. ఈ కేసీయార్ వాయిస్‌తో ఇదే సమస్య… తను అధికారంలో ఉన్నప్పుడు చేస్తేనేమో సరస శృంగారం… ఎదుటోడు చేస్తేనేమో వ్యభిచారం… నిన్నటి నమస్తే తెలంగాణ వార్త అచ్చంగా అదే… ఈ వాయిస్ మారదు, నైతికంగా ఎంత దిగజారిపోతున్నా సరే… తను ఏం రాశాడంటే..? ‘తెలంగాణ సొమ్ము- బీహార్‌లో దుబారా’ అట… అదే హెడింగ్… ఏమిటయ్యా సారాంశం అంటే..? బీహార్ పత్రికల్లో తెలంగాణ సర్కారు యాడ్స్ ఇస్తున్నారు… ప్రకటనల కోసం కోట్లు కుమ్మరిస్తున్నారు… అక్కడి ఎన్నికల ప్రచారం కోసం […]
హార్డ్‌వర్క్ ఎవరిక్కావాలి… లక్కు కావాలి… లేదంటే ఏవో గిమ్మిక్కులు…
. వెండి తెర, బుల్లి తెర, ఫ్యాషన్ ప్రపంచంలో జిలుగు వెలుగుల వెనుక ఎన్నో చీకట్లు, ఇక్కట్లు… ఈ మెరుపులు ఏవీ నిజాలు కావు… కృత్రిమం, ప్లాస్టిక్ నవ్వులు, మేకప్ తొడుగులు… ఇవి అందరికీ తెలిసిందే… మెజారిటీ జీవితాలు పూలపాన్పలేవీ కావు… బిగ్‌టీవీలో వర్ష చాట్ షో కిస్సిక్ టాక్స్ టీవీ సెలబ్రిటీల జీవితాలను, వెతలను ఎంతోకొంత ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది… టీవీ షోలలో తన ఇమేజీకి భిన్నంగా వర్ష బాగానే చేస్తోంది ఈ షో… సౌమ్యారావు […]
మయసభ… బాబు- వైఎస్ రాజకీయాల సీరీస్‌లో కొన్ని సీన్లపై ఆక్షేపణ..!!
. మయసభ… సోనీ లివ్‌లో ఉన్న వెబ్ సీరీస్… పేరుకు ఇది కల్పితకథ అని ఓ పే-ద్ద డిస్క్లయిమర్ వేసి,… చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిల రాజకీయాల చరిత్రగా అందరికీ అర్థమయ్యేట్టు తీశాడు దర్శకుడు దేవ కట్ట… అందులో పాత్రలు ఏవి ఎవరివో ప్రేక్షుకులు ఇట్టే పోల్చుకుంటారు… ఎలాగూ కల్పితం అని డిస్క్లయిమర్ వేసేశాం కదాని క్రియేటివ్ ఫ్రీడం తీసుకుని ఏదో కులసమరంలా కథను, ఆ ఇద్దరి పాత్రలనూ రాసుకున్నాడు… సరే, ఏదో రాశాడు, ఏదో తీశాడు సరేగానీ… […]
బేరసారాల్లో మానవత్వం ఉండదు… మానవత్వంలో బేరసారాలు ఉండొద్దు…
. కూరగాయలమ్మా… కూరగాయలూ… లచ్చిమి నెత్తి మీద గంపతో అరుస్తూ వీథిలో వెళ్తోంది… ఓ ఇంటి దగ్గర ఆగి మళ్లీ అరిచింది… ఇంట్లో నుంచి సుబ్బమ్మ బయటికి వచ్చి, గంప కిందకు దింపడానికి సాయం చేసింది, అరుగు మీద పెట్టారు… పాలకూర ఒక్కో కట్ట ఆరు రూపాయలు చెప్పింది ఆమె… ఈమె రెండు రూపాయల నుంచి బేరం మొదలుపెట్టింది… ‘‘కుదరదమ్మా… మేమూ బతకాలి కదా… అయిదు రూపాయలకైతే ఇస్తా…’’ ‘‘మూడు రూపాయలకు కట్ట, అంతకుమించి పావలా కూడా […]
కొత్త ఉప రాష్ట్రపతిగా ఆర్ఎస్ఎస్ మార్క్ శేషాద్రి రామానుజా చారి..?
