Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘రైతు డిస్కం’పై అడ్డూఅదుపు లేని అబద్ధాలు- బీఆర్ఎస్ తప్పుడు బాష్యాలు…

May 30, 2026 by M S R

.

ప్రతిపక్షం అంటే… ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని నిందించడం, వక్ర బాష్యాలతో- అబద్ధాలతో క్షుద్ర రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడం కాదు…! తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఈ సోయి లేదు… సబ్జెక్టు మీద పెద్దగా పట్టు, ఆసక్తి ఎలాగూ కనిపించని బీజేపీ నుంచి ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయలేం… కానీ, చివరకు కల్వకుంట్ల ప్రవాహం నుంచి విడిపోయిన ఓ చిన్న పాయ కవిత కూడా అదే బాటలో ఉండటం విచిత్రం, హాశ్చర్యం…

ప్రభుత్వం రైతు డిస్కమ్ అని ప్రత్యేకంగా ఓ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏర్పాటు చేయబోతోంది… నిజానికి అది మంచి నిర్ణయం, కారణాలు దిగువన చెప్పుకుందాం… రెగ్యులేటరీ కమిషన్ అనుమతి కావాలి కాబట్టి ఓ పబ్లిక్ హియరింగ్ పెట్టారు నిన్న… (కస్టమర్లు, సేవలు అనే కోణంలో తెలంగాణ రెగ్యులేటరీ కమిషన్ ఓ శుద్ధ దండుగ వ్యవస్థ- అది మరో కథనంలో చెప్పుకుందాం)…

Ads

బీఆర్ఎస్ నుంచి పాత మంత్రి ఎవరో వచ్చాడు… (పాపం, పవర్ శాఖ కూడా చూసినట్టున్నాడు)… రైతులకు మీటర్లు పెడతారు, ఉచిత విద్యుత్తు ఎత్తేస్తారు, కరెంటు సరఫరా కుదిస్తారు, మిగతా డిస్కమ్స్ ప్రైవేటు వాళ్లకు అమ్మేస్తారు అనే తరహాలో ఏదేదో మాట్లాడేశాడు… మరి నిజం ఏమిటి..?

ఏట్లో వేసినా ఎంచి వేయాలి (ప్రతి దానికీ లెక్క ఉండాలనేది ఈ దేశ సంప్రదాయ ఆర్థికనీతి)… రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తున్నాం, కానీ దానికీ ఓ లెక్క ఉండాలి, ఆ లెక్క ప్రకారం ప్రభుత్వం సబ్సిడీలు రిలీజ్ చేయాలి… సో, వ్యవసాయ కరెంటు లెక్కలు తీస్తే అది ఉచిత విద్యుత్తును ఎత్తేయడం ఎలా అవుతుంది..? తప్పుడు బాష్యాలు, వక్రీకరణలు…

అలాగే మీటర్లు పెట్టేది ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర, అంతేతప్ప పంపుసెట్లకు కాదు… ఆయనెవరో ఎండీ ముషారఫ్ అట, ఎక్కడో రైతులు దొంగలు అన్నాడట, అదీ గొడవ… నిజానికి రైతులు దొంగలు అనికాదు, రైతుల పేరిట ఉచిత విద్యుత్తును దుర్వినియోగం చేయడం… అది వాణిజ్య నష్టాలకు (కమర్షియల్ లాస్) కారణం అవుతోందని..! కానీ సదరు అధికారికి చక్కాగా చెప్పడం రాదు, చెప్పినదాన్ని తమ సహజరీతిలో బీఆర్ఎస్ వక్రీకరించడం…

అవును, రైతుల పేరిట కరెంటు దుర్వినియోగం జరిగితే, ఆ భారాన్ని మిగతా వినియోగదారులు ఎందుకు భరించాలి..? కవిత చెబుతోంది, రైతుల నోట్లో ఎండ్రిన్ పోసినట్టే అని..! సబ్జెక్టు తెలియక కాదు, ప్రభుతాన్ని సమర్థించమని ఎవరూ అడగడం లేదు, కానీ సేమ్ అయ్యలాగే ఆ వక్రీకరణలు, అబద్దాలు మానేయాలని అడిగేది, అదే లేకపోతే కేసీయార్‌కు కవితకూ తేడా ఏముంది..? కొత్త పార్టీ దేనికి..? జనానికి గంతలు కట్టడం దేనికి..?

రైతు డిస్కమ్

ఎస్, రైతు డిస్కమ్ పేరిట ఉచిత కనెక్షన్లకు విడదీస్తే… మిగతా డిస్కమ్స్ వయబుల్ అవుతాయి, అమ్మేస్తారు అనేది ఓ వాదన… అదీ తప్పే… ఈ డిస్కమ్స్ 60-70 వేల కోట్ల నష్టాల్లో ఉంటే, అందులో 50 వేల కోట్ల వరకు ప్రభుత్వ సంస్థల బకాయిలే… అవి వయబుల్ అయ్యేది లేదు, ఎవడూ కొనేదీ లేదు… ఒకవేళ కొన్నాసరే గృహజ్యోతి వంటి పథకాలకు సరిపడా సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం ఆయా డిస్కమ్స్‌కు ఇవ్వాల్సిందే…

కాంగ్రెస్ కూడా రాజకీయ పార్టీయే… హఠాత్తుగా ఉచిత విద్యుత్తు ఎత్తేస్తుందా అది..? అది ఎంత నెగెటివ్ రిజల్ట్ ఇస్తుందో తనకు తెలియదా..? సో, బీఆర్ఎస్, టీఆర్ఎస్ వాదనలు ఉత్త హంబగ్… అలాగే ఇక్కడ మరోమాట… ప్రభుత్వ బాధ్యులకూ కాస్త సోయి అవసరం పదాల వాడకంలో… సందర్భశుద్ధి కూడా ఉండాలి…

రైతులకు మూడు గంటలు చాలు అనే పిచ్చి వ్యాఖ్యను కోదండరెడ్డి రెగ్యులేటరీ కమిషన్ ఎదుట ఎందుకు చేసినట్టు..? అది పరోక్షంగా రైతుల 24 గంటల కరెంటుకు ఎసరు పెట్టబోతున్నారనే తప్పుడు సంకేతం ఇవ్వడం లేదా..? ఎక్కడ, ఏం మాట్లాడాలో కూడా తెలియకపోతే ఎలా..?

జగదీష్ రెడ్డి, కవిత, కోదండరెడ్డి… జస్ట్, పొలిటిషయన్స్… పైగా 3 గంటలు, ఎండ్రిన్, అమ్మేస్తారు వంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేసేస్తున్నారు… ప్రభుత్వాన్ని సమర్థించాలని ఎవరూ అడగడం లేదు… కానీ తప్పుడు వ్యాఖ్యలు, బాష్యాల విషయంలో తమాయించుకోవాలి… అందరూ మరీ *నమస్తే తెలంగాణ* పత్రిక ప్రతినిధులయిపోతే ఎలా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నాగదుర్గ తొలి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసినట్టేనా?
  • అద్భుతం… 158 ఏళ్ల తర్వాత మళ్ళీ కనిపించిన అరుదైన పుష్పం!!
  • అదే వృద్ధ అక్కినేని- అదే మీనా- అదే క్రాంతికుమార్… కానీ రిజల్ట్..?!
  • సౌదీలో నేను సేఫ్ అనుకున్నాడు! చివరకు UAPA లో బుక్కయ్యాడు!!
  • కెరీర్ మొదట్లో చిరంజీవి దస్తూరీ తెలుసా మీకు..? ఇదుగో ఓ లేఖ!!
  • I, No Body – ఓ కొత్త స్టోరీ లైన్ – కథ చెప్పడంలోనే కాస్త తడబాటు!!
  • నాగార్జున కుటుంబంలో ఏం జరుగుతోంది? సోదరుల నడుమ పొరపొచ్చాలు?
  • యుద్ధ మేఘాల కింద సముద్రంలో!- ‘పాంచ్‌ సాహెబ్‌’ హిఫా సలీమ్ ధైర్యగాథ!
  • పొలిటికల్ అంకగణితం! లెక్కల్లో కేటీఆర్ ఫెయిల్- రేవంత్‌రెడ్డి పాస్!!
  • ప్రభుత్వ శాఖల్లో ‘డిజిటల్ పాలన’… కొత్త సీఎస్ సంజయ్ జాజు ముద్ర!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions