. టీవీ షోలను సొంతంగా నిర్మిస్తూ, తనే హోస్ట్ చేస్తూ సందడి చేసే ఓంకార్ నిజానికి పెద్దగా బూతులు, ద్వంద్వార్థాలు, వెగటు కంటెంట్ జోలికి వెళ్లడనే పేరుంది… తన షోలు కూడా కాస్త డిఫరెంటుగా ప్లాన్ చేసుకుంటాడు… కానీ వెగటుతనం, వెకిలితనం లేకపోతే టీవీ షోలకు రేటింగ్స్ రావని ఎవరైనా చెప్పారో…. లేక ఈటీవీ రియాలిటీ షోలు, అఫ్కోర్స్, అన్ని టీవీల షోలూ అలాగే ఏడ్చాయి… తను కూడా పిచ్చి కూతలకు దిగినట్టు కనిపిస్తోంది… ఆహా ఓటీటీ […]
ఒకానొక సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఒక రోజు… ఓ కుదువ తంతు…
. ఒక రిజిస్ట్రార్ ఆఫీసు అనుభవం…….. ఇల్లు కట్టి చూడు… ఒక్కోసారి కష్టాలు చెప్పే వస్తాయి- మనం మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ముందుగానే సిద్ధం కావడానికి. అలా మొన్న ఒకరోజు నాకు చెప్పే వచ్చాయి. హైదరాబాద్ శివారులో ఉన్న ఒక రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పని. మనం భవన నిర్మాణానికి అనుమతి కోసం దరఖాస్తు చేయగానే పట్టణ పరిపాలన శాఖ టౌన్ ప్లానింగ్ అధికారులు జాగాను తనిఖీ చేస్తారు. నిర్మాణానికి అనుమతి రావాలంటే మనం కట్టే జాగాలో కొంత భాగం మునిసిపల్ […]
శివుడికి పాలుపట్టే అమ్మ రూపం… మరొకటి తాంత్రిక శక్తుల భీకరరూపం…
. మనదేశంలో తాంత్రిక ఆలయాలలో ‘తారాపీఠ్’ కి ఒక ప్రత్యేకత ఉంది.ఇది తాంత్రిక దేవాలయంగా ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ తారాదేవి అమ్మవారికి శవ భస్మంతో అర్చన జరుగుతుందనీ అంటారు. తాంత్రిక శక్తులు కోరుకునే వారు ఈ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అందు కోసం ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు. గౌహతిలోని కామాఖ్య ఆలయం కూడా వామాచార అర్చన రీతులకు పెట్టింది పేరు… సరే, తారాపీఠ్ విషయానికి వస్తే… ఈ ఆలయానికి సమీపంలో ఉన్న శ్మశానం లో అఘోరాలు, […]
నేను డాక్టర్నే… కానీ మొదట నేను మనిషిని… అలాగే ఆలోచిస్తాను…
. Yanamadala Murali Krishna …. ముందు మనిషిని… తరువాతే డాక్టర్‌ను… ఈ సాయంత్రం ఆవిడ చెప్పారు… ఫలానా వాళ్ళ సర్జరీ పెద్దగా సక్సెస్ కాలేదట, మళ్ళీ సర్జరీ ఏదో సర్జరీ చెయ్యాలని అన్నారట. విషయం ఏమంటే, కొన్ని నెలల క్రితం చర్చించిన తెలిసిన కుటుంబంలోని 60 ఏళ్ల పైబడ్డ మహిళ తాజా అనారోగ్యం గురించి… ఆవిడకి కొన్నేళ్ల క్రితం కాన్సర్ బయట పడితే రేడియోథెరపి, సర్జరీ అయ్యింది. తర్వాత రెండేళ్లకు వెన్నుపూస సర్జరీ అయ్యింది. కొన్ని […]
120 రోజులు సముద్ర గర్భంలో… సెయిలర్ కాదు, ఏరోస్పేస్ ఇంజనీర్…
. (రమణ కొంటికర్ల)…. అన్వేషణ, పరిశోధన.. ఈ రెండూ ఉంటే మనిషి పరిమితుల గోడలు బద్ధలు కొట్టి కొత్త విషయాలను కనుక్కోవచ్చు. విజయమైనా, వైఫల్యమైనా తట్టుకునే శక్తి ఉంటే, అంతకు రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తే.. అంతకుమించి అలాంటి అనుభవాల్ని ఆస్వాదించొచ్చు. అందులో కొన్నింటికి సాహసమే ఊపిరి కావాలి. ఎందుకంటే, అక్కడ ఊపిరి కూడా ప్రశ్నార్థకమే. అదిగో అలాంటి ఫీట్ ను సాధించి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ కెక్కారు ఓ జర్మన్ ఏరోస్పేస్ ఇంజనీర్. రుడిగర్ కోచ్ అనే […]
ఒక క్రికెట్ స్టార్ గొంగడి త్రిష… ఒక కథానాయిక కౌసల్యా కృష్ణమూర్తి…
. Aranya Krishna… మహిళల అండర్ 19 టి20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో భారత్ ని విజేతగా నిలిపిన భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిషకి, మిగతా టీం సభ్యులకు అభినందనలు. ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన 19 ఏళ్ల (15.12.2005) త్రిష జనవరి 28న జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ లో అద్భుతమైన సెంచరీ చేసి భారత్ ని సెమీ ఫైనల్స్ కి తీసుకెళ్లింది. త్రిష చేసిన సెంచరీ మహిళల […]
ఆ ఐఏఎస్ అధికారి సీఎం ఎన్టీయార్ ఎదుట ప్రవేశపెట్టబడ్డాడు… తరువాత..?
. 1983 లో ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు ఆ ఐ.ఏ.ఎస్ అధికారికి పోస్టింగు ఇవ్వలేదు. అప్పటికే పాత కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డారన్న కారణంగా కొందరు ఐఏఎస్ అధికారుల్ని ఆయన ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్ జాబితాలో ఈ అధికారి పేరు కూడా ఉందని, నేడో రేపో జరుగుతుందని ప్రచారం. అలాంటి దశలో ఆ అధికారి పోస్టింగు కొరకు వెళ్తే, ముఖ్యమంత్రి మూడు “అవినీతి నేరాల” ప్రశ్నలతో నిలదీశారు. ముఖ్యమంత్రి: మీరు టిటిడి నిధుల్లోంచి లక్షలాది […]
అప్పుడు డీటీపీతో మాకేం పని అన్నారు… ఇప్పుడదే నడిపిస్తోంది!
. (శంకర్రావు శెంకేసి, 79898 76088) టెక్నాలజీ తోడ్పాటులేని రంగమే లేదిప్పుడు. ప్రపంచమంతా స్మార్ట్‌ఫోన్‌లో ఇమిడిపోతున్న కాలంలో అప్డేట్ అవుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడం అనివార్యం. లేదంటే ఔట్‌డేట్ కాక తప్పదు. ఏదైనా టెక్నాలజీ కొత్తగా తెరపైకి వచ్చినప్పుడు దానికంత ఈజీగా అలవాటుపడటం జరగదు. గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం వచ్చినప్పుడు అవి కేవలం సంపన్నులకే పరిమితం అనుకున్నారు. ఇప్పుడు మార్కెట్లో కూరగాయలు అమ్మే వారు కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్‌ను అలవోకగా చేసి పారేస్తున్నారు. కాలంతో పాటు అవసరం తెచ్చే […]
వేలకువేల కోట్లు..! చివరకు ఆ చీకటి తెరల వెనుక అనామక మరణం..!!
. జయ ఆస్తులు తమిళనాడుకే… అని ప్రత్యేక న్యాయస్థానం ఎట్టకేలకు తేల్చిందట… ఎవరెవరో మేం వారసులం అని చెబుతూ ఆమె ఆస్తుల కోసం కోర్టుల్లో కొట్లాడారు… కానీ ఫలితం లేకుండా పోయింది… నిజానికి ఆమె బతికి ఉన్నప్పుడే… అన్నింటా తోడున్న తన ‘మిత్రురాలు’ శశికళ జయలలిత పేరు చెప్పి, ఆమె అధికారాన్ని తను వాడుకుని ఎంత సంపాదించిందో తనకే తెలియదు… ఐనా జయలలిత తెలిసీ సహించింది… ఆ బంధం అంత బలమైంది మరి… జయలలిత మరణించాక ఎవరికి […]
లోకేష్ బాబు సారు గారూ… ఆ మంగ్లీకే మళ్లీ మళ్లీ పెద్ద పీట వేస్తారటయ్యా…
. (( Ratna Kishore Sambhumahanti ……. పోస్టులోని కొన్ని అంశాలు… )) తెరపై తెలుగు దేశం : మంగ్లీ ఎవరు ? స్థానికత్వం ఎటు పోయింది ? రథ సప్తమి వేడుకలలో స్వాతి స్వామినాథన్ హల్చల్ ? ఎవర్రా వీళ్లంతా ! ఈనాడు, సాక్షి మీడియాలకు కళ్లు కనపడవు.. వాళ్లకు చూపు ప్రసాదించండి సామీ ! ప్రజలకు జ్ఞానం లేదు. అధికారులకూ జ్ఞానం అస్సలు లేదు. రథ సప్తమి వేళ అధికారులకు చూపుతో పాటే జ్ఞానం […]
మళ్లీ ఇరకాటంలో కవిత..! ఇప్పుడు కేరళ మద్యం స్కాం తెరపైకి..!!
. ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి మరో శరాఘాతం… ప్రత్యేకించి కేసీయార్ కుటుంబానికి… మరీ ప్రత్యేకించి కవితకు… ఇరకాటంలో పడినట్టే… ఆల్రెడీ ఢిల్లీ మద్యం స్కాంలో ఆమె ఎదుర్కొంటున్న ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తున్నట్టుగా ఉంది ఈ కేరళ మద్యం కుంభకోణం… ఐతే రాజకీయాల్లో, ప్రజాజీవితంలో ఉన్నప్పుడు ఆరోపణలు వస్తుంటాయి… ప్రత్యర్థి పార్టీలు టార్గెట్ చేస్తూనే ఉంటాయి… కానీ ఇది కాస్త భిన్నంగా ఉంది… ఎందుకంటే..? ముందుగా ఆరోపణలు ఏమిటో చూద్దాం… కేరళలో 2023లో కొత్తగా మద్యం […]
అర్ధరాత్రి… ఆ శ్మశానంలో హఠాత్తుగా కెవ్వుమని ఓ పసిగొంతు ఏడుపు…
. ఈనాడులోని ఓ వార్త దగ్గర చూపు అలా కాసేపు నిలిచిపోయింది… ఆలోచనల్లో ముంచేసింది… ఆ వార్త హెడింగ్, రచన శైలి, ప్రయారిటీలతోపాటు కంటెంట్ కూడా… శ్మశానాన శైశవగీతి… చాలా బరువైన శీర్షిక… నిజానికి శైశవగీతి అనే పదాన్ని అందులో వాడొచ్చా అనే సందేహాన్ని పక్కన పెడితే… వార్త ఉన్నదే పదీపదిహేను లైన్లు… అందులో సగం ఉపోద్ఘాతమే… ఏదో జీవించబోయారు రిపోర్టర్, సబ్ఎడిటర్… కానీ ఒక వేదనను ఆవిష్కరించడంలో సక్సెస్ కాలేదు… విషయం ఏమిటంటే..? ఏలూరు జిల్లాలోని […]
పగబట్టిన నాయకురాలు నాయనమ్మ… ఆమె కళ్లలో ఆనందం కోసం..!
. Ashok Kumar Vemulapalli …….. పగబట్టిన నాయనమ్మ… పరువు హత్య… నాయనమ్మ చేయించిన పరువు హత్య ఇది.. ఇవాళో రేపూ.. కాటికి చేరే వయసులో ఉన్న ఆ పెద్దావిడ పచ్చని ప్రేమ జంటను విడగొట్టింది.. వేరే కులానికి చెందిన వాడిని తన మనవరాలు పెళ్లి చేసుకోవడాన్ని.. పైగా తమ కళ్లెదుట ఊర్లోనే కాపురం పెట్టడాన్ని ఆ పెద్దావిడ తట్టుకోలేకపోయింది. కృష్ణా- రామా అనాల్సిన వయసులో పరువు.. పరువు అంటూ రాత్రీపగలు కలవరించిన ఆ ముసలావిడ… తన మనవరాలిని […]
కేసీయార్ మీద ఏదో బురద జల్లబోయి… చివరకు కాంగ్రెస్‌కే భంగపాటు…
. హబ్బ… ఎట్టకేలకు ఆ పోల్ ట్వీట్ ఆగిపోయింది… దాని 24 గంటల గడువు అయిపోయి ఆగిపోయిందో… లేక ఎట్టకేలకు సిగ్గూశరం గుర్తొచ్చి డిలిట్ కొట్టారో… ఆ పిన్డ్ పోస్టు మాత్రం మాయమైంది… ఈలోపు తెలంగాణ కాంగ్రెస్ ఇజ్జత్ కచరా అయిపోయింది… నిజానికి ఆ తెలంగాణ కాంగ్రెస్ పేరిట వెక్కిరింపులకు, వెటకారాలకు గురైన ఆ ట్వీట్ నిజమో కాదో మొదట డౌటొచ్చింది…. తీరా ఎక్స్‌లో చెక్ చేస్తే అది అధికారిక అకౌంటే అని తేలింది… పైగా ఆ […]
బాగానే వండినా ప్రేక్షకులకు రుచించలేదు… సారీ ఎన్టీయార్ అన్నారు…
. Subramanyam Dogiparthi …. ఇది ప్రేమ సింహాసనం హృదయాల ప్రియ శాసనం అనే ఈ పాట సూపర్ హిట్ సాంగ్ . ఈ ప్రేమ సింహాసనం సినిమాకే ఐకానిక్ సాంగ్ . సినిమా మొత్తం మీద మూడు సందర్భాలలో వస్తుంది . సి నారాయణరెడ్డి చాలా బాగా వ్రాసారు . చక్రవర్తి చాలా శ్రావ్యమైన సంగీతాన్ని అందించగా మంజు భార్గవి శాస్త్రీయ నృత్యం చాలా అందంగా ఉంటుంది . ఈ పాటే కాదు; మిగిలిన అన్ని పాటలూ […]
ఇదో చిత్రమైన కేసు…! పైపైన చదివితే ఎక్కదు… తాపీగా అర్థం చేసుకోవాలి..!!
. ఓ మోటు సామెత… బర్రె ఎవడి దొడ్లో కట్టింది అని కాదు, ఏ దొడ్లో ఈనింది అనేదే ముఖ్యం అని…! క్షమించండి… సుప్రీంకోర్టు తాజా తీర్పు, అంతకుముందు దిగువ కోర్టుల తీర్పుల వార్త ఒకటి చదివాక హఠాత్తుగా స్పురించిన సామెత అది… అంటే… ఎక్కడ కడుపు చేసుకున్నావ్ అని కాదు, ఎక్కడ బిడ్డను కన్నావ్ అని..! కాస్త హార్ష్గానో, అగ్లీగానో ఉన్నట్టుందా..? పర్లేదు, ఆ తీర్పుల ధోరణి కూడా అంతే గందరగోళంగా ఉంది… ఈ కేసు […]
ఒక పెద్ద కథ… రామాయణ కథ… పటాపంచలైన సీత సందేహాల కథ…
. Veerendranath Yandamoori ….. తొలి ఇతిహాసానికి శ్రీకర హాసమై, అలసిన వాల్మీకి మలి ముగింపు దరహాసమై ఒక మహాకావ్య౦ కొలిక్కి వచ్చింది. -1 – పట్టభిషేకానంతరం పందిరి మంచంపై నిద్రిస్తోన్న రాముణ్ణి చూస్తోంది సీత. “…దొప్పలు మూసిన కలువల నొప్పగు రెప్పల చందము చూడనా? గప్పున గుప్పిలి విరిగిన అప్పటి శివుని విల్లు గురుతుకు వచ్చి ఇప్పతి ఇప్పటి నిదురన పెదవుల విచ్చిన నవ్వు చూడనా? నన్ను హరించినవాని సంహరించినప్పటి పెదవుల బిగపట్టు చూడనా? అందము […]
నెమలీక..! అపోహలు, ఆశలు అన్నీ అప్పుడు ఫెటేలున పగిలిపోయాయి…!!
. – విశీ (వి.సాయివంశీ) … …… చిన్నప్పుడు ఇదొక సోకు. పుస్తకాల మధ్యలో నెమ్లీకలు పెట్టడం. అలా పెట్టుకుంటే అదో ఆనందం. నెమ్లీక ఎవరి దగ్గరుంటే వాళ్లు గొప్ప. ఎంత పెద్ద నెమ్లీక ఉంటే అంత గొప్ప. ఆడామగా అందరికీ అదే ఆశ. ఇప్పట్లాగా ఆడ వేరు, మగ వేరు అనే విషయమే అప్పుడు మాకు తెలీదు. క్లాసులో ఇద్దరు ఆడవాళ్ల మధ్యన ఒక అబ్బాయి, అబ్బాయిల పక్కనే అమ్మాయిలు కూర్చుని నోట్సులు రాసుకునేవాళ్లం. అమ్మాయిలు […]
ప్రతి సినిమా ప్రేమనగర్ కాదు… ప్రేమాభిషేకం కూడా కాలేదు…
. Subramanyam Dogiparthi …… ఎయన్నార్- దాసరి- రామానాయుడు కాంబినేషన్లో 1981సెప్టెంబర్ 24 న వచ్చిన ఈ ప్రేమ మందిరం సినిమా ప్రేమనగర్ , ప్రేమాభిషేకం సినిమాల్లాగా బ్లాక్ బస్టర్లు కాకపోయినా వంద రోజులు ఆడింది . అదృష్టవశాత్తూ సినిమాలో హీరోహీరోయిన్లను చంపలేదు . చంపి ఉంటే ఈ వంద రోజులు కూడా ఆడేదే కాదు . దాసరి మార్క్ సినిమా . యన్టీఆర్ మనుషులంతా ఒక్కటే ఛాయ కాస్త కనిపిస్తుంది . కధాంశం వేరు . శుధ్ధోధన […]
…. చివరకు సన్యాసంలోనే నిజమైన సౌఖ్యం ఉందని గ్రహించి…
. “కౌపీన సంరక్షణార్థం” అని బాగా వాడుకలో ఉన్న సంస్కృతం సామెత. అందరికీ తెలిసిందే అయినా… గోచిగుడ్డ నుండి మొదలయిన అంతులేని మహా సంసార ప్రయాణం కథ మళ్లీ మళ్లీ తెలుసుకోదగ్గదే. ఒకానొక ఊరు. పంటపొలాలతో, ధన ధాన్యాలతో పచ్చగా, హాయిగా ఉంది. ఊరిని ఆనుకుని ఊరికి కొండగుర్తుగా ఒక కొండ. ఆ కొండ మీద ఒక శిథిలాలయ మంటపం. ఎక్కడ నుండి, ఎప్పుడొచ్చాడో తెలియదు కానీ…ఒక సన్యాసి వచ్చి ఆ మంటపం కింద గూడు కట్టుకున్నాడు. […]
- « Previous Page
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- …
- 124
- Next Page »