ముళ్లపూడి వారి అక్షర మల్లెపూలు… … ఇవాళ మన ముళ్లపూడి వెంకటరమణ గారి జయంతి. ఈ సందర్భంగా ఆయన్ని నిర్మించుకుంటూ సినిమాల్లో ఆయన డైలాగులు కొన్ని.. (‘ముత్యాలముగ్గు’ సినిమాలో సంగీత..) “కన్నెపిల్ల మనసు అద్దంలా ఉంటుందట. అందులో తాళి కట్టే వాడి బొమ్మ పడగానే అది పటంగా మారిపోతుంది. అని మా బాబాయి గారు చెప్పేవారు” – – – (‘గోరంత దీపం’ సినిమాలో వాణిశ్రీ, శ్రీధర్.. ) “ఎంత హాయిగా ఉంది! ఆ ఇంటికీ ఇక్కడికీ […]
ఒకే దిండుపై నిద్రించిన మన రెండు తలలు… ఉత్తర దక్షిణ ధృవాలు!
అర్ధరాత్రి చీకటి ఆ శ్మశానాన్న్ని పరదాలా కప్పేసి౦ది. సమాధుల మధ్య నుంచి వీచే గాలి వెదురు బొంగుల్లో చేరి ఈలగా మారి, కీచురాళ్ళ లయకి పాటగా నాట్యం చేస్తోంది! దూరంగా కుక్క ఏడుస్తోంది. కాటికాపరి లేడు. అతడికి భయం వేయలేదు. అతడే ఒక ప్రేతంలా ఉన్నాడు. మాధవిని దహనం చేసిందని ఇక్కడే అని అతడికి శర్మ చెప్పాడు. అతడు లోపలికి ప్రవేశించాడు. పాతిక సంవత్సరాలు కలిసి పెరిగి తనతో పాటు పది సంవత్సరాలు కాపురం చేసిన మాధవి […]
టోల్ తీస్తున్నారు… ఆ రోడ్లెక్కితే చాలు పర్సులకు కత్తెర్లు ఖాయం…
హిందూ సనాతన ధర్మం మూల స్తంభం- పునర్జన్మ. ఆ స్తంభంలో సిమెంటు, ఇనుము, ఇసుక, ఇటుక, కంకరలు- పాప పుణ్యాలు. పొరపాటున ఇది ఆధ్యాత్మిక- వేదాంత ప్రస్తావన అనుకుని చదవడం ఆపకండి. ఇది టోల్ గేట్లలో మన తోలు వలిచే ఫాస్ట్ ట్యాగ్ గురించి. వేదంలో నిజానికి ఎంత వెతికినా ఫాస్ట్ ట్యాగ్ కనిపించదు. వేదంలో అన్నీ ఉన్నాయిష…అని ఎగతాళి చేసినా- నిజానికి వేదంలో ఉన్నవే బయట ప్రపంచంలో ఉంటాయి. బయట ప్రపంచానికి వేదం బౌద్ధిక, తాత్విక, […]
బీజీఎం మాత్రమే కాదు… సరైన డబ్బింగ్ కూడా సీన్‌ను పైకి లేపుతుంది…
కల్కి సినిమాలో బుజ్జి అనే ఫ్యూచరిస్టిక్ కారుకు నటి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది కదా… పర్లేదు, బాగానే కుదిరింది… అది చూస్తుంటే దర్శకుడు వంశీ ఏదో తన ఆర్టికల్‌లో రాసిన ఈ వాక్యాలు చకచకా గుర్తొచ్చాయి… డబ్బింగ్ ప్రాధాన్యం మీద సింపుల్‌గానైనా బాగా రాశాడు ఆయన… (అప్పుడెప్పుడో సితార, మంచుపల్లకీలు తీసిన తొలిరోజుల్లో తన జ్ఞాపకాలు)… ‘‘చాలామంది డైరెక్టర్లు బిజీగా ఉండడంవల్లేమో ఈ డబ్బింగ్ పని అసిస్టెంట్లకి అప్పగించేస్తున్నారు. కానీ ఇక్కడ సినిమాని ఎంత ఇంప్రొవైజ్ […]
రాబోయే తరాలు రామోజీరావనే విజేతని ఎలా గుర్తు పెట్టుకుంటాయో!
రాక్షసుడు చెరుకూరి రామోజీరావు ….. The Genghis Khan of Telugu Journalism _________________________________ రామోజీరావు గురించి నాలుగేళ్ల క్రితం రాసిన వ్యాసం ఇది. రెండేళ్ల క్రితం కావచ్చు, గాయకుడు, రచయిత, సంగీత దర్శకుడు ప్రసన్నకుమార్ సర్రాజు బర్త్ డే పార్టీకి జూబ్లీ హిల్స్ లోని ఆయన ఇంటికి వెళ్లాను. 30-40 మంది వచ్చిన ఆ సాయంకాలం పార్టీలో ప్రగతి ఆర్ట్ ప్రింటర్స్ పరుచూరి హనుమంతురావుగారి కోడలు, పరుచూరి నరేంద్ర భార్య ప్రసిద్ద డాక్టర్ శశికళగారు ఓ […]
ఏదో పెద్ద జాతరకు వస్తున్నట్టుగా… తిరుమలను మించిన భక్తజనం…
పాత ఒక రోత… కొత్త ఒక వింత… భక్తులకూ అంతే… సినిమా కొత్తగా ఉండాలి… పాత దేవుడు కూడా కొత్తగా కనిపించాలి… అప్పుడే భక్తులు పోటెత్తుతారు… యాదగిరిగుట్టకు వెళ్లే తోవలో కొత్తగా కట్టిన స్వర్ణగిరి గుడికి నిజంగానే జనం పోటెత్తుతున్నారు… సింపుల్‌గా ఒక్కరోజయితే ఆ యాదగిరిగుట్ట, తిరుమలను మించిన జనం వస్తున్నారు… చూస్తుంటే… బ్యాగులు నెత్తిన పెట్టుకుని, ఆ అడ్డదారుల్లో నడుస్తూ… టూరిస్టు వ్యానుల్లో వస్తూ… జనం విరగబడుతున్నారు… కావచ్చు, ఇంత రద్దీని ఆ యాజమాన్యం కూడా […]
తమిళ దేవుళ్ల దగ్గరకు ఇలా ప్లాన్డ్గా వెళ్తే బెటర్… ఫుల్ టూర్ ప్లాన్…
చాలామంది రీసెంటుగా అరుణాచలం వెళ్తున్నారు… గిరిప్రదక్షిణకు లేదా సాధారణ దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది… అయ్యప్ప దీక్ష విరమణకు శబరిమలై వెళ్లే భక్తులు కూడా తిరుగు ప్రయాణంలో తమిళనాడు గుళ్లు సందర్శించి వస్తున్నారు… అయితే సొంత వాహనాల్లో తమిళ గుళ్లు తిరిగి వద్దామనుకునే వాళ్లకు సరైన గైడెన్స్ ఉండదు… ముందుకు వెళ్లడం, మళ్లీ వెనక్కి రావడం, తద్వారా దూరం పెరగడం, అనవసర ఖర్చు… ఈ నేపథ్యంలో ఫేస్బుక్లో మిత్రుడు రాచకొండ శ్రీహరి పోస్టు ఒకటి ఆసక్తికరంగా […]
జీవితమైనా, సాగైనా ఓ ప్లానింగ్ ఉండాలి… పరీకర్ చెప్పిన కథ…
జీవితం చిన్నదే కానీ దీర్ఘకాలిక ప్రణాళిక ఎందుకు ముఖ్యమో గోవా మాజీ ముఖ్యమంత్రి, మాజీ డిఫెన్స్ మినిస్టర్ మనోహర్ పర్రీకర్ గారు చెప్పిన వాటర్ మెలన్ స్టోరీ అటూఇటూగా తర్జుమా చేసి రాసిన పోస్ట్ ఇది. ఒక ఊర్లో ఒక రైతు 100 ఎకరాల్లో పుచ్చకాయలు పండించేవాడు. ఆ ఊరు చుట్టుపక్కల మాత్రమే కాదు, ఆ జిల్లా లోనే ఆ రైతు పండించే పుచ్చకాయలు చాలా ప్రసిద్ది. పంట చేతికి వచ్చాక ఆ రైతు మే నెలలో […]
Indian Idol Telugu… ఆహా… ఆర్కెస్ట్రా విస్తరణ… చెవుల తుప్పు వదిలేలా..!!
ఇండియన్ ఐడల్ తెలుగు తాజా ప్రోమో చూశాక ఆశ్చర్యంతోపాటు కొంత ఆనందం కూడా… హిందీ ఇండియన్ ఐడల్ షోలో బోలెడు వాయిద్యాలు వాడుతారు షూటింగు సమయంలో… చెవులకింపుగా… పాడేవాళ్లకు కూడా ఓ జోష్… ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్ షో హఠాత్తుగా చాలామంది వాయిద్యకారులు కనిపించారు… పాట క్వాలిటీ పెరిగినట్టనిపించింది… నిజానికి సినిమా సాంగ్స్‌కు సంబంధించి రకరకాల యాప్స్ వచ్చాయి… గాయకులు పాడుతున్నప్పుడు, వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు ఏమైనా చిన్న చిన్న లోపాలు తలెత్తితే అవే సరిచేస్తాయి… కొన్ని […]
జగన్ ఆ లేఖ ఎందుకు రాసినట్టు..? బహుశా ఓ సాకు వెతుక్కోవడమా..!!
జగన్‌ది ఘోరమైన పరాజయమే… మరీ 11 సీట్లే రావడం తలకొట్టేసినట్టే… సందేహం లేదు… పదో వంతు సీట్లు కూడా రాలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని టీడీపీ కూటమి చెబుతోంది… అంటే జగన్‌ను ప్రతిపక్ష నేతగా గుర్తించే అవకాశమే లేదని కూటమి వాదన… ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ప్రోటోకాల్ పరంగా ఓ కేబినెట్ మంత్రికి ఉండే గౌరవం దక్కుతాయి… పదో వంతు సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా అనేది ఏ చట్టంలోనూ లేదనీ, ఎలాగూ టీడీపీ, […]
సర్కార్-4…. సుడిగాలి సుధీర్ కూడా ఈ లాజిక్ గుర్తించలేదా ఏం..?!
చాలామంది ఆహా ఓటీటీ ప్లాట్‌ఫారమ్ మీద సర్కార్ -4 చూస్తూ ఉంటారు… ఇండియన్ ఐడల్ తెలుగు షో ప్లస్ సర్కార్ -4 పోటాపోటీగా పోటీపడుతున్నాయి… అఫ్కోర్స్, ఇండియన్ ఐడల్‌కు దాని నిర్వహణ తీరు, కంటెస్టెంట్ల ఎంపిక ఎట్సెట్రా ప్లస్ పాయింట్లు కాగా… సర్కార్-4కు మెయిన్ అసెట్ సుడిగాలి సుధీర్… గత హోస్ట్ ప్రదీప్‌ను మించి రక్తికట్టిస్తున్నాడు, అందులో డౌట్ లేదు… క్రియేటివ్ టీం కూడా కాస్త ఎక్కువ వర్క్ చేస్తున్నట్టుంది… ఏదో పిచ్చి గేమ్ అన్నట్టు గాకుండా […]
హరి కాంభోజి… అన్ని ఉద్వేగాలకూ అన్వయించగల రాగప్రవాహం…
సినిమా పాటకూ రాగముంటుందా? సినిమా సంగీతంలో శాస్త్రీయ రాగాలను వెతకడం ఏమిటి? సినిమా పాటల్లో సాహిత్య విలువల గురించి మాట్లాడడం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు చాలా మందే వేశారు. రవీంద్రనాధ ఠాగూరు అంఖుల్ ఏం చెప్పారంటే… భారతీయ సంగీతంలో ఏ మార్పులు చొరపడినా సమ్మేళనాలు చేసినా రాగ పద్దతిని విడనాడడం కుదరని పని. దాన్ని శృంఖలాలు అనుకుంటే సడలించుకుంటూ పోతాం తప్ప అసలు పూర్తిగా వైదొలగలేం అన్నారాయన. అంచేత … హరికాంభోజి రాగంలో వచ్చిన తెలుగు సినిమా […]
ఓ వైరల్ పోస్టు… వృత్తిని గౌరవించని వాళ్లను చెప్పుతో కొట్టినట్టు…
ఒక పోస్టు వైరలయింది… బాగా… చాలా మంది మిత్రుల వాల్స్ మీద కనిపిస్తోంది… రచయిత ఎవరో తెలియదు, అందరూ జస్ట్ ‘సేకరణ’ అని పోస్ట్ చేసేస్తున్నారు… నిజంగా ఎవరు రాశారో గానీ బాగా రాశారు… ఈ పోస్టులో హీరో ఓ చెప్పులు కుట్టే వ్యక్తి… మరేముంది ఇందులో..? తనకు అన్నం పెట్టిన వృత్తి పట్ల గౌరవముంది… అది భక్తి… అయితే సోషల్ మీడియా కదా, కొందరు భిన్నంగా కూడా స్పందించవచ్చు… కానీ వృత్తిని గౌరవించడం అనే ఒక్క […]
Dogology..! డాగ్స్ మస్ట్ బి క్రేజీ! అను ఓ శునకపురాణం..!!
“శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని, తనకది హీనమని తలచుకోదు”- శునకానికి తన జన్మ గొప్పదిగానే తోస్తుంది- తనది మరీ కుక్క బతుకు అయిపోయిందని అది అనుకోదు అని అన్నమయ్య కీర్తన. అలా మనం కూడా గొప్ప మనిషి పుట్టుక పుట్టాము అని గర్వపడతాముకానీ, నిజంగా మనిషి జన్మను సార్థకం చేసుకుంటున్నామా? అన్నది అన్నమయ్య ప్రశ్న. ఎప్పుడో 550 ఏళ్ల కిందట కాబట్టి అన్నమయ్య అలా అన్నాడు. ఇప్పుడు కుక్క బతుకు సుఖంగానే ఉంది; మనిషి బతుకే కుక్క […]
‘రద్దుల పద్దు’…. ఈనాడు కళ్లల్లో సంతోషం కోసం బాబు తాజా డెసిషన్…!
కక్షసాధింపు ఉండదు… మాది జగన్ పాలనలాగా సైకో పాలన కాదు… ప్రజావేదిక శిథిలాలను ఆ పాలనకు గుర్తుగా అలాగే ఉంచుతాను…. అని ఏవేవో చెప్పిన చంద్రబాబు తాడేపల్లి వైసీపీ ఆఫీసు కూల్చేశాడు… జగన్, బాబు… ఎవరూ జేసీబీ పాలనకు అతీతులు కారని నిరూపించాడు… ప్రతి జిల్లాలో నిర్మించిన పార్టీ ఆఫీసుల బొమ్మలు వేసి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏదో ఆనందం పొందాయి గానీ… టీడీపీ పార్టీ ఆఫీసులు నిర్మించుకోలేదా..? అసలు హైదరాబాదు ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ కథేమిటి..? రెండు […]
టీటీడీ కొత్త ఈవో గారూ… మీకీ దుర్లభదర్శనం విషయం తెలుసా..?
తిరుమల స్వామి వారి దర్శనం చేసుకోవాలంటే మూడు నెలల ముందుగానే టిటిడి వారి వెబ్ సైట్లో స్పెషల్ ఎంట్రీ స్లాట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో కూడా ముందుగానే ఛానెల్స్ ద్వారానూ.. వెబ్ సైట్ ద్వారానూ తెలియపరుస్తారు సైట్ ఓపెన్ చేసి స్పెషల్ ఎంట్రీ పేజి క్లిక్ చేసి, మనకు కావాల్సిన రోజులో కావాల్సిన టైము స్లాట్ సెలెక్ట్ చేసుకు,ని ఆధార్ డీటైల్స్ ఇస్తే పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేసి […]
ఇంకెన్ని ప్రాణాల్ని మింగుతాయో ఈ కార్పొరేట్ అనకొండలు..!!
