Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సన్నబియ్యం..! బీఆర్ఎస్ గాయిగత్తరకు బుర్ర లేదు- అర్థం లేదు…

June 18, 2026 by M S R

.

ప్రజలు తిరస్కరించి, ప్రతిపక్షంలో కూర్చోబెట్టాక విపరీతమైన ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న బీఆర్ఎస్ ముఖ్యులకు ఏమీ తోచడం లేదు… ఏదో ఒకటి ట్వీట్లో, ప్రెస్‌మీట్లో, నమస్తే వార్తలో, పెయిడ్ ఇంటర్వ్యలో గాయిగత్తర లేపాలని ప్రయత్నించడం అలవాటైపోయింది… రెండున్నరేళ్లుగా అదే ధోరణి…

పెద్ద దొరకు ప్రజల మీద కోపం, అందుకే దూరమైపోయాడు అహంతో… చిన్న దొర, అనుబంధ దొరకు రోజూ ఏదో ఒకటి వార్తల్లోకిి తీసుకురావడం, రాను రాను జనం పట్టించుకోవడం మానేసినా, కౌంటర్ ప్రొడక్ట్ అవుతున్నా సరే, అదే ధోరణి… తాజాగా సన్న రకాల బియ్యం ఓ ప్రబల నిదర్శనం…

Ads

తెలంగాణ ప్రభుత్వం గతంలో 33 రకాల సన్నధాన్యానికి బోనస్ ఇచ్చేది… (గతంలో కేసీయార్‌కు ఇది చేతకాలేదు… దొడ్డురకాల నుంచి రైతుల్ని మార్కెట్ డిమాండ్ ఉన్న సన్నరకాలకు మళ్లించడానికి ఈ బోనస్ మంచి మార్గమనే సోయి లేదు…) ఇప్పుడు ఏం జరిగిందీ అంటే..?

బోనస్ వస్తుంది కదాని ప్రతి అడ్డమైన వరి వెరయిటీని సన్నరకాల పేరిట మార్కెట్‌లోకి వదలడం స్టార్ట్ చేశాయి కొన్ని కంపెనీలు… (మొన్నీమధ్య ఏదో అడ్డమైన ప్రైవేటు వెరయిటీని నమస్తే తెలంగాణ ఓ పెద్ద కథనం పబ్లిష్ చేసి నెత్తిన మోసింది డబ్బుకోసం., గుర్తుంది కదా) …

దీనివల్ల ఏమైంది..? అడ్డమైన వెరయిటీలకు బోనస్ ప్రైస్… దీనివల్ల నిజమైన సన్నరకాల పండించే రైతులకు అన్యాయం… పైగా అవి రేషన్ సిస్టంలోకి వస్తే జనాన్ని మోసం చేసినట్టు అవుతుంది… అందుకని ప్రభుత్వం బియ్యం ఎగుమతిదారులు, మిల్లర్లతో మీటింగు పెట్టి సలహాలు తీసుకుంది… మార్కెట్‌లో డిమాండ్ ఉన్న 7 రకాలకే బోనస్ ప్రైస్ అని ప్రకటించింది…

నిజానికి మంచి నిర్ణయం, ప్రతిదీ గాలి ఆరోపణలతో పొద్దుపుచ్చే బీఆర్ఎస్ రెండు పెద్ద తలలకు అర్థం కాదు… ఈ  రకాలు ఏమిటంటే..?

సన్నాలు



బీపీటీ-5204 (సాంబ మసూరి): ఇది చాలా కాలంగా అందరికీ తెలిసిన ప్రసిద్ధ సన్నరకం. దీని అన్నం చాలా రుచిగా ఉంటుంది.

ఆర్‌ఎన్‌ఆర్‌-15048 (తెలంగాణ సోనా): షుగర్ (డయాబెటిస్) ఉన్నవారికి ఇది చాలా మంచిది. దీనికి మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది.

హెచ్‌ఎంటీ సోనా: తక్కువ పెట్టుబడితో పండించగలిగే మంచి సన్నరకం.

జై శ్రీరామ్: నాణ్యమైన బియ్యం ఇచ్చే రకం. వ్యాపారులు దీనిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు.

కేఎన్‌ఎం-1638 (కూనారం సన్నలు): తెగుళ్లను తట్టుకునే శక్తి ఈ రకానికి ఎక్కువ.

డబ్ల్యూజీఎల్‌-44 (సిద్ది): రైతులు ఎక్కువగా ఇష్టపడే మరో మంచి సన్నగింజ రకం.

కేఎన్‌ఎం-7715: అధిక దిగుబడినిచ్చే అధునాతన సన్నరకం.



ఇవి మాత్రమే మార్కెట్‌లో చెలామణీలో ఉన్న సన్నరకాలు… ఇవి పండిస్తేనే రైతులు ఓపెన్ మార్కెట్‌లో కూడా అమ్ముకోగలరు… ఒకవైపు బోనస్, లేదంటే మార్కెట్ రేట్… ఏదైనా రైతుకు మేలు… మిగతావి సన్న కమ్ దొడ్డు ప్రైవేటు రకాలు… సో, వాటిని నిరుత్సాహపరచాలంటే వాటికి బోనస్ ప్రైస్ కట్ చేయాల్సిందే… రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది అదే…

సన్నాలు

ఇంకా చెప్పుకుందాం… నిజానికి వరి రైతును నిరుత్సాహపరచాలి… రాబోయే సీరియస్ ఎల్‌నినో గురించే కాదు… దొడ్డురకాలకు ప్రపంచంలో మార్కెట్ లేదు… కేంద్రం కొనడం లేదు, కొనదు, అది కొనుగోలు చేసే బాయిల్డ్, రా రైస్‌కు ప్రపంచంలో గిరాకీ లేదు… దేశంలోనే ఆ రకాలు ఎవరూ తినడం లేదు… తూర్పు దేశాల్లో విపరీతమైన దిగుబడి, ఉత్పత్తి… సో, వరి నుంచి రైతును పప్పుదినుసులు, నూనెగింజల వైపు మళ్లించడమే మార్గం… అది పెరిగితేనే మనం బోలెడు విదేశీమారక ద్రవ్యం ఆదా చేయగలం…

సో, వరి తగ్గాలి, ప్రత్యేకించి దొడ్డురకాల నుంచి సన్నాలకు మళ్లాలి, అదీ మార్కెట్‌లో చెలామణీ అయ్యే రకాలకు మళ్లాలి… నిజానికి కేంద్రం కొనకుండా మిగిలిన దొడ్డురకాల బియ్యం రాష్ట్ర గోదాముల్లోనే వేలాది టన్నులుగా ముక్కిపోతూ ఉంది… అడిగేవాడు లేడు… ఏ దేశానికీ పంపించే వీల్లేదు… మరేం చేయాలి..? రైతు పండించిన సార్థకత ఏమిటి…



ఓ వార్త చదివాను… రాష్ట్ర పౌరసరఫరాల గోదాముల్లో ముక్కిపోతున్న బియ్యాన్ని ఓపెన్ టెండర్ వేశారట… 100 కోట్ల స్కామ్ అట… అడ్డగోలుగా 21 రూపాయల ధరతో దక్కించుకుని బడా మిల్లర్లు (కరీంనగర్ జిల్లాలో ఓ మిల్లరాక్రముడు ప్రధాన సూత్రధారి అట) రీపాలిష్ చేసి, మళ్లీ లెవీ పెట్టే ప్లానులో ఉన్నారట… ఇన్ని బాగోతాలకు ప్రధాన కారణం దొడ్డు రకాలు పండించడమే…

పోనీ, రేవంత్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోని మరో నిజం చెప్పుకోవాలి… రాష్ట్ర పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ ఈవిషయంలో అట్టర్ ఫ్లాప్… ఇథనాల్ తయారీకి ఇవ్వరు, బీర్ తయారీకి ఇవ్వరు, ఏ విదేశీ ఆర్డర్లు రావు, జయహో సివిల్ సప్లయిస్ ఉన్నతాధికారులు…

ఈ మార్కెట్, ఈ నిజాలు తెలియవు బీఆర్ఎస్‌‌కు, తెలిసినా గాయిగత్తర ఆపవు, గతంలో కేసీయార్ స్కీములు, స్కాములు పుణ్యమాని తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని రీతిలో సీఎంఆర్ వేల కోట్ల దందాలు, స్కాములు… ఇప్పుడు అవన్నీ మరిచి… సన్నాలపై ఏడుపులు… తెలంగాణకు ఏం దొరికార్రా బాబూ…



చివరగా… పైన చెప్పిన ఏడు రకాల్లో బీపీటీ అంటే బాపట్ల… స్టేట్ డెవలప్డ్ వెరయిటీ…, హెచ్ఎంటీ, జైశ్రీరాం ప్రైవేటు వ్యక్తులు డెవలప్ చేసినవి, అవి విడిగా చెప్పుకుందాం… మిగతావి తెలంగాణ స్టేట్ అగ్రివర్శిటీ వెరయిటీలు… రాజేంద్రనగర్, కూనారం, వరంగల్ పరిశోధన కేంద్రాలు డెవలప్ చేసినవి… సో, సెన్సిటివ్ విషయాల్లోనైనా బీఆర్ఎస్ కాస్త సెన్సిబుల్, కామన్ సెన్సిబుల్ విమర్శలు చేస్తే బెటర్…



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇద్దరు సన్నకారు దళిత రైతులు… మోస్ట్ పాపులర్ సన్నాల్ని డెవలప్ చేశారు…
  • సన్నబియ్యం..! బీఆర్ఎస్ గాయిగత్తరకు బుర్ర లేదు- అర్థం లేదు…
  • Smriti Mandhana … ఎందుకు ఈమె అంత స్పెషల్?
  • ఓహ్, అది మీ కారా? ఎక్కడో కనిపిస్తే బాగుందని మనోళ్లే తెచ్చేశారు!
  • శ్రీదేవికి దీటుగా వెండితెర ఏలాల్సిన నటి… కానీ ఏం లాభం..?
  • దురంధర్ – వెలుతురు, నీడలు కూడా ప్రధాన పాత్రధారులు
  • అసలే అడ్డదిడ్డం కథ- అమితాబ్‌కు ఎందుకు నచ్చిందో మరి…
  • ‘సందేశ్‌ఖాలీ’ — ఆమెను షా మీటింగు దగ్గర్లోనే నిర్బంధించారు… తరువాత..?
  • క్రికెట్‌లో ట్రిపుల్ ధమాకా… అన్నీ టెన్ థౌజండ్ వాలా పేలుళ్లు…
  • సూసైడ్ ఫ్రూటింగ్! నేరేడుపళ్లు విరగకాస్తే సీరియస్ ఎల్‌నినో‌ ఖాయం!?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions