. బీజీఎం అంటే బాక్సులు పగిలిపోయేంత లౌడ్‌గా ఉండాలి… అలా ఉంటేనే సీన్లు భీకరంగా ఎలివేటవుతాయి… ప్రేక్షకుడిని ఉర్రూతలూగిస్తుంది….. థమన్ ఇంకా ఈ భ్రమల్లోనే ఉన్నాడు… అంతేకాదు, మెలొడీ ఇతర జానర్ల పాటలకన్నా ఐటమ్ సాంగ్స్ మీదే తన తపన, దృష్టి, శ్రమ, ప్రయాస కనిపిస్తున్నాయి… జాట్ అనే ఓ సినిమా వచ్చింది కదా తాజాగా… అది చూస్తే అలాగే అనిపిస్తుంది… ఇది తనకు రెండో హిందీ సినిమా… ఉన్నవే మూడు పాటలు, అందులో ఒకటి టచ్ […]
ప్రదీప్ భయ్యా… టీవీ తెరపై నువ్వు తోపు… ఈ సినిమాలు అవసరమా చెప్పు..?!
. ప్రదీప్, దీపిక పిల్లి, గెటప్ శ్రీను, రోహిణి… ఈ పేర్లన్నీ ఈటీవీ బ్యాచ్… ఢీ, జబర్దస్త్ ఎట్సెట్రా… అంతెందకు ఇప్పుడు తాజాగా రిలీజైన సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో కూడా వీళ్లే… ఇంకా చాలామంది అదే బ్యాచ్ కనిపిస్తారు… అంతేకాదు, జబర్దస్త్ షో స్టార్ట్ చేసిన డైరెక్టర్లు నితిన్, భరత్ (తరువాత వేరే చానెళ్లకూ మళ్లారు…) కూడా ఈటీవీ, మల్లెమాల బ్యాచే… ఎస్, వీళ్లందరూ కలిసి చేసిన సినిమా అచ్చంగా ఓ ఈటీవీ రియాలిటీ […]
కమలాసన్కు దీటుగా చంద్రమోహన్… శ్రీదేవికి సాటిగా విజయశాంతి…
. Subramanyam Dogiparthi ….. మరో వసంత కోకిల . సేం టు సేం కధ కాకపోయినా ఆ ఛాయలు బాగానే కనిపిస్తాయి . 1983 లో వచ్చిన ఈ అమాయక చక్రవర్తి సినిమా ఒక మనశ్శాస్త్ర వైద్యుడి భగ్నప్రేమ కధ . వైద్యుడిగా చంద్రమోహన్ చాలా బాగా నటించాడు . వసంత కోకిల సినిమాలో కమల్ హాసన్ నటనకు ధీటుగా , బెటరుగా కూడా ఉంటుందని కూడా చెప్పవచ్చేమో ! చంద్రమోహన్ ఒక సైకియాట్రిస్ట్ . […]
అబ్బే.., ఇది మన తెలుగు ప్రేక్షకులకు ఎక్కడం కష్టమే..!!
. విడాముయార్చి… అదేనా ఆ సినిమా పేరు..? అజిత్ సినిమా… తీవ్రంగా నిరాశపరిచింది… అదే త్రిషతో జతకట్టి ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ పేరుతో మార్కెట్లలోకి వచ్చాడు… ఇప్పుడూ త్రిషతో తన కెమిస్ట్రీ పండకపోయినా సరే, యాక్షన్ సీన్లలో అజిత్ రెచ్చిపోయాడు… అజిత్ అంటే యాక్షన్ కదా… పైగా పాత పరాజయం నుంచి బయటపడాలంటే ఫక్తు ఫ్యాన్స్‌ను అలరించే సినిమా తీయాలని అనుకున్నట్టున్నాడు… పక్కా కమర్షియల్ బాట… లాజిక్కులు మన్నూమశానం జాన్తా నై… తన పాత సినిమాల్ని […]
జాక్.., నీ సినిమా కొట్టేసిందోయ్… అసలు ఇది నీ జానరే కాదు…
. చాన్నాళ్లుగా ఫీల్డులో ఉన్నాడు జొన్నలగడ్డ సిద్దు… కానీ డీజే టిల్లుతో ఇంటింటికీ చేరువయ్యాడు… దాని సీక్వెల్ సూపర్ హిట్… ఆ జానర్ వేరేవాళ్లకు చేతకాదు ఇప్పటి హీరోల్లో… వన్ లైనర్స్, పంచ్ డైలాగులు, సిద్దు మార్క్ టైమింగుతో కామెడీ ప్రేక్షకులను నవ్వించాయి, థియేటర్లకు రప్పించాయి… కానీ ఈసారి కొత్త జానర్లోకి, అదీ అయోమయపు జానర్లోకి ప్రవేశించి దెబ్బతిన్నాడు… అసలు ఇది బొమ్మరిల్లు భాస్కర్ సినిమాయేనా..? సిద్దు అనే పాత్ర… తన చుట్టే కథ… తన తల్లి […]
మరీ నేత్రదానాన్ని కూడా అనుమానించే భర్త… జంధ్యాలకు తలబొప్పి…
. Subramanyam Dogiparthi …… అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామీ, ఆడ ఉసురు తగలనీకు స్వామీ . ఈ అమరజీవి సినిమాలో విప్రనారాయణ నృత్య ప్రదర్శనలో పాట . అద్భుతంగా ఉంటుంది . దేవదేవిగా జయప్రద చాలా అందంగా నృత్యించింది , నటించింది . విప్రనారాయణుడిగా అక్కినేని గురించి చెప్పేదేముంది . 1954 లోనే భానుమతితో ఓ కళాఖండాన్నే ఆవిష్కరించాడు . జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ ట్రాజెడీ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు . […]
థూ, ఇదేం పాట అన్నారందరూ మొదట్లో… కట్ చేస్తే ఇండస్ట్రీ హిట్…
. Veerendranath Yandamoori …… తెలుగు చిత్ర పరిశ్రమకి ఇళయరాజా అప్పుడప్పుడే పరిచయం అవుతున్న రోజులు. కెఎస్. రామారావు అంతకు ముందు తమిళ్ డబ్బింగులు చేసి ఉండటం వల్ల తన తొలి స్ట్రెయిట్ తెలుగు సినిమాకి ఇళయరాజాని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నాడు. సత్యాన౦ద్ మాటలు. లోక్ సింగ్ కేమేరా… రాజా, కోదండరామిరెడ్డి, చిరంజీవి… మొత్తం ఐదుగురు కాంబినేషన్లో ఐదు సినిమాలు చేద్దామనుకొని ఒక అగ్రిమెంట్. అలా వచ్చినవే చాలెంజ్, రాక్షసుడు వగైరా. ఆ వరుసలో అభిలాష […]
అసలే రెండు సింహాలు… రెండు సివంగులు… చింపాంజీ డబులాక్షన్…
. Subramanyam Dogiparthi ……… ఓ చింపాంజీ చేత ద్విపాత్రాభినయం చేయించిన ఏకైక దర్శకుడు ప్రపంచ సినిమా చరిత్రలో ఒక్కడే ఒక్కడు దర్శకుడు రాఘవేంద్ర రావేనేమో ! 1983 ఏప్రిల్ 28 న రిలీజయిన ఈ అడవి సింహాలు సినిమాలో ఈ ప్రయోగాన్ని చేసారాయన . అంతేనా ! డబుల్ పోజులో ఉన్న చింపాంజీలకు రొమాన్స్ , శుభం కార్డు అప్పుడు కృష్ణ- శ్రీదేవి, కృష్ణంరాజు- జయప్రదల జంటలతో పాటు మూడో జంటగా లిప్ లాక్ కూడా […]
ఈ వెగటు కేరక్టర్ తెరమీదికి మల్లొచ్చింది… ఏం ఇండస్ట్రీరా బాబూ….
. శ్రీకాంత్ అయ్యంగార్… ఆమధ్య పిచ్చి కూతలు కూసి, రివ్యూయర్లు, ఫిలిమ్ జర్నలిస్టులను పెంట మీద పురుగుల్లా, కాదు, ఆ పురుగుల విసర్జకాలకన్నా హీనంగా తీసిపారేసిన తిక్క కేరక్టర్ తెలుసు కదా… నథింగ్, ఇలాంటోళ్లను ఎవరూ కంట్రోల్ చేయలేరు… తాజాగా మళ్లీ వచ్చాడురా బాబోయ్… తొక్కలో లోకం… ఎవడేమనుకుంటే నాకేంటి..? నాకు చాన్సులు ఇచ్చేవాడి ఖర్మ… వాడి దరిద్రం… బొచ్చు, మనది పోయేదేముంది అన్నట్టుగా ఉంటున్నాయి తన మాటలు… ఈ సారు గాడు… మైక్ దొరికితే చాలు, […]
యండమూరి సీరియస్ కథాంశానికి సినిమాటిక్ చిరు హంగులు..!
. Subramanyam Dogiparthi …….. చిరంజీవి విజయయాత్రలో ఓ మైలురాయి ఈ అభిలాష సినిమా . యండమూరి వీరేంద్రనాధ్- చిరంజీవి- కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ . ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్ గానే సంచలనం సృష్టించిన ఈ నవల సినిమాగా ఇంకా ఎక్కువ సంచలనమే సృష్టించిందని చెప్పవచ్చు . కధాంశంలో ఉన్న పట్టు , సస్పెన్స్ , సినిమా స్క్రీన్ ప్లేలో ఉన్న బిర్రు , ఇళయరాజా సంగీతం , ఆత్రేయ-వేటూరిల సాహిత్యం , […]
పత్రికలు రాసేవన్నీ నిజాలు కావు… అబద్ధాలన్నీ గాల్లో కలిసిపోవు…
. A Public Celebrity is just a Public Celebrity, but not a Public Property. ఇది మనకు అర్థమైతే సమస్య లేదు. అర్థం కానప్పుడే సమస్యలు వస్తాయి. దినపత్రికలన్నీ అన్నిసార్లూ నిజాలే రాస్తాయన్న గ్యారెంటీ లేదు. రాసిన అబద్ధాలన్నీ గాల్లో కలిసిపోతాయనీ కాదు. ఒక్కోసారి వెంటాడి, శిక్షించే దాకా తీసుకెళ్తాయి. నటి భువనేశ్వరి వర్సెస్ నడిగర్ సంగం విషయంలో జరిగింది ఇదే! 2009లో అత్యంత పాపులర్ అయిన సంఘటన ఇది. చెన్నై నగరంలోని […]
ధనమూలం ఇదం జగత్… కానీ నా భర్త మాత్రం పురుషోత్తముడు…
. ‘సంపాదన ఉంటేనే మనకు మర్యాద’.. ఓ నటి అనుభవం (శ్రీలేఖ ప్రఖ్యాత తమిళ నటి, డబ్బింగ్ కళాకారిణి, డబ్బింగ్ సహ రచయిత్రి. తమిళంలో అనేకమంది హీరోయిన్లకు ఆమె డబ్బింగ్ చెప్పారు. ఎన్నో సినిమాల్లో పాత్రలు పోషించారు. శ్రీలేఖగా ఉన్న ఆమె నాటక నటుడు, డబ్బింగ్ కళాకారుడు రాజేంద్రన్‌ని పెళ్లి చేసుకుని శ్రీలేఖ రాజేంద్రన్ అయ్యారు. తన జీవితంలో పెళ్లి, దాని అనంతర పరిణామాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలివి..) * * * […]
మహానటి సావిత్రి లైఫ్ మీద గీతూ రాయల్ వ్యాఖ్యలు తప్పేనా..?!
. ఒక మహానేత… ఒక మహానటి… ఒక మహావ్యక్తి… వాళ్లకు సంబంధించిన రంగాలకు సంబంధించి వాళ్లు సాధించిన ఘనతలు, వాళ్ల గొప్పతనాలను ప్రశంసిద్దాం… కానీ వాళ్ల వ్యక్తిగత జీవితాల్లో తప్పులు కనిపిస్తే, తప్పులుగా అనిపిస్తే తప్పుపట్టకూడదా..? మన అభిప్రాయాన్ని వినిపించడం, వెల్లడించడం తప్పవుతుందా..? ఫలానా రంగాల్లో వాళ్లు విశేష ప్రతిభ ప్రదర్శించారు కాబట్టి ఇక ఏదైనా సరే చల్తా, చల్నేదో బాల్కిషన్ అనుకోవల్సిందేనా..? కొందరు తప్పేముంది తప్పుల్ని ఎంచితే అంటారు… మరికొందరు తప్పే అంటారు… ఈ మీమాంస […]
ఆ పాట చరణాల సొగసు చూడతరమా…? వేటూరి మేథోమథనం కథ..!!
. వేటూరి వారి అయిదో చరణం అనబడే ఓ సాహిత్య మథనం కథ… . మేం ‘మిస్టర్ పెళ్ళాం’ ఫీచర్ ఫిలిం తీస్తున్న రోజులు. అది 14, డిశెంబరు 1992, మార్గశిర సోమవారం, ప్రఖ్యాత గేయ రచయిత శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారు అయ్యప్ప దీక్షలో, హైదరాబాదులో ఉన్నారు. నిర్మాణ సారధ్యం పూర్తిగా చేస్తున్న నేనేమో చెన్నైలో బాపుగారి దగ్గర వున్నా. మా సినిమాలో, ఓ సందర్భంలో, హీరోయిన్ని ఆటపట్టిస్తూ, హీరో చిలిపిగా పొగిడే ఓ పాటని, […]
ఆదిత్య 369 కు తాత ఇది… ఈ రివ్యూ అర్థమైతే మీకు సినిమా అర్థమైనట్టే..!!
. Ashok Kumar Vemulapalli……. TENET * టెనెట్ సినిమా చివర్లో భవిష్యత్తు నుంచి వర్తమానంలోకి వచ్చిన హీరో ప్యాటిసన్*… గతం నుంచి వర్తమానంలోకి వచ్చిన హీరో వాషింగ్టన్ తో ఒక మాట అంటాడు… నీ గతానికి గొప్ప భవిష్యత్తు ఉంది.. అంటే నాకు కొన్నేళ్లు క్రితం నీకు కొన్నేళ్ల తర్వాత అన్నమాట అని భవిష్యత్తులోకి వెళ్లిపోతే వాషింగ్టన్ గతంలోకి వెళ్లిపోతాడు.. వర్తమానం అలాగే ఉండిపోతుంది.. నేను రాసిన ఈ నాలుగు లైన్లలో మీకు ఒక్కటైనా అర్థమయితే సినిమామొత్తం […]
నిప్పు జర్నలిస్టు ఎన్కౌంటర్ దశరథరామ్ పోలిన పాత్ర… అలాగే హతం..!!
. Subramanyam Dogiparthi ……. 1983 లోకి వచ్చేసాం . చిరంజీవి మరింత పాపులర్ కావటానికి బాగా దోహదపడ్డ సంవత్సరం 1983 . ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ , మంత్రి గారి వియ్యంకుడు వంటి ఫీల్ గుడ్ సినిమాలు విడుదలయ్యాయి . కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ ఆలయ శిఖరం కూడా చిరంజీవికి మంచి పేరు తెచ్చింది . కమర్షియల్ సక్సెస్ కూడా . ఓ పేద కుటుంబం . స్వార్ధంతో కూరుకుపోయి కుటుంబం పట్ల […]
టచ్ మి నాట్..! ముందు సైకోమెట్రీ చదివి ఉండాల్సింది దర్శకుడు..!!
. Ashok Pothraj …… జియో హాట్ స్టార్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి మరో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వచ్చేసింది. ఆ సిరీస్ పేరే ‘టచ్ మీ నాట్’. గతంలో ఒకటి రెండు సినిమాలను తెరకెక్కించిన రమణతేజ, ఈ సిరీస్ కి దర్శకుడు. నవదీప్ – కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, 6 ఎపిసోడ్స్ 7 భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ‘హీ ఈజ్ సైకో మెట్రిక్’ అనే కొరియన్ […]
తొలినాటి శ్రీదేవి ప్రేమికులకు నిజంగానే… ఓ వసంతకోకిల అప్పట్లో…
. Subramanyam Dogiparthi ….. ఎవరికి ఎవరు ఎదురవుతారు , మనసు మనసు ముడిపెడతారు , ఎందుకు వస్తారో ఎందుకు వెళతారో ! ఈ మాటల పాటతో ముగుస్తుంది సినిమా . గొప్ప జీవిత సారాంశం . ఈ ఫిలసాఫికల్ ముగింపుతో ముగుస్తుంది ఈ వసంత కోకిల సినిమా . పేరుకు డబ్బింగ్ సినిమాయే కాని మామూలు సినిమాలతో పోటీపడి నేటికీ ఓ గొప్ప సినిమాగా నిలిచిపోయింది . శ్రీదేవి , కమల్ హాసన్ నట విశ్వరూపం అని […]
‘పరుగులు’ తీయాల్సిన టీ20 కథతో… మరీ ఐదు రోజుల ‘టెస్ట్’ పెట్టారు..!!
. హీరో సిద్ధార్థ్ సంగతి ఎలా ఉన్నా సరే… ఈ సినిమాలో హయ్యెస్ట్ పెయిడ్ హీరోయిన్ నయనతార ఉంది… పైగా మాధవన్ కూడా… ఆ ముగ్గురు చాలు, సినిమా కమర్షియల్ బిజినెస్ వాల్యూ పెంచడానికి… కానీ థియేటర్లలోకి గాకుండా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది నేరుగా… (తమిళ డబ్బింగ్)… అదేమిటో మరి…! సరిగ్గా మార్కెటింగ్ చేసుకోకపోవడమా, మరే ఇతర కారణాలున్నాయా అనేది వదిలేస్తే… ఇంట్రస్టింగ్ స్టోరీ లైన్‌ను ఆసక్తికరంగా ప్రజెంట్ చేయలేదు అనిపించింది దర్శకుడు… క్రైమ్, స్పోర్ట్స్ డ్రామా ఉన్న […]
తండ్రీకొడుకుల బంధానికి కాస్త మైథలాజికల్, అఘోరాల టచ్…
. ఎస్పీ చరణ్… తండ్రి బాలసుబ్రహ్మణ్యం తన ఫీల్డులో గ్రాండ్ సక్సెస్ కేరక్టర్… శాస్త్రీయ సంగీతమే నేర్చుకోకపోయినా అనేక భాషల్లో వేల పాటల్ని పాడటం అనేది కలగనాల్సిన కెరీర్… డబ్బింగ్, యాక్టింగ్, కంపోజింగ్, కచేరీలు, టీవీ షోలు, గానం… వాట్ నాట్..? తన వారసుడే అయినా… బహుముఖ ప్రయత్నాలు చేస్తున్నా చరణ్ మాత్రం ఎప్పుడూ ఓ గ్రాండ్ సక్సెస్ కొట్టలేక మిగిలిపోతున్నాడు… నిర్మాత, దర్శకుడు, నటుడు, గాయకుడు, టీవీ హోస్టింగ్… ఎన్నెన్నో… తనకు గానంకన్నా నటనే ఇష్టం… […]