Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చట్టిలో సరుకేదో నింపుకెళ్లు… భువనచంద్రుడూ వేటూరికి తీసిపోడు…

May 18, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. బంగారు కోడిపెట్ట వచ్చెనండి హే పాపా హే పాపా హే పాపా చెంగావి చీరె గుట్టు చూసుకోండి . 1992 లో వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు ఐకానిక్ పాట భువనచంద్ర వ్రాసిన ఈ బంగారు కోడిపెట్ట పాట . చిరంజీవి , డిస్కో శాంతి మీద తీసిన ఈ పాటకు డాన్స్ కంపోజ్ చేసింది బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సుప్రియ . మగధీర సినిమాలో ఈ పాటను రాం చరణ్ తేజ , మమైత్ ఖాన్ల మీద రీమిక్స్ చేసారు . ప్రేక్షకులను ఉర్రూతలూగించిన పాట .

కన్నడంలో వచ్చిన అనురాగ అరళితు సినిమాకు రీమేక్ మన తెలుగు ఘరానా మొగుడు . H.G.రాధా దేవి నవల అనురాగద అంతపుర నవల ఆధారంగా తీయబడిన ఈ కన్నడ సినిమాలో రాజకుమార్ , మాధవి , గీత లీడ్ రోల్సులో నటించారు . కన్నడంలో రికార్డులు బద్దలు కొట్టిన ఈ సినిమా తెలుగుతో కలిపి ఏడు భాషల్లోకి రీమేక్ అయింది . తమిళంలో రజనీకాంత్ , విజయశాంతి , ఖుష్బూల నటించారు .

Ads

హిందీలో అనిల్ కపూర్ , శ్రీదేవి , రవీనా టాండన్ నటించారు . సింహళ , ఒడియా , బంగ్లాదేశీ , బెంగాలీ భాషల్లోకి రీమేక్ అయింది . మళయాళంలోకి డబ్ చేయబడితే తిరువనంతపురంలో సిల్వర్ జూబిలీ ఆడింది . తెలుగులో పది కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ దాటాయి . 39 సెంటర్లలో వంద రోజులు ఆడింది . మూడు సెంటర్లలో 175 రోజుల పోస్టర్ పడింది . ఇది ఈ సినిమా రికార్డ్ .

ఏ సినిమాకు అయినా సరుకు లేకుండా రికార్డులు సృష్టించబడవు . ఈ సినిమా ఘన విజయానికి మూల పురుషుడు చిరంజీవి . ఫైట్లు , డాన్సులు మాత్రమే కాదు ; అద్భుతమైన కామిక్ టైమింగ్, తదనుగుణంగా డైలాగ్ డెలివరీ . ముఖ్యంగా ఈ సినిమాలో కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి , ఇదుగో మాస్టారూ , కసా బిసా  వగైరా వంటి డైలాగులు ఊతపదాలు అయిపోయాయి .

ఇవి కాకుండా వెడమ చెయ్యి వెనక్కు పెట్టి వంగి కుడి చేత్తో వయ్యారంగా దండం పెట్టడం హైలైట్ . క్లైమాక్సులో ఫైటింగ్ , రెస్క్యూ ఆపరేషన్ , వగైరా . చాలా బాగా నటించారు . అతనికి గొప్ప కాంబినేషన్ రావు గోపాలరావు . అల్లుడు శిష్యా అంటూ మామ ; మామ గురువా అంటూ అల్లుడు ఇద్దరూ పోటాపోటీగా నటించారు .

1+2 సినిమా కదా ! ఫేక్టరీ ఓనరుగా , తలబిరుసు హీరోయిన్ గా నగ్మా ; ఆమె PA గా వాణీ విశ్వనాథ్ ఇద్దరూ గ్లామర్ స్పేసుని బ్రహ్మాండంగా ఫిల్ చేసారు . దర్శకుడు రాఘవేంద్రరావు ఇద్దరి గ్లామరుతో పాటలను చాలా అందంగా చిత్రీకరించారు . కప్పుకో దుప్పటి పాటను మినహాయించి మిగిలిన అయిదు పాటల్నీ భువనచంద్రే అద్భుతంగా వ్రాసారు .

