Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నీ పో మోనే విజయ్… రేవంత్ స్లోగన్ పేలింది… విజయన్ ఇంటికి…

May 5, 2026 by M S R

.

కేరళకు స్టార్ క్యాంపెయినర్‌గా వెళ్లిన రేవంత్ రెడ్డి ఓ పదునైన నినాదాన్ని విసిరాడు అప్పటి సీఎం పినరై విజయన్ మీద..! ఓ సినిమాలోని పాపులర్ డైలాగును పోలిన నినాదం అది… ‘నీ పో మోనే విజయ్’… అంటే ఇక వెళ్లిపో విజయన్ అని..! అంటే, నీ టైమ్ అయిపోయింది, ఇక వెళ్లిపో అని.,.! పేలింది..!

నిజానికి వేరే రాష్ట్రాల నుంచి వచ్చే ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్య నాయకులు ఏదో రాజకీయ మర్యాద కోసం వస్తారు, ప్రచారం నిర్వహించామనిపిస్తారు… కానీ రేవంత్ రెడ్డి స్టయిల్ వేరు కదా… అసలు అభివృద్ధిలో ఓ మోడల్ లేదు, పురోగతి లేదు అంటూ పినరై విజయన్‌ను గట్టిగా గోకాడు… తెలంగాణలో కేసీయార్‌ను ఇంటికి పంపించినట్టే నిన్నూ పంపించేస్తామని గెలికాడు… సాధారణంగా గెస్ట్ ప్రచారకర్తల్ని స్థానిక నేతలు పట్టించుకోరు పెద్దగా…

Ads

కానీ రేవంత్ రెడ్డి విసిరిన అస్త్రాలు ఫలించి, అసలే జనం వ్యతిరేకత సెగ ఎదుర్కుంటున్న స్థితిలో… చివరకు ఉక్కబోతకు గురై పినరై తనే స్పందించక తప్పలేదు… ఏదో వివరణ ఇచ్చుకున్నాడు… చివరకు సీపీఎం ఘోరంగా పరాజయం పాలై కాంగ్రెస్ లీడ్ చేసే యూడీఎఫ్ అధికారం దక్కించుకోవడంతో రేవంత్ రెడ్డి సాగించిన ప్రచారానికి సార్థకత, విలువ, ప్రయోజనం ఏర్పడినట్టయింది… తను ప్రస్తుతం కేవలం తెలంగాణ కాంగ్రెస్ నేత కాదు… అంతకుమించి..!!

ఇదేకాదు, బెంగాల్, అస్సాం ఫలితాలను వదిలేస్తే… తమిళనాడు, కేరళ ఫలితాలను తెలుగు రాష్ట్రాల్లోని పార్టీల విభాగాలు తమకు అనుకూలంగా వాడుకోవడం ఒక కోణం కాగా, ఆ ఫలితాల సెగ తెలుగు పార్టీలకూ తాకింది… తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కేరళ యూడీఎఫ్ గెలుపును, రేవంత్ ప్రచారాన్ని అనుకూలంగా ప్రచారం చేసుకుంటుండగా, కేసీయార్ పార్టీకి చెప్పుకోవడానికి ఏమీ లేదు… పైగా కేసీయార్ గతంలో ఎవరెవరిని కలిశాడో, ఆ ముఖ్యమంత్రులందరూ ఇంటికి వెళ్లిపోయారనీ, ఐరన్ షేక్ హ్యాండ్ అనీ, ఫసాక్ అనీ కాంగ్రెస్ సోషల్ మీడియా ఆ పాత ఫోటోలన్నీ క్రోడీకరించి మరీ ఎద్దేవా చేయడం స్టార్ట్ చేసింది…

కేసీయార్

తమిళనాడులో చంద్రబాబు ప్రచారానికి వెళ్లాడు తప్ప… సనాతన ధర్మ చాంపియన్‌గా బీజేపీ పవన్ కల్యాణ్‌ను ప్రచారబరిలో వాడలేదు… బహుశా పవన్ కల్యాణ్ అనారోగ్యం కారణం కావచ్చు… చంద్రబాబు అన్నాడీఎంకేకు ప్రచారం చేశాడు గానీ అదేమో మూడో ప్లేసులో ఉండిపోయింది… బీజేపీకి కూడా పెద్ద ఫాయిదా ఏమీ లేదు…

కానీ జగన్‌మోహన్‌రెడ్డి ఏ ప్రచారానికీ వెళ్లలేదు… తమిళనాడులో తెలుగు జనం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు బోలెడు, అన్ని పార్టీలూ ఈసారి తెలుగువాళ్లకు ఎక్కువ సీట్లను ఇచ్చాయి కూడా… టీవీకే విజయ్ జగన్ ఫోటోతో ప్రచారం చేసుకున్నాడు అని వైసీపీ సోషల్ మీడియా క్రెడిట్ తీసుకోగా.,. ఇంకోవైపు పవన్ కల్యాణ్‌కు ట్రోలింగ్ మొదలైంది…

‘‘‘రెండు పార్టీలతో పొత్తు పెట్టుకొని… ఏడు మూళ్ల ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసిన ఆయనకు ఉన్న ఫ్యాన్స్ సిగ్గు పడాల్సిన విషయం… పవనన్నకు ప్రాణమిస్తాం.. జగనన్నకు ఓటేస్తాం అని తిరిగే ఈ ఫ్యాన్స్ ఎక్కడ? విజయ్ ఫ్యాన్స్ పరిణితి ఎక్కడ?’’ అని ట్రోలింగు… అవునూ, చంద్రబాబు ప్రచారం చేసిన స్థానాల వారీగా ఎవరైనా ఫలితాల్ని క్రోడీకరించారా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చరిత్రాత్మక ఢిల్లీ జింఖానా క్లబ్‌ ఇక చరిత్ర పుటల్లోకి..?
  • పెళ్లితో కెరీర్ క్లోజ్ అనేది పాతమాట… దాన్ని బ్రేక్ చేసిన డిఫరెంట్ జంట…!
  • నాడు మంజులను రానివ్వలేదు… నేడు మంజుల బిడ్డ ఎంట్రీకి రెడీ…
  • System … సినిమా ముగిసినా… డైలాగులు వెంటాడుతూనే ఉంటయ్…
  • ఎప్‌స్టీన్ రహస్యాలకు ఈమే కీలకం… నాడియా మార్సింకో!
  • బావల్లేని మరదళ్లు… మరదళ్లు లేని బావలు… ఉత్తములు- గుణవంతులు…
  • నా వాచాలత్వం జీడి పప్పు… మీ వక్తృత్వం జిల్లేడు పప్పు…
  • IPL-2026 …. ప్లేఆఫ్‌లోకి రాజస్థాన్…! పంజాబ్ కల మళ్లీ భగ్నం..!
  • డ్రగ్స్ మత్తు దిగింది సరే… ఆ ‘థార్ పోరగాళ్ల’ డబ్బు బలుపు దిగేదెలా..?
  • అవును, సీఎం విజయ్ హీరోయిన్ సూసైడ్ చేసుకుంది… సో వాట్..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions