Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కృష్ణుడు ఈ ఏడాదే వస్తానన్నాడట… అందుకే పెళ్లి చేసుకోలేదట…

November 11, 2023 by M S R

Sharath Kumar ……….  Last month, ఒక వారం పాటు సనాతన ధర్మం ఇంకా త్రిమూర్తుల గురించి research చేస్తూ ఒక article రాసుకుంటూ ఉన్నాను.

త్రిమూర్తుల ప్రస్తావన మొదటగా మనకి ‘రిగ్వేద’లో కనిపిస్తుంది. అందులో ఇవి మూడూ కేవలం ప్రకృతిలో ఉండే natural forces ఇంకా principles ని చూసి రాసుకున్న abstract ideas మాత్రమే.

అంటే అప్పటికి వాటికో రూపం ఏమి లేదు. కనిపించని శక్తి ఎదో ఉంది అనుకుని ప్రకృతిలో ఉన్న natural elements కి మంత్రాలు – శ్లోకాలు – యజ్ఞయాగాల ద్వారా ప్రసన్నం చేసుకోడానికి offerings ఇచ్చేవాళ్ళు, గొప్పగా పొగిడేవాళ్లు. (ఉదాహరణకి: వర్షాలు బాగా పడటానికి)

దాని తరవాత ఎప్పటికో 2000 సంవత్సరాలకి రాసుకున్నవే పురాణాలు. పురాణాలతోనే ఆ abstract idea ని ప్రాణమున్న దేవుళ్లుగా develop చేసి, వాటికి విశ్వంలో ఒక్కో పాత్రని ఇచ్చి, ఒక్కొక్కరికి కొన్ని గుణాలు ఇంకా లక్షణాలు ఇవ్వడం జరిగింది.

ఈ మూడింటిని Anthropomorphic Dieties అంటారు. అంటే దేవుడు అనే idea కి “మనిషి యొక్క గుణాలను” ఆపాదించడం.

అప్పుడు ఆ దేవుడితో relate చేసుకోడానికి మనిషికి easy గా ఉంటుంది. ఒక personal ఇంకా emotional connection ఏర్పడుతుంది. ఇంకా మతపరమైనవి ఇంకా నైతిక సూత్రాలని బోధించడానికి easy & powerful way గా ఉంటుంది.

(ఇది మనకంటే ముందే Sumerian ఇంకా ancient Egyptian civilization లో ఉంది. అందరిదీ same pattern. వాళ్ళకి కూడా sky god, wind god ఇంకా water god అని ఎన్నో ఉన్నాయి. వాటికి human-like characteristics ఇచ్చి ఉన్నారు.)

———-

అయితే ఒకరోజు ఇలాగే రాసుకుంటూ నిద్రపోయాను, అప్పుడు ఈ ముగ్గురూ నా కలలోకి వచ్చి, నాతో ఒక round table conference పెట్టారు.

ఏంటి?? మేము దేవుళ్ళు కాదు అని prove చేద్దామనుకుంటున్నావంటా….మమ్మల్ని మనుషుల ఊహల్లో కూడా బ్రతకనివ్వవా??? అని…

నేను, ముగ్గురికీ చాయ్ తాగించి, ఎదో సర్దిచెప్పి పంపించాను…

———

మనం మెలకువగా ఉన్నప్పుడు, అంటే మన waking ఇంకా rational state లో, ఏదయినా విషయంలో మనకి objective truth ఏంటో ఖచ్చితంగా తెలిసినప్పటికీ….

మన కలల్లో, దేవుడు మీద మనకి నమ్మకం ఉన్నట్టు రావొచ్చు….

దేవుళ్ళే మన కలలోకి కూడా రావొచ్చు…..

కలలో మన mind, truth ఏంటి అని inquire చేయదు – మన conscious ఇంకా subconscious mind తో recieve చేసుకున్న vast information అంతటినీ, mixy లో వేసి తిప్పి, మనకి creative గా ఒక కథని అల్లుతుంది.

నా conscious mind తో నేను దేవుడిని నమ్మకపోవచ్చు, కానీ నా subconscious నా చుట్టూ ఉన్నవాళ్ళ నమ్మకాలని record చేసి, నాకే దేవుడి పట్ల నమ్మకం ఉన్నట్టు – నా కలలో నాకో irrational belief ఉన్నట్టు present చేయొచ్చు.

మన కలలకి ఒక predetermined purpose ఇంకా direction ఏది ఉండదు. its just a result of random and complex neural processes.

తీసుకున్న information ని incorporate చేయడమే దాని పని. కలల నుంచి ఎన్నో deep insights మనం తెలుసుకోవచ్చు కానీ literal గా ప్రతీ కథని నిజమని నమ్మకూడదు.

అందులో ముఖ్యంగా, మన waking state లో మన predominant thoughts ఇంకా feelings నే కలలో చూపించే అవకాశాలు ఎక్కువ.

—————-

చాలా గుళ్ల స్థలపురాణం గురించి చెప్తూ, ఆ గుడి కట్టినవారికి, దేవుడే అతని స్వప్నంలో సాక్షాత్కరించి, తనకి ఒక గుడి ఫలానా చోట కట్టమని చెప్పాడు అని వింటూ ఉంటాం.

ఇప్పుడు మాధవి లత, కృష్ణుడే ఒకరి రూపంలో వచ్చి పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పాడు. ప్రేమ ఇంకా పెళ్లి అంటేనే ఇష్టంలేని నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని convince అయ్యాను అని అంటుంది.

ఇవి రెండూ నిజం అయితే, దేవుళ్ళు నాతో కలిసి ఛాయ్ తాగి, biscuit లు తిని meeting పెట్టడం కూడా నిజమే… కానీ వాస్తవాన్ని తెలుసుకోలేనంతగా ఒక నమ్మకంలో నేను మునిగిలేను. Otherwise, I could flex and proudly claim that gods hang out with me.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions