Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రష్మి గౌతమ్..! డిజిటల్ డిటాక్స్ మాత్రమే కాదు… ఇంకేదో బాధ..!!

July 22, 2025 by M S R

rashmi

. కాదేమో.., అందరూ రాస్తున్నట్టు… సోషల్ మీడియాకు కొన్నాళ్లు పూర్తిగా దూరంగా ఉండాలని టీవీ యాంకర్ రష్మి గౌతమ్ తీసుకున్న నిర్ణయం కేవలం డిజిటల్ డిటాక్స్ కాకపోవచ్చు… ఇంకేదో ఉంది… ఆమెకు తెలుగు టీవీ ప్రేక్షకుల్లో పాపులారిటీ ఎక్కువ… మరో పాపులర్ టీవీ స్టార్ సుడిగాలి సుధీర్‌ జోడీగా బోలెడు వార్తలు, స్కిట్లు పదేళ్లుగా వస్తున్నవే కాబట్టి… అందుకే అందరికీ ఆసక్తి దీనిపై… కేవలం ఆమె ఓ పోస్టు పెట్టింది… ‘‘వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కాస్త ఇబ్బందుల్లో ఉన్నాను… […]

ఓహ్ నీహారికా, మీదీ బెజవాడేనా..? గుడ్, తెలుగు తెరకు ఇద్దరు నీహారికలు..!!

July 20, 2025 by M S R

sudigali sudheer

. సుడిగాలి సుధీర్ ఆహా ఓటీటీలో హోస్ట్ చేసే సర్కార్ షో తెలుసు కదా… కాస్త పాపులర్ షోయే… ఈసారి రెండు ఎపిసోడ్ల ప్రోమోలు కలిపి ఒకే ప్రోమోగా రిలీజ్ చేసినట్టున్నారు… డబుల్ పంచ్… ష్, నిజం చెప్పాలంటే, ఆ ఒరిజినల్ షోకన్నా ప్రోమోలే ఆసక్తికరంగా ఉంటాయి సుమీ… ఈసారి ప్రోమోలో ఆసక్తికరంగా అనిపించిన వాటిల్లో… 1) ఎన్ఎం నీహారిక ఎంట్రీ… ఈమె తెలుసు కదా ఫేమస్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్… సూపర్ ఫ్లో ఉంటుంది ఇంగ్లిషులో… […]

జగన్‌కు ఏమాత్రం నచ్చదనేనా రోజా ఈటీవీని అవాయిడ్ చేస్తోంది..!?

July 20, 2025 by M S R

దీప్తి

. బ్లాక్ బస్టర్ బోనాలు అని జీతెలుగులో ఓ ప్రోగ్రామ్ చేశారట, ప్రోమో కనిపించింది… ఒక్కోచోట ఒక్కో తేదీలో బోనాలు చేస్తార్రా నాయనా..? బోనాలు ఫలానా తేదీన చేయాలనేమీ ఉండదు… తెలంగాణ కల్చర్ గురించి జీతెలుగు వంటి చానెళ్లకు ఏం తెలుసులే గానీ… బోనాలు అని పేరు పెట్టి, ఎప్పటిలాగే తమకు అలవాటైనట్టు నలుగురు సెలబ్రిటీ, చానెల్ ఆస్థాన నటీనటులను పిలిచి ఏదో ఫన్ షో క్రియేట్ చేస్తుంటారు కదా… ఇదీ అంతే… కాకపోతే ఈసారి జగద్ధాత్రి […]

1999 నాటి సినిమా… వందలసార్లు టీవీల్లో వేసినా అవే తోపు రేటింగ్స్…

July 18, 2025 by M S R

soundarya

. అప్పుడప్పుడూ బార్క్ రేటింగు లిస్టులను గెలకడం అలవాటు కదా… సరే, వాటి క్రెడిబులిటీ మీద ఎంత అపనమ్మకం ఉన్నా సరే… టీవీ ప్రోగ్రాములకు రేటింగులకు ఇప్పుడున్నది అదొక్కటే ప్రామాణికం కాబట్టి, చూస్తూ ఉంటాం… ఈ వారం రేటింగ్స్ చూస్తూ ఉంటే, హఠాత్తుగా ఓచోట కళ్లు పెద్దవైపోయి, దానివైపే చూస్తుండిపోయాయి… అసలు జెమిని టీవీ చూసేవాడే తక్కువ తెలుగు టీవీ ప్రేక్షకుల్లో… పేరుకు నాలుగు వినోద చానెళ్లలో ఒకటి అది… కానీ అయిదో ప్లేసులోనో ఉండి ఉంటుంది… […]

ఎంత ఎదిగితేనేం..? క్లోజ్ ఫ్రెండ్స్‌కు కూడా దూరమైందా రష్మిక..!?

July 18, 2025 by M S R

rashmika

. ప్రేరణ… కన్నడ, తెలుగు బిగ్‌బాస్ ఫేమ్… టీవీ నటి… కాస్త టెంపర్‌మెంట్ ఎక్కువే… మనసులో ఉన్నది కక్కేస్తుంది… పుట్టింది హైదరాబాదే, కానీ పెరిగింది, కెరీర్ మొదలుపెట్టిందీ కన్నడ… రష్మిక… పరిచయం అక్కర్లేదు… కన్నడం నుంచి మొదలై ఎక్కడికో వెళ్లిపోయింది… దేశంలోనే టాప్ రేటెడ్ యాక్ట్రెస్ ఇప్పుడు… ఈ ఇద్దరూ ఫ్రెండ్స్… కలిసి తిరిగేవాళ్లు అవకాశాల కోసం… ఒకేచోట ఉన్నారు కొన్నాళ్లు… డెస్టినీ అంటే ఇదే… ఈమె జస్ట్ ఈరోజుకూ టీవీ నటి మాత్రమే… ఆమె రేంజ్ […]

ఈ అల్లరి చిల్లర మెంటల్ పిల్ల నోటి నుంచి ఓ వైరాగ్యపు డైలాగ్..!!

July 11, 2025 by M S R

deepika

. మనుషులు పైకి కనిపిస్తున్నట్టుగా ఉండదు వాళ్ల అసలు తత్వం… భిన్నంగా ఉంటుంది… పైపైన అల్లరి చిల్లరగా, సరదాగా, ఏవో జోకులు వేస్తూ కనిపించే మనుషుల అసలు మెంటాలిటీ లోతుగా ఉండొచ్చు… ఆ ప్రోమో చూస్తే అలాగే అనిపించింది… ఏదో టీవీలో టీవీ నటి, జబర్దస్త్ కమెడియన్ వర్ష హోస్ట్ చేసే కిస్సిక్ టాక్స్ అనే షో తాలూకు ప్రోమో కనిపించింది… అలాంటివి చాలా చాలా చాట్ షోలు టీవీల్లో వస్తూనే ఉంటాయి… కానీ యథాలాపంగా చూస్తుంటే […]

ఈ పాదపూజల తంతులతో… ఏ కాలంలోకి తీసుకుపోతున్నారు సార్..?!

July 11, 2025 by M S R

etv

. ముందుగా ఈటీవీ జబర్దస్త్ టీఆర్పీ రేటింగ్స్ ఓసారి చెప్పుకుందాం… తాజా బార్క్ రేటింగుల్లో జస్ట్, 2.98… అదీ శుక్రవారం రేటింగ్స్… మిగతా టీవీలతో పోలిక వద్దు గానీ… ఆ ఈటీవీ షోలలోనే రాను రాను వెనుకబడిపోతోంది… కొత్తగా హోస్ట్ మానస్‌ను తెచ్చారు… డబుల్ డబుల్ అంటూ ఏవేవో ప్రయోగాలు చేశారు ఈమధ్య… అవేవీ ఫాఫం, టీఆర్పీలను ఏమాత్రం పైకి తోయడం లేదు… సరే, ఈ టీఆర్పీల గోల వదిలేస్తే… 12 ఏళ్లయిందట… భారీ (మెగా) సెలబ్రేషన్స్ […]

స్టార్ల చిన్ననాటి ముచ్చట్లు… జగపతిబాబు టాక్ షో ఆసక్తికరం…

July 3, 2025 by M S R

jagapatibabu

. వైజయంతి మూవీస్ వాళ్లు ఓ టీవీలో టాక్ షోకు ప్లాన్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది… అదీ జీతెలుగులో… ఆ చానెల్‌లో పెద్దగా ఇలాంటి షోలు కనిపించవు… జగపతిబాబు హోస్టుగా జయమ్ము నిశ్చయమ్మురా షో స్టార్ట్ చేస్తున్నట్టు ఓ ప్రోమో కనిపించింది… తన చిన్ననాటి ముచ్చట్లతో కూడిన ప్రోమో కొత్తగా బాగున్నట్టనిపించింది… తన లుక్కు, తన సీనియారిటీ షోకు ప్లస్ అవుతాయనే అనిపించింది… గతంలో కూడా వైజయంతి సిస్టర్స్ జయప్రదతో ఓ టాక్ షో నిర్వహించినట్టు గుర్తు… […]

ఫాఫం హైపర్ ఆది..! ఈటీవీ షోలో రోజురోజుకూ ఈ దిగజారుడేమిటో..!?

July 2, 2025 by M S R

priyanka jain

. హైపర్ ఆది… పదే పదే ఎందుకు నెగెటివిటీని మూటగట్టుకుంటాడో అర్థం కాదు… టీవీ షోల డైరెక్టర్లు చెబితే టెంప్టయి బోల్తా కొడతాడో, తన సొంత ‘విజ్ఞాన ప్రదర్శనో’ అర్థం కాదు… పరోక్ష బూతులు, బాడీ షేమింగులు ఎట్సెట్రా యథేచ్ఛగా దొర్లుతూ ఉంటాయి… తాజాగా ఓ ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రోమో… అందులోకి ప్రియాంక జైన్, ఆమె ప్రియుడో, కాబోయే భర్తో శివ వచ్చారు… ఆమె పాపులరే… అక్కడెక్కడో పిచ్చి రీల్ చేసి వివాదాల్లోకి […]

ఏడాదిలో 19 మూవీలు… ఆల్‌టైమ్ రికార్డు… ఆలీ భలే గుర్తుచేశాడు ఈమెను మళ్లీ…

June 28, 2025 by M S R

malashri

. మగ హీరోయిన్… యాక్షన్ హీరోయిన్… అని జనం ప్రేమగా పిలుచుకునే మాలాశ్రీని అకస్మాత్తుగా కొన్నాళ్ల క్రితం ఆలీ మళ్లీ గుర్తుచేశాడు… ఈటీవీలో తన ఆలీతో సరదాగా షోకు తీసుకొచ్చాడు… పలుసార్లు కొందరు అక్కరలేని వాళ్లను కూర్చోబెట్టి, మన మెదడు తినేవాడు గానీ కొన్నిసార్లు మనం మరిచిపోయిన పాత నటుల్ని హఠాత్తుగా మనముందుకు తీసుకొచ్చేవాడు, ముచ్చట్లు పెట్టేవాడు… పాత జ్ఞాపకాల్ని నెమరేసుకునేలా చేసేవాడు… అది మాత్రం మెచ్చుకోబుద్దేసేది… మాలాశ్రీ అనే పేరు వినగానే గుర్తొచ్చే పాట… ‘‘గజ్జె […]

వంటలే కదా, అదెంత పని… పెంట పెంట చేసేస్తారు ఈ జాతిరత్నాలు…

June 26, 2025 by M S R

star maa

. మన టీవీ నిర్మాతలు, చానెళ్ల క్రియేటివ్ టీమ్స్ దేన్నయినా కామెడీ చేయగలవు… అనగా ఏ సబ్జెక్టయినా సరే కామెడీ షోగా మార్చేయగలవు… కామెడీ ఉంటే పర్లేదు., కానీ కాస్త వినోదం సరే… కానీ మొత్తం ఏ సబ్జెక్టు షో అయినా సరే, నలుగురు టీవీ సెలబ్రిటీలను తీసుకొచ్చి, పిచ్చి పిచ్చి ఆటలు, మాటలు, చేష్టలతో కామెడీ చేసిపారేయడమే సమస్య… ఈటీవీలో ఢీ అనే డాన్స్ షోను సర్కస్ షోగా చేశారు… గతంలో ప్రదీప్, సుధీర్, రష్మి, […]

మానస్ పేలవం… రష్మి, సుధీర్ కళకళ… సుమ, ప్రదీప్ డౌన్ ఫాల్…

June 22, 2025 by M S R

manas

. జబర్దస్త్ రేటింగ్స్ ఇంకా ఇంకా పడిపోతుండటంతో… ఏవో మార్పులు పేరిట, డబుల్ కామెడీ, డబుల్ వినోదం అంటూ ప్రచారం చేశారు… చివరకు డబుల్ యాంకర్స్ అనీ అన్నారు… ఆల్రెడీ డబుల్ జడ్జిలు కాదు, నలుగురిని చేయలేదు, సంతోషం… ఐతే సుడిగాలి సుధీర్ రేంజులో ఎంట్రీ ఇచ్చిన మానస్ యాంకరింగ్ అంతగా ఆకట్టుకోలేదు… మరీ రష్మి పక్కన పేలవంగా తేలిపోయాడు… అఫ్‌కోర్స్, యాంకరింగ్ కొత్త కదా, క్రమేపీ అలవాటవుతాడేమో గానీ ప్రస్తుతానికి వెలవెలే… యాంకర్ల నడుమ పోటీ […]

ఈటీవీలో అంతటి బాపుకే తప్పలేదు అవమానాలు… నిషేధాలు..!!

June 19, 2025 by M S R

bapu

. అసలు టీవీ, మీడియా, సినిమా ఇండస్ట్రీలే అంత… ఏ పెద్ద తలకాయకు ఎప్పుడు కోపమొస్తుందో తెలియదు, ఎవడు ఏం మోస్తాడో, ఎవరేం నమ్ముతారో, ఎవరికి గేట్ చూపిస్తారో అర్థం కాదు… కొమ్మల దాకా ఎక్కించీ ఎక్కించీ చటాలున మొదలునే నరికేస్తారు… ఈటీవీ కూడా అంతే కదా… దాన్ని మొదట్లో రామోజీరావు చిన్నకొడుకు సుమన్ చూస్తుండేవాడు… తను స్వతహాగా కొన్ని సీరియళ్లు రాసేవాడు, నటించేవాడు, డైరెక్షన్… తెలుగు ప్రేక్షకులు పూర్వజన్మలో చేసుకున్న అతి భారీ మహా సుక‌ృతం… […]

హహహ… ప్రోమో చూస్తేనే నవ్వొచ్చింది… భలే కామెడీ ప్రోమో బాసూ…

June 16, 2025 by M S R

etv

. ఈటీవీ వాడు ఆశించినట్టు కామెడీయే… మల్లెమాల వాడు ఆశించినట్టు డబుల్ కామెడీయే… నవ్వొచ్చింది… ఎందుకంటే..? ఆ రెండు సంస్థ ప్లాగ్ షిప్ ప్రోగ్రాం కదా ఆ బూతు, నీచాభిరుచి జబర్దస్త్ కామెడీ షో… ఆ షో తాలూకు తాజా ప్రోమో చూస్తే నవ్వొచ్చింది… హదేమిటో ఫాఫం, షో చూస్తుంటే నవ్వు రావడం లేదు, స్టిల్ వెగటుగానే అనిపిస్తోంది, కానీ ఈ ప్రోమో చూస్తే నవ్వొచ్చింది… ఈమధ్య ఓ ఎఐ ప్రోగ్రాం వచ్చింది కదా… ఏదో ఒక […]

పుష్ప2 బ్యాటింగుతో బుల్లితెర పగిలిపోయింది… ఆల్ టైమ్ హై రేటింగ్స్…

June 15, 2025 by M S R

pushpa2

. స్మగ్లర్ పుష్పరాజ్ హిందీ బుల్లితెరపై విధ్వంసమే క్రియేట్ చేశాడు… అంటే వీక్షణాల్లో…! పెద్ద తెరపై 1800 కోట్ల వసూళ్లు అనే వార్తలు చదివాం కదా… సరే, ఆ లెక్కల్లో కొన్ని మాయలు, అతిశయోక్తులు కూడా ఉన్నాయేమో గానీ స్థూలంగా మొత్తం హిందీ సినిమా పరిశ్రమ కూడా షాక్‌తో చూస్తుండిపోయింది పుష్ప గారి వసూళ్ల వీరంగం చూసి… అది మాత్రం నిజం… తాజాగా బుల్లి తెర మీద కూడా అంతే… ఇప్పటిదాకా టీవీ రేటింగుల్లో తోపు రికార్డులు […]

ఆహా… ఏం తెలివి..? ఆటో-పే సబ్‌స్క్రిప్షన్ తిర‘కాసులు’…!!

June 8, 2025 by M S R

aha

. సరే, యాడ్స్‌తో చంపేస్తున్నాడు కదా… ఒకే మొబైల్‌కు నెలకో, రెండు నెలలకో సబ్‌స్క్రయిబ్ చేసుకుందామని వెతికితే… ఆ స్కీం లేదట, కనిపించలేదు… (ఆమధ్య ఎప్పుడో సింగిల్ మొబైల్‌కు 99 అన్నాడు, తీరా క్లిక్కితే 149 కనిపించింది… ఇప్పుడది లేనట్టుంది…) జస్ట్, నెలకు 67తో స్టార్ట్ చేయండి, 3 నెలలకు ఒకేసారి కట్టండి అని కనిపించింది… పర్లేదు, 3 నెలలకు 200 లోపే కదా అని క్లిక్ చేస్తే బాటా రేటు 249 కనిపించింది… అంతేనా గోల్డ్ […]

ఇండియాలోకెల్లా హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ టీవీ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?!

June 6, 2025 by M S R

tejaswi

. మన తెలుగులో ఆ కార్తీకదీపాన్ని మన ఆడ లేడీస్ నెత్తిన పెట్టుకుని చూస్తుంటారు కదా… మరి జాతీయ స్థాయిలో ఎక్కువ రీచ్, ఎక్కువ జనాదరణ ఉన్న టీవీ సీరియల్ ఏది..? ఆఫ్ కోర్స్, మరీ నార్త్ ఇండియా, అంటే హిందీ బెల్టులో మన తెలుగుకన్నా నాసిరకం సీరియల్స్ కూడా చెలామణీ అయిపోతుంటయ్… సరే, సగటు ఇండియన్ టీవీ సీరియల్ అంటేనే ఒకేరకం… పైగా పలు భాషల్లో చానెళ్లు ఉన్న స్టార్, జీ చానెళ్లు ఆ భాష […]

తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!

June 6, 2025 by M S R

barc

. ఓ మిత్రుడి డౌటనుమానం ఏమిటంటే… ‘‘ఆయా పార్టీల న్యూస్ చానెళ్ల రేటింగ్స్ మెరుగుదల, పతనం కూడా ఆయా పార్టీల పట్ల ప్రస్తుత ప్రజాదరణ స్థాయిని రిఫ్లెక్ట్ చేస్తాయా..?’’ తాజా బార్క్ రేటింగ్స్‌లో రెండు ఉదాహరణల్ని చూపించాడు… ఒకప్పుడు ప్రజాదరణలో కాస్త మంచి స్థితే కనిపించిన కేసీయార్ న్యూస్ చానెల్ టీన్యూస్ ప్రస్తుతం 13వ స్థానంలో ఉంది… మరీ నడుస్తుందో లేదో వాళ్లకే తెలియని ఈటీవీ తెలంగాణ, ఐన్యూస్‌కన్నా దిగువన..!! అదే చంద్రబాబు క్యాంపుగానే పరిగణించబడే ఏబీఎన్ […]

ఆ పాటల షోలో ఇంకా ఆ ప్రవస్తి పాడుతూనే ఉంది ఫాఫం…

June 5, 2025 by M S R

etv

. గత ఏప్రిల్ 20, 21 తారీఖుల్లో కదా వర్దమాన గాయని ప్రవస్తి తను పార్టిసిపేట్ చేసిన పాడుతా తీయగా కార్యక్రమం మీద ఆరోపణలు చేసింది..? సింగర్ సునీత సహా, చంద్రబోస్, కీరవాణిని విమర్శించింది… అంతేకాదు, బాడీ షేమింగు, అసభ్యకరమైన డ్రెస్సుల గురించి ఆ కార్యక్రమ నిర్మాతలు జ్ఞాపిక ఎంటర్‌టెయిన్‌మెంట్ వాళ్లనూ బజారుకు లాగింది… పాటల పోటీల్లో ఎలిమినేషన్లు ఉంటాయి, అవి జడ్జిలు వేసే మార్కులు, ఆ కార్యక్రమం నిర్మాతల ఇష్టం… దాన్ని ప్రశ్నించడానికి ఏమీ ఉండదు… […]

రవితేజ సినిమా అయితేనేం… సూపర్ ఫ్లాప్, చివరకు టీవీల్లో కూడా…

May 16, 2025 by M S R

eagle review

. ఈగల్ అని ఓ సినిమా వచ్చింది గుర్తుందా..? గుర్తుండకపోవచ్చు… అలా వచ్చి, ఇలా వెళ్లిపోయింది… సో వాట్… రవితేజ ఉంటేనేం, అనుపమ పరమేశ్వరన్ రొమాన్స్ చేస్తేనేం… పైగా కావ్య థాపర్, వల్గర్ నవదీప్, అవసరాల శ్రీనివాస్… ఎవరుంటేనేం… కథలో దమ్మేదీ..? అదో రవితేజ మోనాటనస్ యాక్షన్, డైలాగ్ డిక్షన్… చూసీ చూసీ బోర్ కొట్టలేదా..? కొట్టింది… అందుకే ఫ్లాపయింది… కాలంతోపాటు మన హీరోలు మారరు, అదీ వాళ్ల దురదృష్టం… కాదు, సగటు తెలుగు ప్రేక్షకుడి దురదృష్టం… […]

  • 1
  • 2
  • 3
  • …
  • 27
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • సీఎం చెబుతున్నట్టు ఫోన్‌ట్యాపింగ్ చట్టబద్ధమే… కానీ షరతులు వర్తిస్తాయి..!!
  • భార్యల చేతుల్లో భర్తలు రప్పారప్పా… మరో కలవరం వార్త ఏంటంటే..?!
  • నా రంగు నలుపే… సో వాట్..? ఆమె పోస్టుపై ఇప్పటికీ ప్రకంపనలు..!!
  • హరిహర వీరమల్లు..! వెండి తెరపై పవన్ కల్యాణ్ జెండా రెపరెపలు..!!
  • Saiyaara …! ఈ కొత్త ప్రేమకథ ఎందుకు యువతను ఏడిపిస్తోంది..?!
  • పిచ్చి లేచిపోతున్నారు… కల్తీ కల్లు దొరక్క… ఎర్రగడ్డ బాటలో పడి…!!
  • ఎయిర్ ఇండియా బోయింగ్ ప్రమాదంపై సవివర సాంకేతిక విశ్లేషణ 2
  • ఎయిర్ ఇండియా బోయింగ్ ప్రమాదం సవివర సాంకేతిక విశ్లేషణ -1
  • ఫాఫం సాక్షి..! అస్త్రాలు దొరుకుతున్నా ఏదో అంతుపట్టని అలసత్వం..!!
  • తెరపైకి హఠాత్తుగా బాబు, కేసీఆర్, పురంధేశ్వరి, రేవంత్‌రెడ్డి పేర్లు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions