.
అవును, ఖచ్చితంగా చెప్పుకోవచ్చు… ఇది మునుపటి భారత్ కాదు… తన ప్రయోజనాలు, తన రక్షణ, తన సార్వభౌమత్వం, తన సమగ్రతల కోసం ఏ ప్రపంచ వేదికెనైనా ఎదిరించగలదు… ఎదిరిస్తోంది… అటు ట్రంపు ఎంత దూరం జిన్‌పింగ్ అంతే దూరం… ఇటు నెతన్యాహూ ఎంత దగ్గరో, అటు పుతిన్ అంతే దగ్గర…
ఇండియా జియో పాలిటిక్స్‌లో చురుకుగా ఉండదు, కనిపించదు, కానీ ఇండియా ప్రమేయం లేని జియో పాలిటిక్స్ లేవు… రెండు తాజా ఉదాహరణల్ని ప్రముఖంగా చెప్పుకోవాలి… ఖచ్చితంగా… ఎందుకంటే… బయాస్డ్ ఇండియన్ మీడియాకు వీటి ప్రాధాన్యం అర్థం కావడం లేదు గనుక…

Ads
1) రక్తం, నీరు ఒకేచోట పారవు అని తేల్చిచెప్పిన ఇండియా… దశాబ్దాలనాటి నష్టదాయక ఇండస్ వాటర్ ట్రీటీ (సింధుజలాల ఒప్పందం) నుంచి వైదొలిగింది పహల్గాం దురాగతం తరువాత… ఈ దారుణ ఘాతుకం మీద ఒక్క దిమాగీ నక్సల్ మాట్లాడలేదు, గుర్తుంది కదా…
ఈ నదీజలాల పాకిస్థాన్ నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరంలోని ఆర్బిట్రేషన్ కోర్టును (Permanent Court of Arbitration – PCA) ఆశ్రయించింది… ఇండియాకు ఈ ఒప్పందాన్ని నిలిపివేయడం (Abeyance), ఏకపక్షంగా రద్దు చేసే అధికారం పాకిస్థాన్ వాదన… ఒప్పందం ఇంకా అమల్లో ఉందని, భారత్ దాని నిబంధనలను పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది… దీనిపై విచారణ జరిపిన కోర్టు, ఈ ఒప్పందం కొనసాగుతుందని, భారత్ తన బాధ్యతలను విస్మరించరాదని తీర్పునిచ్చింది…
భారత ప్రభుత్వం ఈ కోర్టు తీర్పును, హేగ్ ట్రిబ్యునల్ అధికార పరిధిని తీవ్రంగా వ్యతిరేకించింది. అసలు ఈ ఆర్బిట్రేషన్ కోర్టునే నేను గుర్తించడం లేదు, సింధు జలాల ఒప్పంద నిబంధనలకు వ్యతిరేకంగా ఇది ఏర్పడింది… ఐ డోన్ట్ కేర్ అని తేల్చిచెప్పింది… అంటే, నడుమ నువ్వెవడివి అనడిగింది… అసలు ఏ విచారణకు హాజరు కాలేదు…
మా ప్రాజెక్టులు, మా జలాలు, మా జాతీయ భద్రత కోణంలో మేం నిర్ణయాలు తీసుకుంటాం, నీకేం అధికారం ఉంది తీర్పులు ఇవ్వడానికి, మా నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్థిరంగా చెప్పింది… ఆ కోర్టే కాదు, పాకిస్థాన్ కూడా షాక్… ఇది తేల్చి చెప్పడానికి ఇండియా ఏమాత్రం సందేహించలేదు, స్పష్టంగా, కఠినంగా తేల్చేసింది…

2) గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ (Great Nicobar Project) విషయంలో ఐక్యరాజ్యసమితి (UN) లేవనెత్తిన అభ్యంతరాలను కూడా కేంద్ర ప్రభుత్వం నిర్మొహమాటంగా తోసిపుచ్చింది. ఐక్యరాజ్యసమితిని కూడా ఎహెపో అనడం ఇండియా ధోరణిలో మార్పులకి అద్దం పడుతోంది…
ఈ భారీ ప్రాజెక్టు వల్ల గ్రేట్ నికోబార్‌లోని సున్నితమైన జీవవైవిధ్యం, వర్జిన్ రెయిన్‌ఫారెస్ట్‌లు పూర్తిగా దెబ్బతింటాయని, అక్కడ నివసించే స్థానిక గిరిజన తెగల (షోంపెన్, నికోబారీ ప్రజలు) మనుగడకు ముప్పు వాటిల్లుతుందని యూఎన్ మానవ హక్కుల నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు…
పర్యావరణంపై పడే ప్రభావం గురించి పూర్తి స్థాయి శాస్త్రీయ అధ్యయనం జరిగే వరకు, గిరిజనుల సమ్మతి తీసుకునే వరకు రూ. 72,000 కోట్ల విలువైన ఈ మెగా ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

ఈ ప్రాజెక్టు కేవలం వాణిజ్యపరమైనది మాత్రమే కాదని, దేశ వ్యూహాత్మక, భద్రతా అవసరాలకు ఇది అత్యంత కీలకమని కేంద్రం స్పష్టం చేసింది… అంతర్జాతీయ సముద్ర మార్గాల సమీపంలో ఉన్న ఈ దీవిని అభివృద్ధి చేయడం ద్వారా రక్షణ రంగం బలపడుతుందని వాదించింది…
యూఎన్ లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేదే లేదని, ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది… ఇప్పటికే అన్ని పర్యావరణ అనుమతులు నిబంధనల ప్రకారమే వచ్చాయని, దేశ సమగ్రతాభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ అత్యంత అవసరమని స్పష్టం చేస్తూ ఐక్యరాజ్యసమితికి స్పష్టమైన తిరస్కరణ లేఖను పంపింది….
Share this Article