.
సర్కారు బడి… ఇది దోపిడీ చేసే కార్పొరేటు, ప్రైవేటు బడి కాదు… తల్లిదండ్రుల చెమట దోచుకునే దందా కూడా కాదు… ఉచితంగా చదువు చెప్పి ప్రయోజకులను చేసే ప్రాంగణం… కానీ కొన్నేళ్లుగా… అంటే తెలంగాణ ప్రత్యేక స్వరాష్ట్రం సిద్ధించాక సైతం తీవ్రంగా నిర్లక్ష్యానికి గురికాబడిన రంగం… అంటే, కేసీయార్ పాలనలో..!
కానీ ఇప్పుడు ఓ కొత్త స్వప్నం కళ్లెదుటకు వస్తోంది… అదే తెలంగాణ పబ్లిక్ స్కూల్… అంటే నర్సరీ- కేజీ నుంచి ఇంటర్ దాకా… అంటే ప్లస్ టూ దాకా… అన్నీ అక్కడే… పొద్దున బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నభోజనం, సాయంత్రం స్నాక్స్… ఇంగ్లిష్ మీడియం…
Ads
ఇవే కాదు, సిలబస్‌లో ఉండే పాఠాలే కాదు… ఆధునిక, వర్తమాన జీవనానికి సంబంధించిన టెక్నికల్ స్కిల్స్ వైపు తీసుకెళ్లడం… అత్యాధునిక లేబరేటరీలు, లైబ్రరీలు, డైనింగ్ హాల్, డిజిటల్ క్లాస్ రూమ్స్… హైజీన్, యాంత్రిక వంటశాల… ప్లస్ జిమ్, కల్చరల్, ఎక్సట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌ను ప్రోత్సహించే ఇండోర్, ఔట్ డోర్ గ్రౌండ్స్… ఉచిత రవాణా… ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్… పేరెంట్స్ ఇంతకు మించి ఏం ఆశిస్తారు..?
దీనికి చెమట ధనాన్ని ఎందుకు ప్రైవేటు విద్యావ్యాపారులకు ధారదత్తం చేయాలి..? అదుగో, ఆ స్వప్నం నుంచి పుట్టిందే తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్… అందులో తొలిమెట్టు ఆరుట్ల స్కూల్… దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి సందర్శించనున్నాడు… సంకల్పం సాకారం కావడం అంటే ఇదే.,. కేసీయార్‌కు చేతకానిది, రేవంత్ రెడ్డి సాధిస్తున్నదీ ఇదే… అందుకే స్కూలింగుకు సంబంధించి గేమ్ ఛేంజర్ ఇది…
తొలి దఫా ప్రయోగాత్మకంగా రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలను ఎంపిక చేశారు… దశలవారీగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది… అంతేకాదు, దీన్ని క్లస్టర్ మోడల్‌లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి, ఓ రోల్ మోడల్ స్కూలింగ్ సాధించాలనేది లక్ష్యం…
ఆరుట్ల సంగతే తీసుకుందాం… చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం అయిదు స్కూల్ బస్సులను ఏర్పాటు చేసింది… ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు…
ప్రస్తుతం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో మొత్తం 1,814 మంది విద్యార్థులు చదువుతున్నారు… ప్రీ-ప్రైమరీ విభాగంలో 150 మంది, ప్రైమరీ స్కూల్‌లో 600 మంది, హైస్కూల్ రెండు బ్లాకుల్లో కలిపి 800 మంది, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 160 మంది, రెండో సంవత్సరంలో 104 మంది విద్యార్థులు ఉన్నారు…
తల్లిదండ్రుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోలేక ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి టీపీఎస్‌లో నెలకొంది… ప్రభుత్వ విద్యను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యం అనుకున్నంత సులభం ఏమీ కాదు… కానీ ఎక్కడో ఓచోట తొలి అడుగు పడాలి కదా… ఆ అడుగు పేరే ఆరుట్ల..!!
Share this Article