Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రేవంత్ రెడ్డి దూకుడు! కేసీయార్‌కు ఇక చెరుపుకోలేని మరక!

October 6, 2026 by M S R

.

కేసీయార్ ఆక్రమించిన ప్రభుత్వ భూములకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దూకుడు మునుపెన్నడూ లేని రీతిలో సాగుతోంది… రేవంత్ రెడ్డి అనుకున్నట్టు గనుక తన ‘యాక్షన్’ పూర్తయితే… కేసీయార్ మీద ఇక జీవితంలో చెరుపుకోలేని మరక పడినట్టే! జాతిపిత అనిపించుకోవాలని తాపత్రయపడిన తన చరిత్రలో ఓ ప్రభుత్వ భూముల కబ్జాదారుగా ఓ నలుపు అధ్యాయం లిఖించబడినట్టే… బహుశా కేసీయార్ కుటుంబం మీద రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ అవుతుందేమో ఇది…

కేసీయార్ కుటుంబ సభ్యులు ఆక్రమించిన అసైన్డ్, ప్రభుత్వ భూముల వివరాలను అసెంబ్లీలో సర్వే నంబర్ల వారీగా వెల్లడించాడు కదా రేవంత్ రెడ్డి… అంతకుముందే కేటీయార్, హరీష్, కేసీయార్ మాత్రమే కాదు, సంతోష్, కేటీయార్ కుటుంబసభ్యులు, హరీష్ కుటుంబసభ్యుల భూబాగోతాలను కూడా బద్దలు కొట్టాడు… కేసీయార్ ఫామ్‌హౌజులో 388 ఎకరాల సర్కారీ భూమి కబ్జా అనీ ఆరోపించాడు…

Ads

అంతేకాదు, దాన్ని స్వాధీనం చేసుకుని, పేదలకు పంచుతాననీ ప్రకటించాడు… ఈ భూముల వివరాలు నిగ్గు తేల్చడానికి కమిటీలు వేశాడు… కేసీయార్ ఫామ్‌హౌజ్ బాపతు ఆక్రమణలపై సర్వే చేసిన టీమ్ సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల భూముల్లో ఆక్రమణల వివరాల్ని రేవంత్ రెడ్డికి ఈరోజు వివరించింది…

ప్రాథమిక సమాచారం మేరకు… ఎర్రవల్లి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 325లో మొత్తం 388 ఎకరాలకు గాను అధికారుల సర్వేలో 343 ఎకరాలను గుర్తించారు… రెవిన్యూ రికార్డుల ప్రకారం మరో 45 ఎకరాల భూమి మిస్సింగ్… ఆ భూముల సంగతీ త్వరగా తేల్చాలని ఆదేశించాడు సీఎం…

kcr

దీంతో ఆ మిస్సింగ్ భూమి గుర్తింపు కోసం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల్లో సర్వే నోటిఫికేషన్ విడుదల చేశారు ఉన్నతాధికారులు… భూమి సరిహద్దులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు రెవెన్యూ రికార్డులు సబ్మిట్ చేయాలని నోటీసులు జారీ చేయనున్నారు అధికారులు…

ఇదంతా ఒకెత్తు… కబ్జాలో ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, స్థానిక పేద రైతులకు పంపిణీ చేయాలని సీఎం నిర్ణయించిన విషయం తెలిసిందే… అంతేకాదు, అక్కడే సకల సౌకర్యాలతో ఓ అమరవీరుల కాలనీ నిర్మించాలని కూడా ఆదేశించాడు… ఈమేరకు హౌజింగ్ శాఖ త్వరగా పనులు చేపట్టి వచ్చే జూన్ 2 కల్లా సిద్ధం చేయాలని నిర్దేశించాడు…

అమరవీరులను గుర్తించారా; ఎక్కడెక్కడో ఉండే అమరవీరుల కుటుంబాలు ఇక్కడికి వచ్చి ఉంటాయా; దీనికన్నా స్థానిక పేదలకే వాటిని కేటాయించడం బెటరా అనే ప్రశ్నలు ఎలా ఉన్నా… నిజంగా ఆ భూముల్లో పేదల నాగళ్లు నడుస్తుంటే, ఆ ఇళ్లల్లో పేదలు నివాసం ఉంటే… కేసీయార్ చరిత్రను రోజూ కళ్లెదుట వెక్కిరిస్తున్నట్టే… తన కబ్జాల బాగోతానికి ఓ సంకెేతంలా నిత్యం గుర్తుచేస్తూనే ఉంటాయేమో…

కానీ అనేక కేసీయార్ బాపతు అక్రమాలపై సీరియస్ యాక్షన్‌ను మధ్యలోనే వదిలేసినట్టు గాకుండా… ఎలాంటి లీగల్ అడ్డంకులు రాకుండా, పకడ్బందీగా గనుక రేవంత్ రెడ్డి ఈ కబ్జా భూముల కథకు ఎండ్ కార్డ్ వేయగలిగితే… దీనికితోడు తను అసెంబ్లీలో ప్రకటించిన ప్రతి భూకబ్జా కథనూ ఓ లాజికల్ ఎండ్‌కు తీసుకురాగలిగితే… బీఆర్ఎస్ మీద స్పష్టమైన ఆధిక్యతను సాధించినట్టే… అన్నింటికీ మించి తెలంగాణను కేసీయార్ కుటుంబం అగడు పడ్డట్టు దోచుకుందనే తన ఆరోపణలకు ఆధారాల్ని తెలంగాణ సమాజం ఎదుట ప్రదర్శించినట్టే..!!

 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి దూకుడు! కేసీయార్‌కు ఇక చెరుపుకోలేని మరక!
  • భేష్ మృణాల్… కథ తడబడినా… నటన తగ్గనివ్వలేదు!
  • నేను రెడీ’ అని స్మృతి చెప్పింది.. మూడు నెలలకే హర్మన్ తప్పుకుంది!
  • అబ్బురపరిచే సినిమాటిక్ ‘ఎదుగుదల’..! ఎవరీ ‘పవర్‌ఫుల్ కేరక్టర్..?
  • అనుకుంటాం గానీ… రెహమాన్ సంప్రదాయ రాగాల్లోనూ దిట్ట !!
  • చో – ఎవడినీ లెక్కచేయలేదు- నమ్మిన ఏ మాటనూ దాచుకోలేదు…!!
  • SIR ప్రకంపనలు- న్యాయవ్యవస్థలోనూ చర్చ – భిన్నాభిప్రాయాలు !!
  • స్టీవ్ జాబ్స్ చివరి మాటలు “ఓహ్- వావ్!… ఏం చూశాడు తను..?!
  • పెళ్లి లేదు… పిల్లలు లేరు… అంతిమంగా మేనల్లుళ్లే వారసులు?
  • ఉన్నవాడి ఔదార్యమూ గొప్పదే- లేనివాడి ఔదార్యం మరీ మరీ గొప్పది !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions