Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఊహించిందే! మళ్లీ బీఆర్ఎస్ గాయిగత్తర! విషం తప్ప విజ్ఞత లేదు!

June 26, 2026 by M S R

.

సొసైటీలోకి విషాన్ని ఇంజక్ట్ చేయడంలో, నెగెటివిటీని పంప్ చేయడంలో బీఆర్ఎస్ క్యాంపు తరువాతే ఇంకెవరైనా..! నిన్న తుంగభద్ర డ్యామ్ దగ్గర జరిగిన సభలో మూడు రాష్ట్రాల సీఎంలు, కేంద్రం ప్రతినిధిగా సంబంధిత జలశక్తి మంత్రి ఓ పాజిటివ్ ఆలోచనల్ని సమాజంలోకి వదిలారు… అది…

‘‘ఏళ్లకేళ్లు ఎన్నేళ్లు ఈ జలపంచాయితీలు? కేంద్రం కొన్ని ఆప్షన్లు ఇస్తుంది, మీకు సమ్మతమైతే వోకే చెప్పండి, ఒప్పందాలు కుదుర్చుకుందాం, సాగునీటిని తగాదాల్లేకుండా పంచుకుందాం. కేంద్రం మీకు మద్దతుగా ఉంటుంది…’’

Ads

ఇవి తీర్మానాలు కాదు, ఒప్పందాలు కుదరలేదు, చట్టాలు కూడా కాదు, కానీ ఒక ముందడుగు, రాష్ట్రాల నడుమ పరస్పర జలసహకారానికి ఉద్దేశించి ఓ పాజిటివ్ ధోరణి… మూడు రాష్ట్రాలే  కాదు, అంతర్రాష్ట్ర జలాలతో సంబంధం ఉన్న ఇతర రాష్ట్రాలు కూడా కలిసొస్తే మంచి ఫలితాలు…

కానీ బీఆర్ఎస్ అలియాస్ కేసీయార్ ఏం స్పందించాడు..? నిన్న మనం చెప్పుకున్నదే కదా… ఎంతసేపూ నెగెటివిటీ, విషం తప్ప ఇంకేమీ కనిపించని బీఆర్ఎస్ అలియాస్ కేసీయార్ అలియాస్ నమస్తే తెలంగాణ ఏం స్పందించింది..? ఇలా… (తను బయటికి రాడు, నమస్తేలో రాయిస్తాడు, ఇదేదో మైకుల ముందు చెప్పొచ్చు కదా, చెప్పడు, నామోషీ, నన్ను జనం తిరస్కరించారని అలుగుడు. జనం మీద అలిగే ఏకైనా నాయకుడు ప్రపంచంలో)…

నమస్తే

నిన్న రేవంత్ రెడ్డి ఓ మాటన్నాడు… ‘నేను బరాబర్ గుంపు మేస్త్రీనే, అదేమీ చిన్నతనం కాదు, పైగా నేను పడుకుంటే కుంభకర్ణుడు, లేస్తే బకాసురుడు టైపు కాదు’ అని… (కేసీయార్‌ను ఉద్దేశించి)… ఇన్నేళ్లు తెలంగాణ జలప్రయోజనాల్ని ఏపీకి కట్టబెట్టడమే గాకుండా, లక్షల కోట్లను గోదాట్లో పోసిన (కేంద్రం చెప్పిన మాటే) కేసీయార్ కూడా నమస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డిని ఆక్షేపిస్తూ కథనాలు రాయిస్తున్నాడు… తన ఆలోచనలే.

ప్రతిదీ చంద్రబాబుతో రేవంత్‌రెడ్డిని ముడిపెట్టే ఓ విఫల, విష సూత్రీకరణ… చంద్రబాబు ఏపీకి ఉపయుక్తం అయ్యే ప్రతిపాదనల్ని, తెలంగాణకు నష్టదాయక ఆలోచనల్ని కేంద్రం ద్వారా కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలపై రుద్దుతున్నాడట…

  • (అసలు ప్రతి దానికీ చంద్రబాబు- రేవంత్ రెడ్డికి ముడిపెట్టడం ఏమిటి అసలు? చంద్రబాబు అంటే తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుంది కాబట్టి, తనతో రేవంత్ రెడ్డికి జతకట్టించేసి, ఆ నెగెటివీని రేవంత్ రెడ్డి మీదకు పాస్ ఆన్ చేయాలనే ఓ కుతర్క ఎత్తుగడ. పిడుక్కీ, తద్దినానికీ ఒకే మంత్రంలాగా ఏ విషయం తీసుకున్నా ఇదే ధోరణి)

ఎవరి పార్టీలు వాళ్లవి- ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వాళ్లవి… చంద్రబాబు- డీకే శివకుమార్ – రేవంత్ రెడ్డి నియంతలు కారు… కేసీయార్‌లాగా శివగామి బాపతు పార్టీలు కూడా కావు… నామాటే శాసనం, అందరూ చచ్చినట్టు పాటించండి అనడానికి..! సరే, చంద్రబాబును వదిలేస్తే… డీకే, రేవంత్ ఇద్దరూ కాంగ్రెస్, వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా, కేబినెట్లకు, పార్టీకి, హైకమాండ్‌కు, రెండు రాష్ట్రాల ప్రజానీకానికీ జవాబుదారీలు…

mou system on inter state water issues

వాళ్లు రాజకీయాల్లోనే ఉన్నారు. అన్నీ ఆలోచించే చేస్తారు… మరెందుకు ప్రతి దానికీ చంద్రబాబుతో ముడిపెట్టడం… చంద్రబాబు రేవంత్ రెడ్డి బాస్ కాదు, రేవంత్ రెడ్డి బాస్ వర్తమానంలో కాంగ్రెస్ హైకమాండ్ మాత్రమే. సరే, ఈ జలవివాదాల విషయానికి వద్దాం…

ముగ్గురు సీఎంలు, కేంద్ర మంత్రి రహస్యంగా ఓచోట భేటీ అయి తెలంగాణను నష్టపరిచే కుట్ర ఒప్పందాలు చర్చించారట… ఆలూలేదు, చూలూలేదు, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయినట్టు గాయిగత్తర స్టార్ట్… ఎస్, చాలా చిక్కులుంటాయి, చాలా జవాబులు దొరకాల్సిన ప్రశ్నలు ఉంటాయి… కానీ…

  • నార్తరన్ ఇండియాలో కేంద్రం మధ్యవర్తిగా కొన్ని జలఒప్పందాలు కుదిర్చింది… ఇదే ఇక్కడా ప్రతిపాదిస్తోంది… ఇదేమీ కేంద్రం ఇచ్చే తీర్పు కాదు, చట్టం కాదు, అన్నీ ఆలోచించాకే ముందుకురండి అంటోంది… రాష్ట్రాలకు అంగీకారమైతే వోకే, లేదంటే లేదు… అన్ని రాష్ట్రాలకూ సాగునీటి మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, వడబోసి, ఏది మంచో, ఏది చెడో చెప్పగలిగే సాగునీటి నిపుణులున్నారు.

గోదావరి గూగుల్ మ్యాప్స్‌లో చూస్తూ మూడుచోట్ల అడ్డంగా గీతలు పెట్టేసి, చలో బరాజులు కట్టేద్దాం అని నిర్ణయం తీసుకున్న అభినవ విశ్వేశ్వర్రావు కేసీయార్‌లు లేరు ఈ మూడు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి..!!

అయినా కేసీయార్ ఒక్కడే రాజకీయాల్లో ఉన్నాడా  (??)… డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి రాజకీయాల్లో లేరా..? వాళ్లకు పార్టీ, రాష్ట్రం, కేబినెట్, ప్రజలు అనే కోణాలు లేవా..? ఎస్, ఇవీ సమస్యలున్నాయి, బహుపరాక్ అని చెప్పడం వేరు… చంద్రబాబును లాక్కొచ్చి రేవంత్ కు ముడివేయడం వేరు… Who Is ChandraBabu..? Why this BRS poisonous political propaganda?

తను NDA మనిషి (ఇప్పటికైతే)… రేవంత్, డీకే కాంగ్రెస్… ఎవరి రాజకీయ ధోరణులు వాళ్లవి… ఇక్కడ గురువులు, శిష్యులు స్నేహితులు గట్రా హంబక్… కాకపోతే కర్నాటకలో బీజేపీ గానీ, ఏపీలో జగన్ పార్టీ గానీ కేంద్రం ప్రతిపాదిస్తున్న రాజీబాటను విమర్శించలేదు… ఎందుకంటే… వాటికి విజ్ఞత ఉంది, క్షుద్ర రాజకీయం చేయడం లేదు… ఎట్ లీస్ట్, సాగునీటి విషయంలో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఊహించిందే! మళ్లీ బీఆర్ఎస్ గాయిగత్తర! విషం తప్ప విజ్ఞత లేదు!
  • పేపర్ బాయ్ తలుపు తట్టిన చప్పుడు – నేనింకా బతికే ఉన్నాను…
  • మన్యం గర్భంలో మైనింగ్ మాఫియా – అల్లూరి చారిత్రక గుహలకే ఎసరు!
  • ‘ఉప్పొంగెలే గోదావరి- ఊగిందిలే చేలో వరి’ – వేటూరి మరో శబ్దగారడీ!
  • దయానాయక్ బయోపిక్! – వేలు పెట్టి వారం చెడగొట్టే రాంగోపాల్‌వర్మ!
  • Michael Jackson – రోజురోజుకీ నా పాలిటి ఓల్డ్ వైన్‌లా తయారయ్యాడు!
  • కొత్త FCRA రూల్స్ చూసి కొన్ని ఎన్జీఓలకు వణుకు- కేంద్రం కొరడా!
  • పెద్దరికానికి గౌరవం- అనుభవానికి గుర్తింపు- కావాలి, కానీ ఎలా?
  • పాస్‌పోర్టుకు అంత సీన్ లేకపోతే… కఠిన పోలీసు వెరిఫికేషన్లు దేనికి?
  • అదే జరిగితే… రేవంత్ రెడ్డి చెప్పినట్టు చరిత్రాత్మక ముందడుగే!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions