ఎక్కడో ఏదో తేడా కొడుతోంది… హైదరాబాద్‌లో రాహుల్ సభకు జనం లేకపోవడం ఖచ్చితంగా కాంగ్రెస్ ఆత్మసమీక్ష అవసరమని తెలియజెబుతోంది… రేవంత్ రెడ్డిని బలహీనపరచడానికి ఏమైనా ప్రయత్నాలా..? ఈ ఎన్నికల్లో సరైన సీట్లు రాకపోతే తనను బలిపెట్టాలనే ఆలోచనలా..? సభాస్థలికి జనం రాకపోవడంతో చాలాసేపు రాహుల్ వెయిట్ చేయాల్సి వచ్చింది… జన సమీకరణ దాకా ఎందుకు..? నగరంలోని కేడర్ సరిగ్గా హాజరైతే చాలు కదా సభాస్థలి నిండుగా కనిపించడానికి… నిజానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సిటీ, మెదక్ ప్రాంతాల్లో […]
లీగల్ లిటిగేషన్లతో కొట్టాలి బీఆర్ఎస్‌ను… రేవంత్‌కు ఆంధ్రజ్యోతి పిలుపు…
గేట్లు తెరిచి, ఎడాపెడా చేరికలకు వోకే చెప్పేసిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బ్యానర్ స్టోరీలో చెప్పిన ఓ సలహా పాటిస్తే బెటరేమో…! మన ఎమ్మెల్యేల సంఖ్య పెరగకపోతేనేం, ఎదుటోడి ఎమ్మెల్యేల సంఖ్య ఎలా తగ్గినా సుఖమే కదానేది ఈ స్టోరీ మార్మిక సారాంశం… ఆంధ్రజ్యోతికి రేవంత్ రెడ్డి ఎలాగూ నిత్యపాఠకుడే కాబట్టి తను సీరియస్‌గానే ఆలోచించే చాన్సయితే ఉంది… విషయం ఏమిటంటే..? మెజారిటీకన్నా అయిదారు స్థానాలే ఎక్కువున్నయ్… ఒకవేళ కేసీయార్, బీజేపీ గనుక కలిస్తే… (అవకాశాలు […]
ఆ కేసీయార్ హిస్టరీని రిపీట్ చేయడం రేవంత్‌కు ఎందుకు తప్పనిసరి..!!
2014… కేసీయార్‌కు అత్తెసరు మెజారిటీయే… తెలుగుదేశం, కాంగ్రెస్ ఏవో కుట్రలు పన్ని, తెలంగాణ ఏర్పాటుకు ఓ విఫల ప్రయోగంగా చేస్తాయనే భయం కూడా ఉండింది… కేసీయార్ గేట్లు ఎత్తాడు… నిలబెట్టి ఒక్కొక్కరికి ఏం కావాలో అడిగి మరీ అప్పటి టీఆర్‌ఎస్‌లోకి లాగేసిండు… ఒక్క కాంగ్రెసో, ఒక్క తెలుగుదేశమో కాదు… టీడీపీ 12, కాంగ్రెస్ 5, వైసీపీ 3, సీపీఐ ఒకటి, బీఎస్పీ ఇద్దరు… గేట్లు దాటి జంప్… ఎందుకు..? ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడం… ఎలాగూ ప్రజెంట్ రాజకీయాల్లో […]
హవ్వ… బీఆర్ఎస్, కాంగ్రెస్ తోడు దొంగలట… మరిన్నాళ్లూ కాపాడిందెవరు మహాశయా..?!
1) కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ దోపిడీ, ఇప్పుడు కాంగ్రెస్‌కు ఏటీఎం, ఢిల్లీ దాకా కమీషన్లు చేరుతున్నయ్, బీఆర్ఎస్ స్కాములు ఢిల్లీని చేరాయ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పర సహకారం, ఏ భారీ స్కాం బయటపడినా కుటుంబ పార్టీల పాత్రే తేలుతోంది….. మోడీ వ్యాఖ్యలు ఇవన్నీ… …. నిజమే, ఏ భారీ స్కాం బయటపడినా కుటుంబ అవినీతి పార్టీల పాత్రే తేలుతోంది అనేది కరెక్టే… కుటుంబ పార్టీలు ఖచ్చితంగా దేశానికి చేటు… కానీ బీఆర్ఎస్ అవినీతి మీద గతంలో తప్పనిసరై […]
మళ్లీ కొత్తగా అదే ప్రొసీజర్…? ఆ ఇద్దరికే ఎమ్మెల్సీలుగా మళ్లీ చాన్స్..!
కోదండరాంను రేవంత్ కావాలనే బకరా చేశాడనే పిచ్చి విమర్శ ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది… తప్పు… హైకోర్టులో ఉన్న కేసు తీర్పు ఎలా వస్తుందో రేవంత్ ప్రభుత్వ ముఖ్యులకు ఆల్రెడీ ఓ ఐడియా ఉంది… గవర్నర్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే ఆమె కేబినెట్ నిర్ణయాలను తప్పకుండా ఆమోదిస్తుందనే నమ్మకం, అనుభవమూ ఉన్నాయి… సో, కోదండరాంతోపాటు జర్నలిస్టు అమెర్ అలీ ఖాన్‌లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలనే నిర్ణయం తీసుకుని గవర్నర్‌కు పంపించింది ప్రభుత్వం… ఆమె వెంటనే ఆమోదముద్ర […]
నాడు తొడలు గొట్టి సవాల్ విసిరాడు… ఇప్పుడు ఆ తొడలే విరిగిపోతూ కాళ్లబేరం..!!
మల్లారెడ్డి… ఈ పేరు తెలియని వాళ్లు లేరు, ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు… పాలమ్మి, పూలమ్మి వేల కోట్లు, ఎంత ఆస్తి ఉందో తనకే తెలియనంత సంపద పోగేసిన పేరు… నిజం చెప్పాలంటే జస్ట్, అలా పాలు అమ్మి, పూలు అమ్మి ఇంత డబ్బు గడించిన కథ ప్రపంచంలోకెల్లా అతి పెద్ద సక్సెస్ స్టోరీ అవుతుందేమో… తన చరిత్ర తవ్వుతూ పోతే ఎన్ని పెంకాసులో, ఎన్ని రత్నాలో సంక్షిప్త వివరణ అసాధ్యం గానీ… విజ్ఞత, పరిణతి, హుందాతనం వంటి […]
జర్నలిస్టులు స్వేచ్ఛ అనుభవించారట… హరీష్‌రావు వింత విమర్శలు…
ప్రజా పాలనలో పెన్నులు గన్నులు ఐయ్యాయి… మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలానే ఉండేనా… అన్ని ఫ్లోర్ లు స్వేచ్చ గా తిరిగేవారు జర్నలిస్ట్ లు… విలేకరులకు ఎందుకు స్వేచ్ఛ లేదు సచివాలయంలోకి……. ఈ మాట అన్నది మాజీ మంత్రి, కేసీయార్ కుటుంబసభ్యుడు, బీఆర్ఎస్ ప్రధాన నేత హరీష్ రావు… కొంతమేరకు ఆచితూచి, కాస్త మెచ్యూర్డ్‌గా మాట్లాడతాడని పేరున్న హరీష్‌ను కూడా ఓరకమైన ఫ్రస్ట్రేషన్ ఆవరిస్తున్నట్టుంది… నిజంగా తన విమర్శ చూసి జర్నలిస్టులందరూ నవ్వుకునేలా ఉంది… పెన్నులు-గన్నులు అనే వ్యాఖ్యను నవ్వుకుని […]
పీఎంగా మోడీ వేరు… బీజేపీ మోడీ వేరు… రేవంత్ గీసుకున్న ఓ విభజన రేఖ…
రేవంత్ మంచి స్ట్రాటజిస్టు..! వేదిక మీద మోడీకి అభివాదం చేసి, తన ప్రసంగంలో కూడా నాలుగు సానుకూల వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీద సోషల్ మీడియాలో కనిపించిన ఓ వ్యాఖ్య ఇది… ‘మోడీతో సత్సంబంధాలు’ అనే కోణంలో రేవంత్‌రెడ్డి ధోరణి ఏమిటనే ప్రశ్నకు ఎవరి బాష్యాలు వారికి ఉండవచ్చుగాక… కానీ ఒక్కసారి స్థూలంగా పరిశీలిద్దాం… రేవంత్‌రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి… నరేంద్రమోడీ ఈ దేశానికి ప్రధాని… ప్రధానిని ముఖ్యమంత్రులు కలవాలి, అడగాలి, సాధించాలి,.. కేంద్రం- […]







