Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వరంగల్- కరీంనగర్… ఓ న్యూ మోడల్ పెంటాసిటీ కారిడార్..!!

February 6, 2026 by M S R

.

ఫ్యూచర్ సిటీ తర్వాత…, వరంగల్-కరీంనగర్ ‘ట్విన్ సిటీస్’పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి… అదొక పంచనగరి… Pentacity…  అనగా పంచపాండవుల సంయుక్త నగరి… పాండవనగరి… ఇదొక డిఫరెంట్, ఇన్నొవేటివ్ విజన్… 

వివరాల్లోకి వెళ్దాం… సమర్థ పాలకుడు ముందుగా ఒక కలగనాలి… అదెందుకు సొసైటీకి ఉపయోగకరమో ఓ నిర్ధారణకు రావాలి… క్లారిటీ ఉండాలి, ఆనక సంకల్పం తీసుకోవాలి… దానికి పునాదులు వేయాలి… ఆ ఫలితాలు ఎప్పుడైనా రానీ, అడుగులు అటువైపు బలంగా పడాలి…

Ads

నిన్న కరీంనగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి ప్రసంగపాఠం చదివాక అర్థమైంది ఇదే… ముందుగా తను ఏం చెప్పాడో ఓసార వివరాల్లోకి వెళ్దాం… సారాంశంలోకి…

ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణలో జంట నగరాలున్నాయి… ట్విన్ సిటీస్… కాదు, సైబరాబాద్ కూడా కలిస్తే త్రినగరి… అంటే ట్రైసిటీ… కాదు, కాదు… ఫ్యూచర్ సిటీ అనే ఓ బృహత్తర సంకల్పం తీసుకున్నాడు, ఫ్యూచర్ సిటీ… అదీ కలిస్తే చతుర్నగరి… అంటే క్వాడ్ సిటీ… మరి ఈ పంచ నగరి ఏమిటి..? అంటే పెంటాసిటీ అంటే..?

హైదరాబాద్ మీద ఒత్తిడి తగ్గాలి… మౌలిక సదుపాయాలు, నగర క్వాలిటేటివ్ జీవనం, కాలుష్యం తగ్గింపు, రద్దీ నియంత్రణ తగ్గాలంటే..? అందుకే ఫ్యూచర్ సిటీ… మరి ఈ పెంటా సిటీ ఏమిటి..?

వరంగల్- హన్మకొండ- కాజీపేట… ఇది త్రినగరి… దీనికీ కరీంనగర్‌కూ నడుమ హుజూరాబాద్ ఉంది… ఆల్రెడీ కలిసిపోయినట్టుగా ఉన్నాయి… పోనీ, అవుతున్నాయి… మరి మొత్తం దీన్ని ఓ ‘సిటీ బెల్ట్‌‌‌’గా డెవలప్ చేస్తే..? ఇదీ రేవంత్ రెడ్డి ఆలోచన… అదే చెప్పాడు నిన్న కరీంనగర్ పర్యటనలో…

penta city

తనేమంటాడంటే..,? ‘‘వరంగల్, కరీంనగర్ నగరాలను కలుపుతూ రెండు నగరాల వెలుపల రింగ్ రోడ్లను నిర్మిద్దాం… నడుమ బయో వేస్ట్ పవర్ ప్లాంట్లు పెడదాం… ఐటీ సెక్టార్‌కు హబ్‌ను చేద్దాం… ఇతర ఉపాధి మార్గాలకూ ఓ కేంద్రంగా చేద్దాం… ఇదంతా హైదరాబాద్ విశ్వనగరం మీద ఒత్తిడి తగ్గేందుకు… గ్రామీణ ప్రాంతాలకూ ఉపాధిని దగ్గర చేసేందుకు..?’’

ఎస్, ఉపాధి వికేంద్రీకరించబడాలి… ఏ హైదరాబాదు కేంద్రంగానో కేంద్రీకరించబడకూడదు… నగరాలపై ఒత్తిడి తగ్గాలి… దానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రతిపాదిత వరంగల్- కరీంనగర్ అర్బన్ బెల్ట్ మంచి సంకల్పం…

ఇప్పటికే హైదరాబాద్‌కు ఆవల, శ్రీశైలం- నాగార్జున సాగర్ హైవేల మధ్య స్పోర్ట్స్, విద్య, పరిశోధన, ఫార్మా రంగాల కలయికతో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే… తాజాగా ఈ వరంగల్- కరీంనగర్ సంయుక్త నగరి… దాదాపు 60, 70 మండలాలకు ఓ కొత్త డెస్టినేషన్… అనుకున్నట్టు జరిగితే…

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ – త్రివిభజన (CURE, PURE, RARE)

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముఖ్యమంత్రి మూడు ప్రధాన మండలాలుగా విభజించాడు…

  • CURE (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ)…: హైదరాబాద్ ORR లోపల ఉండే నెట్ జీరో సర్వీసెస్ రీజియన్…

  • PURE (పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ)…: ORR, ప్రతిపాదిత ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) మధ్య ఉన్న తయారీ రంగానికి (Manufacturing) కేటాయించిన ప్రాంతం…

  • RARE (రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ)…: RRR కు ఆవల ఉన్న వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రాంతం…

మరి ప్రతిపాదిత వరంగల్- కరీంనగర్ సంయుక్త నగరి..? తెలంగాణకు మరో హైదరాబాద్… సింపుల్‌గా చెప్పాలంటే అంతే…

వరంగల్-కరీంనగర్ కారిడార్ ముఖ్యాంశాలు

కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా, టైర్-2 నగరాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే రేవంత్ రెడ్డి ఉద్దేశం… ఈ కొత్త జంట నగరాల ప్రాజెక్టులో భాగంగా…

  • అనుసంధానం…: రెండు నగరాల వెలుపల ఉన్న రింగ్ రోడ్లను (ORR) విస్తరించి, అనుసంధానించడం ద్వారా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం….

  • వేస్ట్-టు-ఎనర్జీ…: రెండు నగరాల మధ్య ఒక భారీ ఇంటిగ్రేటెడ్ డంప్ యార్డ్‌ను ఏర్పాటు చేసి, మున్సిపల్ వ్యర్థాల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను నెలకొల్పడం…ప.

  • సమతుల్య అభివృద్ధి…: అభివృద్ధి కేవలం హైదరాబాద్ చుట్టూనే కాకుండా, ఉత్తర తెలంగాణలో కూడా భారీ మౌలిక వసతులు మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించడం….

వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం పూర్తి చేయడం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు, విద్యాసంస్థల ఏర్పాటు కూడా ఈ వరంగల్- కరీంనగర్ పంచనగరిలో భాగమే…



ఎందుకు స్వాగతించాలి..?

1. హైదరాబాద్‌పై ఒత్తిడి తగ్గుతుంది…. తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్ మాత్రమే అనే పరిస్థితి ప్రస్తుతం ఉంది… ఐటీ, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాల కోసం అందరూ ఇక్కడికే వస్తుండటంతో ట్రాఫిక్, కాలుష్యం, వనరుల కొరత పెరుగుతోంది… వరంగల్-కరీంనగర్ కారిడార్ అభివృద్ధి చెందితే, జనాభా, పెట్టుబడులు వికేంద్రీకరణ జరుగుతాయి…

2. ఉత్తర తెలంగాణకు ‘గ్రోత్ ఇంజిన్’… వరంగల్ (రెండవ అతిపెద్ద నగరం), కరీంనగర్ రెండూ ఉత్తర తెలంగాణకు కీలకమైన కేంద్రాలు… ఈ రెండింటినీ కలపడం వల్ల ఈ ప్రాంతం మొత్తం ఒక ఆర్థిక శక్తి కేంద్రంగా (Economic Hub) మారుతుంది… ఇది సమీపంలోని జిల్లాల ప్రజలకు కూడా మేలు చేస్తుంది…

3. మౌలిక సదుపాయాల విప్లవం… రెండు నగరాల ORR అనుసంధానం వల్ల రవాణా వేగవంతం అవుతుంది… వరంగల్ ఎయిర్‌పోర్ట్ కార్యరూపం దాల్చితే, ఉత్తర తెలంగాణకు అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది… వేస్ట్ మేనేజ్మెంట్, చెత్త నుండి విద్యుత్ (Waste-to-Energy) ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా, నగరాలు శుభ్రంగా ఉంటాయి…

4. విద్యా మరియు ఉపాధి అవకాశాలు… వరంగల్ ఇప్పటికే విద్యా కేంద్రంగా (NIT, కాకతీయ యూనివర్సిటీ) పేరుగాంచింది… దీనిని కరీంనగర్‌తో కలిపి ఐటీ, మేన్యుఫ్యాక్చరింగ్ రంగాలతో అనుసంధానిస్తే, స్థానిక యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్ లేదా విదేశాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది…

5. రియల్ ఎస్టేట్ మరియు వ్యాపార వృద్ధి …. ఈ కారిడార్ వెంట కొత్త టౌన్‌షిప్‌లు, షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు, విద్యాసంస్థలు ఏర్పడతాయి… దీనివల్ల వేలాది మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది,  స్థానికంగా భూముల విలువలు పెరిగి ఆర్థిక పురోగతి సాధించవచ్చు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వరంగల్- కరీంనగర్… ఓ న్యూ మోడల్ పెంటాసిటీ కారిడార్..!!
  • ఆరోగ్యానికి ‘లలితకళా’ రక్ష…! ప్రొటియోమిక్స్ అంటే ఏంటి..?
  • గుణశేఖర్ గుణాత్మక పంథా… సామాజిక ఇతివృత్తాల వైపు… కానీ..?
  • ఆ సయామీ బంధం తెలిసీ… కాళేశ్వరాన్ని సీబీఐలో ఎందుకు ముంచినట్టు..!!
  • వాషింగ్టన్ పోస్ట్ ‘ప్రమాద ఘంటికలు’ – ప్రపంచ మీడియాకు హెచ్చరిక
  • జనంలోకి రాడు… ఇల్లు కదలడు… అజ్ఞాతం వీడని ‘జాతిపిత’…
  • పాలకుల తెలివిడి- భవిష్యత్తు తరాలకు భరోసా… అదీ ఈ దేశపు కథ…
  • మోడీపై లోకసభలోనే భౌతిక దాడికి విపక్షం స్కెచ్..? ఓ విశ్లేషణ..!!
  • పాత ఆర్మీ బాస్ నరవాణే పుస్తకం- కొన్ని కటువైన నిష్ఠుర నిజాలు…
  • గుంజి గుంజి… వాడు కాదు, వాడి నిర్మాత- దర్శకులే అసలు వైరసులు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions