.
తమిళ రాజకీయాల నికృష్టం చదువుతున్నారు కదా… అందరిలో ఆ స్టాలినుడే బెటర్ అనిపిస్తున్నాడు… డీఎంకే ఓడిపోవచ్చుగాక… తన కూటమి నుంచి కాంగ్రెస్ విడిపోయి, టీవీకే విజయ్ చంకలో చేరాలని తహతహలాడిపోతోంది… దాని గుణమే అది… శునకతత్వం… మళ్లీ లోకసభ ఎన్నికల నాటికి చూస్తూ ఉండండి, మళ్లీ స్టాలిన్ పంచలో చేరుతుంది…
దేనిది దానికే… ఎస్, లెఫ్ట్, మేము, ఇద్దరూ ఇండి కూటమే… ఐతేనేం, కేరళలో తన్నుకోలేదా..? బెంగాల్‌లో పోటీపడలేదా..? అని ఉల్టా సమాధానం ఇవ్వగలదు… టీవీకేకు మద్దతునిస్తే రెండు మంత్రి పదవులట, రాబోయే స్థానిక ఎన్నికలు, నామినేషన్ పదవులు, రాజ్యసభ సభ్యత్వాలన్నింటిలో విశేష ప్రాధాన్యం కావాలట… ఐనా సరిపోదు కదా… ఇంకేముంది..? ఎక్కడా ఏ దిక్కూ లేని సీపీఎం, సీపీఐ ఎగేసుకుంటూ వెళ్తాయి…
Ads
స్టాలిన్‌కు తత్వం బోధపడిందో… లేక ఛలో అని తనే కనుసైగ చేశాడో… కోవర్టులు కావాలి కదా… కానీ డీఎంకేలో ఒక్కడంటే ఒక్క ఎమ్మెల్యే కూడా అటూఇటూ చూడలేదు… అదీ డీఎంకే కట్టుబాటు, స్టాలిన్ నాయకత్వం… అంతేగాకుండా స్టాలిన్ హుందాగా ఓటమిని అంగీకరించాడు… ఓటములనూ చూశాం, గెలుపులనూ చూశాం, ప్రతిపక్షంలో ఉంటాం అని వెంటనే రాజీనామా చేశాడు… (తను సీఎం కుర్చీని బల్లిలా కరుచుకుపోయిన మమత కాదు కదా…)
అంతేకాదు… తనకు వోట్లేసిన ప్రజలకు థాంక్స్ చెప్పడానికి, వోడిపోయినా సరే, తన నియోజకవర్గం వెళ్లాడు, అందరికీ దండాలు పెట్టాడు… (తన పక్కా హిందూ వ్యతిరేకత, ఉదయనిధి పైత్యం వేరే కథ)… మరి అన్నాడీఎంకే..? అదొక దిక్కుమాలిన కూటమి… దాన్ని మోడీ నమ్మడం అతి పెద్ద బ్లండర్… ఏ కోణంలో చూసినా తప్పే..,
జయలలిత నాయకత్వం వేరు… ఆమె ఛరిష్మా వేరు… ఆమె చనిపోయాక, శశికళ పార్టీని హైజాక్ చేయకుండా ఇదే మోడీ ఆమె కాళ్లూకీళ్లూ సాఫ్ చేశాడు… ఈడీ, రెవిన్యూ ఇంటలిజెన్స్, ఐటీ దళాలు విరుచుకుపడ్డాయి… దెబ్బకు మళ్లీ కనిపించకుండా పోయింది… శాశ్వత తాత్కాలిక ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంను కూడా స్టాలిన్ తన ఫోల్డ్‌లోకి తీసుకుని, ఏదో ఓ సీటు ముష్టి వేశాడు… కానీ పళనిస్వామి..?
వ్యక్తిగతంగా ఆదరణ నిల్… మాట్లాడలేడు… నాయకత్వ లక్షణాలు లేవు… లాస్ట్ ఎన్నికల్లోనే తేలిపోయింది… ఐనా తనను ఎందుకు పట్టుకుని వేలాడినట్టు బీజేపీ… పైగా పళనిస్వామి ఎంత గల్లీ లీడర్ అంటే… అన్నామలై బీజేపీ అధ్యక్షుడిగా ఉండొద్దని, ఎక్కడా టికెట్ ఇవ్వవద్దనీ, ప్రచారం చేయవద్దనీ డిమాండ్లు పెడితే బీజేపీ సాగిలబడి సరేనంది… బ్లండర్…
అన్నాడీఎంకే కూటమిలోని అనేక పార్టీల్లో బీజేపీ ఒకటి… అంతకుమించి ఏం ప్రాధాన్యం ఉంది..? చివరకు ఏం జరిగింది..? 40 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పళనిస్వామిని ఎహెఫో అని తిరస్కరించి, విజయ్ పార్టీకి మద్దతు పలుకుదాం అని రెడీ అయిపోయారుట… సమీపంలో వేరే భవిష్యత్తు ఏమీ కనిపించడం లేదు, ఇప్పుడే సర్దుకుందాం అని… ఇదుగో ఇదీ పళనిస్వామి నాయకత్వం… కుక్కతోక పట్టుకుని బీజేపీ తమిళసాగరం ఈదాలని విఫల ప్రయత్నం…

పోనీ, పళనిస్వామి ఎదుట సాగిలబడ్డారు సరే… (అన్నామలై నవ్వుతూ ప్రేక్షకపాత్ర వహించాడు)… ఏం ఒరిగింది..? ఒకే ఒక సీటు గెలిచారు… (ఉదగమండలం – ఎం. భోజరాజన్) … గత ఎన్నికల్లో (2021) గెలిచిన ప్రముఖ నేతలందరూ ఈసారి ఓటమి పాలయ్యారు… వాళ్లు నలుగురు… వనతి శ్రీనివాసన్: కోయంబత్తూరు సౌత్ (నటుడు కమల్ హాసన్‌పై విజయం)… నైనార్ నాగేంద్రన్: తిరునెల్వేలి… ఎం.ఆర్. గాంధీ: నాగర్‌కోయిల్… సి.కె. సరస్వతి: మొడక్కురిచ్చి…. అంటే నాలుగు నుంచి ఒకటికి పడిపోయింది బీజేపీ…
దీనికన్నా కేరళ నయం కాదా..? ఏకంగా 11.4 శాతం వోట్లు సాధించి మూడు సీట్లు కూడా గెలిచింది… రాజీవ్ చంద్రశేఖర్ నెమామ్ స్థానంలో సీపీఎం సీనియర్ లీడర్ శివన్ కుట్టిని ఓడించాడు… వి.మురళీధరన్, బీబీ గోపకుమార్ మరో ఇద్దరు విజేతలు… సొంతంగా, ఎవడి మద్దతూ అవసరం లేకుండా… యూడీఎఫ్, ఎల్డీఎఫ్‌లను తట్టుకుని గెలిచిన ఈ ముగ్గురే అసలైన స్పూర్తి…
ఆ తెలివి, ఆ సోయి తమిళనాట ఎందుకు లోపించింది..? అదుగో అన్నామలై పకపకా నవ్వుతున్న ధ్వని..!! బీజేపీ ప్రాయోజిత అన్నాడీఎంకే కూటమి ప్రస్తుతం చీలిక అంచుల్లో నిలబడింది… ఇదేనా బీజేపీ సాధించింది..? పిటీ..!!
Share this Article