.
అవును, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు… కేటీఆర్ వర్కింగ్ సీఎం కమ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు… పెద్ద దొరవారు ఫామ్ హౌజులో ఎవరికీ అందుబాటులో లేకుండా పోతే… కొడుక్కిమొత్తం వ్యవహారాలు అప్పగించేస్తే… ఆల్మోస్ట్ తెలంగాణ ముఖ్యమంత్రిలాగే కేటీఆర్ చెలామణీ అయ్యాడు… బహిరంగ రహస్యం…
మరీ కీలకమైన అంశాల్లో మాత్రమే కేసీఆర్ బయటికి కనిపించేవాడు… సేమ్ టు సేమ్… చంద్రబాబు అచ్చు కేసీఆర్‌లా అయిపోయాడు… కేటీఆర్‌లాగే లోకేష్ మొత్తం చక్రాలు తన చేతుల్లోకి తీసేసుకున్నాడు… అన్ని రకాల వ్యవహారాలూ తన చెప్పుచేతల్లోనే… ప్లస్ తన అనుంగు అనుచరుల చేతుల్లోనే…
Ads
సాక్షికి రాయడం ఎలాగూ చేతకాదు, ఏం రాయాలో కూడా తెలియదు… యెల్లో మీడియా అసలు రాయదు… కానీ జమీన్ రైతు డోలేంద్ర ప్రసాద్ రాస్తాడు… కుండ బద్దలు కొట్టేస్తాడు… ఖుల్లంఖుల్లా… ఇలా…

Zamin Ryot …. కొడుకు మాటే నెగ్గింది
ముగ్గురు రాజ్యసభ సభ్యులూ లోకేష్ మిత్రులే
సానా సతీష్ అర్హత – లోకేష్‌తో సాన్నిహిత్యం
లేటరైట్ గనుల నియంత్రణలో ప్రావీణ్యానికి విజయ్‌కు బహుమానం
నెలవారీ సర్వేలతో మెప్పించి, పదవీ తాయిలం కొట్టేసిన భాష్యం
టిడిపితో వారధిగా లింగమనేని లౌక్యానికి జనసేన కానుక
- నాలుగు రాజ్యసభ ఖాళీలు నింపేసారు. ఒకటి జనసేన, మూడు తెలుగుదేశం. అయితే విచిత్రంగా ఈ నలుగురిలో ఒక్కరంటే ఒక్కరికి కూడా రాజ్యసభకు వెళ్లగలిగిన స్థాయి, అనుభవం, దేశ రాజకీయాల పట్ల అవగాహన, పార్లమెంటరీ వ్యవస్థతో పరిచయం, ప్రజలతో కలిసిమెలిసి తిరిగిన చరిత్ర లేకపోవడం రెండు పార్టీలలోనూ చర్చనీయాంశంగా మారింది.
జనసేన అభ్యర్థిగా లింగమనేని రమేష్‌ను ఎంపిక చేశారు. ఆయన బడా కుబేరుడు. రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకున్నవాడు. ఆ స్థలాలలో ఒకదానిలో ఇల్లు కట్టించి, చంద్రబాబుకు ఇచ్చాడు. మరొక దగ్గర జనసేన ఆఫీసు కట్టుకోవడానికి జాగా చూపించాడు. ఈ రెండేళ్ల కాలంలో జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య వారధివలె పని చేస్తున్నాడు.
మాటలు చేరవేయడమే ఆయన బాధ్యత. నిర్ణయాలలో ఎటువంటి ప్రమేయం లేదు. మాటలతో పాటు మూటలు కూడా కలిసే వుంటాయి కదా? దానికి ప్రతిగా ఆయన సిఫార్సుతో బెరైటీస్ గనుల దోపిడీకి వైకాపా అగ్రనేతలకు సమీప బంధువులకు అవకాశం ఇచ్చారు. వారి నుంచి తృణమో పణమో అందుతుందో లేదో తెలియదు.
ఇప్పుడు తాజాగా అనంతపురం జిల్లాలో జెన్కో నిర్మించతలపెట్టిన ఒక భారీ జల విద్యుత్ కేంద్రం కాంట్రాక్ట్ పని తనకే ఇవ్వాలని హఠం పట్టి, ఐదారు నెలలుగా టెండర్ ప్రక్రియను అడ్డుకుంటున్నాడు. అటు వైపు ఈయన కంటే బలవంతుడైన బడా కాంట్రాక్టర్ వున్నాడు కాబట్టి, తాగు లాగుడు పోటీ నడుస్తూనే వుంది. లింగమనేని రమేష్ గారి చరిత్ర ఇంతే. ఆయనకు రాజ్యసభ ఇచ్చారంటే, పవన్ కళ్యాణ్ ఆ నిర్ణయం ఎందుకు చేసి వుంటాడో ఊహించడం కష్టం కాదు. పార్టీ నడపాలంటే డబ్బు కావాలి కదా?
తెలుగుదేశం పార్టీ ఎంపిక మరింత వివాదాస్పదం. ఒకరు లోకేష్ ఏ ఊరికి వెళ్లినా ఫైవ్ స్టార్ స్థాయికి తగ్గకుండా ఆతిథ్య మర్యాదలు చేసే వాడు; ఒకడు లోకేష్ పనుపున రాజమండ్రి నుంచి విశాఖపట్నం వరకు లేటరైట్ పేరుతో నిషేధిత బాక్సైట్ ఖనిజాన్ని ఇబ్బడి ముబ్బడిగా తరలించి, కోట్లకు కోట్లు సంపాదించి, కప్పం కడుతున్న వాడు. ముచ్చటగా మూడవ వ్యక్తి – లోకేష్ మనసును రంజింప చేసే స్థాయిలో, సర్వే చేసినట్లు, దానిలో తెలుగు దేశం పార్టీ గ్రాఫ్ రోజురోజుకు పెరిగి పోతున్నట్లు, నెల నెలా నివేదికలు ఇచ్చి, టిడిపి ఎమ్మెల్యేల ర్యాంకింగులకు ఇన్‌పుట్ అందిస్తున్న వాడు.
ముగ్గురివీ వ్యక్తిగత సంబంధాలు మాత్రమే. ఇందులో రాజకీయం అంటూ ఏమీ లేదు. ప్రజలతో సంబంధం అవసరం లేదనుకున్నారు. రాజ్యసభ గౌరవంతో మనకేమి పని అని భావించారు. తెలుగుదేశం కోసం ఒక జీవిత కాలం పాటు అంకిత భావంతో పని చేసిన వారిని, గేట్ దాటి లోపలకు కూడా రానివ్వలేదు. కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు.
జగన్ హయాంలో ధైర్యంగా ముందుకు వచ్చి, వీరోచిత పోరాటాలు చేసి, జైలుకు వెళ్లి, లాఠీ దెబ్బలు తిన్న వారిని కూడా, మీతో ఇంకేమి పని వుంది మాకు అని ప్రశ్నించారు. పాత మాకొక రోత, కొత్తలో వింత ఏమిటో రుచి చూడాలి కదా అనే ధోరణిలో ఈ ముగ్గురి ఎంపిక జరిగింది.
రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో తండ్రీ కొడుకుల మధ్య పేచీ తలెత్తుతుందని గత వారం వ్రాశాము. అది నిజం. కానీ ఈ వాదోపవాదాలలో కొడుకు మాట నెగ్గింది. పాపం, చంద్రబాబు ముసలివాడిగా పరిగణనకు గురై, వెనక్కు వెళ్లిపోయాడు. ఆయన ముసలి వాడని తిట్టిన జగన్ మీద తెలుగుదేశం పార్టీ మొత్తం ఆడిపోసుకున్నది.
కానీ ఇప్పుడు స్వంత కొడుకే, నువ్వు ముసలి వాడివి, నీకేమీ తెలియదు పొమ్మని పక్కన పెడితే, ఏ తెలుగు నేత కూడా నోరు విప్పి మాట్లాడే సాహసం చేయడం లేదు. లోకేష్‌కు అసలే ముక్కు మీద కోపం. ఇంకా మూడేళ్ల కాల వ్యవధి వుంది, అధికారం అనుభవించడానికి. ఎవరి కోసమో మనం ఎందుకు చెడ్డ కావాలన్న ధోరణిలో సైలెంట్ అయిపోయింది పార్టీ…..
Share this Article