ఉత్త ముచ్చట్లు — విద్యా వ్యాపారంలో రాలిపోతున్న “Thar e zameen par” ————————— పిల్లలకు ఏం కావాలో… పిల్లలు ఏం కావాలో తల్లిదండ్రులు నిర్ణయిస్తారు. కొన్నిసార్లు పోటీ ప్రపంచంలో ఇతర పిల్లలతో పోల్చుతూ వారి జీవితాన్ని ఆగం చేస్తారు. ఎవరి పిల్లలో ఏవో ర్యాంకులు సాధించారని నమ్ముతూ… అదే కాలేజీలో తమ పిల్లల్ని చేర్పిస్తే… జీవితంలో మంచి స్థాయికి వెళ్తారని ఆశిస్తారు. కానీ… కొన్నిసార్లు తల్లిదండ్రులు చేసే పొరపాట్లు… పిల్లల జీవితాల్ని అగమ్యగోచరం చేస్తాయి. ఆఖరికి […]
యండమూరి ఇష్టపడటమే గొప్ప… పైగా పరిచయ ప్రచారం మరీ అరుదు…
యండమూరి ఏది చేసినా కాస్త డిఫరెంటు… ఓ కథల సంపుటి అందింది తనకు… ముందుమాట రాయాలి, రాయాలంటే చదవాలి… కొత్త రచయిత… ఏదో నిర్లిప్తతతో చదవడం స్టార్ట్ చేసి, అదే బిగితో చదివేశాను అంటున్నాడు ఆయన… దాన్ని తన ఫేస్బుక్ వాల్ మీద పరిచయం చేశాడు… అఫ్కోర్స్, రచయిత కూడా తనలాగే సీఏ చేశాడు కాబట్టేమో… పైగా ఆ రచయితపై తన రచనల ప్రభావం బాగా ఉందని గమనించిన ప్రేమ కాబట్టేమో… కానీ ముందుమాట రాయడమే కాదు, […]
కళాక్షరిక… ఇంట్రస్టింగ్ ప్రయోగం… మన లిపికి ఇంకొన్నాళ్లు ఆయుష్షు…
తెలుగు అక్షరాలు సులభంగా నేర్చుకోవడానికి- ‘కళాక్షరిక’ దక్షిణాది తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లో అంతరించిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నది మన తెలుగుకే. తెలుగు నామరూపాల్లేకుండా ఎప్పటికి పోతుంది అన్నది మన ప్రయత్నాలను బట్టి ఉంటుంది. ఇప్పటి మన సంకల్పం, పట్టుదల ప్రకారం చూస్తే- ఖచ్చితంగా ఇంకో రెండు వందల ఏళ్ళల్లో మొదట తెలుగు లిపి అదృశ్యం కావచ్చు. మాట్లాడే భాషగా తెలుగు ఇంకొంత ఎక్కువ కాలం బతకవచ్చేమో కానీ- ఆ మాట్లాడే తెలుగులో తెలుగు పది […]
బురద వార్తల నడుమ ఈ ఆఫ్‌బీట్ స్టోరీ బాగుంది… బట్, సరిపోలేదు..!!
సాక్షి ఫస్ట్ పేజీలో… (హైదరాబాద్ ఎడిషన్‌లో…) డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు హైదరాబాద్ ఎలా డెస్టినేషన్‌గా మారుతుందో ఓ వార్త కనిపించింది… ఆహ్లాదంగా అనిపించింది… తెల్లారిలేస్తే రాజకీయ బురద తప్ప మరేమీ కనిపించని పత్రికల ఫస్ట్ పేజీలో… వాడిని వీడిలా తిట్టాడు, వీడిని వాడలా తిట్టాడు బాపతు చెత్తా వార్తలే ప్రధాన పాత్రికేయంగా మారిపోయిన దుర్దినాల్లో… ఓ ఆఫ్ బీట్ వార్త ఫస్ట్ పేజీలో (అఫ్కోర్స్, ఈమధ్య స్లీవ్‌లెస్ జాకెట్ బాపతు నిలువు సగం పేజీలు వేస్తున్నారు కదా, అందులో…) […]
- « Previous Page
- 1
- …
- 30
- 31
- 32
- 33
- 34
- …
- 118
- Next Page »