ఓ దివంగత ముఖ్యమంత్రికి కొడుకు… ఇప్పటి ముఖ్యమంత్రికి వియ్యంకుడు… ముఖ్యమంత్రి కలలు గనే యువరాజుకు మామ… భవిష్యత్తులో కాబోయే మరో ముఖ్యమంత్రి (??)కి తాత… అన్నింటికీ మించి ఓ మహానటుడి వారసుడు…. అలాంటి ఉజ్వల చరిత్ర ఉన్న బాలయ్యబాబు మరీ బజారు మనిషిలా మాట్లాడాడు… బజారు భాష ఆశ్రయించాడు… సావిత్రి అనే సినిమా ఆడియా రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ తన అభిమానులకు ఓ బ్రహ్మాండమైన పిలుపునిచ్చాడు… ‘‘ఆడోళ్లు వెంటబడితే వదిలేస్తారా? కడుపులు చేయడమే…’’ అంటూ నీచమైన వ్యాఖ్యలు చేశాడు… నేనెక్కని ఎత్తులు లేవు, చూడని లోతులు లేవు అంటూ తన ‘ఘనత’ను కూడా చాటుకున్నాడు… ఇదీ తెలుగుజాతి చేసుకున్నఖర్మ… అంతటి గొప్ప నటుడి ఆత్మ క్షోభించేలా చేసిన చిత్తకార్తె వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బాగా చర్చనీయాంశమయ్యాయి… ‘‘వాళ్ల అయ్యనేమో రెండు రూపాయల కిలో బియ్యం పథకంతో పేదల కడుపులు నింపాడు, ఆయన అల్లుడేమో వేలాదిమంది బక్క రైతుల భూములు లాక్కుని వాళ్ల కడుపులు కొట్టాడు, తనేమో అందరికీ కడుపులు చేయాలంటూ పిలుపునిచ్చాడు… ఇది తెలుగుజాతి చేసుకున్న ఖర్మ అనుకుంటారా? అసలు బజారు మనుషుల్ని ఆదరిస్తున్న మన తెలివికి మనమే చప్పట్లు కొట్టుకుందామా…?’’ వంటి కామెంట్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి…
Leave a Reply