.
నిన్న ఓ వార్త… సనాతన ధర్మం ఓ వైరస్, దాన్ని నిర్మూలించాల్సిందే అని కూసే ఉదయనిధి తల్లి దుర్గ కర్నాటక, మైసూరు ప్రాంతంలోని గంజాం, నిమిషాంబ గుడికి వెళ్లి ప్రార్థనలు చేసింది… ఆమె పక్కా ఆస్తికురాలు… తమిళనాడులోని ప్రధాన గుళ్లకే కాదు, తిరుమలకూ తరుచూ వెళ్తుంది… ప్రోటోకాల్ ఏమీ పాటించకుండా ఓ సామాన్య భక్తురాలిగా వెళ్తుంటుంది…
మతాచరణ, ఆస్తికత్వం ఆమె వ్యక్తిగతం, ఆమె నమ్మకం, దాన్ని ఎవరూ విమర్శించడానికి వీల్లేదు… ఆమె ఇష్టం, తన ఆధ్యాత్మిక మార్గాన్ని ఆమె ఎప్పుడూ దాచుకోదు, ఎవరికీ ఏ జవాబూ ఇవ్వదు, గుడ్… ఉదయనిధి భార్య కిరుతిగ (కృత్తిక?) క్రిస్టియన్, ఆమె కూడా తన మతాచరణను పాటిస్తుంది… అది ఆమె ఇష్టం, గుడ్… కానీ ఉదయనిధి పేలాపనలు కేవలం సనాతన ధర్మం నిర్మూలన మీదే ఎందుకు..?
Ads
సొంత కుటుంబసభ్యులకే చెప్పలేనివాడివి, బయట ప్రజలు మాత్రం అర్జెంటుగా హిందూ మతాన్ని విసర్జించి, నాస్తికులైపోవాలా..? ఉదయనిధి మార్క్ హేతువాదం తీరుపై ఈ ప్రశ్న కూడా సహేతుకమే కదా..! పార్టీ సిద్ధాంతం వేరు- కుటుంబసభ్యుల ఆచరణ వేరు… అనేది చెప్పుకోవడానికి బాగుంటుంది… కానీ ఇదే ద్వంద్వ వైఖరి, సగటు మనిషికి అర్థం కాని ధోరణి…
సీపీఐ నారాయణ తిరుమల వెళ్తాడు, శ్రీశ్రీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తాడు, గద్దర్ ఓ పూజారి ఎదుట ఉత్తరీయం చాపి ఆశీస్సులు అడుగుతాడు,,. ఇలా చాలా…
డీఎంకే లేదా ఉదయనిధి మద్దతుదారులు సాధారణంగా ఇచ్చే సమాధానం వేరుగా ఉంటుంది… వారు “మేము వ్యక్తుల మత విశ్వాసాలను వ్యతిరేకించడం లేదు; సనాతన ధర్మం పేరుతో చారిత్రకంగా ఏర్పడిన కుల వివక్ష, అసమానతలను విమర్శిస్తున్నాం” అని అంటారు… అలాగే ప్రతి వ్యక్తికి తన మతాన్ని ఆచరించే స్వేచ్ఛ ఉందని, ఆ స్వేచ్ఛ తన తల్లికీ వర్తిస్తుందని వాదిస్తారు…
కానీ విమర్శకులు మాత్రం అదే చోట ప్రశ్నిస్తారు…
- నిజంగా అది కేవలం సామాజిక అసమానతలపై విమర్శ అయితే “సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి” వంటి పదజాలం ఎందుకు?
- కుటుంబ సభ్యుల మతాచారాలను గౌరవిస్తూనే, కోట్లాది ఇతర హిందువుల విశ్వాసాలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం ఎలా సమంజసం?
- ఒకే ప్రమాణం అందరికీ వర్తించాలా, లేదా కుటుంబానికి ఒకటి, ప్రజలకు ఇంకొకటా?
ఇది వాస్తవానికి రాజకీయ- సిద్ధాంతపరమైన చర్చ. కొందరి అభిప్రాయం ప్రకారం ఇందులో ద్వంద్వ వైఖరి కనిపిస్తోంది. అదే సమయంలో వారి మద్దతుదారులు “వ్యక్తిగత విశ్వాసం”- “సామాజిక సిద్ధాంత విమర్శ” వేర్వేరు విషయాలు అని చెబుతారు…
నిమిషాంబ మాతకు దుర్గా స్టాలిన్ విన్నపం ఇదేనా..? ‘మావోడి ధర్మ నిర్మూలన వ్యాఖ్యల్ని క్షమించి, వాడిని కాపాడు తల్లీ…’
Share this Article