. ఆర్ఎస్ఎస్ సారథి మోహన్ భగవత్‌కూ బీజేపీ సారథి మోడీకి నడుమ చాలాకాలం అగాధం కొనసాగడం అందరికీ తెలిసిందే… మోడీ మీద భగవత్ పలుసార్లు పరోక్షంగా పంచులు కూడా వేశాడు, 75 ఏళ్ల వయో పరిమితి వంటివి కూడా… మొత్తానికి సంధి కుదిరినట్టుంది… కొన్నాళ్లుగా మళ్లీ ఆర్ఎస్ఎస్ పట్టు పెరిగింది పార్టీపై, ప్రభుత్వంపై..! ఆమధ్య రాజ్యసభ నామినేటెడ్ సభ్యత్వాలు, గవర్నర్ల ఎంపికల్లోనూ అది కనిపించింది… కారణాలు ఏవైతేనేం… ఉపరాష్ట్రపతి పదవి నుంచి జగదీప్ ధన్‌ఖడ్‌ను రాజీనామా చేయించి […]
ఈ గుడికి వెళ్లొచ్చిన కొన్నాళ్లకే ఇందిర హత్య… మరి మోడీ సందర్శన…?!
. నిన్నో మొన్నో ఓ చిన్న వీడియో బిట్ కనిపించింది… ఆధ్యాత్మిక ప్రచారకుడిగా కనిపిస్తున్న ఒకాయన్ని ఒకామె అడుగుతోంది… ‘‘తమిళనాడులోని చారిత్రక బృహదీశ్వరాలయం ప్రధాన ద్వారం గుండా దర్శనానికి వెళ్లిన ఇందిరాగాంధీ కొన్నాళ్లకే మరణించింది… తనతోపాటు వెళ్లిన అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీ రాంచంద్రన్ కూడా మరణించాడు… మొరార్జీ దేశాయ్ కూడా అంతే… కానీ కరుణానిధి మాత్రం ప్రధానద్వారాన్ని అవాయిడ్ చేసి, పక్కనున్న వేరే ద్వారం నుంచి లోపలకు వెళ్లాడు, అందుకే తప్పించుకున్నాడు… అధికారంలో ఉన్నవాళ్లు ప్రధాన […]
Run Away… విమానాలన్నాక ఎదురెదురుగా రావా ఏమిటి..?
. విమానం రెక్కలు విప్పి ఆకాశంలో ఎంతెత్తుకు ఎగిరినా నేలకు దిగాల్సిందే. రన్ వే మీద ల్యాండయిన విమానం రెక్కల్లో ఇంధనం నింపుకుని, పొట్టలో ప్యాసింజర్లను పొదివి పట్టుకుని మళ్ళీ పక్షిలా గాల్లోకి ఎగరాల్సిందే. త్రేతాయుగం నాటికే ఇప్పటి డబుల్ డెక్కర్ ఎయిర్ బస్ కంటే మెరుగైన పుష్పక విమానాలు ఉండేవని రామాయణం సుందరకాండను ప్రస్తావిస్తూ నమ్మేవారు నమ్ముతారు. నమ్మనివారు కేవలం వాల్మీకి ఊహగా, కవి కల్పనగా కొట్టిపారేస్తారు. 1903 డిసెంబర్ 17న రైట్ బ్రదర్స్ తొలిసారిగా […]
మైక్రోబరస్ట్..! కుండపోత కాదు, ఇది పైనుంచి కమ్మేసే ఓ సునామీ..!!
. Ravi Vanarasi ………. ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో కురిసిన మెగా మైక్రోబర్స్ట్ వర్షం … పెర్త్‌లో వర్షపు సునామీ… ఫిబ్రవరి 2020లో పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో ఒక అద్భుతమైన, అతి భారీ వర్షం కురిసింది… కేన్ ఆర్టీ ఫొటోగ్రఫీ (Kane Artie Photography) వీడియోలో బంధించిన దృశ్యం, చూసేవారిని అబ్బురపరిచింది… https://www.facebook.com/reel/1499164424767331 ఆకాశం నుంచి ఒక్కసారిగా నీరు సునామీలా భూమి మీద పడినట్టుగా అనిపించింది. దీనికి కారణం మైక్రోబర్స్ట్ (Microburst) అనే వాతావరణ అద్భుతం. ఇది సాధారణ […]
జీతెలుగు టీవీ సీరియల్ తీసేవాడికి చూసేవాడు పరమ లోకువ..!!
. ఎప్పట్నుంచో ఓ డౌటనుమానం… సరే, ప్రతి టీవీ సీరియల్ నిర్మాతకు… అనగా తీసేవాడికి చూసేవాడు లోకువ… మరీ మహిళా ప్రేక్షకులను ఎడ్డోళ్లను చేసి, వాళ్లను పిచ్చెదవలుగా జమేసి… నానా చెత్తా వదులుతుంటారు… తెలుగు సినిమాలలో ఉన్నట్టే లాజిక్రహిత సీన్లు, కథలు సీరియళ్లలోనూ… ఎర్రగడ్డ, వైజాగ్ పిచ్చాసుపత్రులకు… ప్రైవేటు సైకియాట్రిస్టుల దగ్గరకు కేసులు పెరుగుతున్నాయీ అంటే… పచ్చని కాపురాల్లో నిప్పులు పోస్తున్నవీ అంటే… సొసైటీని పొల్యూట్ చేస్తున్నాయంటే… ప్రస్తుతం సినిమాల తరువాత సీరియళ్లే… ఐతే… స్టార్‌మా సీరియళ్లు […]
సీఎం స్వయంగా ఓసారి టాలీవుడ్ యవ్వారాలపై దృష్టిపెట్టడం బెటర్..!!
. రేవంత్ రెడ్డి ఎంత ఉదారంగా ఉంటున్నా సరే… తెలుగు సినిమా పరిశ్రమ వ్యవహారాలకు సంబంధించి తను బాగా మిస్లీడ్ అవుతున్నాడనే భావన ప్రబలంగా వ్యాపిస్తోంది… 1) దిల్ రాజు… తను స్వతహాగా సినిమా వ్యాపారి… తనకు రాగద్వేషాలు ఉంటాయి… అవి ప్రభుత్వంపై రిఫ్లెక్ట్ అవుతాయి… అది ఓ ప్రజాప్రభుత్వానికి సరైనది కాదు… 2) కోమటిరెడ్డి… తను మంత్రే… తను పెద్దగా సినిమా పరిశ్రమ నుంచి ఆశించేది ఏమీ ఉండదు… కానీ తను కూడా మిస్లీడ్ అవుతున్నాడు… […]
70 ఏళ్ల వయస్సులోనూ యంగ్‌గా, ఆరోగ్యంగా… భలే తల్లి..!!
. నిజమే… ఆమె వయసును జయించింది… 70 ఏళ్ల వయస్సులో కూడా ఆమె అబ్బురపరిచే ఫిట్నెస్ ఎక్సర్సయిజులతో 40 ఏళ్ల దానిలా కనిపిస్తుంది… ఆమె ఎవరో కాదు… పింకీ రోషన్… తను ఇన్‌స్టాలో ఎక్కువగా కనిపిస్తుంది… సినిమా వార్తల తెర మీద ఎప్పుడూ కనిపించదు… ఇన్‌స్టాలో బోలెడు ఎక్సర్సయిజు వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది… చిట్కాలు చెబుతుంది… అవును, ఆమె గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్‌గా పిలవబడే హృతిక్ రోషన్ తల్లి… తనే 51 ఏళ్లు… వార్-2 ప్రిరిలీజ్ […]
ట్రంపు… డబ్బు కక్కుర్తి మాత్రమే… నో ఎమోషన్స్, నో మోరాలిటీ…!!
. డొనాల్డ్ ట్రంప్… ఈ 79 ఏళ్ల అమెరికన్ ఇప్పుడు భారతీయులకే కాదు… ప్రపంచ దేశాలకే పెద్ద టెర్రర్ ఇప్పుడు… ఒక్క పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌కు తప్ప..! తన వ్యక్తిగత జీవితం అంతా రోత… బోలెడు కథలు… వావీ వరుసలూ పట్టని కూతలు, చేతలు… కేసులు కూడా… తనకు డబ్బు కావాలి… తనొక ఫుల్ టైమ్ వ్యాపారి, జస్ట్ పార్ట్ టైమ్ రాజకీయ నాయకుడు… మొన్నీమధ్య ఇంగ్లిష్ మీడియాలో కనిపించిన ఓ వార్త మరీ పీక్స్ అనిపించింది… […]
రీఎంట్రీ సరే గానీ… కుర్ర వేషాలకు సూటయ్యే సీన్ లేదయ్యా నవీనూ..!
. నిన్న ఈటీవీ ప్లస్‌లో రాత్రి చాలా బాగుంది అనే సినిమా వస్తోంది… వడ్డే నవీన్, శ్రీకాంత్ నటించారు… మాళవిక హీరోయిన్… ఈవీవీ సినిమా… పెద్దగా కథ అంతగా ఆకట్టుకునేలా లేకపోయినా… సినిమాలో ఎల్బీ శ్రీరాం పోషించిన గంటస్తంభం వెంకటేశ్వరరావు అనే ఒక విలక్షణమైన పాత్ర హైలైట్… ఆ పాత్ర సంభాషణలు కూడా చాలా డిఫరెంట్..! వడ్డే నవీన్‌ను చూస్తుంటే అనిపించింది… మాంచి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా సరే… అది ఎంట్రీ వరకే తప్ప నిలదొక్కుకోవడానికి పనికిరాదు కదా […]
ఈ తలనొప్పిని మీకు సమర్పించువారు…!
. ఏ మీడియాకైనా ప్రకటనలే ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువు లేకపోతే మరుక్షణం ఆ మీడియా ఊపిరి ఆగిపోయినట్లే. కంటికి కాటుక అందం. కంటిని మించిన కాటుక వికారం. ప్రస్తుతం మీడియాలో ప్రకటనలు కంటిని మించిన, ముంచిన కాటుకలా పాఠకుల, శ్రోతల, ప్రేక్షకుల సహనానికి పరీక్షలా తయారయ్యాయని ఒక సర్వేలో తేలింది. భాష ఏదయినా భాషే. మాట్లాడే భాషకంటే రాసే భాష కొంచెం ఫార్మల్ గా, కర్త కర్మ క్రియా పదాలు సరయిన అన్వయంతో ఉండాలి. మామూలుగా రాసే […]
అటెన్షన్ చంద్రబాబు..! అమరావతి వ్యవహారం తనే పర్యవేక్షించాలి..!
. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ హఠాత్తుగా చంద్రబాబు మీద ఎందుకు అలిగాడనే కారణాలు ఎలా ఉన్నా… ఆదివారం నాడు తను కొత్తపలుకులో రాసుకొచ్చిన పీ4 పథక విశ్లేషణ గానీ… నిన్న ఫస్ట్ పేజీలో పరిచేసిన అమరావతి రైతుల ప్లాట్ల లేఅవుట్ల పాట్ల కథనం కూడా నిజాలు… వాటిని పాత్రికేయ కోణంలో మాత్రమే చూస్తే..! భూములు తీసుకున్నప్పుడు రెండేళ్లలో రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తాం అని నమ్మ బలికారు… ఇప్పటికీ దాదాపు పదేళ్లు… ఇంతవరకు రైతుల ప్లాట్లకు సంబంధించి […]
ఐఫిల్ టవర్‌ను అర్ధచంద్రాకారంలో వొంచి వొంచి రేకులు కప్పినట్టు..!!
. Yaseen Shaikh ……… 5 జూలై 2018 …. అనగా హైదరాబాద్ గౌలిగూడ బస్టాండ్ కుప్పకూలినరోజు… . ద ‘డోమ్స్’ డే! తాజ్‌మహల్‌ను కాస్త దగ్గరికి నొక్కి, చుట్టూ ఉన్న మీనార్లను పీకి దాని తలపై ప్రతిష్టిస్తే? చార్మినార్ అవుతుంది. కాకపోతే… తాజ్‌మహల్ తెల్లగా ఉంటుంది. మన చార్మినార్‌కు ఒకింత వన్నె తక్కువ. ఈమాత్రం దానికి ఆగ్రా వెళ్లనేల? **** ఎప్పుడైనా కొడైకెనాల్ కొడై లేక్ చూశారా? అక్కడికెళ్లే ముందు గైడ్లు తెగ ఊరిస్తారు. తీరా చూశాక… […]
ప్రపంచదేశాలు ఆల్రెడీ లైట్ తీసుకుంటున్నాయి అమెరికాను… పార్ట్-2
. పార్థసారథి పొట్లూరి ….. అమెరికా పతనం పార్ట్-2 పీటర్ టర్చిన్ 15 ఏళ్ళ క్రితం చెప్పిన జోస్యం నిజం అని ఒప్పుకోవడానికి కొన్ని వరుసగా జరిగిన సంఘటనలని జాగ్రత్తగా పరిశీలిస్తే అమెరికా పరిస్థితి ఎలా దిగజారుతూ వచ్చిందో అర్ధం అవుతుంది. 1. కోవిడ్ వాక్సిన్ సిద్ధం కాకముందు క్వినైన్ డ్రగ్ కోసం ట్రంప్ భారత దేశాన్ని దేబిరించడం అనేది అమెరికా ఎంత బలహీనంగా ఉందో తెలియచేసే సంఘటన. అఫ్కోర్స్! ముందు భారతీయుల అవసరాలు తీరినాకే మేము […]
ట్రంపు ఒక పాత్ర, అంతే… అమెరికా పతనం ఆరంభమైనట్టేనా..? పార్ట్-1
. Pardha Saradhi Potluri ………… అమెరికా పతనం – పీటర్ టర్చిన్- part-1 పీటర్ టర్చిన్- Peter Turchin! పీటర్ టర్చిన్ మాక్రో హిస్టరీ ( Macro History) కి సంబంధించి పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్త. హిస్టోరికల్ డైనమిక్స్ మీద పుస్తకాలు వ్రాసాడు. పీటర్ టర్చిన్ పుట్టింది 1957 లో ఒక్కప్పటి సోవియట్ యూనియన్ లో. అమెరికాలో స్థిరపడిన రష్యన్ జాతీయుడు. నిజానికి పీటర్ టర్చిన్ బయాలాజీ పట్టభద్రుడు. జూవాలజీలో Ph.d చేశాడు కానీ చరిత్ర […]
ఈ చరిత్రాత్మక కట్టడం కుప్పకూలిందే కేసీయార్ హయాంలో..!!
. నిజం నిలకడగా గడప దాటేలోపు అబద్ధం ప్రపంచమంతా తిరిగొస్తుందంటారు కదా… దీన్ని బీఆర్ఎస్ క్యాంపు బలంగా నమ్ముతుంది… నమస్తే తెలంగాణలో ఉద్దేశపూర్వకంగా ఓ వార్త అచ్చేస్తారు… దాన్ని బీఆర్ఎస్ క్యాంపు సోషల్ మీడియా పోస్టులు, వీడియోలతో జనంలోకి తీసుకుపోతుంది… గౌలిగూడ బస్టాండును 400 కోట్ల హడ్కో రుణం కోసం తాకట్టు పెట్టారని వార్త… హవ్వ, ఇంత అన్యాయమా..? ఓ చరిత్రాత్మక కట్టడాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాకట్టు పెడుతుందా..? ఇంకేముంది..? రేపో ఎల్లుండో దాన్ని అమ్మేస్తారు, […]
అన్యథా శరణం నాస్తి.., త్వమేవ శరణం మమ… మోడీకి కనువిప్పు…
. వద్దూవద్దంటున్నా సరే… వెంకయ్యనాయుడిని యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పించి, ఉపరాష్ట్రపతిని చేసినప్పుడే అనుకున్నాం… ఏదో రోజు తప్పక ఆయన విలువ తెలిసి, మోడీ లెంపలేసుకుని, తిరిగి పిలుస్తాడనీ, మార్గదర్శకత్వం కోరుతాడనీ… ఈ అమిత్ షాలు, ఈ రాజనాథ్సింగ్లు, ఈ నడ్డాలు కాదు, ఈ ఆదానీలు అసలే కాదు… చంద్రబాబు ట్విన్ బ్రదర్ వంటి ఆ వెంకయ్యనాయుడే తిరిగి అల్టిమేట్ రక్షకుడనీ… చివరకు తన ఉనికికే ప్రమాదం వాటిల్లేసరికి… అటు అమెరికా సుంకాలు, ఇటు రాహుల్ గాంధీ […]
- « Previous Page
- 1
- …
- 4
- 5
- 6
- 7
- 8
- …
- 379
- Next Page »