బాలసుబ్రమణ్యం , చిత్ర , మనో శ్రావ్యంగా పాడి హిట్ సాంగ్సుని చేసారు . తార , ప్రభుదేవా పాటల్ని చిరంజీవి లెవెల్లో కంపోజ్ చేసారు . నగ్మా , వాణీ విశ్వనాథు కూడా ధీటుగానే డాన్సించారు . ఒక పాటలో నగ్మా బెడ్ మీద నుండి చిరంజీవి మెడ మీదకు ఒక కాలు వేసి కుస్తీ లెవెల్లో అక్రమించుకుంటుంది . అయ్యబాబోయ్ . రాఘవేంద్రరావుకే తగింది . ప్రభుదేవాకు తట్టిందేమో ఆ అవుడియా .

ఓ వానపాట . కిటుకులు తెలిసిన చిటపట చినుకులు పిటపిటలాడిన పరువపు తళుకులు అంటూ చిరంజీవి , వాణీ విశ్వనాథు మీద ఉంటుంది . పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దాని పేరు . ఈ డ్యూయెట్ చిరంజీవి , నగ్మాల మీద .

హే పిల్ల హల్లో పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం వన్ బై టూ వన్ బై టూ , ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు ఎక్కడో గుచ్చావు చేప ముల్లు , కప్పుకో దుప్పటి చలేస్తే (ఈ పాటను కీరవాణి వ్రాసారు) అంటూ సాగుతాయి మిగిలిన డ్యూయెట్లు . కీరవాణి సంగీతం పాటలకు ఎంత బాగుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . పాటలు జనంలో హిట్టయితే ఆ క్రెడిట్ అంతా సంగీత దర్శకుడికే . బేక్ గ్రౌండ్ స్కోర్ కూడా చక్కగా ఉంటుంది .

ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్లు అనే పాటలో భువనచంద్ర ఏకంగా చట్టిలో సరుకేదో నింపుకెళ్లు అని రాస్తాడు, అంటే ఏమిటి మాస్టారూ, మరీ వేటూరి ఆవహించిన చందంగా…

ప్రధాన పాత్రల్లో శుభ , రమాప్రభ , శరత్ సక్సేనా , సత్యనారాయణ , పొన్నంబలం , సాక్షి రంగారావు , పి యల్ నారాయణ , ఆహుతి ప్రసాద్ , బ్రహ్మానందం  తదితరులు నటించారు .

సినిమా కధ అందరికి ఇంకా గుర్తున్నదే . టూకీగా కూడా చెప్పనక్కర్లేదు . దేవీ ఫిలిం ప్రొడక్షన్స్ బేనరుపై ప్రముఖ నిర్మాత దేవీ వరప్రసాద్ నిర్మించిన ఈ సినిమా 24 వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో కూడా ప్రదర్శించబడింది . ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది ఉత్తమ వినోదాత్మక చిత్రంగా . తరచూ ఏదో ఒక టివి చానల్లో వస్తూనే ఉంటుంది . యూట్యూబులో కూడా ఉంది . Undoubtedly , a great romantic , action entertainer .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ – ఒక థ్రిల్లింగ్ ‘మెగా’ సీరియల్!
  • పల్స్ పోలియో! ఏటా ‘చుక్కల’ ప్రయాసకు కూడా పాకిస్థానే కారణం..!
  • అన్నీ వదిలేసి.., హిమాలయ సన్యాస జీవనం అంత సులభమా?
  • నిజమే – పాస్‌పోర్టు జాతీయతను నిర్ధారించదు! ఇదీ వాస్తవ స్థితి!
  • RAAKA – రష్మిక నెగెటివ్ షేడ్స్ – రొమాన్స్ కాదుట, ఘర్షణ !
  • BRS – నైరాశ్యం వీడని పార్టీ కేడర్! ఫాయిదా లేని KTR ప్రయాస!!
  • ఆశ్చర్యమేమీ లేదు- పాక్ క్రికెటర్లతో ఉగ్రవాదుల చెట్టాపట్టాల్!
  • పాకిస్థాన్! … అరబ్ భ్రమల నుండి సింధు, సంస్కృత మూలాల వైపు…
  • ‘కమ్మ’ అంటే తెలుసా? – ‘ఇడుపు కాయితం’ అసలు అర్థమేమంటే?
  • గంగ చంద్రముఖిలా..! కాషాయ రాంచందర్‌ కాస్తా పింక్ హరీష్‌లా…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions