హైదరాబాద్ లో నేనొక న్యూస్ ఛానెల్ హెడ్ గా పనిచేస్తున్న రోజుల్లో మా అనంతపురం జిల్లా నుండి ఒక యాడ్ ఏజెన్సీ మిత్రుడు వచ్చాడు. అనంతపురం నుండి హిందూపురం వెళ్లేదారిలో కొత్తగా పుట్టుకొచ్చి…ఒక వెలుగు వెలుగుతున్న యువ బాబాగారు భారీ ఎత్తున ప్రకటనలివ్వడానికి సిద్ధంగా ఉన్నారని…నేనొకసారి వారిని దర్శించుకుంటే ఛానెల్ కు యాడ్స్ కట్టలు తెగినట్లు ప్రవహిస్తాయని చెప్పాడు. యాజమాన్యానికి విషయం చెబితే ఎగిరి గంతేసి…వెంటనే నన్ను బయలుదేరమన్నారు. నాతోపాటు యాడ్ ఏజెన్సీ మిత్రుడు కూడా వచ్చాడు. […]
డ్రెస్ సెన్స్..! ఆమ్రపాలి వస్త్రధారణపై మళ్లీ సోషల్ మీడియా విమర్శలు..!!
ఆమె హఠాత్తుగా తనిఖీకి వెళ్లింది… అవున్లెండి, తనిఖీలంటేనే చెప్పి వెళ్లరు కదా… గుడ్… పేరు ఆమ్రపాలి… సరే, ఆమ్రపాలిరెడ్డి… హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మాత్రమే కాదు, మొత్తం ఐదు పోస్టుల్లో ఆమె అధికారిణి… బాగా యాక్టివ్… ఎనర్జిటిక్… కొన్నాళ్లు ప్రధాని కార్యాలయంలో పనిచేసి, రీసెంటుగా తెలంగాణకు వచ్చేసి, మంచి పోస్టుల్లో చేరింది… అదంతా వోకే… కావాలని యాంటీ కాంగ్రెస్, ప్రొ బీఆర్ఎస్ గ్రూపులు ఆమె పేరు చివర రెడ్డి అని యాడ్ చేస్తున్నారు, ఆమె కులాన్ని […]
ఓ కోమటాయన పత్రికలో ఈ అజాతశత్రు గురించి నెగెటివ్ ప్లాంటెడ్ స్టోరీ..!!
ఆయనో రాజకీయ విశ్వవిద్యాలయం . ఊరకూరకనే ఆయాసపడే ఈతరం రాజకీయ నాయకులు రోశయ్య గారి సంయమనం , క్రమశిక్షణ వంటి ఎన్నో మంచి లక్షణాలను అధ్యయనం చేయాలి , నేర్చుకోవాలి . ఈరోజు ఆయన జయంతి . వారికి నివాళులను అర్పిస్తూ , ఓ సంఘటనను మిత్రులతో పంచుకుంటా … 1978 లో అనూహ్యంగా ఇందిరా కాంగ్రెస్ ఆం.ప్ర లో గెలిచింది . చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి . శాసనమండలిలో రోశయ్య గారు చెన్నారెడ్డి గారికి చుక్కలు […]
పీటలు- పీఠాలు… కర్నాటక రాజకీయం అంటేనే స్వాములు, జోక్యాలు…
ముఖ్యమంత్రి మార్పుకోసం సన్యాసుల పోరాటం “కౌపీన సంరక్షణార్థం” అని బాగా వాడుకలో ఉన్న సంస్కృతం సామెత. అందరికీ తెలిసిందే అయినా- గోచిగుడ్డ నుండి మొదలై… అంతులేని మహా సంసార ప్రయాణం దాకా సాగుతూనే ఉన్న ఆ కథ మళ్లీ మళ్లీ తెలుసుకోదగ్గదే. ఒకానొక ఊరు. పంటపొలాలతో, ధన ధాన్యాలతో పచ్చగా, హాయిగా ఉంది. ఊరిని ఆనుకుని ఊరికి కొండగుర్తుగా ఒక కొండ. ఆ కొండ మీద ఒక శిథిలాలయ మంటపం. ఎక్కడ నుండి, ఎప్పుడొచ్చాడో తెలియదు కానీ… […]
కోదండరాంను నైతికంగా కార్నర్ చేస్తున్న దాసోజు శ్రావణ్..!!
అఫ్ కోర్స్… దాసోజు శ్రావణ్ కోదంరాం పట్ల వాడిన భాష నచ్చలేదు… ఒకవైపు మీ నాయకత్వంలోనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను, ఏనాటి నుంచో మీ ఫాలోయర్ని అని చెబుతూనే తూలనాడటం సరైందిగా అనిపించలేదు… కానీ శ్రావణ్ పోరాటంలో న్యాయం ఉంది… తన ఆవేదనలో అర్థముంది… దక్కాల్సిన పోస్టు దక్కడం లేదే అనే ఆక్రోశం ఉంది… కానీ… రాజకీయాల్లో ఉద్వేగాలకు తావు లేదు… రాజకీయాలంటేనే క్రూరం… అది జేసీబీలాగా తొక్కేసుకుంటూ పోతుంది… తన, పర అని చూడదు… అది […]
మోడీ వోట్లపై వింత లెక్కలు, విచిత్ర విశ్లేషణలు… తిక్క బాష్యాలు..!!
ఎహె, మోడీకి వచ్చినవి ఆఫ్టరాల్ 6 శాతం వోట్లు అని కొన్ని వార్తలు కనిపించాయి… అరె, 36.56 శాతం కదా, ఇదేమిటి 6 శాతం అని రాసేస్తున్నారు ఏమిటా అని చూస్తే… అవి మొత్తం జనాభాలో బీజేపీకి పడిన వోట్ల శాతం అట… వారెవ్వా… మోడీ మీద వ్యతిరేక వార్తలు రాయాలనుకుంటే రాయండి గానీ మరీ ఇలాంటి బాష్యాలు ఏమిటో అర్థం కాదు… మోడీలు వస్తుంటారు, పోతుంటారు… ఎవరూ శాశ్వతం కాదు, గెలుపోటములు కూడా వస్తుంటాయి, పోతుంటాయి… […]
రామరావణ యుద్ధం సీత కోసం కాదు… ఆ రావణుడి వ్యూహమే వేరు…
పది తలల రావణాసురుడు అంటే 6 శాస్త్రాలు, 4 వేదాలు చదివిన అత్యంత జ్ఞానం కలిగిన వ్యక్తి అని అర్ధం. ఎక్కువ మంది రామాయణం కుటుంబానికి సంబంధించినది అని, భారతం యుద్ధానికి సంబంధించినది అని చూస్తారు. కానీ రామాయణం పూర్తిగా అర్ధం చేసుకుంటే సన్ ట్జూ రాచిన “ది ఆర్ట్ ఆఫ్ వార్” కూడా ఎందుకూ పనికి రాదు. అత్యంత శ్రేష్టమైన యుద్ద వ్యూహాలు రామాయణం లో కూడా గమనించవచ్చు. రావణాసురుడికి 6 గురు తమ్ముళ్లు, ఇద్దరు […]
అందుకే తను అంబానీ..! 50 జంటలకు పెళ్లిళ్లలతో భారీ దిష్టితీత..!!
చిన్న వార్తే అంటారా..? వోకే… అబ్బే, సముద్రంలో కాకి రెట్ట అంటారా..? వోకే… కొడుకు పెళ్లి భారీ ఖర్చును మన మీద రుద్దేందుకు జియో టారిఫులు పెంచాడు తెలుసా అంటారా..? వోకే… అంత వరల్డ్ టాప్ టెన్ రిచ్చు… సొసైటీకి ఏమిచ్చాడు అంటారా..? వోకే… ఏం చెప్పినా సరే, ఎంత చిన్న ఔదార్యమైనా సరే, స్వాగతిద్దాం… అంతకుమించి మనం అడిగినా ఆయనేమీ చేయడు, పక్కా వ్యాపారి, పక్కా గుజరాతీ వ్యాపారి… కొన్ని ఫోటోలు, ఆ వార్త చూశాక […]
కప్పు పట్టుకుని మురిసిపోయే ఈ వ్యక్తి కథ ఓసారి చదవాలి తప్పకుండా..!!
టీ20 వరల్డ్ కప్ గెలిచాం… సరే, మన క్రికెటర్లను వేనోళ్ల పొగిడాం… జైషా అయితే ఏకంగా 125 కోట్ల నజరానా ప్రకటించాడు… దేశం మొత్తం కీర్తిస్తోంది… రోహిత్, కోహ్లి, బుమ్రా, సూర్యకుమార్, పాండ్యా, అక్సర్ …. పేరుపేరునా ప్రశంసిస్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం… ఈ గెలుపు వెనుక ఇంకెవరైనా తెర వెనుక వ్యక్తులు ఉన్నారా..? రాహుల్ ద్రావిడ్ గాకుండా… ఉన్నాడు… తన గురించి చెప్పుకుంటేనే ఈ ప్రపంచ కప్ గెలుపు చరిత్ర చెప్పుకున్నట్టు… లేకపోతే అసంపూర్ణం… 21 రూపాయలతో […]
పాత బ్రిటిష్ చట్ట భాషకు స్వస్తి… ఇక ‘భారతీయ’ న్యాయ చట్టాలు…
‘భారతీయ’ భాషాస్మృతి ఇండియన్ పీనల్ కోడ్- ఐ.పి.సి. ఇకపై భారతీయ న్యాయ సంహిత. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్- సి.ఆర్.పి.సి. ఇకపై భారతీయ నాగరిక్ సురక్షా సంహిత. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇకపై భారతీయ సాక్ష్య అధినియం. పోలీసు భాష ప్రపంచంలో లిపి ఉన్నవి, లిపి లేనివి ఎన్ని భాషలయినా ఉండవచ్చుగాక. “ఆల్ యువర్ లాంగ్వేజెస్ విల్ ఎండ్ వేర్ మై లాఠీ బిగిన్స్” అని ఒక అలిఖిత పోలీసు దుడ్డు కర్ర భాష ఉంది కాబట్టి సకల […]
‘ఆమెను చూస్తే మా అమ్మ గుర్తొచ్చింది… ఈ నాలుగు మాత్రలు చాలు…’
విజయవాడ గాంధీ నగర్లో శాంతి సినిమా హాల్ పక్కనే ఓ చిన్న క్లినిక్ ఉండేది . రెండే రెండు గదులు . ముందు చిన్న వరండా..వెనుక డాక్టర్ గారి గది . డాక్టర్ పేరు కృష్ణ . తీసుకునే ఫీజు 30 రూపాయలు నో టెస్టులు . మందులు కూడా రెండో మూడో రకాలు రాసేవారు . అవి కూడా ఆయన దగ్గరే దొరికేవి . మొత్తం ఓ రెండొందల్లో అయిపోయేది . దీనికన్నా ముందు రోగి […]
Iam Sorry To Say… సర్, అసలు ఇవి కానేకావు మన మూలాలు…!
ఐయాంసారీటుసే… ఎవరైనా పుస్తకం రాస్తే ఎలా ఉండాలి! నలుగురికీ చెప్తున్నారంటే, ఏం పాటించాలి? నిష్పాక్షికత, పారదర్శకతలు ప్రామాణికంగా దాని ముగింపులో ఒక సమగ్రత, విస్తృతత్వం ఉండాలి! అంతేకానీ, రచయితే ఓ అభిప్రాయానికి ఫిక్సై ఇతరులను అందుకు ఒప్పించే ప్రయత్నంలా ఉండకూడదు! కల్లూరి భాస్కరం గారి ఇవీమనమూలాలు పుస్తకం చదివాను! కాలగర్భంలోకి మనం ఎంత లోతుకు వెళ్లగలం అని మొదలుపెడుతూ జెనెటిక్స్, జీనియాలజీ, లింగ్విస్టిక్స్ ఆధారిత పరిశోధనలను ఏకరువు పెడుతూ, ఈనాటికి 3500 ల ఏళ్ల క్రితం జరిగిందనే […]
ఇద్దరు పెళ్లాలు మూడో పెళ్లి చేయించారు సరే… కానీ ఆమోదనీయమేనా..?!
వాట్సప్ వార్తల గ్రూపుల్లో కనిపించింది ఈ వార్త… ముందుగా ఈ వార్త చదవండి… ‘‘హ్యాట్రిక్ హీరో.. ముచ్చటగా మూడో పెళ్లి..! శుభ లేఖలు పంచి.. దగ్గరుండి మూడవ పెళ్లి జరిపించిన మొదటి భార్య & రెండో భార్య..!! అల్లూరి జిల్లా ఏజెన్సీలోని పెదబయలు మండలం గుల్లెలు పంచాయితీ కించూరు గ్రామం. అక్కడ సాగేని పండన్న.. పార్వతమ్మ ను తొలుత వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు అప్పలమ్మను కూడా మొదటి భార్య అంగీకారంతో పెళ్లాడాడు.. అలా ఇద్దరు భార్యలతో […]
విజయ్ దేవరకొండ తన యాస ఎందుకు మార్చుకోవాలి అసలు..?!
తెలంగాణ వాళ్లం.. మేం అంత Uncultured ఆ..? హీరో విజయ్ దేవరకొండని తన యాస మార్చుకొమ్మని ఓ వీడియో చేశారని చెబుతూ, ఆ వీడియోను ఖండిస్తూ ఓ మిత్రుడు ఒక పోస్ట్ రాశారు. ఆ వీడియో చేసినవాళ్లు కొన్ని సినిమాలకు ఆ యాస సరికాదని అన్నారా? లేక పూర్తిగా ఆ యాసను వదిలేయమని ఉచిత సలహా ఇచ్చారా అనేది తెలియదు. కొన్ని సినిమాలకు ఆ యాస కరెక్ట్ కాదని నేనూ ఒప్పుకుంటాను. ఒక యాక్టర్ అన్ని పాత్రల్లో […]
విస్కీ మార్కెట్కు కిక్కిచ్చే వార్త… లిక్కర్ హేటర్స్ కూడా చదవొచ్చు…
Amrut Distilleries from Bengaluru wins “World’s Best Whiskey” title at 2024 International Spirits Challenge in London…. అని ఓ వార్త కనిపించింది పొద్దున్నే… లండన్లో జరిగిన ఇంటర్నేషనల్ స్పిరిట్స్ చాలెంజ్ పోటీలో వరల్డ్ బెస్ట్ విస్కీ అవార్డు కొట్టేసిందట… సరే, మంచిదే… రకరకాల పోటీలు జరుగుతూ ఉంటాయి, జరిపిస్తూ ఉండాలి, అదే స్పిరిట్ అంటే… ఎందుకంటే..? ప్రచారం కోసం, మార్కెటింగ్ కోసం ఏదో ఒకటి చెప్పుకోవడానికి ఉండాలి కదా… అప్పట్లో దట్టమైన […]
ఇక్కడా ఓ అర్జునుడు… తోడుగా ఓ కర్ణుడు… కానీ అశ్వత్థామ లేడు…
ఒక పాత్ర కర్ణుడు… అలియాస్ కరణ్… మరో పాత్ర అర్జునుడు… అలియాస్ అర్జున్… ఇవి రెండూ ప్రధాన పాత్రలు… అన్నదమ్ములే…. అరెరె, ఆగండి అక్కడే… కల్కి గురించి కాదు, ట్రోలింగ్ ఇక్కడా స్టార్ట్ చేయకండి… ఆ సినిమా వేరు, అందులో కర్ణుడు ప్రభాస్, అర్జునుడు విజయ్ దేవరకొండ… రెండురోజులుగా ట్రోల్ తీస్తున్నారు… కానీ ఇక్కడ చెప్పుకునేది కల్కి కాదు, అసలు ఇది సినిమాయే కాదు… హాట్స్టార్లో వస్తున్న వెబ్ సీరీస్… ఇందులో అశ్వత్థామ పాత్రే లేదు… వోకేనా…! […]
లీకుల కాలంలో… ఈ అగ్ని పరీక్షల్లో అందరూ పరాజిత పరీక్షిత్తులే…
లీకు పరీక్షల కాలంలో అందరూ పరాజిత పరీక్షిత్తులే! అగ్ని పరీక్ష అప్పుడు సీతమ్మకు ఒకసారే అగ్నిపరీక్ష. ఇప్పుడు చదువుకునే పిల్లలకు రోజూ అగ్ని పరీక్షలే. వారి తల్లిదండ్రులకు ప్రతిక్షణం విషమ పరీక్షలే. సహన పరీక్షకు పరీక్ష వెయ్యి ఉద్యోగాలకు పది లక్షల మంది పోటీపడే నోటిఫికేషన్ల కోసం పడిగాపులు పడడం సహన పరీక్షకు పరీక్ష. స్వీయ పరీక్ష అప్పులు చేసి కోచింగులకు వెళ్లడం; నిద్రాహారాలు మాని దీక్షగా చదవడం మనకు మనమే పెట్టుకునే స్వీయ పరీక్ష. శల్య […]
సింఫనీ..! ఇండియన్ ఐడల్ తెలుగు షోకు అదనపు భారీ ఆకర్షణ..!
సింగర్ గీతామాధురి చెప్పినట్టు… తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-3 పాటల పోటీలో పాల్గొనేవాళ్లు అదృష్టవంతులు… ఎందుకు..? ఏదో ఓ చిన్న ఆర్కెస్ట్రా సాయంతో తమ ప్రతిభను ప్రదర్శించుకునే చాన్స్ గాకుండా… ఓ సింఫనీ, చాలా వాయిద్యాల సహకారంతో గ్రాండ్గా తమ పాటను శ్రోతలకు పరిచయం చేసుకునే అవకాశం దక్కడం..! ఆడిషన్ రౌండ్స్ పక్కన పెడితే ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగులో ఉన్న గ్రాండ్ గాలా రౌండ్ సినిమా సంగీత ప్రియుల చెవుల తుప్పు వదిలించింది… చెన్నై ఆర్కెస్ట్రా… […]
కల్కి..! మొత్తానికి నాగ్ అశ్విన్ మహాభారతం మీదకు దృష్టి మళ్లించాడు..!
చాన్నాళ్లయింది ఒక సినిమా మీద సోషల్ మీడియా ఇంతగా చర్చకు పెట్టడం..! అమితాబ్, నాగ్ అశ్విన్ సినిమా కల్కి మీద సోషల్ మీడియా పోస్టుల్లో రకరకాల విశ్లేషణలు, అభిప్రాయాలు, విమర్శలు, ప్రశంసలు హోరెత్తిపోతున్నాయి… కల్కి సినిమా ఓ మంచి పని చేసింది… ఏకంగా ప్రజెంట్ జనరేషన్ నడుమ మహాభారతం మీద డిబేట్ రన్ చేస్తోంది… అశ్వత్థామ శాపం, తలపై మణి దాకా అనేక అంశాలు జనం చర్చిస్తున్నారు… మరీ ప్రత్యేకించి కర్ణుడి కేరక్టర్ మీద అందరి దృష్టీ […]
ఆధిపత్యం వస్తేనే ఇలా దంచితే… ఇక Jio మోనోపలీ వస్తే ఏమిటో..?!
రిలయన్స్ జియో టారిఫ్స్ 12.5% – 25% వరకూ పెరిగాయట. దీంతో ముఖేష్ అంబానీ వాళ్ళబ్బాయి పెళ్లి ఖర్చులు మొత్తం మన నెత్తినే రుద్దుతున్నట్టున్నాడు అని వాపోతున్నారు జనాలు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. జియో కొత్తగా మార్కెట్లోకి వచ్చినప్పుడు ఉచిత టారిఫ్, అన్ లిమిటెడ్ కాల్స్, డేటా ఆఫర్లు ఇచ్చినపుడు ఇదే జనాలు అప్పటివరకు వాడుతున్న నెట్వర్క్స్ వదిలి జియోకి బదిలీ అయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీకి టెలికాం రంగం మీద […]
- « Previous Page
- 1
- …
- 29
- 30
- 31
- 32
- 33
- …
- 118
- Next Page »