Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

A Global Traveller — మోడీ టూర్ల సెంచరీ — 78 దేశాల పర్యటనలు

June 17, 2026 by M S R

.
Nàgaràju Munnuru … భారతదేశంలో ఎన్నికైన ప్రధానుల్లో 12 సంవత్సరాలు ఏకబిగిన సేవలు అందించి రికార్డు సృష్టించిన ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా మరొక రికార్డు సొంతం చేసుకున్నారు. ప్రధాని పదవి చేపట్టిన నాటి నుండి ఇప్పటి వరకు ఆయన 100 విదేశీ పర్యటనలు పూర్తి చేశారు. జూన్, 2014లో మొదటి పర్యటన భూటాన్ దేశంలో చేయగా జూన్, 2026లో స్లోవేకియా 100వ దేశం. (ఈ 100 విదేశీ పర్యటనల్లో భాగంగా ఆయన ఇప్పటివరకు మొత్తం 78 దేశాలను సందర్శించారు.)

అయితే నన్ను అన్నింటికంటే ఎక్కువ ఆకర్షించింది భారత ప్రధాని ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్ళినా ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలకరిస్తూ కనిపించారు. ఇది మనకు భారతీయులు ప్రపంచంలోని దాదాపు అన్నిదేశాల్లో స్థిరపడినట్లు ధృవీకరిస్తుంది.

సహజంగానే కష్టపడి పనిచేసే తత్వం కలిగిన భారతీయులు, జీవితంలో పైకి ఎదగాలి అనే తపనతో విదేశాలకు వలసలు వెళ్ళి ఉన్నత విద్యనభ్యసించి, ఉన్నతోద్యోగాలు చేస్తూ తాము అభివృద్ధి చెందడమే కాకుండా తమకు నీడనిచ్చిన దేశాల అభివృద్ధికి పాటుపడుతున్నారు.

Ads

కొన్ని వర్గాల ప్రజల మాదిరి రాడికల్ భావజాలం లేకపోవడం, ఆయా దేశాల సంస్కృతిని గౌరవించడం, అందరి దేవుళ్ళు ఒకటే అనే భావన కలిగి ఉండటం వలన ఆయా సమాజాల్లో భారతీయులు పాలు నీళ్ళలా కలిసిపోయి సృహుద్భావ వాతావరణంలో జీవిస్తున్నారు.

ఆయా దేశాల్లో నమోదయ్యే హత్యలు, దొంగతనాలు, అత్యాచార ఘటనలు వంటి నేరాల్లో భారతీయ మూలాలున్న వారి సంఖ్య అత్యంత తక్కువగా ఉంటటం కూడా భారతీయులు ఎలాంటి వారు అని చెప్పకనే చెబుతుంది.

యుద్ధం, నియంతృత్వం, ఉగ్రవాదం కారణంగా తమదేశంలో బతకలేక శరణార్థులుగా యూరప్ దేశాలకు వలస వెళ్లిన ఒకవర్గం వారు ఆయా దేశాల్లో ప్రస్తుతం సృష్టిస్తున్న విధ్వంసం చూస్తే తెలుస్తుంది ఎవరు ఎలాంటివారో..

తను ఎక్కడికి వెళ్లినా రెండు అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. తప్పుకుండా ఆయా దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులను కలుస్తాడు, ప్రసంగిస్తాడు, అందరితో చేతులు కలుపుతూ కలిసిపోతుంటాడు. ఒక బలమైన దేశం మీ వెనుక ఉంది, విశ్వమానవులుగా మారుతున్న భారతీయులు మీరు దేశానికి గర్వకారణం అనే భావన కలిస్తాడు.

ఆయా దేశాల ప్రధాన నేతలతో వ్యక్తిగత సంబంధాలు పెంచుకోవడం మరో విశేషం. మెజారిటీ దేశాల నేతలు మోదీ ప్రేమలో అలా పడిపోతుంటారు. మృదువర్తన, సంస్కారం, మర్యాదతో తను కనెక్ట్ అయిపోతుంటాడు.

మోదీ తన టూర్‌లో ఆయా దేశాల కల్చర్‌కు సంబంధించిన ఆహార్యం కనబరచడం, ఎక్కడా ఆ దేశం గురించి గానీ, ఆ ప్రజల గురించి గానీ, ఇండియా గురించి గానీ ఒక్క పొల్లు మాట తన నోటి వెంట రాదు… “మోదీ కేవలం ఒక దేశాధినేతగా పర్యటించడం లేదు, ఒక భవిష్యత్ భారత్ ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తున్నారు”

  • మరొక విషయం. మోదీ ఏ దేశం వెళ్లినా ఆయా దేశాల అత్యుతన్న పౌరపురస్కారాలు వరిస్తున్నాయి. బహుశా ఇది భారత దేశపు ఏ నేతకూ దక్కని అరుదైన గౌరవం. ఈ కోణంలో మోదీ నిజంగానే ఓ సార్థకజీవుడు.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • A Global Traveller — మోడీ టూర్ల సెంచరీ — 78 దేశాల పర్యటనలు
  • రాజకీయ కలకలం – ఠాక్రేకు మరో భంగపాటు? – జార్ఖండ్‌లో మరో ఘట్టం
  • BJD — పట్నాయక్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం — వారసుల్లేరు, నాయకుల్లేరు
  • Pepsi Blunder — ఓ మార్కెటింగ్ తొందరపాటు — దేశమంతా అల్లర్లు
  • ఆరుట్ల స్కూల్ — ప్రతి సర్కారు బడి ఇలా మారిపోతే ఎంత బాగుండు..!
  • జానీవాకర్ విస్కీ..! అసలైన ‘కిక్’ ఏది..? ధరను బట్టి ‘థ్రిల్’ కాదు..!!
  • క్రుయల్ టాలీవుడ్… ఇక్కడ మనుషులుండరు… జస్ట్, కరెన్సీ నోట్లు మాత్రమే…
  • కేసీఆర్ దోస్త్ ఆగవ్వ… ఇల్లు కూల్చి ఆగం చేస్తే, కాంగ్రెస్ కట్టించి ఆదుకుంది…
  • పంజాబ్ ఆప్ సర్కారులో ముసలం..! ముదురుతోంది వివాదం..!
  • Obsession … థియేటర్ వదిలినా చాలాసేపు ఆ పాత్ర మనల్ని వదలదు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions