Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రతిసారీ వైభవ్ గెలిపించలేడు… ఆటతీరులోనూ అస్థిరత్వం…

May 2, 2026 by M S R

.

ప్రతి సారీ వైభవ్ గెలిపించడు… గెలిపించలేడు… నిజం… రాజస్థాన్ రాయల్స్ జట్టుకు తత్వం బోధపడింది… మిగతా జట్టు సభ్యులు తలా ఓ చేయి వేశారు, కానీ నిన్నటి మ్యాచ్ చేజారిపోయింది… రాత్రి మ్యాచులో రాజస్థాన్ జట్టు మీద ఢిల్లీ జట్టు గెలిచి, తన అవకాశాల్ని మెరుగుపరుచుకోగా… రాజస్థాన్ టాప్ వన్ ప్లేసులోకి వెళ్లే మంచి అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకుంది… ఇంట్రస్టింగ్…

టాస్ గెలిచి, ముందుగా బ్యాటింగ్ ఎందుకు ఎంచుకుందో అర్థం కాదు… తీరా మొదలెట్టారు… ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ ఇద్దరూ ఫామ్‌లో ఉన్నవాళ్లే… కానీ ఇద్దరూ 6, 4 పరుగులకు ఔట్… ఎప్పుడైతే ఇద్దరు ఓపెనర్లు వెంటవెంటనే ఔటవుతారో ఆ ఇంపాక్ట్ మిగతా ఆటగాళ్ల మీద పడుతుంది, దూకుడు తగ్గుతుంది… కానీ రాజస్థాన్ జట్టులోని ధ్రువ్, కెప్టెన్ పరాగ్, ఫెరీరా పరిస్థితిని చక్కదిద్దడమే కాదు, 225 పరుగుల దాకా తీసుకుపోయారు…

Ads

పరాగ్ ఇంకాసేపు ఉన్నా, ఫెరీరా ఉన్నా ఈ స్కోర్ ఇంకా పెరిగేది… 225 పరుగులు పెద్ద స్కోరే కానీ ఈరోజుల్లో ఆ నంబర్‌ను ఉఫ్ అని ఊదేస్తున్నారు కదా… అదే జరిగింది… నిశాంక, కేఎల్ రాహుల్, నితిశ్ రాణా ఏమాత్రం ఒత్తిడి కూడా ఫీల్ గాకుండా… మరో 5 బాల్స్ ఉండగానే టార్గెట్ కొట్టేశారు… రాజస్థాన్ తన బౌలర్ల ఆటతీరును సమీక్షించుకోవాల్సి ఉంది…

ipl

దీంతో ఏమైంది..? ఢిల్లీ కేపిటల్స్ ప్లేఆఫ్ బరిలోకి బలంగానే వస్తోంది… టాప్ 6 లో ఉందిప్పుడు 8 పాయింట్లతో… ఇంకా 5 మ్యాచులున్నాయి దానికి… అవకాశాలూ ఉన్నాయి… రాజస్థాన్ ఆల్రెడీ 10 మ్యాచులు ఆడేసింది… 12 పాయింట్లతో నాలుగో ప్లేసు… ఇది గెలిచి ఉంటే 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి చేరి, పంజాాబ్‌కన్నా మెరుగైన స్థితిలో ఉండేది…

ఇప్పుడు రాజస్థాన్ జట్టుకు ఇటు ఢిల్లీ కేపిటల్స్, అటు గుజరాత్ టైటాన్స్ నుంచి ప్లేఆఫ్ బరిలో పోటీ పెరిగింది… ఇప్పుడున్న స్థితిలో ఈ ఆరు జట్లలోనే నాలుగు నిలుస్తాయి.,. అవి ఏవేవి అనేదే ఈ వారం పోటీ తేలుస్తుంది… సో, వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు కదా గెలిపిస్తాడనే నమ్మకం తప్పు… ఈ బౌలర్లతో 220 ప్లస్ స్కోర్‌ను డిఫెండ్ చేసుకుంటామనుకున్నా తప్పే…!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రతిసారీ వైభవ్ గెలిపించలేడు… ఆటతీరులోనూ అస్థిరత్వం…
  • మైండ్ యువర్ ఇన్సూరెన్స్ … ఏ బీమా చూసినా ఏమున్నది, మోసం తప్ప…
  • ఇండిగో ఫ్లయిట్‌లో ఏసీ ఆపేసినట్టు… థియేటర్‌లో కూడా సఫకేషన్…
  • గాయపడిన సింహం ఊరుకుంటుందా..? ప్రేక్షకుడినీ గాయపరుస్తుంది…!!
  • పాకిస్థాన్‌కు దుబయ్ నుంచి మొదలైంది అసలు ‘వ్యతిరేకత’..!
  • భేష్ లోకేష్… కార్పొరేట్ దోపిడీ బడులను దాటి… నిల‘బడి’…
  • సో, మంగ్లీ తమ్ముడికీ మైక్రో ఫైనాన్స్‌ లావాదేవీలతో లింక్స్..!
  • కత్తి మీ చేతుల్లోనే ఉంది కిషన్ సాబ్… యుద్ధమే మీకు ఇష్టం లేదు…
  • బెంగాల్ రిజల్ట్..! యాక్సిస్‌తోపాటు సట్టాబజార్ కూడా హేండ్సప్..!!
  • గ్రేట్ నికోబార్…! ఇక ‘ఆ మూక’ మొత్తం దీనిపై పడి ఏడుస్తోంది..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions