గా కథ చెప్పడం ఆయన ప్రత్యేకత. దృశ్యం పొయిటిక్ గా ఉండేలా చూసుకునేవారు. గొప్ప భావుకుడు. ఆయన అసలు పేరు అలగ్జాండర్ . తెర పేరు మహేంద్రన్. శివాజీ తంగపతకం కథ ఆయనదే! కమర్షియల్ సినిమాని ఆర్ట్ సినిమా పద్దతిలో చూపించడం అనే […]
రామసేతు ఇటుకలు నీటిపై తేలతాయి… సినిమా మాత్రం ‘మునిగిపోయింది’…
సినిమాలకు సంబంధించిన బేసిక్ సూత్రం ఒకటే… కొత్త ఆసక్తికర విషయం చెప్పాలి లేదా తెలిసిన విషయాన్నే ఆసక్తికరంగా చెప్పాలి… ఓ నాసిరకం చెత్త కంటెంటును జనం ఆమోదించేలా చేయడం రాజమౌళికి తెలుసు… కానీ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న హిందూ పురాణాలకు లింకై ఉన్న కంటెంటు ఉండీ అక్షయ్ కుమార్ ఓ చెత్త సినిమాను జనం మీదకు వదిలాడు… నిజానికి చెత్త సినిమా అనే స్ట్రెయిట్ వ్యాఖ్య సరికాదు… రామసేతు సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ అవుతుందని అనుకున్నారు, దాంట్లో […]
ఓహ్… కాంతార సూపర్ హిట్ వరాహరూపం పాట ఈ ప్రైవేటు పాటకు కాపీయా..?
కాంతార సినిమా ఎంత హిట్టో తెలుసు కదా… అందులో చివరలో వచ్చే వరాహరూపం ఆ సినిమాకు ప్రాణం… ఇప్పుడు ఆ పాట వివాదంలో చిక్కుకుంది… కేరళలో చాలా పాపులర్ ప్రైవేటు మ్యూజిక్ కంపెనీ మాతృభూమి కప్పా టీవీ 2017లో రిలీజ్ చేసిన నవరసం పాటకు వరాహరూపం కాపీ అనేది తాజా వివాదం… దీనిపై సదరు కంపెనీ కాంతార నిర్మాతలు హొంబళె ఫిలిమ్స్‌పై, దర్శకుడిపై కేసులు వేయాలని భావిస్తోంది… 2 మిలియన్ల సబ్స్క్రయిబర్లున్న ఈ యూట్యూబ్ మ్యూజిక్ చానెల్‌కు […]
అది 1979… చిరంజీవికి గుర్తుందో లేదో… మోహన్‌బాబు కూడా సహనటుడు…
Bharadwaja Rangavajhala….. 2014 లో అనుకుంటా …. ప్రముఖ సినీ దర్శకుడు ఐఎన్ మూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు అనే వార్త చూశాను. అప్పటికి ఆయన వయసు సుమారు 89 సంవత్సరాలు. ఎవరీ ఐఎన్ మూర్తి అనుకుంటున్నారా … ఎన్టీఆర్ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన సీతారామకళ్యాణం చిత్రానికి ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా వ్యవహరించారాయన. నిజానికి ఈ సినిమాకు దర్శకత్వం ఎన్టీఆర్ అని టైటిల్ కార్ట్స్ లో పడదు. అయినా అన్నగారు దర్శకత్వం వహించిన తొలి చిత్రం అదే. […]
ఈ కాంతార ‘హీరో’కు నిజమైన పరీక్ష ముందుంది… అదేమిటంటే..?
నిజమే… రిషబ్ శెట్టికి ముందుంది ముసళ్ల పండుగ… హార్ష్‌గా ఉన్నట్టుంది కదా వ్యాఖ్య… కానీ నిజమే… ఇన్నాళ్లూ తీసిన సినిమాలు వేరు, ఇప్పుడిక కాంతార తరువాత తీయబోయే సినిమా వేరు… తనకు తాను ఓ హైరేంజ్ బెంచ్ మార్క్ ఒకటి క్రియేట్ చేసుకున్నాడు… హీరోగా, దర్శకుడిగా, కథకుడిగా..! ఎక్కడి 15 కోట్ల సినిమా… ఎక్కడి 250- 300 కోట్ల వసూళ్లు… డబ్బు సంగతి ఎలా ఉన్నా సరే, ఆ సినిమాయే ఓ ఊపు ఊపేస్తోంది… తన నటనను […]
‘‘పసుపుతో 21 బియ్యపుగింజలు ఎర్రటిబట్టలో చుట్టి బీరువాలో పెట్టుకోవాలి…’’
ధన త్రయోదశి సందర్భంగా అందరూ ఎంతోకొంత బంగారం కొనాలని కొన్నేళ్లుగా మన తెలుగు మీడియాలో సాగుతున్న ప్రచారం.., బోలెడు స్టోరీలు రాస్తారు… ఫోటోలు వేస్తారు… ధన్‌తేరాస్ పేరిట ఈరోజుకు అత్యంత పవిత్రతను కట్టబెట్టి తెలుగు మీడియా తమ వ్యాపార ప్రయోజనాల కోసం పాఠకులకు చేస్తున్న ద్రోహం… కేవలం బంగారం దుకాణాలకు గిరాకీ పెంచే ఓ పిచ్చి ప్రయత్నం… మనం ఆమధ్య విపరీతంగా మీమ్స్, పోస్టులు, సోషల్ చెణుకులు చదివాం గుర్తుందా…? పర్సులో అయిదు యాలకులు పెట్టుకోవడం, బీరువాలో […]
అంతటి కంతారాలోనూ కొన్ని వెకిలి సీన్లు… కానీ ఈ సప్తమి భలే వెనకేసుకొచ్చింది…
లీల గుర్తుందా..? ఫారెస్ట్ గార్డ్ పాత్ర… కాంతార సినిమాలో రిషబ్ శెట్టి అలియాస్ శివ పాత్ర ప్రేమికురాలు… లీల పాత్రకు మరీ పెద్దగా ప్రాధాన్యం ఏమీ ఉండదు సినిమాలో… కానీ హీరోయిన్ హీరోయినే కదా… తన సినిమాలోని లీల పాత్రకు పనికొచ్చే ఫేస్ కావాలని రిషబ్ వెతుకుతూ, అనుకోకుండా ఇన్‌స్టాలో ఈమె ఫోటోలు చూశాడు… ఆల్రెడీ ఏదో సినిమాలో నటించింది… సో, ఆడిషన్‌కు రమ్మన్నాడు… తరువాత వోకే అన్నాడు… ఆమె పుట్టింది, పెరిగింది బెంగుళూరు… తండ్రి అసిస్టెంట్ […]
లక్కీ కార్తి..! పొన్నియిన్ సెల్వన్ సంబురాల్లోనే తాజాగా సర్దార్…!!
నటి లైలా పదహారు ఏళ్ల తరువాత మళ్లీ రంగు పూసుకుంది… సర్దార్ సినిమా కోసం..! హిందీ నటుడు చుంకీ పాండే తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు… మొన్నమొన్ననే పొన్నియిన్ సెల్వన్ సినిమాతో తమిళంలో బ్రహ్మాండమైన ఫేమ్ సంపాదించిన కార్తికి ఇది మళ్లీ వెంటనే ఓ స్పై థ్రిల్లర్… డబుల్ రోల్… చెప్పుకోదగిన హీరోయిన్లే… రాశిఖన్మా, రాజీష విజయన్… మంచి అభిరుచి కలిగిన దర్శకుడు మిత్రన్ దీనికి దర్శకుడు… సర్దార్ సినిమా రిలీజుకు ముందు విశేషాలు ఇవే… అవన్నీ […]
ఓరి దేవుడా… చిన్న హీరో ఐతేనేం… పెద్ద హీరో ఐతేనేం… అన్ని బాటలూ రీమేకులే…
విష్వక్సేన్ అయినా అంతే… చిరంజీవి అయినా అంతే… మనకు తెలుగులో సొంత కథల్లేవు, మనకు ప్రయోగాలు అక్కర్లేదు… ఏదో భాష నుంచి మన హీరోయిజానికి అనువుగా మల్చుకుని, ఓ రీమేకును జనంలోకి వదలడమే… ఓరి దేవుడా అనే సినిమా పోస్టర్ చూడగానే గుర్తొచ్చే నిజం ఇదే… పోనీ, అదైనా నిన్నటిదో మొన్నటిదో కూడా కాదు… ఏళ్ల క్రితం నాటి సినిమాలైనా సరే, రీమేకడమే… తమిళంలో రెండున్నరేళ్ల క్రితం వచ్చింది ఓ మై కడవులే అనే సినిమా… దాన్ని […]
జిన్నా..! అంతటి పోర్నరికి కూడా కథాప్రాధాన్యమున్న పాత్ర ఇచ్చారు…
ఏడు కొండల వెనుక నుంచి జిన్నా అనే టైటిల్ వస్తుంటే… అది ఏమైనా వివాదానికి దారితీస్తుందేమో అనుకున్నారు… ఐనా అనితర సాధ్యమైన మరో షిర్డి గుడిని కట్టించి, ఇక భక్తులు షిర్డికి వెళ్లనక్కర్లేదన్న అత్యంతాతి హిందూ భక్తిపరుడు మంచు మోహన్‌బాబుతో పెట్టుకోవాలంటే హిందూ సంస్థలకు కూడా అంత ధైర్యమెక్కడ ఉంటుంది..? పైగా ఇంట్రడక్షన్లో జైశ్రీరాం అనిపిస్తే సరి… అంతేనా..? హీరో చేతి మణికట్టుకు మూడు ఓంకారాలు చెక్కిన ఓ బ్రేస్లెట్, దానికి హనుమంతుడి బొమ్మ… ఇంకేం కావాలి..? […]
సిల్లీ కామెడీ..! మళ్లీ జాతిరత్నాలు తీయబోతే ఈ పంటికింద రాళ్లు తగిలాయ్…
దర్శకుడు నాగ్ అశ్విన్ ఏమిటి..? ఒక సినిమాను జస్ట్ తనే నిర్మించి, మిగతా అంశాల్లో వేలుపెట్టకపోవడం, ఓ చిన్న దర్శకుడికి పూర్తి స్వేచ్చ ఇవ్వడం ఏమిటి… అని అప్పట్లో ఓ చిన్న ఆసక్తి… హీరో నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ ఆ సినిమాకు ప్రాణంగా నిలిచి… 4 కోట్లు ఖర్చు పెట్టిన సినిమాకు 40 కోట్లు వచ్చిపడ్డయ్… అందుకని ఆ దర్శకుడు కేవీ అనుదీప్ తదుపరి ప్రాజెక్టు మీద ఆసక్తి… తాజాగా విడుదలైన ఆ సినిమా పేరు […]
చేతి చిటికెన వేళ్లు కలిపితే కళ్యాణమై… కాలి బొటన వేళ్లు కలిపితే నిర్యాణమై…
Bharadwaja Rangavajhala……….. భారత దేశంలో కులపరమైన అణచివేత కొత్తదేం కాదు. దళిత కులాల్లో పుట్టి అనేక అవమానాలను ఎదుర్కొన్న కవులు కళాకారులకూ కొదవ లేదు. ఈ ఆవేదన నుంచే జాషువా గబ్బిలం రాస్తే, జాన్సన్ కాకి కావ్యం రాశాడు. నిదర ముదర పడే వేళ వల్లకాడు ఒక్కటే అని జాలాది రాసేశారు గానీ… ఎవరి వల్లకాడు వారికే ఉంది. అగ్రవర్ణాలనే ఆదరించే చిత్ర సీమలోకి దళితుడుగా కాలుపెట్టి గౌరవం అందుకున్నాడు జాలాది. జాలాది పుట్టింది కృష్ణాజిల్లా దోసపాడు. తండ్రి […]
- « Previous Page
- 1
- …
- 84
- 85
- 86
- 87
- 88
- …
- 126
- Next Page »