ఫోటో చూశారు కదా… ఆమె వృత్తి రీత్యా ఓ డాక్టర్… పాతిక సంవత్సరాల క్రితమే ఇంగ్లండ్ వెళ్లిందీమె… అక్కడే స్థిరపడిపోయిందామె… ఓరోజు తన కూతురు స్కూల్ నుంచి చిరాగ్గా వచ్చింది, బ్యాగ్ సోఫా మీద పడేసి కన్నీళ్లు పెట్టుకుంది… ఏంది తల్లీ, ఏమైంది అనడిగింది డాక్టరమ్మ… స్కూల్లో పిల్లలు ఏడిపిస్తున్నారమ్మా… మీ అమ్మ ఏమిటి అలా..? ఓ క్లాత్ అలా చుట్టేసుకుంది, అదేం డ్రెస్సింగ్ అని ఓ తెల్లమ్మాయి ప్రశ్నించింది… ఏం చెప్పాలో అర్థం కాలేదు… ఐనా […]
నేను – నా టాక్సీ… అది ప్రాణదాత… నేను సారథిని… ఎన్నో వందల కేసులు…
ఒరేయ్ రిక్షా వంటి పిలుపుల్ని ఇప్పుడు వినడం లేదు, అవి ఎవరూ పడటం లేదు కూడా… అలాగే ఏయ్ రిక్షా, ఏయ్ టాక్సీ డ్రైవర్ అనే పిలుపులూ లేవు, ఎట్ లీస్ట్ బాగా తగ్గిపోయాయ్… డెలివరీ బాయ్స్, కొరియర్ బాయ్స్‌ను కూడా డెలివరీ పార్టనర్స్, కొరియర్ ఏజెంట్స్ అంటున్నాం… కానీ ఒకాయన తనను ఎవరైనా టాక్సీ డ్రైవర్ అని పిలిస్తే గర్వంగా ఫీలవుతాను అంటున్నాడు… ముంబై హ్యూమన్స్ గ్రూపులో షేర్ చేసుకున్నాడు… ఇలా… నా భార్య గర్భస్రావంతో […]
ఓహ్… బిషన్ సింగ్ బేదీ పేరు వెనుక ఇంత కథ ఉందా..? ఇంట్రస్టింగ్…!!
Nancharaiah Merugumala……. బిషన్ సింగ్ బేడీ పేరులో విష్ణువు ఉన్నాడనీ, వేదీ అనే మాటకు ‘బేదీ’ పంజాబీ రూపమని ఆలస్యంగా తెలిసింది! బేదీ ఆస్ట్రేలియా భార్య సంగతి ఒక్క సాక్షే ప్రస్తావించింది! ………………………………………. మేం ఆరో తరగతి చదువుతుండగా (1967–68) ఆంధ్రప్రభ నుంచి క్రికెట్ వార్తలు మా నాన్న నాతో చదివించుకుని వినే రోజుల్లో మొదటిసారి కనిపించిన పేరు బిషన్ సింగ్ బేడీ. అప్పటికి పంజాబీల (సిక్కులూ, హిందువులూ) పేర్లు ఎలా ఉంటాయో కొద్దిగా సోయి ఉన్న […]
ఎర్ర బియ్యం ఎందుకు శ్రేష్టం..? సుగర్, బీపీ, ఒబేసిటీ సమస్యలకు ఎలా విరుగుడు..?!
ఎర్రబియ్యం అన్నం… ఎర్రబియ్యం, రెడ్ రైస్, కేరళ బియ్యం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినపడుతోన్న బియ్యపు రకం. బరువు తగ్గాలనుకునేవారు, మదుమేహం, రక్తపోటు వున్నవారికి డైటీషియన్స్ ప్రిస్క్రైబ్ చేసే మన తెల్ల అన్నానికి ప్రత్యామ్నాయం. డైటింగ్ చేసేప్పుడు అన్నం తినాలి అనే కోరికను (క్రేవింగ్) తీర్చగలిగే అద్బుతమైన బియ్యపు వెరైటీ. దీనిని శతాబ్ధాలుగా మన దేశంలో సాగు చేస్తున్నారు. అస్సాం బెంగాల్, ఆంధ్ర, కేరళలో పూర్వం విరివిగా సాగుచేసేవారు. ప్రస్తుతం సేంద్రియ పద్ధతిలో సాగు చేసే రైతులు […]
చిన్నప్పుడు మా ఇంటికి దెయ్యం వచ్చింది… అదీ ముసలి దెయ్యం…
దెయ్యం వచ్చింది.. అవును..నా చిన్నప్పుడు మా ఇంటికి దెయ్యం వచ్చింది..అదీ ముసలి దెయ్యం.. రాత్రి అయితే చాలు మా ఇంటిమీద రాళ్లు విసిరేది.. ఒక్క మా ఇంటిమీదే కాదు.. మా పెద్దనాన్న బ్రహ్మయ్య, బాబాయిలు ప్రసాద్, కృష్ణ వాళ్ళ ఇళ్ల మీదా రాళ్లు విసిరేది.. ఆ దెయ్యం వచ్చే టైం కి మేమంతా తలుపులు వేసుకుని భయపడుతూ పడుకునేవాళ్ళం.. ఎప్పుడు ఎవరిఇంటిమీద రాళ్లు వేస్తుందో అర్థంగాక భయపడి చచ్చేవాళ్ళం… అలా వారం రోజుల తర్వాత ఆ దెయ్యాన్ని […]
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం… చంద్రబాబు అరెస్టుపై తీవ్ర ఆందోళన…
అది అంతరిక్షంలోని స్పేస్ స్టేషన్… 24వ తేదీ, మంగళవారం ఉదయం 11 గంటలకు ఇద్దరు వ్యోమగాముల నడుమ చర్చ… ఒక వ్యోమగామి దిగువన కనిపిస్తున్న ఇండియా వైపు దిగులుగా చూస్తూ తోటి వ్యోమగామితో అంటున్నాడు… ‘అదుగో కనిపిస్తున్న సముద్రం పక్కనే తీరంలో ఆంధ్రప్రదేశ్… చుక్కలా కనిపిస్తున్నది కదా, అదే రాజమహేంద్రవరం… చంద్రబాబు ఉన్న ఊరు అదే… ఆయనను అక్రమంగా అరెస్టు చేసి ఇక్కడి జైలులోనే పెట్టారు… దుర్మార్గం కదా… ఇప్పుడే శాటిలైట్ టీవీ ట్యూన్ చేస్తుంటే ఈ […]
ఈరోజు సద్దుల బతుకమ్మ… మీలో ఎందరు వీటిని చూసి ఉంటారు..?
Srinivas Sarla……. చేతుల పిస్తోల్ లేదు, జేబుల రీల్ పటాకలు లెవ్వు, వేసుకోడానికి కొత్త అంగీ లాగు లేదు, దోస్తుగాళ్ళు అందరూ బతుకమ్మ దగ్గరకు వెళ్లారు, అందరి దగ్గర పిస్తోల్ ఉంది, నా దగ్గర లేదు, మరేట్ల పోవాలే ఆడుకోను.. అరేయ్ నేను రాను మీరు పోర్రి.. అని అలిగి ఇంట్ల కూసున్న… పెద్దవాళ్ళు బతుకమ్మ ఆడుతుంటే, మేము చేతిలో 5 రూపాల ఇనుప తుపాకీతో రీల్ తొడిగి, కనిపించినోడి వెంబడి పడుతూ హ్యాండ్సప్ కదిలితే కాల్చి […]
ఈ బారాత్… పెళ్లి పెటాకుల బారాత్, గుడ్‌బై బారాత్, విడాకుల బారాత్…
అదేదో పాత సినిమా… పెళ్లికి అందరినీ పిలిచి, వాళ్ల సమక్షంలో ఎలా ఒక్కటయ్యామో… అదేరకంగా విడాకులకు కూడా అందరినీ పిలిచి, అందరికీ చెప్పి, అందరి సాక్షిగా విడిపోదాం అని హీరోయిన్ వాదించి, ఒప్పించి, ఫంక్షన్ పెడుతుంది… ఇంట్రస్టింగు పాయింట్… పొద్దున్నే ఈనాడులో ఓ వార్త చదివాక అదే గుర్తొచ్చింది… ఆ వార్త ఏమిటంటే..? జార్ఖండ్, రాంచీలో ప్రేమ్ గుప్తా అనే ఓ తండ్రి… గత ఏడాది ఏప్రిల్‌లో తన బిడ్డ సాక్షి గుప్తాకు ఉన్నంతలో బాగా ఖర్చు […]
తంగేడు లేదు, గునుగు కానరాదు… అన్నీ బంతిపూల బతుకమ్మలే నేడు…
ఫేస్బుక్ మిత్రురాలు Shyla వాల్ మీద ఓ పోస్టు… వాళ్ల సంస్థ PURE ఆధ్వర్యంలో కొత్తగూడెం అటవీ ప్రాంతాల్లో నడిచే బళ్లల్లో పిల్లలు బతుకమ్మ ఉత్సవాల్ని జరపుకుంటున్న ఫోటోలు ఆ పోస్టుకు జతచేయబడి ఉన్నాయి… అందులో బతుకమ్మల ఫోటోలు ఆకర్షించాయి… ప్రత్యేకించి అడవిలో దొరికే కూరగాయల బతుకమ్మ మరీనూ… ఓ బడిపిల్ల ఎత్తుకున్న బతుకమ్మ కూడా… పదీపదిహేను తంగేడు పూలు, నెత్తిన మరో పదీపదిహేను గునుగు… మిగతాదంతా ఓ ఎండిపోయిన పొదలా ఉంది… సంప్రదాయ, ఛాందసవాదులు చూస్తే ఠాట్ […]
ఆమెది ఉదాత్తమైన ఓ అక్రమ ప్రేమ… ఐతేనేం, తలెత్తుకుని బతికింది…
లేచిపోయినానని ఎవరన్నా అంటే…. Scandal …and An affair to remember ………………………………………….. ఉదాత్తమైన అక్రమ ప్రేమ… స్టోరీ – 2 Happy families are all alike, every unhappy family is unhappy inits own way అనాకెరినినా నవల ఎప్పటికీ వెన్నాడే ఈ వాక్యంతో మొదలవుతుంది. టాల్ స్టాయ్ ఒక్కడే ఇలా నిజాలు చెప్పి మనల్ని భయకంపితుల్ని చేయగలడు. “లేచిపోయినానని ఎవరన్నా అంటే నా మనసుకెంతో కష్టంగా వుంటుంది.. “ ఇది రాజేశ్వరి […]
ఆమె రాయలసీమ విజయమ్మ కాదట… తెలంగాణ విజయలక్ష్మి అట…
ఆంధ్రజ్యోతి వాడు మాస్ట్ హెడ్ పక్కనే ఓ ఇండికేటర్ వార్త పెట్టాడు… అనగా లోపల పేజీల్లో ఉన్న ఓ వార్తకు ఇండికేటర్ అన్నమాట… ఐనా ఇప్పుడు ప్రతి పేపరూ అంతే కదా… ఫస్ట్ పేజీలో 16, 17 వార్తల పట్టిక పెడుతున్నారు కదా… సో, ఇదీ ఆ బాపతే… శీర్షిక పేరు ‘తెలంగాణకు వైఎస్ విజయలక్ష్మి’… ఓ ఆశ్చర్యార్థకం ప్లస్ ఓ ప్రశ్నార్థకం కూడా పెట్టాడు… అంటే నిజమో కాదో తెలియదు అని చెప్పడం, పైగా నిజమేనా […]
ఆయన కంప్యూటర్ కనిపెట్టిన బాబు కాదు… కానీ ఆ భాషల్ని పరపరా నమిలేశాడు…
ఇండియాకు ఐటీని తెచ్చినవాడు… మన ఐటీకి ఆద్యుడు… కంప్యూటర్ కనిపెట్టినవాడు… ఐటీ పితామహుడు… వంటి విశేషణాలతో చంద్రబాబును కీర్తిస్తూ సాగే డప్పులు బోలెడు చదవబడ్డాం… బడుతున్నాం ఇంకా…! తనకు అంత సీన్ లేదని కూడా మనం నిజాలు చెప్పుకున్నాం… సరే, అదంతా వేరే సంగతి గానీ ఓ ప్రశ్న… కంప్యూటర్ను కనిపెట్టిన పితామహుడు చంద్రబాబుకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం తెలుసా..? ఎవరికైనా సమాధానం తెలుసా..? భలేవారే… రాకెట్ కనిపెట్టినవాడు ఆ రాకెట్లో అంతరిక్షానికి వెళ్లి రావాలనేముంది అంటారా..? […]
మందు ఎక్కితే… ఆంగ్లం దానంతటదే తన్నుకుని వస్తుంది అదేమిటో గానీ…
Nancharaiah Merugumala…… మద్యం తాగితే… ఎందుకు కొందరు ఇంగ్లిష్ లో మాట్లాడతారు? ఈ ప్రశ్నకు 50 ఏళ్ల క్రితం హిందీ నటదర్శకుడు ఐఎస్ జోహార్ చెప్పిన జవాబు! ……………………………………………………………………………….. ఇంగ్లిష్.. వింగ్లిష్….!! అనే శీర్షికతో ఒక బ్లాక్ బోర్ద్, దాని కింద ‘ఇండియన్ మేడ్ ఫారిన్ లికర్’ సీసాలున్న ఫోటోలతో మిత్రుడు నీల్ కొలికిపూడి గారు 2018 సెప్టెంబర్ 23న పెట్టిన తన పాత పోస్టును ఈరోజు తన వాల్ మీద మరోసారి అతికించగా, అరగంట క్రితం […]
సెల్ఫ్ బ్రాండ్… ఎవడికో కోట్లు తగలేయడం దేనికి..? మనమే ఓ బ్రాండ్…
Self Made: ఏ మాటకామాట. లలితా బంగారు నగల గుండాయన ఆయనకు ఆయనే ఒక బ్రాండ్. “డబ్బులెవరికీ ఊరికే రావు; డబ్బులు చెట్లకు కాయవు” అని గుండాయన చెప్పేవరకు మనకు తెలియనేలేదు. “జ్ఞానం ఎవరయినా ఉచితంగా పంచుతారు…మన భోజనం మాత్రం మనమే సంపాదించుకోవాలి” అని పతంజలి సూత్రీకరించారు. ఈ దేశంలో ఏ పూటకు ఆ పూట వండుకోవడానికి గింజలు లేకపోయినా…బంగారు మాత్రం ఉండి తీరాలి అన్న తపన అనాదిగా ఉంది కాబట్టి…మధ్యతరగతి వారి బంగారు కలలను లలితా గుండాయన చక్కగా పట్టుకున్నాడు. అమితాబ్, […]
చిన్న కథ… సినిమా ట్విస్టులూ లేని కథ… కానీ కొలవలేనంత లోతుంది…
ఓ కథ చదివే ముందు ఓ సోషల్ ట్రెండ్ గుర్తుతెచ్చుకొండి… నువ్వు ఈ పనిచేస్తూ ఫోటో పోస్ట్ చేయగలవా..? ఎందరికి చాలెంజ్ విసురుతావు..? చాలెంజ్‌కు గురైనవాళ్లు కూడా ఆ పనులుచేసి, ఫోటోలో పోస్ట్ చేసి, మరో నలుగురిని చాలెంజ్ చేయాలి… ఇదొక చైన్ స్కీమ్… ఐస్ గడ్డలు నెత్తి మీద గుమ్మరించుకుంటావా..? మీసాలు, గడ్డాలు గొరిగించుకుంటావా..? ఇలాంటివి… ఇప్పుడు ఫేస్ బుక్లోనే కనిపించిన ఓ ఇంగ్లిష్ పోస్టుకు తెలుగు స్వేచ్చానువాదం చదవండి… స్థానికరించబడిన అనువాదం… అనగా లోకలైజ్ […]
విశ్వమానవులు వాళ్లు… కానీ తమ మూలాల్ని గౌరవిస్తారు- ప్రేమిస్తారు…
ఒక ఫోటో ఆలోచనల్లో పడేసింది… జీ20 సదస్సు కోసం ఇండియా వచ్చిన రిషి సునాక్, ఆయన భార్య అక్షత మూర్తి అక్షరధామ్ గుడికి వెళ్లారు… ఆ ఫోటో కాదు… మంత్రాలయం నుంచి వచ్చిన చిన్న వార్త… మరీ రెండుమూడు వాక్యాలు కూడా లేదు… దాంతోపాటు ఓ ఫోటో… అదేమిటీ అంటే… సునాక్ తల్లిదండ్రులు 16 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి పూజలు చేశారనేది వార్త… మంగళవారం బెంగుళూరు నుంచి కారులో తుంగభద్ర రైల్వే స్టేషన్ […]
ఇండియన్ పీనల్ కోడ్‌కు అదనంగా అక్కడ పోలీస్ పంచాంగ్ కోడ్…
Crime-Panchangam: సంస్కృతంలో గ్రహం మాటకు ముందు ఉపసర్గలు చేరి, మాట కొంచెం మారి- ఉపగ్రహం అనుగ్రహం నిగ్రహం విగ్రహం సంగ్రహం గ్రహణం గ్రాహ్యం గ్రహీత లాంటి ఎన్నెన్నో మాటలు పుడతాయి. పట్టుకోవడం అన్నదే ఇందులో మూల ధాతు రూపానికి ఉన్న అర్థం. అందుకే గ్రహాలను సవాలు చేస్తూ అంతరిక్షంలో వాటికి దగ్గరగా (ఉప) పంపే ఉపగ్రహాలకు కూడా ముందు శ్రీహరికోట పక్కనున్న చెంగాళమ్మ అనుగ్రహం, ఆపై తిరుమల ఏడుకొండలవాడి ప్రత్యేక అనుగ్రహం కోరుతున్నారు శాస్త్రవేత్తలు భక్తి ప్రపత్తులతో. […]
అవును, నేను మారిపోతున్నాను… వయస్సుతోపాటు… అనుభవాలతోపాటు…
Jagannadh Goud …. టొరొంటో లో చాలా కాలం తరువాత నా మిత్రుడు కలిస్తే ఏరా చాలా ఏళ్ళు వచ్చాయి మనకి. వయస్సు తో పాటు ఏమైనా ఆలోచనలో కూడా మార్పు వచ్చిందా అని క్యాజువల్ గా అడిగాను. అప్పుడు అతను అన్నాడు. *అవును నేను మారుతున్నాను* తల్లిదండ్రులను, బంధువులను, భార్యను, పిల్లలను స్నేహితులను, సినెమా హీరోలని ఇన్నాళ్లు ప్రేమించాను.ఇప్పుడిప్పుడే నన్ను నేను ప్రేమించుకోవడం మొదలు పెట్టాను. *అవును నేను మారుతున్నాను* నేనేమీ ప్రపంచ పటాన్ని కాదు, […]
ఆకులో ఆకులై… కొమ్మలో కొమ్మలై… ప్రకృతి మాత ఒడిలో జంటజీవనం…
Jayanthi Puranapanda జీవితంలో ఒడిదుడుకులను ఆత్మస్థైర్యంతో అధిగమించారు.. తన మనసుకి నచ్చిన కేరళ అబ్బాయిని వివాహం చేసుకున్నారు.. ప్రకృతిలో నివసించాలనుకున్నారు.. రెండు సైకిళ్ల మీద ఈ దంపతులు తమ యాత్ర ప్రారంభించారు.. ప్రస్తుతం నాగార్జునసాగర్ సమీపంలో చిన్న కుటీరం నిర్మించుకుని, మనసుకి నచ్చిన పంటలు పండిస్తూ, రచనా వ్యాసంగం చేస్తున్నారు జయతిలోహితాక్షన్ దంపతులు. ప్రకృతి ఒడిలో సహజమైన జీవనం సాగిస్తున్న ఈ జంట నుంచి నేటితరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. జయతి జన్మదినం సందర్భంగా ఆమెను ఫోనులో […]
తెలుగు కొత్త వ్యాకరణం… చిరు ప్లస్ తాత అంటే చిరుత… వేయండి వీరతాళ్లు…
“చిరుత” వ్యాకరణం… భాష ఏ ఒక్కరి సొత్తూ కాదు. ఆ భాష మాట్లాడేవారందరి ఉమ్మడి సొత్తు. ప్రవహించేదే భాష అని ఒక పరమ ప్రమాణం ఉండనే ఉంది. నిలువ నీరు మురుగు కంపు కొట్టి తాగడానికి పనికిరాదు. ప్రవహించే నీటిలో ఎంత చెత్త కలిసినా తాగడానికి పనికిరాకుండా పోదు. భాషాశాత్రవేత్తలు, వ్యాకరణ పండితులు, భాషోత్పత్తి శాస్త్రం చదివినవారే కొత్త మాటలు పుట్టించాలని నియమం లేదు. నిజానికి పండితుల భాష సామాన్యులకు అర్థం కాదు. సామాన్యుల భాషను పండితులు గుర్తించరు. […]
- « Previous Page
- 1
- …
- 4
- 5
- 6
- 7
- 8
- …
- 35
- Next Page »