(Disclaimer: ఇది సరదాగా రాసింది. ఎవర్నీ ఉద్దేశించింది కాదు. కాబట్టి ఏకీభవించినా, విభేదించినా చివరిదాకా హాయిగా చదవొచ్చు). 1) రాయని భాస్కరులు: వీళ్లు సినిమాలు చూస్తారు. ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత తమ పనుల్లో బిజీ అయిపోతారు. సినిమా చూశాక రివ్యూ రాయాలన్న ఆశ, ఆలోచన లేని సగటు జీవులు. 2) నా ఇష్టం: వీళ్లు ఎవరికీ లొంగరు. ఏ భావజాలానికీ చెందరు. సినిమా నచ్చితే నచ్చిందని రాస్తారు. నచ్చకపోతే నచ్చలేదని రాస్తారు. సూటిగా, నిర్మొహమాటంగా చెప్తారు. […]
బ్లాక్ బస్టర్… ఎందుకు హనుమాన్ మూవీ ఈ రేంజులో హిట్టయ్యింది..?!
అమెరికాలో 3 మిలియన్లు ప్లస్ వసూళ్లు… ఇంకా జోరు… ఒక వార్త… గుంటూరుకారం, సైంధవ, నాసామిరంగ సినిమాల టికెట్లు ఒక ఎత్తు, హనుమాన్ టికెట్లు మరో ఎత్తు… మరో వార్త… దాదాపు 100 సింగిల్ స్క్రీన్లలో హనుమాన్ షోలు… ఇంకో వార్త… నార్త్‌లో దుమ్మురేపుతున్న హనుమాన్… ఇదింకో వార్త… నేడో రేపో వంద కోట్ల క్లబ్బులో హనుమాన్… దాదాపు అన్ని వార్తలూ హనుమాన్ అనే సినిమా విజృంభణను సూచిస్తున్నాయి… ఈ జోరు ఇప్పట్లో ఆగదు… క్లియర్… సంక్రాంతి […]
హీరోలేమో మేలిమి జాతిరత్నాలు… ఏడాదికే ఈమె ఐరన్ లెగ్గు అట…
హీరోయిన్ శ్రీలీల మీద భీకరమైన ట్రోలింగ్ కనిపిస్తోంది… ఒక హిట్ వస్తే గోల్డెన్ ఎగ్, ఒక ఫ్లాప్ వస్తే ఐరన్ లెగ్… ఇలా ఇండస్ట్రీ ముద్రలు వేసే తీరు మీద మాట్లాడుకుంటున్నాం కదా… ఇప్పుడు సోషల్ మీడియా ట్రోలర్లు కూడా తోడయ్యారు… ఆమెను తీసుకుంటే ఇక ఆ సినిమా మటాషే అనే ముద్ర వేసేస్తున్నారు… నిజంగా ఆమె ఐరన్ లెగ్గేనా..? ఆమె ఇప్పటికిప్పుడు గగనం నుంచి దిగి రాలేదు… నాలుగైదేళ్లుగా ఫీల్డ్‌లో ఉంది… అటు మెడిసిన్ చదువుతూనే […]
ఐతే గోల్డెన్ ఎగ్గులు… లేదంటే ఐరన్ లెగ్గులు… భలే వేస్తార్రా స్టాంపులు…
శంకర్ జీ…. హీరోయిన్లు ఐరన్ లెగ్గులా.. లక్కీ ఐకాన్ లా… 70 ఏళ్ల కిందటిమాట అప్పట్లో కృష్ణకుమారి అనే పొడగరి అందమైన అమ్మాయికి అవకాశాలు ఎదురెక్కి వెళ్లాయి. ఎన్టీఆర్ కూడా సొంత చిత్రం పిచ్చిపుల్లయ్యలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. అయినా ఏం లాభం, హీరోయిన్ గా నటించిన చిత్రాలు దాదాపు పది దాకా బాల్చి తన్నేశాయి. అప్పుడెవరూ ఆమెను ఐరన్ లెగ్ అనలేదు. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసింది. అక్కినేని, ఎన్టీఆర్ లతో జమునకు పొసగక […]
పర్లేదు… ఈ హీరోయిన్‌కు ఫ్యూచర్ ఉంది… సినిమా టైమ్‌పాస్ పల్లీబఠాణీ…
చూడకపోతే పోయేదేమీ లేదు, అంత ఆసక్తి రేపే సినిమా ఏమీ కాదు… అలాగని ఏమీ చెడగొట్టలేదు… ఉన్నంతలో పండుగ ఉత్సాహాన్ని, గ్రామీణ వాతావరణాన్ని ఇంకాస్త పెంచే సినిమా… మరీ మాస్ మసాలా పెడపోకడలు కూడా ఏమీ లేవు… సో, ఫ్యామిలీలతోసహా వెళ్లి చూడవచ్చు… అలాగని ఏదో కొత్తదనం కోరుకోవాల్సిన పనిలేదు… జస్ట్, ఓ సినిమా.., వెళ్లాం, చూశాం, వచ్చాం… టైమ్ పాస్ పల్లీ బఠానీ యవ్వారం.., నిజానికి నాగార్జునలో ప్రయోగప్రియుడు ఏనాడో కనుమరుగయ్యాడు… గతంలో నాగార్జున అంటే […]
ఆమె తల్లి చనిపోయాక గానీ ఈయన ఆమెకు దగ్గర కాలేకపోయాడు…
శంకర్ జీ …… సంపూర్ణ సగటు మానవుడు. జన్మనామము ఉప్పు శోభనాచలపతి రావు. తను అందంగా ఉంటాడు అనుకోవటమే కాదు అందరూ అలాగే అన్నారు. బియస్సి చేశాక మద్రాసులో లా చదవటానికి వెళ్ళాడు. తండ్రితో కలిసి షూటింగ్ చూడటానికి ఒక స్టూడియోకి వెళ్ళాడు. అక్కడ ఎన్టీఆర్ ను చూసిన శోభనాచలపతి తండ్రి అతన్ని ఎన్టీఆర్ లా హీరోగా చూడటానికి ఆశపడ్డాడు. తండ్రి కోరిక తన కోరిక అదే అవ్వటంతో చదువుకు స్వస్తి చెప్పి సినిమాలో వేటలో పడ్డాడు. […]
కొన్ని పాటలు అంతే… మనసుకు పట్టేసి ఓ పట్టానా వదలవు…
Bharadwaja Rangavajhala… కొన్ని పాటలు అంతే… మనసుకు పట్టేసి ఓ పట్టానా వదలవు. లాస్ట్ ఇయర్ ఇదే రోజు… ఉదయం లేచింది లగాయతు… కలనైనా నీ వలపే పాట తొలిచేస్తాందని చెప్పానుగా … ఈ పాటలో … కళలూ కాంతులు నీ కొరకేలే అని లీలగారు పాడేప్పుడు … ఠక్కున మనసు రామకథను వినరయ్యా లోకి దూకేస్తుంది. అదే లైనును పై స్థాయిలో కాక కోమలంగా పాడినప్పుడు అదే మనసు పూజాఫలంలో … పగలే వెన్నెలాలోకి జారుతుంది. […]
రాంగ్ టైమింగ్, రాంగ్ ట్వీట్… బన్నీ ‘ఆనంద స్మృతు’లపై హాశ్చర్యం…
వద్దూవద్దనుకుంటున్నా సరే, గుంటూరుకారం గురించి ఏదో ఒకటి రాయకతప్పడం లేదు… కాదు, దిల్ రాజుకు షాక్ గురించి కాదు, త్రివిక్రమ్ ఫెయిల్యూర్ గురించి కాదు, మహేశ్ బాబు గ్రాఫ్ పడిపోవడం గురించి కాదు, థమన్ కాపీ ట్యూన్ల గురించి కాదు, చివరకు కుర్చీ మడతబెట్టి పాటలో దౌర్భాగ్యం గురించి కూడా కాదు… ఇది ఓ డిఫరెంట్ యాంగిల్… అల్లు అర్జున్ అలియాస్ బన్నీ… మెగా కంపౌండ్ ప్రొడక్ట్… పాన్ ఇండియా స్టార్… తెలుగులో మస్తు డిమాండ్ ఉన్న […]
కిల్లర్ సూప్..! మీకు భర్త- ప్రియుడు- ప్లాస్టిక్ సర్జరీ పాత క్రైం స్టోరీ గుర్తుందా..?
అప్పట్లో ఓ సెన్సేషనల్ కేసు గుర్తుందా..? ఇప్పుడు ఆమె ఏ జైలులో ఎలా ఉందో తెలియదు గానీ… ప్రియుడితో కలిసి భర్తను చంపేసి, అచ్చం భర్తలా తన ప్రియుడికే ప్లాస్టిక్ సర్జరీ చేయించి, భర్త స్థానంలో ప్రవేశపెట్టింది… కాకపోతే చికెన్ సూప్ దగ్గర ఈ నకిలీ భర్త బయటపడిపోయి, బండారం బద్ధలై, మొత్తం కథంతా బయటపడింది… ప్రియుడితో కలిసి భర్త హత్య తాలుకు కేసులు బోలెడు… కానీ ఓ సినిమా కథలా ఉన్న ఈ కేసు ఇదే […]
గురూజీ గురూజీ అని నెత్తిన పెట్టుకుంటే… కుర్చీ మడతబెట్టి… కొట్టాడు..!!
‘గురూజీ గురూజీ అని నెత్తిన పెట్టుకుని మోశాం కదా… తనే కుర్చీ మడతపెట్టీ… –డురా’ … ఇదీ ఓ సగటు మహేశ్ బ్యాబు ఫ్యాన్ బాధ… నిజమే, మరీ ఈబాపతు సినిమా వదులుతారని ఎవరూ ఊహించలేదు… తనొక మాటల మాంత్రికుడట… మహేశ్ బాబుకు అత్తారింటికి దారేది, అల వైకుంఠపురంలో రేంజును మించి హిట్ ఇస్తాడని బోలెడంత ప్రచారం జరిగింది… తీరా చూస్తే ఢమాల్… ఇదే మహేశ్ బాబుతో ఇదే త్రివిక్రమ్ అతడు, ఖలేజా సినిమాలు చేశాడు.., జయాపజయాలు […]
సూపర్మాన్, స్పైడర్మాన్, బ్యాట్‌మాన్, ఐరన్మాన్… సూపర్ హనుమాన్…
ఈమధ్యకాలంలో అనేక కారణాలతో ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించిన సినిమా… హనుమాన్..! నిజానికి ఓ చిన్న సినిమా, చాలా చిన్న రేంజ్ హీరో… కానీ ఓ స్టార్ హీరో సినిమాకన్నా అధికంగా బజ్ ఏర్పడింది… దూకుడుగా బిజినెస్ జరిగింది… థియేటర్లలోకి వచ్చింది… బోలెడన్ని ప్రీమియర్ షోలు పడ్డాయి… సరే, ఇంతకీ పాసైందా..? అయ్యింది..!! హాలీవుడ్లో సూపర్మాన్, స్పైడర్మాన్, బ్యాట్‌మాన్, ఐరన్మాన్ వంటి బోలెడంత మంది సూపర్ నేచురల్ కేరక్టర్లు ‘మాన్లే’ గాకుండా… మానవాతీత, మాంత్రిక శక్తుల ఫిక్షన్లు […]
ఆ ‘ఫైర్’ నుంచి ఈ ‘కాతల్’ దాకా – A ’Progressive’ Journey…
భారతీయ సినీ దర్శకురాలు దీపా మెహతా 1996లో ‘ఫైర్’ అనే సినిమా తీశారు. ఎగువ మధ్యతరగతి ఇంట్లో ఇద్దరు తోడికోడళ్ళు. పెద్దామె భర్త ఆధ్యాత్మిక దారిలో పడి భార్యకు శారీరకంగా దూరంగా ఉంటున్నారు. రెండో ఆమె భర్త ప్రియురాలి మోహంలో మునిగి భార్యను పట్టించుకోవడం లేదు. ఇలాంటి స్థితిలో ఆ ఇద్దరు స్త్రీల మధ్య శారీరక సంబంధం మొదలైంది. కొన్నాళ్లకు ఆ సంగతి ఇంట్లో వారికి తెలిసింది. ఆ తర్వాత? 27 ఏళ్ల తర్వాత మలయాళంలో ‘కాతల్’ […]
ఆశ్చర్యపరుస్తున్న హనుమాన్ దూకుడు… పెద్దల మొహాలు మాడిపోవడమేనా…
రేపు విడుదల… సంక్రాంతి బరిలోకి పందెంకోళ్ల విడుదల… తన్నుకొండి… కానీ ఈరోజుకూ బయట నిర్మాతలు, బయర్లు, డిస్ట్రిబ్యూటర్లు తన్నుకుంటున్నారు… ఆగడం లేదు… ఈ సమస్య అంతా హనుమాన్ సినిమాతో వచ్చింది… వాళ్లు స్థిరంగా నిలబడటంతో, ఎవరికీ తలవంచక, తలెత్తుకుని నిలబడటంతో వచ్చింది… బెదిరింపులకు, ఒత్తిళ్లకు తలొగ్గకపోవడం వల్ల వచ్చింది… పెత్తనాలు, అహాలతో వచ్చింది… ఛస్, ఇదేదో చిన్న సినిమా, ఉఫ్ అని ఊదితే కొట్టుకుపోతుంది అనుకున్నారు, ఏళ్లుగా ఇండస్ట్రీలో వేళ్లు దిగిపోయినవాళ్లు… కానీ ఏం జరిగింది..? చిన్న […]
మీరేమనుకున్నా సరే.., మా బోయపాటికి సాటి ఎవరూ లేరు..! లేరు..!!
గొట్టిముక్కల కమలాకర్ ….. శంకరాభరణం సినిమా చివరలో శంకరశాస్త్రి “అంతరించిపోతున్న, కొడిగట్టిపోతున్న సంస్కృతీ సంప్రదాయాలను అడ్డంపడి ఆపుతున్న ఆ మహా మనీషి ఎవరో..?” అంటూ హాచ్చెర్యపోతాడు. ఆ మహామనీషి పాటివాడే మా బోయపాటి..! ** హీరోయిన్ తప్ప తను తీసిన ప్రతీసినిమాలో మహిళలు ఎంతో పద్ధతిగా వంటింట్లో కూడా పట్టుచీరలు కట్టుకుంటారు. ప్రతీకొంపలో కనీసం ఓ పాతిక మంది బిరబిరలాడుతూ తిరుగుతుంటారు. “సింహా” లో డాక్టరుగారు మర్డర్లు చేసొచ్చినా, ఇంట్లో భార్య ఏడువారాల నగల్ని దిగేసుకుని పప్పుచారు పెడుతుంది. […]
అప్పట్లో మహేశ్ రమ్యకృష్ణ రొమాంటిక్ స్టెప్పులు… ఇప్పుడు తల్లీకొడుకులు…
అరె, విన్నావా..? రమ్యకృష్ణ అప్పట్లో… అంటే 20 ఏళ్ల క్రితం ఇదే మహేశ్ బాబుతో ఐటమ్ సాంగ్ చేసి, ఓ ఊపు ఊపేసిందట, ఎవరో రాశారు అన్నాడు ఓ మిత్రుడు… మళ్లీ తనే అన్నాడు… ‘ఐనా ఏముందిలే..? మొదట్లో తన మనమరాలిగా నటించిన శ్రీదేవితో ఎన్టీయార్ తరువాత కాలంలో జతకట్టలేదా..? స్టెప్పులు వేయలేదా..?’ నిజమే కదా… మన సినిమాల్లో పురుష్ వయస్సు అలాగే స్థిరంగా యవ్వనంలోనే ఉండిపోతుంది… ము- కిందికి 70 ఏళ్లు వచ్చినా, వీపుకు బద్దలు […]
రేయ్, ఎవుర్రా మీరంతా..? ఇండస్ట్రీలో ఎవరినీ సుఖంగా ఉండనివ్వరా..?
నిన్నో, మొన్నో సింగర్ సునీత ఓ సోషల్ మీడియా పోస్టులో తన పెళ్లి ఫోటో పెట్టి, ఆ వివాహ క్షణాల్ని తలుచుకుని ఆనందపడింది… కొడుకును హీరోగా లాంచ్ చేసింది… బిడ్డను కూడా సింగర్ చేయాలని ప్రయత్నిస్తోంది… బాగుంది, లేటు వయస్సులో రెండో పెళ్లి మ్యాంగో రామ్‌తో… గుడ్, వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, సునీత పిల్లలు కూడా అమ్మ పెళ్లికి అతిథులయ్యారు… వాళ్ల బతుకులేవో వాళ్లు బతుకుతున్నారు కదా… ఓ వెబ్సైట్లో ఓ వార్త కనిపించింది… అదేమిటయ్యా అంటే… సోషల్ […]
ఆపరేషన్ తేజస్…! అయోధ్య రామజన్మభూమికీ కంగనా రనౌత్కూ లింక్…!!
ఈ స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడికో పోతుంది… పర్లేదు, వాట్సపులో, ఫేస్బుక్లో కొందరు రాసుకొచ్చారు… దేశమంతా ఇంటింటికీ రామజన్మభూమి అక్షింతలు పంచుతున్నారు కదా, బీఆర్ఎస్- కాంగ్రెస్ ఎలాగూ పార్టిసిపేట్ చేయవు, మరి బీజేపీ వాళ్లు కూడా పెద్ద హడావుడి చేయడం లేదేమిటి అని…! అసలు వచ్చే ఎన్నికల్లో ఫాయిదా కోసమే కదా అర్జెంటుగా రాముడి దర్శనానికి బాటలు వేస్తున్నది, మరి వాళ్లే వాడుకోవడం లేదేమిటి అని ఆ ప్రశ్నల సారాంశం… సింపుల్, బీజేపీ దీన్ని పార్టీ కార్యక్రమంలాగా […]
చివరకు చిన్నాచితకా పాత్రలకూ మన తెలుగు మెరిట్ అక్కరకు రాదా..?!
ఒక వార్త… సైంధవ్ సినిమాలో హీరో వెంకటేష్ తప్ప ఇంకెవరూ తెలుగు నటులు లేరట… మన మీద మనమే జాలిపడాల్సిన వార్త… మాట్లాడితే మన తెలుగు జాతి, మన తెలుగు వాళ్లం, మన నేల, మన ప్రజలు అని బోలెడు నీతులు ఉచ్చరిస్తూ… తెలుగు ప్రేక్షకుల జేబులే కొల్లగొడుతూ… మన ఖజానా నుంచే రాయితీలతో స్టూడియోలు కట్టుకుంటూ… చివరకు తమ సినిమాల్లో నాలుగు పాత్రలు తెలుగు నటీనటులకు ఇవ్వలేని దౌర్భాగ్యమా..? అంటేనేమో అన్నామంటారు… కన్నెర్ర చేస్తారు… తాటతీస్తామంటారు… […]
ఆ రెండూ మడతపెట్టి, మిక్సీలో దంచేశాడు కారం…! ఓహ్, ఇదేనా మరి కథ…?
నిన్నటి నుంచీ ఒకటే హడావుడి యూట్యూబ్ చానెళ్లలో, సైట్లలో… ఏమనీ అంటే… త్రివిక్రమ్ మళ్లీ దొరికిపోయాడు అని… గుంటూరుకారం సినిమా ట్రెయిలర్ చూడగానే… ‘మీరు మీ పెద్దబ్బాయిని అనాథలా వదిలేశారట. దానికి ఏమంటారు” అని రమ్యకృష్ణను ఓ రిపోర్టర్ అడగడంతోనే ఆ ట్రెయిలర్ స్టార్ట్… ఆ తరువాతే మహేశ్ బాబు ఎంట్రీ… అదుగో అక్కడ వెంటనే కొందరు పట్టేసుకున్నారు… హర్రె, ఇది మమ్ముట్టి నటించిన రాజమాణిక్యం సినిమా కథే అని కొందరు తేల్చేశారు… నో, నో, యద్దనపూడి […]
నయనతారకు టేస్ట్ లేదు.., ఆమె మొగుడికి సోయీ లేదు… భలే జంట బాసూ…
రెండు వార్తలు… ఒకటి నయనతార ప్రధానపాత్రలో నటించిన అన్నపూరణి సినిమాపై ఎఫ్ఐఆర్ నమోదైంది… ఆ సినిమాలో శ్రీరాముడిని కించపరిచారనీ, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని శివసేన మాజీ లీడర్ రమేశ్ సోలంకి కేసు పెట్టాడు… పైగా అది లవ్ జీహాద్‌ను ప్రోత్సహించేలా ఉందంటాడు ఆయన… నయనతారతోపాటు దర్శకనిర్మాతల్ని, సినిమా ప్రసారం చేస్తున్న నెట్‌ఫ్లిక్స్ మీద కేసు నడిపించాలని కోరాడు… తన వాదన ఎలా ఉందనేది పక్కన పెడితే… ఆ సినిమా క్లైమాక్స్ మాత్రం హిందూ సమాజం విమర్శలకు గురైంది… […]
- « Previous Page
- 1
- …
- 85
- 86
- 87
- 88
- 89
- …
- 110
- Next Page »



















