Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శివాజీలోని పెద కామందుకు కోపమొచ్చింది… శోభాశెట్టి టార్గెట్‌గా పిచ్చి కేకలు…

November 16, 2023 by M S R

శివాజీ… నాగార్జున చాణక్య అని నెత్తిన మోస్తుంటాడు… బిగ్ బాస్ టీం కూడా ఫుల్లు సపోర్టు… హౌజులో ఈ పెద కామందు ఒకరిద్దరిని పాలేర్లుగా చూస్తూ ఓ గ్యాంగ్ మెయింటెయిన్ చేస్తాడు… ఐనా తననే అంతిమ విజేతగా ప్రకటించే దిశలో తీసుకెళ్తోంది బిగ్‌బాస్ టీం… ఎందుకంత ప్రయారిటీ తనకు..?

గేమ్ ఫెయిర్‌గా ఆడటం చేతకాదు తనకు… పైగా ఎంతసేపూ శోభాశెట్టిని టార్గెట్ చేసి ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేయడం, పెద్దగా మీదమీదకు అరుస్తూ వెళ్లడం… ఇదేం ధోరణి..? అంత సీనియర్, ఏమాత్రం హుందాతనం లేకుండా ఆడుతున్నాడు… తన పెత్తనం చెలాయించుకునే ధోరణే తప్ప మరేమీ లేదు…

ఈరోజు హౌజులో జరిగింది ఏమిటి..? అర్జున్‌కు దక్కిన ఎవిక్షన్ పాస్ తన దగ్గరే కాపాడుకోవాలంటే దాన్ని డిఫెండ్ చేసుకోవాలని ఓ ఫిటింగ్ పెట్టాడు బిగ్‌బాస్… అలా యావర్ చేతికి వచ్చింది ఏదో పోటీలో… అర్జున్ చేజారింది… యావర్ కాపాడుకోవాలన్నా గేమ్స్ గెలవాలి… రెండు గెలిచాడు… మూడో గేమ్ అదేదో విల్లంబులు, బాల్స్ బ్యాలెన్స్…

Ads

అందులో శివాజీ, యావర్, ప్రియాంక పోటీదారులు… శోభాశెట్టి, ప్రశాంత్ సంచాలకులు… మధ్యలోనే శివాజీ బాల్స్  కింద పడేసి బరి నుంచి బయటికి వచ్చేశాడు… అదేమంటే ప్రశాంత్ మీద అరిచాడు… డిస్టర్బ్ చేయడం వల్లే తను కాన్సంట్రేషన్ కోల్పోయాను అని… తనకు సోయి లేనిది ఏమిటంటే..? డిస్టర్బెన్స్ ఉన్నా సరే, కాన్సంట్రేట్ చేసి గెలవడమే గెలుపు అని… ప్రశాంత్ తన గ్యాంగే కాబట్టి నోరు మూయించాడు… ఇక శోభ…

నువ్వు ఫస్ట్ వీక్ నుంచి ఇంతే… ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలే అని మొదలుపెట్టాడు… అటూఇటూ తిరుగుతూ పెదరాయుడు స్టయిల్‌లో ఆమె నిర్ణయాన్ని ప్రభావితం చేయడానికి ఒకరకంగా బ్లాక్ మెయిల్ చేయసాగాడు… ఒక దశలో ‘ఆమె తనంతట తనే ఎలిమినేషన్‌కు మార్గం వేసుకుంటోంది’ అన్నాడు… తనకు అలవాటే కదా, ఎవడో ఒకడిని తన్ని బయటికి పోతాను, ఈ రాజమాతలకు మూతులు పగులుతాయ్ వంటి తలతిక్క వ్యాఖ్యలు…

శోభ ఎలిమినేషన్‌కు మార్గం వేయడం అంటే… ఒక పాజిబులిటీ చూద్దాం… యావర్ చేతిలో ఎవిక్షన్ పాస్ గనుక ఉంటే… రతిక చివరి ప్లేసులో గనుక ఉంటే, శోభ కింద నుంచి రెండో ప్లేసులో ఉంటే… ఎవిక్షన్ పాస్ సొంతం కోసం గాకుండా ఎవరికైనా ఉపయోగించాలి అనే పుల్టా రూల్ ఏదైనా బిగ్‌బాస్ పెడితే… అప్పుడు శివాజీ శాసిస్తాడు, యావర్ పాటిస్తాడు… శోభ బయటికి వెళ్లిపోతుంది… రతిక సేవ్ అవుతుంది… ఎందుకంటే..? శివాజీ టార్గెట్ శోభ… రతిక వీక్ ప్లేయర్, ఆమెతో జరిగే నష్టం ఏమీ ఉండదు…

శోభ బయటికి వెళ్తే ఆమె గ్రూపులోని ప్రియాంక, అమర్ మోరల్‌గా వీక్ అయిపోతారు… ఇదీ శివాజీ ప్లాన్… ఇంత అవసరమా..? ఐనా సరే, నాగార్జున ఏమీ అనడు… ఒకవేళ వీకెండ్ షోలో అడిగినా, అబ్బే అదంతా సరదాగా అని శివాజీ చెబుతాడు… నాగార్జున సరేనంటూ తలూపుతాడు… ఏం ఫేక్ షో నడిపిస్తున్నర్ర భయ్…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దీపిక పడుకోన్ సరే- హీరోల ‘చిల్లర ఖర్చుల’పై ఎవరైనా నోరెత్తగలరా..?!
  • విజయ్ బాటలో జూనియర్! జూలై 18న ఏం చెప్పబోతున్నాడు?!
  • నిఖార్సుగా, నిజాయితీగా, బేషరతుగా ప్రేమించేవారు ఎవరైనా ఉంటారా?
  • ఏదో ఒకటి గోక్కోవడం అనసూయకు అలవాటే కదా… ఇదీ అదే..!!
  • కేసీయార్ క్షుద్ర జర్నలిజం! అసలు నీరో ఎవరు పెద్ద దొరవారూ!?
  • సర్సర్లే గానీ పాయల్… ఆ కంటెంట్ లేకపోతే సబ్‌స్క్రిప్షన్లు వస్తాయంటావా!?
  • బీఆర్ఎస్ నిధులపై కవిత పేల్చిన పొలిటికల్ కరప్షన్ బాంబు!
  • మరో రాజ్యాంగ పోరాటం! ఆ బిల్లును గెలుకుతున్న సీఎం విజయ్!!
  • అసలు బ్లండర్ కేసీయార్‌కూ తెలుసు! అందుకే కాళేశ్వరంపై ద్రోహ నిశ్శబ్దం!!
  • ఐదు పెళ్లిళ్లు – డజను అఫయిర్స్… కానీ చివరకు ఏమయ్యాడు..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions