Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కామ్రేడ్… మీరెళ్లిపోయారు… ఇక ఆ నష్టదాయక శక్తులదే ఆధిపత్యం…

September 12, 2024 by M S R

ఆ రాజకీయాలు ఎంత పాప పంకిలం అయినా సరే… సీతారాం ఏచూరి అంటే నాకు అభిమానం…

ఈ దేశానికి హిందుత్వ రాజకీయాలు ఫాసిస్టు రాజకీయాలు వేరు కాదు అని మూడు దశాబ్దాల కిందనే చెప్పిన మేధావి. తరువాత ఆ పార్టీ ఎంత దిగజారి పోవాలో అంత పోయింది .

వాళ్ళు నందిగ్రాంలో జన సంఘ్ గా, ఆంధ్రాలో తెలుగు దేశంగా , తెలంగాణలో భారత రాష్ట్ర సమితిగా … మొత్తంగా యే పార్టీకీ దగ్గర కాదు అని చెబుతూ ఫాసిస్టు పార్టీ ఎదుగుదలకే దోహదపడిన గొప్ప పార్టీ వాళ్లది.

Ads

చదువుకున్న తరం అంతరించి పోలేదు అని ఎప్పటికీ రుజువు చేసిన ఏచూరి . ఫాసిస్టు పార్టీని ఓడించాలి అంటే కలిసి వచ్చే అన్ని పార్టీలనూ కలుపుకొని పోవాలి అనేవాడు . ఆ శక్తులు విడిపోతే అంతిమంగా ఫాసిజమే రాజ్యం సొంతం చేసుకునే ప్రమాదం ఉంటది అనేది ఆయన థీసిస్.

కానీ, వాళ్ళు ఏనాడూ ఏచూరి ఆలోచనలను గౌరవించ లేదు… ఆయన స్ఫూర్తిని దెబ్బ తీశారు. తీస్తూనే ఉన్నారు. ఇక యధేచ్చగా పని చేస్తారు.

సర్, మీకు బాగా లేదు అని వారం కింద తెలిసింది . నిన్న రాత్రి ICU లో నీ పక్కనే ఉన్న మిత్రుడు ఒక మంచి మాట చెప్పాడు. ఆయనకు బాగానే ఉంది వెంటిలేటర్ తీసేసారు అని, సంతోషపడ్డా . ఇంతలోనే ఈ వార్త…

మిమ్మల్ని లక్షలాది మంది నిజమైన కామ్రేడ్స్ మిస్ అవుతారు . కుల రొచ్చులో కొట్టుకుని కునారిల్లుతున్న అభినవ మార్క్స్ , లెనిన్, జింగుచకా గాళ్ళు మా పార్టీ ఇక నుంచి అన్ని పార్టీలకు సమదూరం అవుతూ .. మానవ సమాజానికి కాంతి సంవత్సరాల దూరంలో దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటారు…

సిపిఎం పోలిట్ బ్యూరో మెంబర్ , ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గంట కింద ఎయిమ్స్ లో వూపిరి తిత్తులు మొరాయించి మనకు దూరం అయ్యాడు. హైదారాబాద్ లో జరిగిన జాతీయ మహాసభ లో జరిగిన జుగుప్సాకరమైన క్యాంప్ రాజకీయాలలో మైనారిటీ తీర్మానాన్ని గెలిపించిన ధీరుడు అతను కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో అదొక చారిత్రక ఘటన.

చివరిగా ఒక మాట చెప్పగలను… ఈ దేశం లో INDA కూటమికి ఏచూరి ఒక అదనపు సొబగు. ఇప్పుడు CPM అంతటి ప్రభావవంతమైన నాయకులు అసలే లేరు, పైగా ఫాసిజానికి మినియేచర్లు ఇప్పటి నాయకులు . ఈ దేశానికి ఈ కాలానికి అవరమైన నాయకుడు ఏచూరి.

I can say It’s an irreplaceable loss to left camp and social democracy. రెస్ట్ ఇన్ పవర్ కామ్రేడ్… అల్విదా….. (గుర్రం సీతారాములు) 

 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ దంపతులు నడిపితేనే.. నాటి రాజకీయ ప్రముఖుల విమానయానం…
  • జైన వెడ్స్ బ్రాహ్మణ… ఒక సంపూర్ణ సంప్రదాయిక పెళ్లి వేడుక…
  • ఫిక్సింగ్… విజయోత్సవాల్లో ఏదో కుట్రకోణం… 11 మంది ఉసురు తీసిందెవరు..?
  • ఆహా… ఏం తెలివి..? ఆటో-పే సబ్‌స్క్రిప్షన్ తిర‘కాసులు’…!!
  • ఏడీ..? ఏమైపోయాడు నేను ప్రేమించిన ఆ నా మణిరత్నం..?!
  • భారీ డిజాస్టర్ దిశగా థగ్ లైఫ్… హిందీవాడు అడ్డంగా ఛీకొట్టేశాడు…
  • అమెరికా అధ్యక్షుడు… ఆ టేబుల్‌కు ఆ రెండు ఇంపార్టెంట్ బటన్లు…
  • మహేష్ బాబును త్వరగా పంపించేయండి, నిద్రకు ఆగలేడు… కెవ్వు కేక..!!
  • తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాక..! అసలు దోషి ఎవరు..?!
  • మిలమిల మెరిసిన తార… వెన్నెల పైటేసిన కిన్నెరసాని…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions